ఫేస్బుక్లో పోస్ట్ చేయకూడనివి తెలుసా.. | these things are shouldnt be post | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్లో పోస్ట్ చేయకూడనివి తెలుసా..

Published Mon, Jul 4 2016 12:42 PM | Last Updated on Fri, Jul 27 2018 12:33 PM

ఫేస్బుక్లో పోస్ట్ చేయకూడనివి తెలుసా.. - Sakshi

ఫేస్బుక్లో పోస్ట్ చేయకూడనివి తెలుసా..

సామాజిక అనుసంధాన వేదిక ఫేస్బుక్లో ఏవి పడితే అవి పోస్ట్ చేయకూడదని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. అవి పోస్ట్ చేసిన వాళ్లకు ఇబ్బందులు తీసుకొస్తాయంట. అలా పోస్ట్ చేయకూడని కొన్ని అంశాల గురించి వారు ప్రత్యేకంగా చెప్పారు. అవేమిటో ఒకసారి పరిశీలిస్తే..
 
బ్యాంక్ వివరాలు..
డబ్బు పంపించేందుకు బ్యాంకు ఖాతా వివరాలు అవసరం ఉంటుంది. కొంతమంది విద్యార్థులు ఈ మధ్య ఆ వివరాలను ఫేస్ బుక్ లో చాటింగ్ సమయాల్లో పోస్ట్ చేస్తున్నారంట. అలాంటి తప్పు ఎప్పుడూ చేయొద్దని వారు ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నారు.
విన్నింగ్ టికెట్స్
ఆస్ట్రేలియాలో ఓ మహిళ తను గెలిచిన లాటరీ టికెట్ అని సంతోషాన్ని ఆపుకోలేక ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. పెద్ద ఎత్తున పార్టీ కూడా చేసుకుంది. కానీ దురదృష్టవశాత్తు ఆ టికెట్ ను కొందరు వ్యక్తులు మార్ఫింగ్ చేసి ఆమెకు తెలిసిన వారిలో కొందరు ఆ నగదు కొట్టేశారు.
ఇంటి చిరునామా
కొంతమంది ఇంటి చిరునామాను కూడా ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్నారంట. దీనివల్ల దొంగలకు తలుపులు బార్లా తెరిచినట్లే అవుతుందని అలాంటి పనులు చేయొద్దని హెచ్చరిస్తున్నారు.
పాస్ పోర్ట్ కూడా..
చాలామంది వ్యక్తులు తమ పాస్ట్ పోర్టు నెంబర్ కూడా ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తున్నారని ఇది చాలా డేంజర్ అని అంటున్నారు.
పిల్లల వివరాలు, ఫొటోలు
చిన్నారుల వివరాలను కూడా ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం అంతమంచిది కాదని అంటున్నారు. పిల్లల ఫొటోలు పోస్ట్ చేసినప్పుడు వాటికి లైక్స్ రావడమేమోగానీ.. అందులో కొంతమంది నెగెటివ్ కామెంట్స్ కూడా చేస్తారంట. అది చూసి మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉందని.. అలాంటివి అస్సలు పోస్ట్ చేయకూడదని అంటున్నారు.
బాస్కు ఫిర్యాదు
ఒక ఉద్యోగి తన సంస్థకు, యజమానికి సంబంధించిన ఫిర్యాదులు ఎట్టి పరిస్థితుల్లో ఫేస్బుక్ లో పోస్ట్ చేయొద్దంట. అలా చేయడం వల్ల ఆ ఉద్యోగికి భవిష్యత్తులో కూడా సమస్యలు వస్తాయంట. అలాగే, ఫేస్ బుక్ ద్వారా ప్రైవేట్ సంభాషణ ఎప్పుడూ చేయొద్దంట.
కాపీ అండ్ పేస్ట్ స్టేటస్
ఫేస్ బుక్లో కాపీ పేస్ట్ చేయొద్దని చెప్తున్నారు. అలా చేయడం వల్ల తమ కంటెంట్ దొంగిలించారని దానికి సంబంధించిన వ్యక్తులు కేసులు పెట్టే ప్రమాదం కూడా లేకపోలేదని వారు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement