హెల్త్ డెరైక్టర్ ఉత్తర్వులు ఇచ్చినా దక్కని పోస్టింగ్! | Health Director Orders Given no posting | Sakshi
Sakshi News home page

హెల్త్ డెరైక్టర్ ఉత్తర్వులు ఇచ్చినా దక్కని పోస్టింగ్!

Published Thu, Jan 30 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM

Health Director Orders Given no posting

విజయనగరంఆరోగ్యం, న్యూస్‌లైన్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందగా తయారైయింది జిల్లా పైలేరియా నివారణ అధికారి పరిస్థితి.  పదోన్నతి కల్పిస్తూ సాక్షాత్తూ రాష్ట్ర హెల్త్ డెరైక్టర్ ఆదేశాలిచ్చినా ఇంతవరూ పోస్టింగ్ లభించలేదు.  ఆరు నెలల క్రితం జిల్లా మలేరియా అధికారిగా పనిచేసిన కృష్ణామాచార్యులు ఉద్యోగ విరమణ చేశారు. దీంతో  మున్సిపల్ వైద్యాధికారిగా పనిచేసిన ఎం.రవికుమార్‌రెడ్డికి ఇన్‌చార్జ్ బాధ్యతలను అప్పగించారు.  ఈనెల 4న పైలేరియా అధికారి సత్యనారాయణ ను జిల్లా మలేరియా అధికారి( పూర్తి అదనపు బాధ్యతులు)గా నియమిస్తూ హెల్త్ డైరక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆయనకు మలేరియా అధికారి పోస్టును ఇంతవరకు కేటాయించలేదు. వాస్తవంగా ఆదేశాలు వచ్చిన వెంటనే అతన్ని విధుల్లో చేర్చుకోవాలి. కానీ ఇక్కడ  అలా జరగలేదు. ఉత్తర్వులు వచ్చిన మరుసటి రోజునే సత్యనారాయణ తనను డీఎంఓగా నియమిస్తూ హెల్త్ డైరక్టర్  ఉత్తర్వలు ఇచ్చారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి చూపించారు.  25 రోజులు అవుతున్నా ఇంతవరకు అతనికి బాధ్యతులు అప్పగించలేదు. ఉత్తర్వులు వచ్చి 25 రోజులవుతున్నా  రవికుమార్ రెడ్డే విధులు నిర్వహిస్తున్నారు. 
 
 సత్యనారాయణకు 20 ఏళ్ల అనుభవం
 మలేరియా విభాగంలో సత్యనారాయణకు 20 ఏళ్లు పాటు పనిచేశారు. యాంటమాలిజిస్టు అనే కారణంతో ఇతనికి  పోస్టు ఇవ్వకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అడ్డుపడ్డారని ఆరోపణలుఉన్నాయి.  ఇదే విషయాన్ని డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి ని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా సత్యనారాయణను డీఎంఓగా నియమిస్తూ హెల్త్ డైరక్టర్ ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవమేనని అన్నారు. అయితే ప్రస్తుతం ఇన్‌చార్జ్ పనిచేస్తున్న   రవికుమార్‌రెడ్డికి గతంలో మలేరియా అధికారిగా పనిచేసిన అనుభం ఉన్నందున  కొంత కాలం రవికుమార్ రెడ్డినే డీఎంఓగా కొనసాగించాలని కలెక్టర్ ఆదేశించారని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement