నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
సబ్జెక్టులవారీగా పరిశీలన షెడ్యూల్ విడుదల చేసిన సొసైటీలు
పరిశీలన తర్వాత వెబ్ కౌన్సెలింగ్...ఆన్‌లైన్ పద్ధతిలో పోస్టింగ్‌లు
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల నుంచి దాదాపు నాలుగు నెలల క్రితం ఉద్యోగ నియామక ఉత్తర్వులు పొందిన సుమారు 8,500 మంది అభ్యర్థులకు అతిత్వరలో పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతు న్నారు. వచ్చే నెల మొదటి వారంలో వారంతా విధుల్లో చేరే అవకాశాలున్నాయి. ఉద్యోగాలు లభించిన వారిలో ఎక్కువ మంది ఫిబ్రవరిలో నియామక పత్రాలు పొందగా... ఎమ్మె ల్సీ ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో మరికొందరికి నియా మక పత్రాల పంపిణీ నిలిచిపోవడం తెలిసిందే.
తాజాగా ఎన్నికల కోడ్ ముగియడంతో పెండింగ్ అభ్యర్థులకు నియా మక పత్రాలు ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రెండు, మూడు రోజుల్లో వారికి నియామక పత్రాలు అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత సొసైటీ లు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నాయి. ఇప్పటికే బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బి. సైదులు ధ్రువపత్రాల పరిశీలనకు షెడ్యూల్ విడుదల చేశారు.
ఈ నెల 24 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి కూడా ఆ సొసైటీ పరిధిలో ధ్రువపత్రాల పరిశీ లనకు శనివారం షెడ్యూల్ జారీ చేశారు. దీంతో మైనారిటీ, జనరల్, ఎస్సీ గురుకుల సొసైటీలు కూడా షెడ్యూల్ విడుదలకు సిద్ధమయ్యాయి. ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తయ్యాక పోస్టింగ్‌లు ఇచ్చేందుకు గురుకుల సొసైటీలు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించాయి.
పైరవీలకు తావులేకుండా పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించేందుకే ఈ దిశగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. జూలై 7 నాటికి ఎస్సీ గురుకుల సొసైటీ పోస్టింగ్ ఆర్డర్లు విడుదల చేయనున్నట్లు ఆ సొసైటీ కార్యదర్శి తెలిపారు. ఇతర గురుకుల సొసైటీలు సైతం అదే తరహా కార్యాచరణ చేపట్టినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment