శృతి హాసన్, గౌతమిల ఫైట్ | Shocking: Shruti Haasan and Kamal Haasan's partner have an ugly fight on the sets! | Sakshi
Sakshi News home page

శృతి హాసన్, గౌతమిల ఫైట్

Published Mon, Aug 15 2016 6:14 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM

శృతి హాసన్, గౌతమిల ఫైట్ - Sakshi

శృతి హాసన్, గౌతమిల ఫైట్

కమల్ ముద్దులకూతురు శృతిహాసన్కు, కమల్ పార్ట్నర్ గౌతమికి మధ్య సినిమా సెట్స్లో ఫైట్ జరిగిందట. కమల్, శృతి ఓ సినిమాలో తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నారు. ఆ సినిమాకు గౌతమి కాస్ట్యూమ్ డిజైనర్గా ఉన్నారు. శృతి పాత్రకు గౌతమి రూపొందించిన దుస్తులు నచ్చకపోవడంతో వీరిద్దరి మధ్య వాదులాట మొదలైందట. తనకు అస్సలు నప్పని దుస్తులను డిజైన్ చేసినందుకు గౌతమిపై శృతి ఫైర్ అయినట్లు సమాచారం.

చెన్నైలో షూటింగ్ సెట్స్లో ఉండగా వీరిద్దరూ ఒకరి మీద ఒకరు అసహనాన్ని ప్రదర్శించుకున్నారు. వీరిద్దరి మధ్యకు వెళ్లేందుకు కమల్తో సహా ఎవరూ సాహసించలేదట. కేవలం ఈ సినిమా విషయంలోనే కాదు, ఇప్పటికే పలుమార్లు గౌతమి తన కోసం డిజైన్ చేసిన దుస్తులను ధరించేందుకు శృతి వ్యతిరేకించింది. ఆమె డిజైన్స్ నచ్చకపోవడమే అందుకు కారణమట. ఏదేమైనా ఈ ఇద్దరి గొడవ ఆ రోజు షూటింగ్కు సెలవు చెప్పడానికి కారణమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement