Keys
-
జగన్నాథ రహస్యం!
లక్షలాది భక్తజనం పాల్గొనే విశ్వవిఖ్యాత రథయాత్రతో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పూరీ జగన్నాథుని ఆలయం మరోమారు పతాక శీర్షికలకెక్కింది. రాజుల నుంచి మొదలుకుని సామాన్యుల దాకా శతాబ్దాలుగా జగన్నాథస్వామికి సమర్పించుకున్న కానుకల చిట్టా గుట్టు వీడబోతోంది. ఆదివారం ఆలయం దిగువన ఉన్న ఆభరణాల నిల్వ గది(రత్న భండార్)ని దాదాపు 40 సంవత్సరాల తర్వాత లెక్కింపు కోసం తెరవబోతున్నారు. విషసర్పాలు ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో అత్యయిక ఔషధాలను సిద్ధంచేసి వైద్యులు, పాములు పట్టే వాళ్లను వెంటబెట్టుకునిమరీ పురావస్తు, ప్రభుత్వ అధికారులు లోనికి వెళ్లబోతున్నారు. జగన్నాథుడికి చెందిన వజ్ర, వైఢూర్యాలు, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి తదితరాల బరువును తూచి, వాటి నాణ్యతను పరిశీలించి వేరే గదిలో సురక్షితంగా భద్రపరచాలని నిర్ణయించారు. చాన్నాళ్ల క్రితం గది తాళం చెవులు పోగొట్టి ఒడిశాలోని బిజూజనతాదళ్ సర్కార్ ఆలయ సంపద సంరక్షణలో విఫలమైందని బీజేపీ అసెంబ్లీ ఎన్నికలవేళ ఆరోపణలు గుప్పించడంతో గది తలుపులు తెరచి సంపదను సరిచూడాలన్న డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. అయితే గది తెరవడంపై శనివారం తుది నిర్ణయం తీసుకుంటామని ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ శుక్రవారం చెప్పారు.180 రకాల ఆభరణాలు1978లో గదిని తెరచి ఆభరణాలు, వెండి, బంగారం నిల్వలను లెక్కించి మళ్లీ పొడవాటి చెక్కపెట్టెల్లో భద్రపరిచారు. ఆనాడు అన్నింటినీ లెక్కించడానికి 70 రోజులు పట్టింది. గదిలో 180 రకాలకు చెందిన అమూల్యమైన ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు సమాచారం. స్వచ్ఛమైన పసిడి ఆభరణాలు 74 రకాలున్నాయి. ఒక్కోటి 100 తులాల బరువైన పురాతన ఆభరణాలూ ఉన్నాయి. ‘‘ 1978లో సంపద లెక్కించారు. అయితే జీర్ణావస్థకు చేరిన కొన్ని ఆభరణాల రిపేర్ పనుల కోసం 1985 జూలై 14వ తేదీన గది తెరిచారు. అప్పుడు నేనూ వెళ్లా. 9 అడుగుల పొడవు, 3 అడుగుల ఎత్తు ఉన్న 15 చెక్కపెట్టెల్లో ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరిచారు. వెలకట్టలేని ఆభరణాలతోపాటు ఎంతో బంగారం, వెండి నిల్వలు గదిలో దాచారు. పెద్ద సింహాసనం, ఉత్తరభారత భక్తులు జగన్నాథ, బలభద్రులకు సమర్పించిన అరటిపువ్వు ఆకృతి చెవిదిద్దులు ఇలా ఎన్నో విభిన్న ఆభరణాలు అక్కడున్నాయి. తర్వాత గది తలుపులు మూసి రెండు రకాల తాళాలు వేసి సీల్‌వేశారు. తాళం చెవులను ట్రెజరీ ఆఫీస్ నుంచి వచ్చిన కలెక్టర్‌కు అందజేశాం’ అని ఆనాటి ఆలయ నిర్వహణ అధికారి రవీంద్ర నారాయణ మిశ్రా రెండేళ్ల క్రితం ఒక టీవీచానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. 12వ శతాబ్దంలో పూరీ ప్రాంత రాజుకు లొంగిపోయిన సామంతరాజుల కిరీటాలు, యుద్ధంలో గెల్చుకున్న విలువైన సొత్తునూ రహస్య గదిలో భద్రపరిచారని తెలుస్తోంది.2018లో మరోసారి ప్రయత్నించి..పురాతన గది శిథిలమై గోడలకు చెమ్మ రావడంతో గది పటిష్టత, ఆభరణాల పరిరక్షణ నిమిత్తం గది తలుపులు తెరవాలని హైకోర్టు ఆదేశాల మేరకు 2018 ఏప్రిల్ 4వ తేదీన 16 మంది సభ్యుల భారత పురావస్తుశాఖ నిపుణుల బృందం గది తెరిచేందుకు వెళ్లింది. అయితే తాళం చెవి అదృశ్యమయిందన్న వార్తల నడుమ వెనుతిరిగింది. అయితే కిటికీ నుంచి చూసి గది గోడలు దెబ్బతిన్నట్లు, పైకప్పు పెచ్చులు ఊడినట్లు నిర్ధారించుకున్నారు. ఈ తతంగం అంతా 40 నిమిషాల్లో ముగిసింది. చీకటిగదిని మళ్లీ 40 ఏళ్ల తర్వాత తెరుస్తున్న నేపథ్యంలో ఈసారైనా అన్ని ఆభరణాలు, బంగారం, వెండి నిల్వలను సరిచూసి శిథిల గదికి బదులు నూతన గదిలో సురక్షితంగా దాచాలని సగటు పూరీ జగన్నాథుని భక్తుడు కోరుకుంటున్నాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టిన అధికారులు
-
తాళాల పంచాయతీ.. ‘ఇది కుట్ర ప్రకారమే జరిగింది..’
జగిత్యాల/జగిత్యాలటౌన్: జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి వీఆర్కే ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్నికల సామగ్రి భద్రపర్చిన స్ట్రాంగ్‌రూం తాళపు చెవులు మాయం కావడంపై సోమవారం విచారణ జరగనుంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) నుంచి ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేశారు. ఇందులో 441 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలిచారు. అయితే ఈ ఫలితాలను సవాల్ చేస్తూ లక్ష్మణ్ కుమార్ అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ పిటిషన్ వేయగా.. న్యాయస్థానం విచారణ చేపట్టింది. దీంతో ఎన్నికలకు సంబంధించిన సామగ్రి మొత్తం జగిత్యాలలోని వీఆర్కే కళాశాలలోని స్ట్రాంగ్‌రూంలో భద్రపర్చారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ను తెరిచి అందులోని డాక్యుమెంట్స్‌ను నిర్ణీత తేదీలోగా తమకు అందించాలని హైకోర్టు కలెక్టర్, ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్ యాస్మిన్ బాషా, అప్పటి ఎన్నికల రిటర్నింగ్ అధికారితో కలిసి స్ట్రాంగ్‌రూమ్ తాళం తెరిచేందుకు ఈనెల 12న ప్రయత్నించారు. అయితే మూడు గదుల్లో రెండో గది తాళం తెరచుకోవడంతో అందులో పత్రాలు పరిశీలించి వీడియో తీశారు. ఇక మిగతా రెండు గదుల తాళాలు కనిపించలేదు. ఆ తాళాలను పగులగొట్టడం లేదా మారుతాళంతో తీయాలని ప్రయత్నాలు చేయగా వాటికి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ అంగీకరించలేదు. దీంతో తెరచిన గదులతో పాటు మిగతా రెండు గదులకు సీల్ వేశారు. తాళాలు తెరచుకోలేని విషయాన్ని కోర్టుకు విన్నవిస్తామని కలెక్టర్ తెలిపారు. కాగా ఈ తాళాలు తెరచుకోకపోవడంపై లక్ష్మణ్ కుమార్ తప్పుబట్టారు. ఓటింగ్ యంత్రాల స్ట్రాంగ్ రూమ్ తాళాలను కుట్ర ప్రకారమే తీయలేదని లక్ష్మణ్ ఆరోపించారు. కలెక్టర్ లేదా, అదనపు కలెక్టర్ వద్ద ఉండాల్సిన తాళం చెవులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కోర్టు ఆదేశించి ఆరు రోజులు గడిచినా అధికారులు స్ట్రాంగ్ రూమ్ తాళం చెవులు లేవని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. -
కార్లకు డిజిటల్ ‘కీ’ స్ తయారుచేయనున్న శాంసంగ్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ త్వరలోనే స్మార్ట్ఫోన్లను ఉపయోగించి డిజిటల్ కారు ‘కీ’ స్ను తయారుచేయనుంది. అల్ట్రా-వైడ్‌బ్యాండ్ (యుడబ్ల్యుబీ), నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సి)-ఎనేబుల్డ్ డిజిటల్ కార్ కీస్‌కు త్వరలోనే శాంసంగ్ ఆవిష్కరించనుంది. ఈ డిజిటల్ ‘కీ’ స్ తొలుత దక్షిణ కొరియా ప్రవేశపెట్టాలని శాంసంగ్ భావిస్తోంది. అన్ని ఎలక్ట్రిక్ జెనెసిస్ జివి 60 కార్లకు శాంసంగ్ కీస్‌ను తయారుచేయనుంది. చదవండి: టెస్లా జోరు.. మిగతా కంపెనీల బేజారు..! గెలాక్సీ ఎస్ 21 లాంచ్ సమయంలో తన ఫోన్లలో డిజిటల్ కార్ కీస్ కోసం ప్రణాళికలను ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పలు శాంసంగ్ మోడళ్లలో తెచ్చేందుకు శాంసంగ్ ప్రయత్నాలను చేస్తోంది. ది వెర్జ్ కథనం ప్రకారం, శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 ప్లస్ , శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా, నోట్ 20 అల్ట్రా, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2, ఫోల్డ్ 3 స్మార్ట్‌ఫోన్స్ యుడబ్ల్యుబి సాంకేతికతను మద్దతు ఇవ్వనున్నాయి. దీంతో పలు ఎలక్ట్రానిక్ వాహనాలను కీస్ లేకుండా ఈ స్మార్ట్ఫోన్లను ఉపయోగించి స్టార్ట్ చేయవచ్చును. ఈ టెక్నాలజీ సహాయంతో కార్ విండోస్‌ను కూడా ఆపరేట్ చేయవచ్చును. డిజిటల్ కీలు శామ్సంగ్ పాస్ యాప్‌లో భద్రంగా నిల్వ ఉంటాయి. . ఎంబెడెడ్ సెక్యూర్ ఎలిమెంట్ (ఇఎస్ఇ)" ద్వారా డిజిటల్ కీస్‌ను రక్షిస్తాయి. ప్రస్తుతం శాంసంగ్ కేవలం జెనెసిస్ జివి 60 కార్లకే మాత్రమే డిజిటల్ కీస్ పనిచేయనున్నాయి.ఆడి, బిఎమ్‌డబ్ల్యూ, ఫోర్డ్ వంటి దిగ్గజ ఆటో మొబైల్ కంపెనీలతో శాంసంగ్ భాగస్వామ్యాన్ని కల్గిఉంది. భవిష్యత్తులో భారీ ఎత్తున్న ఆటోమొబైల్ కంపెనీలకు ఎన్ఎఫ్సీ డిజిటల్ కీస్‌ను తయారుచేసేందుకు శాంసంగ్ సన్నాహాలను చేస్తోంది. చదవండి: టాటా స్కై కోసం అంతరిక్షంలోకి జిశాట్-24 కమ్యూనికేషన్ శాటిలైట్ -
అతడి కడుపులో తాళం చెవులు, నాణేలు
చెన్నై: ‘మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పిచూడు, పురుగులు ఉండు’ అన్నట్లు... అతగాడి కడుపులో బయటపడ్డ వస్తువులను చూసి వైద్యులే అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే మానసిక రోగి జయకుమార్ (54) ఐనావరం మెంటల్ హాస్పిటల్లో ఉండగా ఎంఆర్ఐ స్కాన్ తీసేందుకు వైద్యులు ప్రయత్నించారు. అయితే స్కాన్ తీయడంలో సమస్యలు ఏర్పడ్డాయి. అతని కడుపులో ఏవైనా లోహపు వస్తువులు ఉండొచ్చని వైద్యులు అనుమానించారు. దీంతో చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి అక్కడ సీటీ స్కాన్ చేశారు. ఈ స్కాన్‌లో అతని కడుపులో తాళం చెవులు, నాణేలను ఉండటాన్ని గమనించారు. వీటిని వెలికితీసేందుకు గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ప్రత్యేక పరికరాన్ని కడుపులోకి చొప్పించి వాటిని వెలికి తీశారు. దీని గురించి ఆస్పత్రి డీన్ జయంతి శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రోగి కడుపులో ఆపరేషన్ లేకుండా వస్తువులను వెలికితీశామని అన్నారు. ప్రస్తుతం రోగి జయకుమార్ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. అతని కడుపులో ఉన్న అన్ని వస్తువులను వెలికితీసినట్లు బ్లూరోస్కోపీ ద్వారా నిర్ధారించామన్నారు. -
కీలుకు మేలు ఫలితాలు!
ఫలితాలు! టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీలో నూటికి నూరుశాతం సత్ఫలితాలుంటాయని నిపుణులు తెలియచేస్తున్నారు. సాధారణంగా ఈ సర్జరీ యాభై ఏళ్ల నుంచి ఎనభై ఏళ్ల వయసు వరకు చేస్తుంటారు. అయితే ఈ ఆపరేషన్ ఏ వయసులో చేయవచ్చనే దానికి కూడా ఇదమిత్థంగా నిబంధనలేమీ లేవు. పేషెంటులో ఎముక క్షీణత, కీలు అరుగుదలను బట్టి ఏ వయసు వారికైనా చేయవచ్చు. రోగిని పరీక్షించిన ఆర్థోపెడిక్ సర్జన్ అవసరాన్ని సూచిస్తారు. జువైనల్ ఆర్థరైటిస్ కారణంగా టీనేజ్‌లో కూడా ఈ అవసరం ఏర్పడవచ్చు. మోకాలి నిర్మాణం ఇలా! దేహంలో ఉంటే కీళ్లన్నింటిలో మోకాలి కీలు చాలా పెద్దది, సంక్లిష్టమైన నిర్మాణం కూడ. తొడ ఎముక కింది భాగానికి, పిక్క ఎముక పై భాగానికి మధ్య పటెల్లా (మోకాలి చిప్ప)తో కప్పి ఉంటుంది మోకాలి నిర్మాణం. పటెల్లా కింద ఈ మూడు ఎముకల మధ్య కార్టిలేజ్ ఉంటుంది. కీలును కదిలించినప్పుడు ఎముకల చివర్లు ఒకదానితో మరొకటి ఒరుసుకు పోకుండా కందెనలా ఉంటుంది ఈ కార్టిలేజ్. కీళ్ల నిర్మాణంలో రెండు ఎముకలను కలిపి ఉంచే లిగమెంట్ చాలా ముఖ్యమైనది. తొడ- పిక్క ఎముకలను పట్టి ఉంచే ఈ లిగమెంట్ దేహంలోని లిగమెంట్లన్నింటిలోకి పెద్దది. ఈ వ్యవస్థ మొత్తాన్ని సినోవియల్ మెంట్రేన్ చుట్టి ఉంటుంది. ఇది మోకాలు సులువుగా కదలడానికి అవసరమైన ద్రవాలను విడుదల చేస్తుంది. ఇవన్నీ ఐకమత్యంగా పని చేస్తున్నంత కాలం మోకాలి కీలుకు సమస్యలు ఉండవు. గాయాలు, వార్ధక్యం, కొన్ని ఇతర కారణాల వల్ల మోకాలి భాగాల పని తీరులో ఐకమత్యం లోపిస్తుంది. అప్పుడే వాపు, నొప్పి, కీళ్లు కదిలించలేకపోవడం... వంటి సమస్యలు తలెత్తుతాయి. • రెండేళ్ల మనుమడు ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్నాడు. • కుర్చీ పట్టుకుని లేచి నిలుచున్నాడు... మనవడిని మురిపెంగా చూస్తోంది రాజ్యలక్ష్మి. • అది ఫైబర్ కుర్చీ... కదిలిపోయింది. పిల్లాడికి పట్టు తప్పుతోంది. • కంగారుగా లేవబోయిందామె. అంతే... మోకాలి కీళ్లు పటపటమంటూ శబ్దం చేశాయి. కళ్లవెంట నీళ్లు పడేటంతటి బాధను అదిమిపట్టి అడుగు ముందుకు వేసేలోపే పిల్లాడు కిందపడిపోయాడు. అయ్యో! అంటూ పిల్లాడిని చేతుల్లోకి తీసుకుని సముదాయిస్తోంది. • ఈ మోకాళ్ల నొప్పులు లేకపోతే చక్కగా మనవడి ఆలనపాలన చూసుకునేది కదా అని బాధపడుతోందామె. • యాభై ఏళ్లు దాటిన వారిలో ఇది సర్వసాధారణమైన సమస్య. మోకాలి నొప్పి మొదట్లో మందులతో తగ్గుతుంటుంది. క్రమంగా అది మందులకు మాట వినని స్థితికి చేరుతుంది. అప్పుడిక ప్రత్యామ్నాయం నీ రీప్లేస్మెంట్ సర్జరీ మాత్రమే అంటారు నిపుణులు. అత్యంత క్లిష్టమైన బాధ ఈ చికిత్సతో మటుమాయం అవుతోంది. మరుసటి రోజే నడవవచ్చు! ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. సర్జరీ చేసిన మరసటి రోజు నుం నడవవచ్చు. హాస్పిటల్ నుంచి డిశ్చార్ చేయకముందే బెడ్ మీద నుంచి లేచి బాత్రూముకి వెళ్లడం, పనులు సొంతంగా చేసుకోవచ్చు. అలాగే ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత మరే ఇతర సమస్యలు రావని వైద్యులు చెప్తున్నారు. అయితే నీ రీప్లేస్మెంట్సర్జరీ ఒక్కటే కాదు, ఏ ఇతర సర్జరీ చేసుకున్నప్పుడైనా తీసుకోవాల్సిన సాధారణ జాగ్రత్తలు... అంటే వ్యక్తిగత పరిశుభ్రత, ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు ఇక్కడ కూడా పాటించాల్సిందే. ఇందులో ప్రత్యేకంగా బ్లడ్‌క్లాట్ ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. కార్టిలేజ్‌లో గడ్డకట్టిన రక్తనాళాల ద్వారా ఊపిరితిత్తులకు చేరి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంటుంది. అందుకోసం ముందుగానే రక్తం పలుచబడడానికి మందులిస్తారు. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో, నాణ్యమైన వైద్యసేవలు, పరికరాలు ఉన్న వైద్యశాలలో ఈ సర్జరీని విజయవంతంగా చేయడం సాధ్యమే. టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీలో నూటికి నూరుశాతం సత్ఫలితాలుంటాయని నిపుణులు తెలియచేస్తున్నారు. సాధారణంగా ఈ సర్జరీ యాభై ఏళ్ల నుంచి ఎనభై ఏళ్ల వయసు వరకు చేస్తుంటారు. అయితే ఈ ఆపరేషన్ ఏ వయసులో చేయవచ్చనే దానికి కూడా ఇదమిత్థంగా నిబంధనలేమీ లేవు. పేషెంటులో ఎముక క్షీణత, కీలు అరుగుదలను బట్టి ఏ వయసు వారికైనా చేయవచ్చు. రోగిని పరీక్షించిన ఆర్థోపెడిక్ సర్జన్ అవసరాన్ని సూచిస్తారు. జువైనల్ ఆర్థరైటిస్ కారణంగా టీనేజ్‌లో కూడా ఈ అవసరం ఏర్పడవచ్చు. మోకాలి నిర్మాణం ఇలా! దేహంలో ఉంటే కీళ్లన్నింటిలో మోకాలి కీలు చాలా పెద్దది, సంక్లిష్టమైన నిర్మాణం కూడ. తొడ ఎముక కింది భాగానికి, పిక్క ఎముక పై భాగానికి మధ్య పటెల్లా (మోకాలి చిప్ప)తో కప్పి ఉంటుంది మోకాలి నిర్మాణం. పటెల్లా కింద ఈ మూడు ఎముకల మధ్య కార్టిలేజ్ ఉంటుంది. కీలును కదిలించినప్పుడు ఎముకల చివర్లు ఒకదానితో మరొకటి ఒరుసుకు పోకుండా కందెనలా ఉంటుంది ఈ కార్టిలేజ్. కీళ్ల నిర్మాణంలో రెండు ఎముకలను కలిపి ఉంచే లిగమెంట్ చాలా ముఖ్యమైనది. తొడ- పిక్క ఎముకలను పట్టి ఉంచే ఈ లిగమెంట్ దేహంలోని లిగమెంట్లన్నింటిలోకి పెద్దది. ఈ వ్యవస్థ మొత్తాన్ని సినోవియల్ మెంట్రేన్ చుట్టి ఉంటుంది. ఇది మోకాలు సులువుగా కదలడానికి అవసరమైన ద్రవాలను విడుదల చేస్తుంది. ఇవన్నీ ఐకమత్యంగా పని చేస్తున్నంత కాలం మోకాలి కీలుకు సమస్యలు ఉండవు. గాయాలు, వార్ధక్యం, కొన్ని ఇతర కారణాల వల్ల మోకాలి భాగాల పని తీరులో ఐకమత్యం లోపిస్తుంది. అప్పుడే వాపు, నొప్పి, కీళ్లు కదిలించలేకపోవడం... వంటి సమస్యలు తలెత్తుతాయి. • రెండేళ్ల మనుమడు ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్నాడు. • కుర్చీ పట్టుకుని లేచి నిలుచున్నాడు... మనవడిని మురిపెంగా చూస్తోంది రాజ్యలక్ష్మి. • అది ఫైబర్ కుర్చీ... కదిలిపోయింది. పిల్లాడికి పట్టు తప్పుతోంది. • కంగారుగా లేవబోయిందామె. అంతే... మోకాలి కీళ్లు పటపటమంటూ శబ్దం చేశాయి. కళ్లవెంట నీళ్లు పడేటంతటి బాధను అదిమిపట్టి అడుగు ముందుకు వేసేలోపే పిల్లాడు కిందపడిపోయాడు. అయ్యో! అంటూ పిల్లాడిని చేతుల్లోకి తీసుకుని సముదాయిస్తోంది. • ఈ మోకాళ్ల నొప్పులు లేకపోతే చక్కగా మనవడి ఆలనపాలన చూసుకునేది కదా అని బాధపడుతోందామె. • యాభై ఏళ్లు దాటిన వారిలో ఇది సర్వసాధారణమైన సమస్య. మోకాలి నొప్పి మొదట్లో మందులతో తగ్గుతుంటుంది. క్రమంగా అది మందులకు మాట వినని స్థితికి చేరుతుంది. అప్పుడిక ప్రత్యామ్నాయం నీ రీప్లేస్మెంట్ సర్జరీ మాత్రమే అంటారు నిపుణులు. అత్యంత క్లిష్టమైన బాధ ఈ చికిత్సతో మటుమాయం అవుతోంది. మరుసటి రోజే నడవవచ్చు! ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. సర్జరీ చేసిన మరసటి రోజు నుం నడవవచ్చు. హాస్పిటల్ నుంచి డిశ్చార్ చేయకముందే బెడ్ మీద నుంచి లేచి బాత్రూముకి వెళ్లడం, పనులు సొంతంగా చేసుకోవచ్చు. అలాగే ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత మరే ఇతర సమస్యలు రావని వైద్యులు చెప్తున్నారు. అయితే నీ రీప్లేస్మెంట్సర్జరీ ఒక్కటే కాదు, ఏ ఇతర సర్జరీ చేసుకున్నప్పుడైనా తీసుకోవాల్సిన సాధారణ జాగ్రత్తలు... అంటే వ్యక్తిగత పరిశుభ్రత, ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు ఇక్కడ కూడా పాటించాల్సిందే. ఇందులో ప్రత్యేకంగా బ్లడ్‌క్లాట్ ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. కార్టిలేజ్‌లో గడ్డకట్టిన రక్తనాళాల ద్వారా ఊపిరితిత్తులకు చేరి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంటుంది. అందుకోసం ముందుగానే రక్తం పలుచబడడానికి మందులిస్తారు. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో, నాణ్యమైన వైద్యసేవలు, పరికరాలు ఉన్న వైద్యశాలలో ఈ సర్జరీని విజయవంతంగా చేయడం సాధ్యమే. సర్జరీకి దారి తీసే కారణాలు మోకాలి సమస్యల్లో ఎక్కువగా కనిపించేది ఆర్థరైటిస్. మోకాలిని కదిలించాలంటే భయపడేటంత నొప్పి ఉంటుంది. ఇందులో ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అని మూడు రకాలుంటాయి. 1. ఆస్టియో ఆర్థరైటిస్ కార్టిలేజ్ పటుత్వం లోపించడం వంటి మార్పులు వయసు పై బడిన వారిలో వస్తుంటాయి. ఎముకల మధ్య కుషన్ తగ్గిపోవడంతో ఎముకలు ఒరిపిడి లోనయి నొప్పి, కీళ్లు బిగుసుకు పోవడం కనిపిస్తుంటాయి. ఈ సమస్య సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వారిలో కనిపిస్తుంటుంది. ముప్పై ఏళ్లలో కూడా కనిపిస్తుంటుంది. కానీ ఇది చాలా తక్కువ శాతం. 2. రుమటాయిడ్ ఆర్థరైటిస్: ఇది ఒక వ్యాధి. సినోవియల్ మెంబ్రేన్ స్రావాల విడుదల తగ్గడం, పలుచగా ఉండాల్సిన ద్రవం చిక్కబడడం వంటి మార్పులు సంభవిస్తాయి. ఇది దీర్ఘకాలం కొనసాగితే కార్టిలేజ్ కార్టిలేజ్ క్షయానికి గురయ్యి కీళ్లలో నొప్పి, వాపు వస్తాయి. కీళ్లలో వాపుకు సంబంధించిన అనేక సమస్యలలో ఎక్కువగా కనిపించేది ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్. 3. పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్: ఇది ప్రమాదవశాత్తూ గాయాలపాలయినప్పుడు మోకాలి ఎముకలు చిట్లడం, విరగడం, మోకాలి కీలులోని లిగమెంట్ వంటి భాగాలు చీరుకు పోవడం వంటివి సంభవిస్తుంటాయి. అలాంటప్పుడు కూడా వాపు, నొప్పితోపాటు కీలు కదలించడం కష్టమవుతుంది. చికిత్స: ఎముకను ప్రిపేర్ చేయడం: కార్టిలేజ్‌లో డ్యామేజ్ అయిన భాగాన్ని, ఫెముర్ బోన్, టిబియా బోన్ల చివర్ల పొరలను తొలగిస్తారు మెటల్ ఇంప్లాంట్స్ అమరిక: తొలగించిన కార్టిలేజ్, ఎముక చివర్ల పరిమాణానికి తగినట్లు, మోకాలి కీలులో సరైన కొలతలతో లోహపు కీలును తయారు చేసి అమర్చడం రీసర్ఫేస్: మోకాలి చిప్ప లోపలి పొరను సరిచేసి ప్లాస్టిక్ బటన్ అమర్చడం. ఇది కొన్ని నీ రీప్లేస్మెంట్ సర్జరీలకు మాత్రమే అవసరం ఇన్సర్ట్ ఎ స్పేసర్: ఇది లోహపు భాగాల మధ్య కదలికను సులువు చేస్తుంది. • టోటల్ నీ రీప్లేస్మెంట్ చాలా అరుదుగా చేస్తారు. మోకాలు పూర్తిగా వంగిపోవడం, దేహం బరువును మోయలేక మోకాలి వంపుతోపాటు కాళ్లు విల్లుగా వంగడం వంటి పరిస్థితుల్లో టోటల్ నీ రీప్లేస్మెంట్ అవసరమవుతుంది. అలాగే... • భరించలేని మోకాలి నొప్పి, కీళ్లు బిగుసుకుపోవడంతో నడవడం, మెట్లెక్కడం, కుర్చీలో నుంచి ఉన్న ఫళాన లేవలేకపోవడం, రోజువారి పనులు చేసుకోలేనప్పుడు కర్ర లేదా వాకర్ సాయం తీసుకోక తప్పని పరిస్థితుల్లో పడుకుని లేచేటప్పుడు కీళ్లు బిగుసుకుపోయి మంచం మీద లేవడానికి ప్రయాసపడడం మందులతో చెప్పుకోదగినంత ఉపశమనం పొందలేనప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు, కార్టిజోన్ ఇంజెక్షన్లు, లూబ్రికేషన్ పెంచే ఇంజక్షన్లు, ఫిజికల్ థెరపీ, ఇతర ఆపరేషన్లతో సాంత్వన దక్కనప్పుడు టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరం అవుతుంది. ముందస్తు పరీక్షలు! ఆర్థోపెడిక్ సర్జన్ కింది అంశాలను నిర్ధారించుకున్న తర్వాత నీ రీప్లేస్మెంట్ సర్జరీకి అనుమతిస్తారు. మెడికల్ హిస్టరీ: పేషెంట్ సాధారణ ఆరోగ్యపరిస్థితిని తెలుసుకోవడం... అంటే బీపీ, డయాబెటిస్, గుండె వ్యాధులు, మరేదైనా ఇతర వ్యాధులకు మందులు వాడుతుండడం వంటివి ఫిజికల్ఎగ్జామినేషన్: దీని ద్వారా మోకాలి కదలికను, పటుత్వాన్ని, ఎముక గట్టిదనాన్ని, మొత్తంగా కాలి పరిస్థితిని అంచనా వేస్తారు ఎక్స్-రే: ఈ పరీక్ష ద్వారా ఎముక క్షీణత, కార్టిలేజ్ డ్యామేజ్, ఇతర డిఫార్మిటీలు తెలుస్తాయి. వీటితోపాటు బ్లడ్ టెస్ట్, ఎమ్ఆర్ఐ స్కాన్ ద్వారా మోకాలి ఎముకను ఆనుకుని ఉండే మెత్తటి టిస్యూల స్థితి తెలుస్తుంది. -
యాప్ ఉంటే చాలు కారు 'కీ' అక్కర్లేదు!
న్యూయార్క్: కారుకు ఇక కీ(తాళం చెవి) అక్కర్లేదు.. మీ స్మార్ట్ ఫోన్లో యాప్ ఉంటే సరిపోతుంది. ప్రముఖ స్వీడన్ వాహన తయారీ సంస్థ వోల్వో ఈ కొత్త టెక్నాలజీకి శ్రీకారం చుడుతోంది. కారు తాళం చెవి చేసే పనులన్నీ బ్లూటూత్ ఆధారిత డిజిటల్ కీ టెక్నాలజీతో పనిచేసే మొబైల్ యాప్ తో చేసేలా ఉండే కార్లను ఓల్వో రూపొందిస్తోంది. ఈ యాప్ ద్వారా డ్రైవర్లకు మల్టిపుల్ డిజిటల్ కీస్‌ను పొందే అవకాశం కూడా కల్పించనున్నారు. దీంతో వేరువేరు ప్రాంతాల్లో ఉన్న విభిన్న వోల్వో వాహనాలను ఈ యాప్ ద్వారా నియంత్రించే అవకాశం ఉంటుంది. కారును షేర్ చేసుకునే వారు సైతం తాళం చెవిల మార్పిడి లేకుండానే తమ డ్రైవర్లకు సులభంగా యాప్ ద్వారా యాక్సెస్ ఇవ్వడానికి వీలుంటుంది. కారును రెంటుకు తీసుకునే వారికి సైతం ఈ టెక్నాలజీతో ఉపయోగం ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. వినియోగదారుల సమయం ఆదాచేసే ఈ యాప్ టెక్నాలజీ 2017లో అందుబాటులోకి రానుంది. -
నటుణ్ని కాకుంటే ప్రధానమంత్రి అయ్యుండేవాడిని
లాహోర్: 'రైల్వే గోడౌన్ లో పనిచేసిన మా నాన్న సిమెంట్ దొంగతనం కేసులో జైలు పాలయ్యాడు. ఉద్యోగంలో నుంచి తీసేయడంతో రైల్వే క్వార్టర్స్ ఖాళీచేయాల్సివచ్చింది. అమ్మా, అన్నయ్య, నేను రోడ్డున పడ్డాం. అప్పుడు నాకు ఆరేళ్లు. కుటుంబపోషణ కోసం అన్నయ్య స్టేషన్ లోనే కూలీగా మారాడు. నేనేమో అంగట్లో టీ అమ్మేవాణ్ని' అంటూ పొరుగుదేశస్తులతో తన చిన్ననాటి సంగతులు గుర్తుచేసుకున్నారు లిజెండరీ యాక్టర్ ఓంపురి. లాహోర్ లోని అలహమ్రా ఆర్ట్ సెంటర్ లో ప్రారంభమైన అంతర్జాతయ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న ఆయన భారత్- పాక్ సంబంధాలపై మనసులోని మాటలు బయటపెట్టారు. ఇరుదేశాల మధ్య ప్రతిబంధకాలనే తాళాలు వేసున్నప్పటికీ, వాటిని తెరవగలిగే తాళం చెవులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ ల వద్ద ఉన్నాయని, ఇద్దరు ప్రధానుల నిర్ణయాలే ఇరు ప్రాంతల ప్రజల ఐక్యతకు బాటలువేస్తాయని, పాకిస్థాన్ కు రావటం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుందని ఓంపురి అన్నారు. నటుడు కాకుంటే ఏమయ్యేవారు? అనే మీడియా ప్రశ్నకు..'చిన్నప్పుడు చాయ్ అమ్మాను కదా, మెల్లగా టీ దుకాణం పెట్టుకుని ఇప్పటికి ప్రధానమంత్రి అయ్యుండేవాడిని' అని చమత్కరించారు. -
52 మంది తహశీల్దార్లకు పోస్టింగ్‌లు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో భారీ స్థాయిలో 52 మంది తహశీల్దార్లకు పోస్టింగ్‌లు లభించాయి. ఎన్నికలకు ముందు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని 43 మంది తహశీల్దార్లకు స్థాన చలనాలు కలిగాయి. ప్రస్తుతం ఎన్నికల ముగియడంతో వారందరినీ తిరిగి యథాస్థానాల్లో కొనసాగించేందుకు సీసీఎల్ఏ అనుమతులు మంజూరు చేసింది. దీంతో పక్క జిల్లాలకు బదిలీపై వెళ్లిన వారు తిరిగి విశాఖ జిల్లాకు వచ్చారు. వారిలో చాలా మంది పాత స్థానాలే కేటాయించినప్పటికీ కొందరికి మాత్రం కాస్త మార్పులు చే శారు. ఆ మేరకు కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ రూరల్ తహశీల్దార్‌గా ఉన్న రవీంద్రనాథ్ను నాతవరం మండలం తహశీల్దార్‌గా బదిలీ చేశారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న వి.వి.రమణను విశాఖ రూరల్‌కు కేటాయించారు. అప్పట్లో కలెక్టరేట్లో సి-సెక్షన్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన జ్ఞానవేణిని వుడాలో స్పెషల్ తహశీల్దార్‌గా నియమించారు. ఇటీవలే త హశీల్దార్గా పదోన్నతి వచ్చిన రామలక్ష్మిని సి-సెక్షన్‌కు వేశారు. పాయక రావుపేటకు తహశీల్దార్‌గా పనిచేసిన లింగయ్య సస్పెండ్ కావడంతో ఆ స్థానంలో హైదరాబాద్‌లో హైకోర్టులో లైజన్ ఆఫీసర్‌గా పనిచేసి జిల్లాకు వచ్చిన సుమతిభాయిని నియమించారు. మిగిలిన వారందరికీ గతంలో ఏయే స్థానాల్లో పనిచేశారో అవే స్థానాలు కల్పించారు. నర్సీపట్నం తహశీల్దార్‌గా పనిచేసిన కళావతి సస్పెండ్ కావడంతో ఆ పోస్టును ఖాళీగా ఉంది.