
కడుపులో నుంచి తీసిన తాళం చెవులు, నాణేలు
చెన్నై: ‘మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పిచూడు, పురుగులు ఉండు’ అన్నట్లు... అతగాడి కడుపులో బయటపడ్డ వస్తువులను చూసి వైద్యులే అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే మానసిక రోగి జయకుమార్ (54) ఐనావరం మెంటల్ హాస్పిటల్‌లో ఉండగా ఎంఆర్‌ఐ స్కాన్ తీసేందుకు వైద్యులు ప్రయత్నించారు. అయితే స్కాన్ తీయడంలో సమస్యలు ఏర్పడ్డాయి. అతని కడుపులో ఏవైనా లోహపు వస్తువులు ఉండొచ్చని వైద్యులు అనుమానించారు. దీంతో చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి అక్కడ సీటీ స్కాన్ చేశారు. ఈ స్కాన్‌లో అతని కడుపులో తాళం చెవులు, నాణేలను ఉండటాన్ని గమనించారు.
వీటిని వెలికితీసేందుకు గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ప్రత్యేక పరికరాన్ని కడుపులోకి చొప్పించి వాటిని వెలికి తీశారు. దీని గురించి ఆస్పత్రి డీన్ జయంతి శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రోగి కడుపులో ఆపరేషన్ లేకుండా వస్తువులను వెలికితీశామని అన్నారు. ప్రస్తుతం రోగి జయకుమార్ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. అతని కడుపులో ఉన్న అన్ని వస్తువులను వెలికితీసినట్లు బ్లూరోస్కోపీ ద్వారా నిర్ధారించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment