- గోపాలరావుపై సస్పెన్షన్ ఎత్తివేత
ఐబీ ఈఈకి మళ్లీ పోస్టింగ్
Published Mon, Sep 26 2016 12:22 AM | Last Updated on Thu, Mar 28 2019 6:26 PM
వరంగల్ : చిన్న నీటిపారుదల శాఖ ములుగు ఈఈ గోపాలరావుపై విధించిన సస్పెన్షన్ ను ప్రభుత్వం ఎత్తివేసింది. పెండింగ్ విచారణ పేరిట ఆయనకు మళ్లీ ములుగు ఈఈగా పోస్టింగ్ ఇచ్చారు.
ఈనెల 30వ తేదీన గోపాలరావు పదవీ విరమణ చేయనున్నారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం తాత్కాలికంగా సస్పెన్షన్ ఉత్తర్వులను నిలిపివేసింది. మిషన్ కాకతీయ కార్యక్రమంలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ మొదటి విడత పనుల్లో అక్రమాలకు బాధ్యులుగా నిర్ధారించి గోపాలరావుతో పాటు అప్పటి పరకాల డీఈఈ బి.వెంకటేశ్వర్లు (ఏటూరునాగారం డీఈఈగా పనిచేస్తున్నారు), ఏఈఈ శరత్‌బాబు, ఈ పనుల నాణ్యతను ధ్రువీకరించిన క్యూసీ డీఈఈ వెంకటేశ్వర్లు, ఏఈఈ తిరుపతిరావులను ఈనెల 1న ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ పొందుతున్నందున తనకు సస్పెన్షన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఈఈ గోపాలరావు పెట్టుకున్న వినతితో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా గోపాలరావుతో పాటు సస్పెన్షన్ కు గురైన మిగిలిన వారికి ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. రీ పోస్టింగ్ పొందిన గోపాలరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించినట్లు సర్కిల్ కార్యాలయవర్గాలు
తెలిపాయి.
Advertisement
Advertisement