- జీఏడీ కార్యదర్శిగా అరుణ
- మార్కెటింగ్ డెరైక్టర్‌గా అనితా రాజేంద్ర
- భూ సేకరణ డెరైక్టర్‌గా మాణిక్‌రాజ్ నియామకం
సాక్షి, హైదరాబాద్: పదిమంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాల్లో భాగంగా పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్న పలువురికి కొత్తగా బాధ్యతలు అప్పగించారు. జీఏడీ కార్యదర్శిగా(సర్వీసెస్, హెచ్‌ఆర్‌ఎం) జి.డి.అరుణ నియమించడంతో పాటు జీఏడీ అదనపు బాధ్యతల నుంచి బి.వెంకటేశ్వరరావును రిలీవ్ చేశారు.
రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డెరైక్టర్‌గా అనితా రాజేంద్రకు పోస్టింగ్ ఇచ్చారు. మార్క్‌ఫెడ్ ఎండీగా ఇన్‌చార్జి బాధ్యతలను కూడా అప్పగించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా సి. సుదర్శన్‌రెడ్డి, ఫిషరీస్ డెరైక్టర్‌గా టి.విజయ్‌కుమార్, యూత్‌సర్వీసెస్ డెరైక్టర్‌గా మహ్మద్ అబ్దుల్‌అజీమ్ నియమితులయ్యారు. నీటిపారుదల, కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ శాఖ పరిహారం, పునరావాసం, భూ సేకరణ డెరైక్టర్‌గా కె.మాణిక్‌రాజ్ నియమితులయ్యారు.
అంతకుముందు ఈ పోస్టులో జి. వెంకటరామ్‌రెడ్డిని నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేశారు. రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డెరైక్టర్‌గా డా.ఎం.వి.రెడ్డి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ డిప్యూటీ కార్యదర్శిగా భారతీ లక్‌పతి నాయక్‌కు బాధ్యతలు అప్పగించారు. మహబూబ్‌నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పి.వెంకటరామిరెడ్డి నియమితులు కాగా, అంతకుముందు బి. విజేంద్రకు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు.