ఈ కాస్ట్యూమ్స్ చాలా చాలా... కా..ఆ..ఆ..ఆ..స్ట్లీ | Where costumes worn by Bollywood stars in films | Sakshi
Sakshi News home page

ఈ కాస్ట్యూమ్స్ చాలా చాలా... కా..ఆ..ఆ..ఆ..స్ట్లీ

Published Sun, Jul 12 2015 11:22 PM | Last Updated on Wed, Apr 3 2019 7:03 PM

ఈ కాస్ట్యూమ్స్ చాలా చాలా... కా..ఆ..ఆ..ఆ..స్ట్లీ - Sakshi

ఈ కాస్ట్యూమ్స్ చాలా చాలా... కా..ఆ..ఆ..ఆ..స్ట్లీ

వెండితెరపై జిగేల్‌మని మెరిసే తారలను చూస్తున్నప్పుడు కళ్లకు హాయిగా ఉంటుంది. అమ్మాయిలైతే కథానాయికలు వేసుకునే కాస్ట్యూమ్స్‌కి, అబ్బాయిలేమో కథానాయకుల డ్రెస్సులకు కళ్లప్పగించేస్తారు. వీలైతే ఆ తరహా కాస్ట్యూమ్స్‌ని తామూ ధరించాలని కుర్రకారు ఉబలాటపడిపోతుంటారు. కానీ, వాటి రేటు వింటే మాత్రం డీలా పడిపోతారు. కొన్ని కాస్ట్యూమ్స్ ధర వింటే కళ్ల ముందు నక్షత్రాలు కనబడతాయి. హిందీ రంగాన్ని తీసుకుంటే, అక్కడ ‘కాస్ట్‌లియస్ట్ కాస్ట్యూమ్స్’ జాబితా చాలానే ఉంది. వాటిలోకొన్ని కాస్ట్యూమ్స్ గురించి తెలుసుకుందాం...
 
 బోలెడు కాస్ట్యూమ్స్.. బోలెడు డబ్బులు
 ‘రామ్‌లీలా’లో దీపికా పదుకొనె ధరించిన కాస్ట్యూమ్స్ అన్నీ చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి. ముఖ్యంగా ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు దీపికా ధరించిన ఆకుపచ్చ లెహంగా, చోళీ అమ్మాయిలను చాలా ఆకట్టుకుంది. దీని ఖరీదు 1 లక్షా 75వేలు. అలాగే, ఇదే సినిమాలో దీపికా ధరించిన ఆరెంజ్ కలర్ లెహెంగా ధర దాదాపు మూడు లక్షలు. ఇంకో సిల్వర్ లెహెంగా రేటు లక్ష రూపాయలపైనే. ఈ చిత్రంలో దీపికా బోల్డన్ని కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తారు.
 
 షారూక్ రబ్బర్ సూట్స్ ధర 90 కోట్లు
 బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన చిత్రాల్లో ‘రా.వన్’ భారీ నిర్మాణ వ్యయంతో రూపొందింది. ఈ సైంటిఫిక్ థ్రిల్లర్‌లో షారూక్ ధరించిన ఒక్కో రబ్బర్ సూట్ ఖరీదు నాలుగున్నర కోట్ల రూపాయలని సమాచారం. సినిమా మొత్తం మీద ఆయన 20 సూట్స్ వాడారు. ఈ సూట్‌తో పాటు ఇంకా షారూక్ ఖాన్ వాడిన కాస్ట్యూమ్స్‌తో కలిపితే మొత్తం 100 కోట్ల రూపాయలు. ఆశ్చర్యంగా ఉంది కదూ..
 
 కోటీ 20 లక్షలతో సైనికుడి కాస్ట్యూమ్స్ వాడిన సల్మాన్
 కండలవీరుడు సల్మాన్‌ఖాన్ నటించిన చిత్రం ‘వీర్’. ఈ చిత్రంలో ఆయన చేసిన సైనికుడి పాత్ర కోసం ప్రత్యేకంగా ఆరు కాస్ట్యూమ్స్ తయారు చేయించారు. ఒక్కో కాస్ట్యూమ్ ధర 20 లక్షల రూపాయలు. సో.. సైనికుడి పాత్ర ధరించిన దుస్తుల ధర మాత్రమే కోటీ ఇరవై లక్షలని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
 
 ఇద్దరికీ లక్షలే
 ‘ఏ డోలరే.. డోలరే.. డోలా...’ అనే పాట వినగానే, కళ్లముందు మాధురీ దీక్షిత్, ఐశ్వర్యారాయ్ కనిపిస్తారు. ఈ ఇద్దరూ కథానాయికలుగా నటించిన ‘దేవదాస్’ చిత్రంలోని ఈ పాట ఎవర్‌గ్రీన్ అనొచ్చు. ఈ చిత్రంలో మాధురీ, ఐష్ చాలా అందంగా కనిపిస్తారు. ముఖ్యంగా వారి కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయి. మాధురీ దీక్షిత్ ధరించిన ఒక్కో కాస్ట్యూమ్ ధర 15 లక్షల రూపాయలు. ఐష్ ధరించిన ఒక్కో కాస్ట్యూమ్స్ 10 నుంచి 12 లక్షల రూపాయలతో తయారు చేశారు.
 
 జోథాగా మెరడానికి 2 లక్షలు
 ఐశ్వర్యా రాయ్ నటించిన ‘జోథా అక్బర్’ గుర్తుందా? యువరాణి జోథాగా తెరపై ఐష్ మెరిసిన వైనాన్ని అంత సులువుగా మర్చిపోలేం. జోథా ధరించిన హెవీ డిజైనర్ కాస్టూమ్స్ అప్పట్లో చాలామంది దృష్టిని ఆకర్షించాయి. ఒక్కో కాస్ట్యూమ్ ధర 2 లక్షల రూపాయలు.
 
 లండన్ నుంచి ఇంపోర్ట్
 ‘కంబక్త్ ఇష్క్’ చిత్రంలో కరీనా కపూర్ ఓ నలుపు రంగు గౌనులో దర్శనమిస్తారు. ఈ బ్యూటీ మేని ఛాయ తెల్లని తెలుపు కావడంతో ఆ నల్లరంగు గౌనులో చాలా అందంగా కనిపించారు. అది ఇక్కడ తయారైన గౌను కాదు. లండన్ నుంచి తెప్పించా రు. దాని ఖరీదు 8 లక్షల రూపాయలు.
 
 ఇంకా ‘ప్రిన్స్’ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ వాడిన లెదర్ బైకర్ స్యూట్ ఖరీదు 30 వేలయ్యింది. ఇలాంటి ఈ చిత్రంలో ఆరు సూట్స్ ధరించారాయన. ఇంకా హిందీ రంగంలో కాస్ట్యూమ్స్ కోసమే బాగా ఖర్చు పెట్టిన చిత్రాలే చాలానే ఉన్నాయి.
 
 సోనాక్షీ.. సో కాస్ట్‌లీ డ్రెస్
 ‘ఒక్కడు’ చిత్రానికి రీమేక్‌గా అర్జున్ కపూర్, సోనాక్షీ సిన్హా జంటగా హిందీలో రూపొందిన చిత్రం ‘తేవర్’. ఈ చిత్రంలో సోనాక్షీ చేసిన పాటల్లో ‘రాధా నాచేగీ..’ ఒకటి. ఈ పాట తీయడానికి అయిన ఖర్చు రెండున్నర కోట్లయితే, దీనికి సోనాక్షీ ధరించిన కాస్ట్యూమ్ ఖరీదు 75 లక్షల రూపాయలు. దాదాపు ఐదు నిమిషాలు కనిపించే పాటకు ఇంత ఖర్చు పెట్టారంటే మామూలు విషయం కాదు. ఈ కాస్ట్యూమ్‌లో సోనాక్షీ సింప్లీ సుపర్బ్‌గా ఉన్నారనొచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement