వేలానికి కబాలి కోటు, కారు | Rajani Kanth Kabali costumes to be auctioned | Sakshi
Sakshi News home page

వేలానికి కబాలి కోటు, కారు

Published Tue, Aug 16 2016 10:23 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

వేలానికి కబాలి కోటు, కారు

వేలానికి కబాలి కోటు, కారు

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా కబాలి. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ తరువాత డివైడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం దుమ్మురేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త రికార్డ్లను నమోదు చేస్తూ రజనీ కలెక్షన్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా రజనీకి ఉన్న క్రేజ్ను మరింత ఉపయోగించుకోవాలని భావిస్తున్న చిత్రయూనిట్ కొత్త ప్లాన్ చేస్తోంది.

కబాలి సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ వినియోగించిన కారుతో పాటు ఆయన వేసుకున్న దుస్తులను కూడా వేలానికి ఉంచాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే వందల కోట్ల కలెక్షన్లతో సంచలనం సృష్టించిన కబాలి.. వేలం ద్వారా మరింత భారీ మొత్తాన్ని సొంతం చేసుకుంటుందని భావిస్తున్నారు. రజనీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇతర దేశాల నుంచి కూడా అభిమానులు వేలంలో పాల్గొంటారని.. అందుకు తగని ఏర్పాట్లు చేసే పనిలో ఉంది చిత్రయూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement