న్యూఢిల్లీ : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ సినిమా షూటింగ్‌లో మంగళవారం అస్వస్థతకు గురయిన సంగతి తెలిసిందే. బిగ్ బీ ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన పడుతుండగా ఆయన భార్య జయాబచ్చన్ మాట్లాడుతూ ప్రస్తుతం అమితాబ్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ‘ఈ సినిమాలో పాత్ర కోసం అమితాబ్ కోసం ప్రత్యేక దుస్తులు రూపొందించారు. అవి చాలా బరువుగా ఉన్నాయి. ఈ దుస్తులను ధరించడం వల్లే అమిత్‌జీకి వెన్ను నొప్పి, మెడనొప్పి వచ్చాయి, తప్ప ఆయనకు వేరే ఆరోగ్య సమస్యలు ఏమి లేవు’ అని జయాబచ్చన్ తెలిపారు. కాగా అస్వస్థతకు గురైన అమితాబ్‌కు చికిత్స చేసేందుకు ముంబాయి నుంచి ప్రత్యేక వైద్యుల బృందం జోథ్‌పూర్ వచ్చింది. కాగా బిగ్ బీ త్వరగా కోలుకోవాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ట్విట్ చేశారు.
బిగ్ బీ ప్రస్తుతం ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’తో పాటు ‘102 నాట్ అవుట్’ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్‌తో పాటు రిషికపూర్ కూడా నటిస్తున్నారు. ఈ ఏడాది మేలో ‘102 నాట్ అవుట్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment