కనిగిరి రూరల్: టీడీపీ కనిగిరి పేరుతో వాట్సప్ గ్రూప్‌లో తీవ్ర అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టడంపై కనిగిరిలో కలకలం రేపింది. ఈ గ్రూప్‌లో పట్టణానికి చెందిన ఓ యువకుడు, యువతి ఫొటో పెట్టి పక్కన పలువురు మహిళలతో పాటు, వైఎస్సార్ సీపీ మహిళా ప్రజాప్రతినిధుల తల ఫొటోను మార్ఫింగ్ చేసి చాలా అసభ్యకరంగా పోస్టింగ్ చేశారు.
దీనిపై పట్టణంలో జోరుగా చర్చ సాగింది. అయితే ఈ గ్రూప్ డీపీ లోగోలో ఒకరి ఫొటోలు ఉండగా, గ్రూప్ అడ్మిన్‌లుగా వేరే వ్యక్తుల పేర్లు పెట్టారు. దీంతో ఆ గ్రూప్‌లో అడ్మిన్‌గా కనిపిస్తున్న వ్యక్తి (ఓ టీవీ రిపోర్టర్ కావడంతో) వెంటనే స్పందించాడు. తనకు ఈ గ్రూప్‌నకు ఎటువంటి సంబంధం లేదని, భాను అనే పేరుగల వారు తనను గ్రూప్‌లో యాడ్ చేసి అడ్మిన్ చేశారని, వారిపై తాను పోలీస్ కేసు పెడుతున్నట్లు గ్రూప్‌లో మెసేజ్ పెట్టాడు.
సభ్యులంతా గ్రూప్‌లో నుంచి లెఫ్ట్ కావాలని ఆ పోస్ట్‌లో కోరాడు. ఈ ఘటనపై పోలీసులు రహస్య విచారణ చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై కనిగిరి ఎస్సై దాసరి ప్రసాద్‌ను వివరణ కోరగా ఈ ఘటనపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment