విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో భారీ స్థాయిలో 52 మంది తహశీల్దార్లకు పోస్టింగ్‌లు లభించాయి. ఎన్నికలకు ముందు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని 43 మంది తహశీల్దార్లకు స్థాన చలనాలు కలిగాయి. ప్రస్తుతం ఎన్నికల ముగియడంతో వారందరినీ తిరిగి యథాస్థానాల్లో కొనసాగించేందుకు సీసీఎల్‌ఏ అనుమతులు మంజూరు చేసింది. దీంతో పక్క జిల్లాలకు బదిలీపై వెళ్లిన వారు తిరిగి విశాఖ జిల్లాకు వచ్చారు. వారిలో చాలా మంది పాత స్థానాలే కేటాయించినప్పటికీ కొందరికి మాత్రం కాస్త మార్పులు చే శారు.
ఆ మేరకు కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ రూరల్ తహశీల్దార్‌గా ఉన్న రవీంద్రనాథ్‌ను నాతవరం మండలం తహశీల్దార్‌గా బదిలీ చేశారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న వి.వి.రమణను విశాఖ రూరల్‌కు కేటాయించారు. అప్పట్లో కలెక్టరేట్‌లో సి-సెక్షన్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన జ్ఞానవేణిని వుడాలో స్పెషల్ తహశీల్దార్‌గా నియమించారు.
ఇటీవలే త హశీల్దార్‌గా పదోన్నతి వచ్చిన రామలక్ష్మిని సి-సెక్షన్‌కు వేశారు. పాయక రావుపేటకు తహశీల్దార్‌గా పనిచేసిన లింగయ్య సస్పెండ్ కావడంతో ఆ స్థానంలో హైదరాబాద్‌లో హైకోర్టులో లైజన్ ఆఫీసర్‌గా పనిచేసి జిల్లాకు వచ్చిన సుమతిభాయిని నియమించారు. మిగిలిన వారందరికీ గతంలో ఏయే స్థానాల్లో పనిచేశారో అవే స్థానాలు కల్పించారు. నర్సీపట్నం తహశీల్దార్‌గా పనిచేసిన కళావతి సస్పెండ్ కావడంతో ఆ పోస్టును ఖాళీగా ఉంది.
52 మంది తహశీల్దార్లకు పోస్టింగ్‌లు
Published Sun, Jun 8 2014 12:39 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement