
42 సీఐల బదిలీ
పోలీసు శాఖ ఉత్తర్వులు వెల్లడించిన డీఐజీ మల్లారెడ్డి వెయిటింగ్‌లో తొమ్మిది మంది ఇన్‌స్పెక్టర్లు
వరంగల్ క్రైం :వరంగల్ రేంజ్ పరిధిలో మంగళవారం భారీగా ఇన్‌స్పెక్టర్ల(సీఐ) బదిలీలు జరిగారుు. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల పరిధిలో ఒకేసారి 101 మందిని బదిలీ చేస్తూ వరంగల్ రేంజ్ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారని డీఐజీ మల్లారెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లాలో 42 మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యా రు. సీఐల బదిలీలకు సంబంధించి గత నెల 23న ‘సాక్షి’ కథనంలో ఇచ్చినట్లుగానే ఎక్కువ పోస్టింగ్‌లు ఖరారయ్యాయి.
సాధారణ ఎన్నికల తర్వాత ఇన్‌స్పెక్టర్ల బదిలీలు జరగడం ఇదే మొదటిసారి. పోస్టింగ్‌ల విషయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలను ప్రాధాన్యం ఇచ్చినట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో 29 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీసు శాఖ అక్టోబర్ 17న ఉత్తర్వులు ఇచ్చింది. 24 గంటల్లోనే నిలిపివేసింది. మళ్లీ ఇప్పుడు బదిలీలు జరిగాయి.