
కాపురానికి రమ్మన్న భర్తను..
ముజఫర్ నగర్ : కాపురానికి రమ్మని అడగడానికి వెళ్లిన భర్తను భార్య హత్య చేసిన ఉదంతం ముజఫర్ నగర్ లో చోటు చేసుకుంది. సోదరులతో కలిసి మహిళ ఈ ఘాతుకానికి ఒడిగట్టడం ఆందోళన రేపింది. భార్యను ఇంటికి తెచ్చుకోవడానికి వెళ్లిన భర్త రాజీవ్ (26) ను సోదరులు, సత్పాల్, విక్రమ్ తో కలిసి గురువారం హత్య చేసింది. అనంతరం హిందున్ నదిలో పడేశారు.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం రాజీవ్, సర్వేష్ దంపతులు. వీరి మధ్య గత కొన్ని నెలలుగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సర్వేష్ బుధాన ప్రాంతంలో ఉన్న పుట్టింటికి వెళ్లిపోయింది. రెండు నెలలుగా తల్లిదండ్రుల దగ్గర ఉంటున్న భార్యను తిరిగి తీసుకురావడానికి అత్తారింటికి వెళ్లాడు రాజీవ్. దీంతో ఏమైందో ఏమో తెలియదుగానీ, సర్వేష్, తోబుట్టువులు, సత్పాల్, విక్రమంతో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం సమీపంలోని నదిలో పడేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ విషయం వెలుగు చూసింది.
కాగా భర్త హత్య కేసులో ఇద్దరు సోదరులు పాటు, సర్వేష్ పై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురిపై విచారణ జరుగుతోందన్నారు.