మరో భారీ బ్యాంకింగ్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వడోదరకు చెందిన విద్యుత్ కేబుల్స్, సామగ్రిని తయారు చేసే కంపెనీ వేలకోట్ల రూపాయల మేర బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టింది. 11 బ్యాంకుల కన్సార్టియాన్ని భారీ ఎత్తున మోసం చేసిన వ్యవహారంలో కేసు నమోదు చేశామని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గురువారం ప్రకటించింది.