రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, రాంగ్‌రూట్, మితిమీరిన వేగంతో వాహనాలు నడపడంతో ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి.
తాజాగా కర్ణాటకలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ యువ ఐపీఎస్ అధికారి మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ట్రైనింగ్ పూర్తి చేస్తుకున్న అతడు..తన తొలి పోస్టింగ్‌ను చేపట్టేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరగడం మరింత దురదృష్టకరం. వివరాలు.. మధ్యప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల హర్ష్ బర్దన్ క్ణాటక కేడర్‌కు చెందిన 2023 ఐపీఎస్ బ్యాచ్ అధికారి.
సోమవారం తన తొలి పోస్టింగ్ స్వీకరించేందుకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న పోలీస్ వాహనం టైరు పగిలిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో హసన్-మైసూరు హైవేలోని కిట్టనే సరిహద్దు సమీపంలో వాహనం రోడ్డు పక్కన ఉన్న ఇంటిని ఢీకొట్టి అనంతరం చెట్టును డీకొట్టింది. ఈ ప్రమాదంలో బర్దన్ తలకు బలమైన గాయం తగలంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ యువ ఐపీఎస్ మరణించాడు. డ్రైవర్‌కు స్పల్ప గాయాలయ్యాయి.
మరోవైపు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సంఘటన స్థలంలో పోలీస్ వాహనం ధ్వంసమైనట్లు కనిపిస్తోంది. ఐపీఎస్ మృతిపై కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. అతని కుటుంబానికి సానుభూతి తెలిపారు. సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం లభించిన సమయంలో ఇలా జరగడం దురదృష్ణకరమని అన్నారు.
‘హసన్-మైసూరు హైవేలోని కిట్టనే సరిహద్దు సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి హర్ష్ బర్ధన్ మృతి చెందడం బాధాకరం. ఆయన ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించేందుకు వెళుతుండగా ఇలాంటి ప్రమాదం జరగడం చాలా దురదృష్ణకరం. ఎన్నో ఏళ్లు శ్రమించి, అనుకున్న లక్ష్యాన్ని సాధించినప్పుఉ ఇలా జరగకూడదు.హర్ష్ బర్ధన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.’ అని కన్నడలో ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment