తెలంగాణలో 36 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్‌లిస్తూ ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు టీపీ దాస్ శాంతిభద్రతల అదనపు డీజీగా సుదీప్ లక్తాకియా
హైదరాబాద్: తెలంగాణలో 36 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్‌లిస్తూ ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు సమావేశమై సాయంత్రం నుంచి రాత్రి వరకు సుదీర్ఘ కసరత్తు చేశారు. అనంతరం రాజీవ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.