Costumes
-
#International Yoga day 2024 స్పెషల్ కాస్ట్యూమ్స్ (ఫొటోలు)
-
కరచరణో రసి మణిగణ భూషణ... లుక్... ఐ వాజ్ గోనా గో
శాస్త్రీయ నృత్య వేషధారణ అనగానే శాస్త్రీయ నృత్యమే కళ్ల ముందు కదలాడుతుంది. అలా కాకుండా ర్యాప్ వినిపిస్తే ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఈ వీడియో ఉదాహరణ. నటి అదా శర్మ క్లాసికల్ డ్యాన్సర్ వేషంలో అమెరికన్ ర్యాపర్ ఎమెనెమ్ ఐకానిక్ ర్యాప్ ‘ర్యాప్ గాడ్’ ట్రాక్‌తో ‘వావ్’ అనిపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ రీల్ వైరల్‌గా మారింది. శర్మను ప్రశంసలతో ముంచెత్తిన వారిలో హీరో అయుష్మాన్ ఖురాన, నటి ఊర్వశీ రౌటేల, ఇండియన్ ర్యాపర్ రఫ్తార్లాంటి సెలబ్రిటీ కూడా ఉన్నారు. యూట్యూట్ ద్వారా 2013లో విడుదలైన ‘ర్యాప్ గాడ్’ సాంగ్ సూపర్ హిట్ కావడమే కాదు ‘మోస్ట్ వర్డ్స్’ విశేషంతో ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’లోకి ఎంటర్ అయింది. ఎన్నో అవార్డ్లు గెలుచుకుంది. ‘లుక్, ఐ వాజ్ గోనా గో ఈజీ ఆన్ యూ నాట్ టు హార్ట్ యువర్ ఫీలింగ్స్ బట్ ఐయామ్ వోన్లీ గోయింగ్ టు గెట్ దిస్ వన్ చాన్స్ సమ్‌థింగ్ రాంగ్. ఐ కెన్ ఫీల్ ఇట్’ అని శాస్త్రీయ నృత్య వేషధారణతో కనిపిస్తున్న అదా శర్మ పాడుతుంటే ‘వాహ్వా’ అనకుండా ఉండలేము. View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) -
పెళ్లిలో ఆలియా భట్‌ను ఫాలో అయిన పరిణీతి చోప్రా, ఫోటోలు వైరల్
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట వివాహ వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లీలా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను పరిణీతి సోషల్ మీడియా వేదికగా పంచుకోగా కాసేపటికే ఫోటోలు వైరల్‌గా మారాయి. 'మేము మొదటి సారి బ్రేక్‌ఫాస్ట్ కోసం కలిసి కూర్చున్నప్పుడే మా హృదయాలు కలిశాయి. ఈరోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాను. ఎట్టకేలకు అందరి ఆశీర్వాదంతో మేము ఒక్కటయ్యాం. మేము ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేము' అంటూ తన సంతోషాన్ని పంచుకుంది. దీంతో పరిణీతి-రాఘవ్‌ల దంపతులకు సెలబ్రిటీలు సహా నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వీరిద్దరి జోడి చూడచక్కగా ఉందంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక పెళ్లి వేడుకలో పరిణీతి చోప్రా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లెహెంగాలో మెరిసిపోగా, పవన్ సచ్‌దేవా డిజైన్ చేసిన డిజైనర్ అవుట్‌ఫిట్‌లో రాఘవ్ చద్దా కనిపించారు. ఈ ఇద్దరూ పేస్టల్ కలర్ దుస్తుల్లో అందంగా కనిపించారు. ఈమధ్య కాలంలో పేస్టల్ కలర్స్, న్యూడ్ మేకప్ ట్రెండ్ బాగా వినిపిస్తోంది. ఆలియా భట్ నుంచి ఇప్పుడు పరిణీతి చోప్రా వరకు.. సింపుల్‌గా, పేస్టల్ కలర్స్‌లో నేచురల్‌గా కనిపించేందుకే సెలబ్రిటీలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు పెళ్లంటే రెడ్, ఎల్లో, గ్రీన్ వంటి సాంప్రదాయ కలర్స్ దుస్తుల్లోనే వధూవరులు కనిపించేవారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలకు హెవీ లెహంగాలు, భారీ నగలు, హెవీ మేకప్ వరకు.. అంతా భారీగా ఉండాలని కోరుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హెవీ అండ్ కాస్ట్లీ దగ్గర్నుంచి ఇప్పుడు సింపుల్ అండ్ క్లాసిక్ అనే ట్రెండ్ నడుస్తోంది. దీనికి తగ్గట్లే న్యూడ్ మేకప్ విత్ పేస్టల్ కలర్స్ అంటూ మరో అద్భుతమైన ట్రెండ్ సెట్ చేశారు మన బాలీవుడ్ ముద్దుగుమ్మలు. ఇక మరో విశేషం ఏమిటంటే.. పరిణీతి చోప్రా ఆలియా భట్‌ను ఫాలో అయ్యిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఆలియా కూడా తన పెళ్లికి క్రీం పేస్టల్ కలర్ అవుట్‌ఫిట్‌లో అందంగా ముస్తాబైంది. అంతేకాకుండా మెహందీ ఫంక్షన్లోనూ చాలా సింపుల్ మెహందీలో దర్శనమిచ్చింది. ఇప్పుడు పరిణీతి కూడా అచ్చంగా ఆలియాలానే క్రీం కలర్ పేస్టల్ లెహంగా, చాలా సింపుల్ మెహందీలో కనిపించింది. దీంతో వీరిద్దరి లుక్‌ని పోలుస్తూ పలు ఫోటోలు ఇంటర్నెట్లో దర్శనమిస్తున్నాయి. -
నాగార్జున వేసుకున్న ఈ షర్ట్‌కి ఓ స్పెషల్ ఉంది.. గుర్తుపట్టారా?
సాధారణంగా సెలబ్రిటీలు అనగానే వారు ధరించే బట్టల దగ్గర్నుంచి చెప్పులు వరకు ప్రతీది కాస్ట్లీగానే ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈవెంట్ ఏదైనా డిజైనర్ వేర్ కాస్ట్యూమ్ ఉండాల్సిందే అనేంతలా ఆకట్టుకుంటారు. వాళ్లు ధరించే వాచ్‌లు, మేకప్, హ్యాండ్‌బ్యాగ్స్, ఫోన్స్,కాస్ట్యూమ్స్.. ఇలా ఒకటేమిటి ప్రతీదాంట్లో యూనిక్‌నెస్ కోరుకుంటారు. ఇక టాలీవుడ్ మన్మథుడు నాగార్జున స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏ డ్రెస్ వేసుకున్నా పర్ఫెక్ట్గా సూటైపోతుంది. 64ఏళ్లు పైబడినా సరే ఇప్పటికీ నాగార్జున గ్రీకువీరుడిలానే అట్రాక్ట్ చేస్తారు. సిక్స్టీ ప్లస్‌లో ఉన్నా, యంగ్ లుక్‌లో కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తుంటారు. తాజాగా అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకల్లో నాగార్జున వేసుకున్న షర్ట్ ఆకట్టుకుంటుంది. నిజానికి ఈ షర్ట్ రెండేళ్ల క్రితం నాటిది. 2021లో బిగ్‌బాస్ సీజన్5లో ఓ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ఈ షర్ట్ వేసుకున్నారు. ఎట్రో పైస్లీ బ్రాండ్‌కు చెందిన లెమన్ ఎల్లో సిల్క్ షర్ట్‌లో భలే అట్రాక్ట్ లుక్‌లో కనిపించారు. దీని ధర దాదాపు $1310 డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 83,908 రూపాయలు అన్నమాట. అప్పట్లోనే ఈ షర్ట్ ధర గురించి సోషల్ మీడియాలో గట్టిగానే టాక్ వినిపించింది. అయితే మళ్లీ రెండేళ్లకు ఇప్పుడు నాగార్జున సేమ్ షర్ట్‌లో కనిపించడం విశేషం. ఎంత కాస్ట్లీ బట్టలైనా ఒకసారి వేసుకున్న కాస్ట్యూమ్స్‌ను స్పెషల్ ఈవెంట్స్‌లలో రిపీట్ చేయడానికి మామూలుగానే సెలబ్రిటీలు ఇష్టపడరు. కానీ నాగార్జున ఏఎన్నార్ శతజయంతి వేడుకల్లో ఇలా సింపుల్‌గా కనిపించడం నిజంగానే మెచ్చుకోవాల్సిన విషయమంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -
'సిల్క్ స్మిత'ను చూసి శ్రీదేవి కూడా ఫాలో అయ్యేది : బాలకృష్ణ
Balakrishna About Silk Smitha : సిల్మ్ స్మిత..ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శృంగార తారగా స్టార్ డం తెచ్చుకున్న సిల్మ్ స్మిత రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలందరితో నటించారు. గ్లామర్ పాత్రలతో అలరించిన ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సహా పలు భాషల్లో 450కి పైగా సినిమాల్లో నటించారు. అప్పటివరకు కేవలం గ్లామరస్ డాల్‌గానే గుర్తింపు పొందిన ఆమె ఆదిత్య 369 సినిమాలో కీలకపాత్ర పోషించి నటిగా గుర్తింపు పొందారు. ఇటీవలె ఈ సినిమా విడుదలై 30 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ చిత్ర విశేషాలపై బాలకృష్ణ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సిల్క్ స్మిత గురించి మాట్లాడుతూ..'ఆమెకు తెలుగు రాకపోవడంతో ఇంగ్లీషులో డైలాగ్ పూర్తిచేసింది. షాట్ అయ్యాక ఓకేనా సార్ అని డైరెక్టర్ని అడిగే సరికి అందరూ బిత్తరపోయారు. నువ్ మాట్లాడింది ఇంగ్లీష్ తల్లీ.. అని ఆ డైరెక్టర్ చెప్పడంతో సెట్లో అంత నవ్వుకున్నాం. ఇక మేకప్, కాస్ట్యూమ్స్ విషయంలో సిల్క్ స్మితను కొట్టిన ఆడదే లేదు. ఎందుకంటే శ్రీదేవి వంటి స్టార్ హీరోయిన్లు సైతం సిల్మ్ స్మిత కాస్ట్యూమ్స్, మేకప్‌ని ఇమిటేట్ చేసేది. ఒక డ్యాన్సర్‌ని స్టార్ హీరోయిన్లు సైతం ఫాలో కావడం అంటే అది మామూలు విషయం కాదు' అంటూ బాలకృష్ణ సిల్క్ స్మితపై ప్రశంసలు కురిపించారు. -
రాధేశ్యామ్ : ప్రభాస్ కాస్ట్యూమ్స్ కోసం 6కోట్లు!
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. రాధేశ్యామ్‌లో ప్రభాస్ లుక్ చాలా కొత్తగా ఉంటుందని, కేవలం ప్రభాస్ కాస్ట్యూమ్స్ కోసమే నిర్మాతలు 6కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక డిజైనర్ టీం పని చేసిందని, ప్రభాస్ కెరియర్లోనే అత్యంత కాస్ట్లీ కాస్టూమ్స్ ఇవేనని సమాచారం. యూరప్ నేపథ్యంలో వింటేజ్ పిరియాడికల్ కథకు తగ్గట్లు ప్రభాస్ లుక్ కోసం చాలా జాగ్రత్తలు పాటించారట మూవీ టీం. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో జూలై 30న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. ఈ సినిమా విడుదలైన పది రోజులకే అంటే ఆగస్టు 11న ప్రభాస్ మరో చిత్రం ఆదిపురుష్ విడుదల కానుండటం గమనార్హం. చదవండి : (ప్రేమ కోసం చచ్చే టైప్ కాదంటున్న ప్రభాస్) (‘సలార్’ స్పెషల్ సాంగ్‌లో ప్రియాంక చోప్రా!) -
దుస్తులపై విమర్శలు.. హీరోయిన్ ఆగ్రహం
నటి ఆండ్రియాకు కోపం వచ్చింది. సంచలన నటిమణుల్లో తన రూటే సెపరేట్ అనిపించుకున్న నటి ఈ బ్యూటీ. నా జీవితం నా ఇష్టం. ఎవరేమనుకుంటే నాకేంటి అనేలా ప్రవర్తించే ఆండ్రియా ఇటీవల వార్తల్లో కనిపించలేదు. అసలు సినిమాల్లోనే కనిపించలేదు. వడచెన్నై చిత్రం తరువాత ఈ భామను తెరపై చూడలేదు. అంతేకాదు తన టైమ్ బాగోలేదో, లేక తొందరపాటు నిర్ణయంతోనో గానీ జీవితంలో కొంత గడ్డుపరిస్థితిని చవిచూసింది. ఈ విషయాన్ని తనే ఇటీవల బహిరంగంగా చెప్పుకుని బాధపడింది కూడా. తాను ఒక వివాహితుడితో సహజీవనం చేసి మానసికంగానూ, శారీరకంగానూ చాలా కోల్పోయానని ఆవేదనను వ్యక్తం చేసింది. అలాంటి ఆండ్రియా ఇప్పుడు మళ్లీ వార్తల్లో తరచూ కనిపిస్తోంది. నటిగానూ బిజీ అవుతోంది. ఇకపోతే ఇటీవల ఈ అమ్మడు చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో యూత్‌ను మజా చేసిందనే చెప్పాలి. అయితే అందులో ఆండ్రియా ధరించిన దుస్తులే విమర్శలకు దారి తీశాయి. అంతేకాకుండా ఆమెపై గాటుగా విమర్శిస్తున్నారు. దీంతో ఆండ్రియాకు చిర్రెత్తు కొచ్చింది. తన డాన్స్‌ను మాత్రమే ఎంజాయ్ చేయాలి గానీ, ధరించిన దుస్తుల గురించి కామెంట్స్ కొడతారా అంటూ రుసరుసలాడింది. ఏదేమైనా మరోసారి తన అసలు నైజాన్ని ఆండ్రియా నెటిజన్లకు చూపించింది. కాగా ప్రస్తుతం ఈ జాణకు అవకాశాలు వరుసకడుతున్నాయి. విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తోంది. దీనితో పాటు కా, వట్టం, మాళిగై చిత్రాల్లో నటిస్తోంది. అన్నట్లు ఇటీవల ఆయుర్వేద వైద్యంతో కొత్తందాలను సంతరించుకున్న ఆండ్రియా ఆ విషయాన్ని అందరికీ తెలియజేయడానికే శృంగారభరిత డాన్స్‌తో కూడిన వీడియోను విడుదల చేసిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. మొత్తం మీద తన ప్రయత్నం ఫలించినట్లే ఉంది. కోలీవుడ్‌లో మరో రౌండ్ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తోందన్నమాట. View this post on Instagram Va va pakkam va 😋 #aboutlastnight #birthdaygirl #thejeremiahproject Thanks @amritha.ram for this BOMB 👗 ❤️ A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) on Dec 21, 2019 at 11:56pm PST -
లీగల్ చర్యలకు సిద్ధం: ట్వింకిల్ ఖన్నా
సాక్షి, ముంబై: నటి, బాలీవుడ్ అగ్రహీరో అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా లీగల్ చర్యలకు సిద్ధమైపోయింది. రుస్తుం సినిమాలో అక్షయ్ ధరించిన దుస్తులను వేలానికి ఉంచిన విషయం తెలిసిందే. ఈ సంగతి తెలిసిన ఓ అధికారి ట్వింకిల్ ఖన్నాకు ట్వీటర్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ‘నీ భర్త సినిమాలో ధరించిన కాస్టూమ్ మాత్రమే. అది యూనిఫామ్ కాదు. సైనికాధికారుల భార్యలు తమ భర్తల దుస్తులను వేలం వేయాలని చూడరు. అది చాలా గౌరవంతో కూడుకున్నది... ఒకవేళ యూనిఫామ్ పేరిట నువ్వు పిచ్చి వేషాలేస్తే నిన్ను కోర్టుకి లాగుతా. మా యూనిఫామ్‌ను తాకాలని చూస్తే నీ ముఖం పగలకొడతా’ అంటూ సందేశం పెట్టాడు. ఆయన లెఫ్టినెంట్ కల్నల్ సందీప్ అహ్లావట్గా తర్వాత నిర్ధారణ అయ్యింది. ఇక ఈ విషయాన్ని ట్వింకిల్ ఖన్నా ట్విటర్లో ప్రస్తావించారు. బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని.. భౌతిక దాడులకు పాల్పడతామన్నందుకు ఆయనపై లీగల్ చర్యలు తీసుకుంటానని ఆమె తెలిపారు. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్‌కుమార్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘రుస్తుం’.. ఫ్రైడేస్ ఫిలిం వర్క్ పతాకంపై టీనూ సురేష్ దేశాయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నౌకాదళ అధికారి ‘రుస్తుం పావరి’ దేశం కోసం పోరాడిన అంశం నేపథ్యంతో చిత్రం రూపొందింది. రెండేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద రూ. 124 కోట్లు సాధించి విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రంలో అక్షయ్ ధరించిన దుస్తులని వేలం వేశారు. 20 వేల నుండి ప్రారంభమైన ఈ వేలం శుక్రవారం సాయంత్రానికి 3 కోట్లకి చేరింది. మే 26 సాయంత్రం 9.30ని.లకి వేలం ముగియనుంది. వచ్చిన మొత్తాన్ని జంతువుల సంరక్షణ కోసం పనిచేసే ఓ ఎన్జీవోకు అక్షయ్ విరాళంగా ఇవ్వనున్నాడు. And this response to @mrsfunnybones ill advised idea to auction the Rustom costume comes from one of the finest men in uniform I know- Lt Col Sandeep Ahlawat. pic.twitter.com/lwDXuG0CLm — Sandeep (@SandeepUnnithan) 28 April 2018 As a society do we really think it’s all right to threaten a woman with bodily harm for trying to raise funds for a charity by auctioning a uniform used in a movie,a piece of film memorabilia ? I will not retaliate with violent threats but by taking legal action! #JaiHind https://t.co/OF7e5lTHel — Twinkle Khanna (@mrsfunnybones) 29 April 2018 -
బిగ్ బీ అస్వస్థతకు కారణం ఇదే...
న్యూఢిల్లీ : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ సినిమా షూటింగ్లో మంగళవారం అస్వస్థతకు గురయిన సంగతి తెలిసిందే. బిగ్ బీ ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన పడుతుండగా ఆయన భార్య జయాబచ్చన్ మాట్లాడుతూ ప్రస్తుతం అమితాబ్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ‘ఈ సినిమాలో పాత్ర కోసం అమితాబ్ కోసం ప్రత్యేక దుస్తులు రూపొందించారు. అవి చాలా బరువుగా ఉన్నాయి. ఈ దుస్తులను ధరించడం వల్లే అమిత్‌జీకి వెన్ను నొప్పి, మెడనొప్పి వచ్చాయి, తప్ప ఆయనకు వేరే ఆరోగ్య సమస్యలు ఏమి లేవు’ అని జయాబచ్చన్ తెలిపారు. కాగా అస్వస్థతకు గురైన అమితాబ్‌కు చికిత్స చేసేందుకు ముంబాయి నుంచి ప్రత్యేక వైద్యుల బృందం జోథ్‌పూర్ వచ్చింది. కాగా బిగ్ బీ త్వరగా కోలుకోవాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ట్విట్ చేశారు. బిగ్ బీ ప్రస్తుతం ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’తో పాటు ‘102 నాట్ అవుట్’ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్‌తో పాటు రిషికపూర్ కూడా నటిస్తున్నారు. ఈ ఏడాది మేలో ‘102 నాట్ అవుట్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మెగా మూవీ : కాస్ట్యూమ్స్ కే ఐదు కోట్లు
ఖైదీ నంబర్ 150 సినిమాతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, తన 151వ చిత్రంగా చారిత్రక చిత్రాన్ని ఎంచుకున్నారు. ఎన్నో ఏళ్లుగా చర్చల దశలో ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో చిరంజీవి ప్రధాన పాత్రలో సైరా నరసింహారెడ్డి సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పీరియాడిక్ సినిమా కావటంతో అప్పటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించేందుకు భారీగా ఖర్చు పెడుతున్నారు. ముఖ్యంగా చిరు లుక్ కోసం బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్లు కసరత్తులు చేస్తున్నారు. అంతేకాదు చిరు దుస్తులు, చెప్పుల కోసమే ఏకంగా 5 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారట. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు జగపతిబాబు, సుధీప్, విజయ్ సేతుపతిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మెగాస్టార్ సరసన నయనతార తొలిసారిగా హీరోయిన్ గా నటిస్తోంది. -
చల్లని నరకం!
ఎముకలు కొరికే చలి. ఆ చలి తెలియకుండా ఉండాలంటే మందపాటి డ్రెస్సులు వేసుకోవాలి. చేతికి గ్లౌజులు, కాళ్లకు సాక్సులూ ఉంటేనే ఎంతో కొంత చలి తెలియకుండా ఉంటుంది. కానీ, చిట్టిపొట్టి దుస్తులు వేసుకుంటే మాత్రం ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది. అందాల కథానాయికలు ఇలాంటి పరిస్థితిని చాలాసార్లు ఎదుర్కొంటారు. పాటల చిత్రీకరణను చలి ప్రాంతాల్లో జరిపినప్పుడు వాళ్లు పడే పాట్లు మామూలుగా ఉండవు. ఈ విషయం గురించి కాజల్ అగర్వాల్ దగ్గర ప్రస్తావిస్తే – ‘‘లొకేషన్లో మేం (హీరోయిన్లు) తప్ప మిగతా అందరూ చలి నుంచి కాపాడుకోవడానికి స్వెటర్లు వేసుకుంటారు. హీరోలు కూడా ఫుల్ కవర్డ్గా ఉంటారు. వాళ్లను చూసి, నిట్టూర్పు వదలడం మినహా ఏం చేయగలం? ఇలాంటి కష్టాలను తట్టుకోవడానికి ప్రిపేర్ అయిపోవాలి. ‘మన ప్రొఫెషన్ ఇంతే. ఇలానే ఉంటుంది’ అని పదే పదే చెప్పుకుంటేనే ఇక్కడ కొనసాగగలుగుతాం. ఆ సంగతి పక్కన పెడితే, అసలు సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడే మొహమాటం, బిడియం వంటి కొన్ని లక్షణాలను వదిలేయాలి. సిగ్గుపడితే నలుగురిలో నటించలేం. మేం వింత వింత కాస్ట్యూమ్స్ వేసుకుంటాం. ఒంటి మీద ఉన్న ఆ డ్రెస్సు గురించి పట్టించుకుంటే ధ్యాస నటన మీద ఉండదు. చుట్టూ అందరూ ఉన్నారు కదా అని ఆలోచిస్తే, యాక్ట్ చేయడం కష్టమవుతుంది. అందుకే, కళ్లెదుటే జనాలు ఉన్నా లేనట్లే ఊహించుకోవాలి. ఒక్కోసారి నేను రాత్రి ఒంటి గంటకు నిద్రపోయి, ఉదయం ఐదు గంటలకల్లా నిద్ర లేచి, షూటింగ్‌కి వెళ్లిపోతాను. అంత హార్డ్‌వర్క్ చేస్తేనే కెరీర్ ఉంటుంది. లేకపోతే ఇంటికి వెళ్లిపోవాల్సిందే’’ అన్నారు. పాయింటే కదా! -
వేలానికి కబాలి కోటు, కారు
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా కబాలి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ తరువాత డివైడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం దుమ్మురేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త రికార్డ్లను నమోదు చేస్తూ రజనీ కలెక్షన్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా రజనీకి ఉన్న క్రేజ్‌ను మరింత ఉపయోగించుకోవాలని భావిస్తున్న చిత్రయూనిట్ కొత్త ప్లాన్ చేస్తోంది. కబాలి సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ వినియోగించిన కారుతో పాటు ఆయన వేసుకున్న దుస్తులను కూడా వేలానికి ఉంచాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే వందల కోట్ల కలెక్షన్లతో సంచలనం సృష్టించిన కబాలి.. వేలం ద్వారా మరింత భారీ మొత్తాన్ని సొంతం చేసుకుంటుందని భావిస్తున్నారు. రజనీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇతర దేశాల నుంచి కూడా అభిమానులు వేలంలో పాల్గొంటారని.. అందుకు తగని ఏర్పాట్లు చేసే పనిలో ఉంది చిత్రయూనిట్. -
శృతి హాసన్, గౌతమిల ఫైట్
కమల్ ముద్దులకూతురు శృతిహాసన్‌కు, కమల్ పార్ట్నర్ గౌతమికి మధ్య సినిమా సెట్స్‌లో ఫైట్ జరిగిందట. కమల్, శృతి ఓ సినిమాలో తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నారు. ఆ సినిమాకు గౌతమి కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఉన్నారు. శృతి పాత్రకు గౌతమి రూపొందించిన దుస్తులు నచ్చకపోవడంతో వీరిద్దరి మధ్య వాదులాట మొదలైందట. తనకు అస్సలు నప్పని దుస్తులను డిజైన్ చేసినందుకు గౌతమిపై శృతి ఫైర్ అయినట్లు సమాచారం. చెన్నైలో షూటింగ్ సెట్స్‌లో ఉండగా వీరిద్దరూ ఒకరి మీద ఒకరు అసహనాన్ని ప్రదర్శించుకున్నారు. వీరిద్దరి మధ్యకు వెళ్లేందుకు కమల్‌తో సహా ఎవరూ సాహసించలేదట. కేవలం ఈ సినిమా విషయంలోనే కాదు, ఇప్పటికే పలుమార్లు గౌతమి తన కోసం డిజైన్ చేసిన దుస్తులను ధరించేందుకు శృతి వ్యతిరేకించింది. ఆమె డిజైన్స్ నచ్చకపోవడమే అందుకు కారణమట. ఏదేమైనా ఈ ఇద్దరి గొడవ ఆ రోజు షూటింగ్‌కు సెలవు చెప్పడానికి కారణమైంది. -
ఈ కాస్ట్యూమ్స్ చాలా చాలా... కా..ఆ..ఆ..ఆ..స్ట్లీ
వెండితెరపై జిగేల్మని మెరిసే తారలను చూస్తున్నప్పుడు కళ్లకు హాయిగా ఉంటుంది. అమ్మాయిలైతే కథానాయికలు వేసుకునే కాస్ట్యూమ్స్‌కి, అబ్బాయిలేమో కథానాయకుల డ్రెస్సులకు కళ్లప్పగించేస్తారు. వీలైతే ఆ తరహా కాస్ట్యూమ్స్‌ని తామూ ధరించాలని కుర్రకారు ఉబలాటపడిపోతుంటారు. కానీ, వాటి రేటు వింటే మాత్రం డీలా పడిపోతారు. కొన్ని కాస్ట్యూమ్స్ ధర వింటే కళ్ల ముందు నక్షత్రాలు కనబడతాయి. హిందీ రంగాన్ని తీసుకుంటే, అక్కడ ‘కాస్ట్లియస్ట్ కాస్ట్యూమ్స్’ జాబితా చాలానే ఉంది. వాటిలోకొన్ని కాస్ట్యూమ్స్ గురించి తెలుసుకుందాం... బోలెడు కాస్ట్యూమ్స్.. బోలెడు డబ్బులు ‘రామ్‌లీలా’లో దీపికా పదుకొనె ధరించిన కాస్ట్యూమ్స్ అన్నీ చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ముఖ్యంగా ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు దీపికా ధరించిన ఆకుపచ్చ లెహంగా, చోళీ అమ్మాయిలను చాలా ఆకట్టుకుంది. దీని ఖరీదు 1 లక్షా 75వేలు. అలాగే, ఇదే సినిమాలో దీపికా ధరించిన ఆరెంజ్ కలర్ లెహెంగా ధర దాదాపు మూడు లక్షలు. ఇంకో సిల్వర్ లెహెంగా రేటు లక్ష రూపాయలపైనే. ఈ చిత్రంలో దీపికా బోల్డన్ని కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తారు. షారూక్ రబ్బర్ సూట్స్ ధర 90 కోట్లు బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ నటించిన చిత్రాల్లో ‘రా.వన్’ భారీ నిర్మాణ వ్యయంతో రూపొందింది. ఈ సైంటిఫిక్ థ్రిల్లర్‌లో షారూక్ ధరించిన ఒక్కో రబ్బర్ సూట్ ఖరీదు నాలుగున్నర కోట్ల రూపాయలని సమాచారం. సినిమా మొత్తం మీద ఆయన 20 సూట్స్ వాడారు. ఈ సూట్‌తో పాటు ఇంకా షారూక్ ఖాన్ వాడిన కాస్ట్యూమ్స్‌తో కలిపితే మొత్తం 100 కోట్ల రూపాయలు. ఆశ్చర్యంగా ఉంది కదూ.. కోటీ 20 లక్షలతో సైనికుడి కాస్ట్యూమ్స్ వాడిన సల్మాన్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ నటించిన చిత్రం ‘వీర్’. ఈ చిత్రంలో ఆయన చేసిన సైనికుడి పాత్ర కోసం ప్రత్యేకంగా ఆరు కాస్ట్యూమ్స్ తయారు చేయించారు. ఒక్కో కాస్ట్యూమ్ ధర 20 లక్షల రూపాయలు. సో.. సైనికుడి పాత్ర ధరించిన దుస్తుల ధర మాత్రమే కోటీ ఇరవై లక్షలని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరికీ లక్షలే ‘ఏ డోలరే.. డోలరే.. డోలా...’ అనే పాట వినగానే, కళ్లముందు మాధురీ దీక్షిత్, ఐశ్వర్యారాయ్ కనిపిస్తారు. ఈ ఇద్దరూ కథానాయికలుగా నటించిన ‘దేవదాస్’ చిత్రంలోని ఈ పాట ఎవర్గ్రీన్ అనొచ్చు. ఈ చిత్రంలో మాధురీ, ఐష్ చాలా అందంగా కనిపిస్తారు. ముఖ్యంగా వారి కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయి. మాధురీ దీక్షిత్ ధరించిన ఒక్కో కాస్ట్యూమ్ ధర 15 లక్షల రూపాయలు. ఐష్ ధరించిన ఒక్కో కాస్ట్యూమ్స్ 10 నుంచి 12 లక్షల రూపాయలతో తయారు చేశారు. జోథాగా మెరడానికి 2 లక్షలు ఐశ్వర్యా రాయ్ నటించిన ‘జోథా అక్బర్’ గుర్తుందా? యువరాణి జోథాగా తెరపై ఐష్ మెరిసిన వైనాన్ని అంత సులువుగా మర్చిపోలేం. జోథా ధరించిన హెవీ డిజైనర్ కాస్టూమ్స్ అప్పట్లో చాలామంది దృష్టిని ఆకర్షించాయి. ఒక్కో కాస్ట్యూమ్ ధర 2 లక్షల రూపాయలు. లండన్ నుంచి ఇంపోర్ట్ ‘కంబక్త్ ఇష్క్’ చిత్రంలో కరీనా కపూర్ ఓ నలుపు రంగు గౌనులో దర్శనమిస్తారు. ఈ బ్యూటీ మేని ఛాయ తెల్లని తెలుపు కావడంతో ఆ నల్లరంగు గౌనులో చాలా అందంగా కనిపించారు. అది ఇక్కడ తయారైన గౌను కాదు. లండన్ నుంచి తెప్పించా రు. దాని ఖరీదు 8 లక్షల రూపాయలు. ఇంకా ‘ప్రిన్స్’ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ వాడిన లెదర్ బైకర్ స్యూట్ ఖరీదు 30 వేలయ్యింది. ఇలాంటి ఈ చిత్రంలో ఆరు సూట్స్ ధరించారాయన. ఇంకా హిందీ రంగంలో కాస్ట్యూమ్స్ కోసమే బాగా ఖర్చు పెట్టిన చిత్రాలే చాలానే ఉన్నాయి. సోనాక్షీ.. సో కాస్ట్లీ డ్రెస్ ‘ఒక్కడు’ చిత్రానికి రీమేక్‌గా అర్జున్ కపూర్, సోనాక్షీ సిన్హా జంటగా హిందీలో రూపొందిన చిత్రం ‘తేవర్’. ఈ చిత్రంలో సోనాక్షీ చేసిన పాటల్లో ‘రాధా నాచేగీ..’ ఒకటి. ఈ పాట తీయడానికి అయిన ఖర్చు రెండున్నర కోట్లయితే, దీనికి సోనాక్షీ ధరించిన కాస్ట్యూమ్ ఖరీదు 75 లక్షల రూపాయలు. దాదాపు ఐదు నిమిషాలు కనిపించే పాటకు ఇంత ఖర్చు పెట్టారంటే మామూలు విషయం కాదు. ఈ కాస్ట్యూమ్‌లో సోనాక్షీ సింప్లీ సుపర్బ్‌గా ఉన్నారనొచ్చు. -
స్పందోలిక మన్‌డోలిక
ఆటపాటలు తప్ప అన్యం ఎరుగని బాల్యం.. జీవితాంతం ఏదో రూపంలో తొంగి చూస్తూనే ఉంటుంది. చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలో.. బుజ్జాయిగా అమ్మతో దిగిన ఫొటోనో కనిపిస్తే మనసు కాసేపు ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోతుంది. ఆనాటి గుర్తులను తడిమి వర్తమానంలోకి వచ్చిన మనుషులు కాసేపు అవే జ్ఞాపకాలల్లో సేదతీరుతారు. కానీ కళను ఒంటబట్టించుకున్న ఈ మనిషి మాత్రం.. ఆనాటి జ్ఞాపకాలను అంతే ఫ్రెష్‌గా మళ్లీ ఆవిష్కరిస్తున్నాడు. రవికాంత్ ఫైన్ ఆర్ట్స్‌లో మాస్టర్ డిగ్రీ సాధించాడు. బొమ్మలు గీస్తాడు.. తయారు చేస్తాడు కూడా. తన జ్ఞాపకానికి కళను మేళవించి.. ఆ కళకు చరిత్రను రంగరించి బొమ్మల రూపంలో ప్రజెంట్ చేస్తున్నాడు. ఒక్కోసారి ఒక్కో థీమ్ తీసుకుని.. దాన్ని అన్ని కోణాల్లో నేటి తరానికి చూపుతున్నాడు. రవికాంత్ తండ్రి టీచర్, ఆర్టిస్ట్, ఫొటోగ్రాఫర్. ఆయన స్టూడియోలో పిల్లలు ఫొటో దిగడానికి ఊగే కీలుగుర్రం ఒకటి ఉండేది. చిన్నప్పుడు దానిపై సరదాగా స్వారీ చేసిన రవికాంత్‌కు ఈ మధ్య ఆ రోజులు గుర్తొచ్చాయి. వింతగా తోచిన ఆనాటి జ్ఞాపకాన్ని.. గొప్పగా చూపాలనుకున్నాడు. కీలుగుర్రాల పుట్టపూర్వోత్తరాల కోసం చరిత్రలోకి తొంగి చూశాడు. వాటి పుట్టిల్లు బెంగళూరు, మైసూర్ మధ్య ఉన్న చెన్నపట్న అని తెలుసకున్నాడు. అక్కడికి వెళ్లి వాటి గురించి తెలుసుకుని రకరకాల కీలుగుర్రాల మినియేచర్ పెయింటింగ్స్ వేశాడు. కొయ్యలతో కీలుగుర్రాల నమూనాలు తీర్చిదిద్దాడు. వీటన్నింటినీ వాటి చరిత్రతో సహా.. స్పందోలిక (ద రాకింగ్ హార్సెస్) పేరుతో బంజారాహిల్స్‌లోని ట్రైడెంట్ హోటల్లో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశాడు. గుర్రాల ఐతిహాసక విశిష్టతను, చారిత్రాత్మక ప్రశస్తిని తెలియజేస్తూ కాన్వాస్‌పై రంగులద్దాడు. పోస్ట్ మాడర్నిజంతో గుర్రాల నేపథ్యాన్ని ఆవిష్కరించాడు. గురువారంతో ఈ ప్రదర్శన ముగుస్తుంది. ఫొటోలు.. ఫోజులు.. తన మదిలో మెదిలిన ఆ పాత గుర్తులను కమనీయంగా చూపడం రవికాంత్‌కు కొత్తకాదు. 90వ దశకంలో ఫొటో స్టూడియోకు వెళ్లి ఫొటోలు దిగడం అంటే చాలామంది ఓ పండుగలా ఫీలయ్యేవాళ్లు. సెల్ఫీలు, రిల్ఫీలు దిగుతున్న ఈ స్మార్ట్ జమానాకు నాటి ఫొటో ఫోజుల సంగతి తెలియజేసేందుకు రవికాంత్ విభిన్న ప్రయోగం చేశాడు. ఆనాటి ఫొటోలు.. ఫోజులు ఎలా ఉండేవో.. తనకొచ్చిన కళతో కళ్లముందుంచాడు. ఆ తర్వాత మహారాజులకు రాచఠీవి తెచ్చే కాస్ట్యూమ్స్ గురించి ఆలోచన రాగానే.. ఆ థీమ్‌ను ఎంచుకుని వారి గెటప్స్పై ఓ ప్రదర్శన నిర్వహించాడు. -
ఈకల కోకలు
రాతియుగం సెకండాఫ్‌లో బట్టలు చుట్టుకోవడం నేర్చిన మానవులు.. అంచెలంచెలుగా ఆధునికతను అందిపుచ్చుకున్నారు. చెట్ల ఆకులు కట్టుకున్న చేతులతోనే.. పట్టుపీతాంబరాలు చుట్టుకున్నారు. జంతు చర్మాలను ధరించిన వాళ్లే.. లెదర్‌తో నయా డిజైన్లను ప్రపంచానికి పరిచయం చేశారు. విప్లవాత్మకమైన మార్పులతో కొత్తపుంతలు తొక్కిస్తున్న ఫ్యాషన్ డిజైనర్లు ఇప్పుడు మూలాల్లోకి వెళ్లి ఆనాటి ట్రెండ్స్‌ను మళ్లీ తెరపైకి తెస్తున్నారు. ఆదివాసీలు అలంకరించుకునే పక్షుల ఈకలతో ఇన్నోవేటివ్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి మార్కెట్లో మార్కులు కొట్టేస్తున్నారు. ఫాస్ట్‌గా మూవ్ అవుతున్న ప్రపంచం కోసం ఫ్యాషన్ రంగం సైతం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతోంది. ఈతరం అభిరుచులకు తగ్గట్టుగా సరికొత్త డిజైన్లను అందుబాటులోకి తెస్తోంది. కాటన్ శారీస్, సిల్క్ స్కర్ట్స్.. వందల రకాల ఫ్యాబ్రిక్స్‌తో వేల రకాల కాస్ట్యూమ్స్ మగువల మనసులు దోచేశాయి. ఇప్పుడదే కోవలోకి ఫెదర్స్ ట్రెండ్‌ను చేరుస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. నెమలీకలు.. కోడీకలు.. ఎప్పటికప్పుడు నయా ట్రెండ్స్‌తో కాదేదీ ఫ్యాషన్‌కు అనర్హం అని రుజువు చేస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. నెమలి, కోడి, పావురాల ఈకలతో సరికొత్త వస్త్రాలు తయారు చేస్తున్నారు. నెమలీకలతో వెడ్డింగ్ డ్రెస్, ఫ్లోర్ లెన్త్ ఫ్రాక్స్, మినీ డ్రెస్, స్కర్ట్స్ రూపొందిస్తున్నారు. చీరల కొంగులకు ఈకలతో ముడివేసి.. అతివల అందానికి మరింత వన్నె తెస్తున్నారు. కోడి ఈకలు, పావురాల ఈకలు కూడా ఫెదర్ ట్రెండ్‌లో సత్తా చాటుతున్నాయి. రంగురంగుల ఈకలు అల్లుకున్న డ్రెస్‌లు మగువల మనసును దోచేస్తున్నాయి. అదనపు సొబగులు.. పట్టుపోగులతో సవరాలు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈకలతో రూపుదిద్దుకున్న హెయిర్ యాక్ససరీస్ కూడా అందుబాటులోకి వచ్చేశాయి. రంగురంగుల ఫెదర్ హెయిర్ యాక్ససరీస్ కురుల అందాన్ని మరింత పెంచుతున్నాయి. ఇవేకాకుండా ఫెదర్ హెయిర్ హ్యాట్, ఫెదర్ హెయిర్ క్లిప్స్, ఇయర్ హ్యాంగింగ్స్ కూడా ఇప్పుడు ఫ్యాషన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈకలతో రూపొందించిన పౌచెస్ కూడా అందర్నీఆకట్టుకుంటున్నాయి. ఈ తరం కాలేజ్ స్టూడెంట్స్, మోడల్స్, హీరోయిన్లు సైతం నైట్ పార్టీలకు ఇలాంటి ఇన్నోవేటివ్ కలెక్షన్స్ వేసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. సిరి -
కోట్లు కొల్లగొట్టిన మడోన్నా కాస్టూమ్స్