ఖైదీ నంబర్ 150 సినిమాతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, తన 151వ చిత్రంగా చారిత్రక చిత్రాన్ని ఎంచుకున్నారు. ఎన్నో ఏళ్లుగా చర్చల దశలో ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో చిరంజీవి ప్రధాన పాత్రలో సైరా నరసింహారెడ్డి సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పీరియాడిక్ సినిమా కావటంతో అప్పటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించేందుకు భారీగా ఖర్చు పెడుతున్నారు. ముఖ్యంగా చిరు లుక్ కోసం బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్లు కసరత్తులు చేస్తున్నారు. అంతేకాదు చిరు దుస్తులు, చెప్పుల కోసమే ఏకంగా 5 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారట.
త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు జగపతిబాబు, సుధీప్, విజయ్ సేతుపతిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మెగాస్టార్ సరసన నయనతార తొలిసారిగా హీరోయిన్ గా నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment