![King Nagarjuna wears silk shirt after 2 years in ANR 100th birth anniversary celebrations - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/20/Nagarjuna_650x400.jpg.webp?itok=Z9fv593N)
సాధారణంగా సెలబ్రిటీలు అనగానే వారు ధరించే బట్టల దగ్గర్నుంచి చెప్పులు వరకు ప్రతీది కాస్ట్‌లీగానే ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈవెంట్ ఏదైనా డిజైనర్ వేర్ కాస్ట్యూమ్ ఉండాల్సిందే అనేంతలా ఆకట్టుకుంటారు. వాళ్లు ధరించే వాచ్‌లు, మేకప్, హ్యాండ్‌బ్యాగ్స్, ఫోన్స్,కాస్ట్యూమ్స్.. ఇలా ఒకటేమిటి ప్రతీదాంట్లో యూనిక్‌నెస్ కోరుకుంటారు. ఇక టాలీవుడ్ మన్మథుడు నాగార్జున స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఆయన ఏ డ్రెస్ వేసుకున్నా పర్ఫెక్ట్‌గా సూటైపోతుంది. 64ఏళ్లు పైబడినా సరే ఇప్పటికీ నాగార్జున గ్రీకువీరుడిలానే అట్రాక్ట్ చేస్తారు. సిక్స్టీ ప్లస్‌లో ఉన్నా, యంగ్ లుక్‌లో కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తుంటారు. తాజాగా అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకల్లో నాగార్జున వేసుకున్న షర్ట్ ఆకట్టుకుంటుంది. నిజానికి ఈ షర్ట్ రెండేళ్ల క్రితం నాటిది. 2021లో బిగ్‌బాస్ సీజన్5లో ఓ వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున ఈ షర్ట్ వేసుకున్నారు.
ఎట్రో పైస్లీ బ్రాండ్‌కు చెందిన లెమన్ ఎల్లో సిల్క్ షర్ట్‌లో భలే అట్రాక్ట్ లుక్‌లో కనిపించారు. దీని ధర దాదాపు $1310 డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 83,908 రూపాయలు అన్నమాట. అప్పట్లోనే ఈ షర్ట్ ధర గురించి సోషల్ మీడియాలో గట్టిగానే టాక్ వినిపించింది. అయితే మళ్లీ రెండేళ్లకు ఇప్పుడు నాగార్జున సేమ్ షర్ట్‌లో కనిపించడం విశేషం.
ఎంత కాస్ట్‌లీ బట్టలైనా ఒకసారి వేసుకున్న కాస్ట్యూమ్స్‌ను స్పెషల్ ఈవెంట్స్‌లలో రిపీట్ చేయడానికి మామూలుగానే సెలబ్రిటీలు ఇష్టపడరు. కానీ నాగార్జున ఏఎన్నార్ శతజయంతి వేడుకల్లో ఇలా సింపుల్‌గా కనిపించడం నిజంగానే మెచ్చుకోవాల్సిన విషయమంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment