సాక్షి,విజయవాడ: తెలంగాణ నుంచి ఇటీవలే వచ్చిన ఐఏఎస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఆదివారం(అక్టోబర్ 27) ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ టూరిజం కార్పొరేషన్ ఎండీగా ఆమ్రపాలి, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణిమోహన్, వైద్య ఆరోగ్య కమిషనర్‌గా వాకాటి కరుణ, కార్మికశాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్‌ను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరో ఐఏఎస్ అధికారి రొనాల్డ్‌రోస్‌కు ఇంకా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. కాగా, ఏపీకి కేటాయించిన తమను తెలంగాణలోనే కొనసాగించాలని ఐఏఎస్ అధికారులు పెట్టుకున్న అభ్యర్థనను కేంద్ర డీఓపీటీ శాఖ తిరస్కరించడంతో వీరు ఏపీకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదీ చదవండి: దీపావళికి కూటమి ప్రభుత్వం ఇచ్చే కానుక ఇదేనా
Comments
Please login to add a commentAdd a comment