Costume
-
Fathers Day 2024: కన్నా... నేనున్నా
తల్లి ఎదురుగా ఉంటే ఎంతమంది ఉంటే మాత్రం ఏమిటి? సంప్రదాయ నృత్య దుస్తులు ధరించిన అమ్మాయి భయం భయంగా స్టేజీ ఎక్కింది. ఎదురుగా ఎంతోమంది జనం. తన వైపే చూస్తున్నారు. ‘భయపడవద్దు’ అన్నట్లుగా సైగ చేసింది తల్లి. అంతేకాదు...మ్యూజిక్ స్టార్ట్ కాగానే డ్యాన్స్ స్టెప్స్‌ను ఆటిస్టిక్ కుమార్తెకు చూపెట్టడం మొదలుపెట్టింది. స్టేజీ ముందు ఉన్న తన తల్లిని నిశితంగా గమనిస్తూ అందంగా, అద్భుతంగా డ్యాన్స్ చేసింది ఆ అమ్మాయి. ‘స్పెషల్–నీడ్స్ చిల్డ్రన్ ఆలనా పాలనకు ఎంతో ఓపిక, అంకితభావం కావాలి. అవి ఈ తల్లిలో కనిపిస్తున్నాయి’ అని నెటిజనులు స్పందించారు. అపర్ణ అనే యూజర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. -
మిస్ యూనివర్స్ పోటీల్లో దేవకన్యలా మెరిసిపోయిన శ్వేత
ప్రతిష్టాత్మక 72వ మిస్ యూనివర్స్ అందాల పోటీలు ఫైనల్‌కు చేరుకున్నాయి.ఎల్ సాల్వడార్లో వేదికగా ఆదివారం ఉదయం 9గంటలకు(భారత కాలమానం ప్రకారం).. మిస్ యూనివర్స్2023 ఎవరో తేలిపోనుంది. 90 దేశాలకు చెందిన అందాల భామలు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. భారత్ నుంచి 23ఏళ్ల శ్వేతా శార్దా ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం జరిగిన నేషనల్ కాస్ట్యూమ్ షోలో శ్వేత ధరించిన కాస్ట్యూమ్స్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్‌గా మారాయి. రీగల్ ఎంబ్రాయిడరీతో చేసిన దుస్తులు ధరించి శ్వేత దేవకన్యలా మెరిసింది. జాతీయ పుష్పం కమలం స్ఫూర్తితో రూపొందించిన కిరీటం ధరించి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది.దీంతో పాటు జాతీయ పక్షి నెమలి ప్రతిబింబించేలా కాస్ట్యూమ్‌ను ఎంబ్రాయిడరీతో తీర్చిదిద్దారు. సవాళ్లను ఎదుర్కొనే, అభివృద్ధి చెందుతున్న దృఢమైన భారత్‌కు ప్రతీకగా ఈ కాస్ట్యూమ్‌ను డిజైన్ చేసినట్లు డిజైనర్ నిధి యశా తెలిపింది. ప్రస్తుతం శ్వేతా శార్దా లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Miss Diva (@missdivaorg) ఎవరీ శ్వేతా శార్దా? చండీగఢ్‌కు చెందిన 23 ఏళ్ల శ్వేతా శార్దా ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ అందాల పోటీలో ఈ ఏడాది భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తోంది. 16 ఏళ్ల వయసులో తన తల్లితో కలిసి ముంబై చేరిన శ్వేత చిన్నతనంలోనే డ్యాన్స్‌పై మక్కువ ఏర్పరుచుకుంది. ఇప్పటివరకు ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’, ‘డ్యాన్స్ దీవానే’ వంటి పలు రియాలిటీ షోల్లో ఆమె పాల్గొంది. ఫెమినా మిస్ ఇండియా గ్రూప్‌లో భాగమైన ‘మిస్ దివా యూనివర్స్-2023’ కిరీటాన్ని సొంతం చేసుకుంది. మరి మిస్ యూనివర్స్‌గా సత్తా చాటుతుందా అన్నది చూడాల్సి ఉంది. భారత్ నుంచి చివరగా 2021లో హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్‌గా గెలుపొందిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Miss Diva (@missdivaorg) -
నాగార్జున వేసుకున్న ఈ షర్ట్‌కి ఓ స్పెషల్ ఉంది.. గుర్తుపట్టారా?
సాధారణంగా సెలబ్రిటీలు అనగానే వారు ధరించే బట్టల దగ్గర్నుంచి చెప్పులు వరకు ప్రతీది కాస్ట్లీగానే ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈవెంట్ ఏదైనా డిజైనర్ వేర్ కాస్ట్యూమ్ ఉండాల్సిందే అనేంతలా ఆకట్టుకుంటారు. వాళ్లు ధరించే వాచ్‌లు, మేకప్, హ్యాండ్‌బ్యాగ్స్, ఫోన్స్,కాస్ట్యూమ్స్.. ఇలా ఒకటేమిటి ప్రతీదాంట్లో యూనిక్‌నెస్ కోరుకుంటారు. ఇక టాలీవుడ్ మన్మథుడు నాగార్జున స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏ డ్రెస్ వేసుకున్నా పర్ఫెక్ట్గా సూటైపోతుంది. 64ఏళ్లు పైబడినా సరే ఇప్పటికీ నాగార్జున గ్రీకువీరుడిలానే అట్రాక్ట్ చేస్తారు. సిక్స్టీ ప్లస్‌లో ఉన్నా, యంగ్ లుక్‌లో కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తుంటారు. తాజాగా అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకల్లో నాగార్జున వేసుకున్న షర్ట్ ఆకట్టుకుంటుంది. నిజానికి ఈ షర్ట్ రెండేళ్ల క్రితం నాటిది. 2021లో బిగ్‌బాస్ సీజన్5లో ఓ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ఈ షర్ట్ వేసుకున్నారు. ఎట్రో పైస్లీ బ్రాండ్‌కు చెందిన లెమన్ ఎల్లో సిల్క్ షర్ట్‌లో భలే అట్రాక్ట్ లుక్‌లో కనిపించారు. దీని ధర దాదాపు $1310 డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 83,908 రూపాయలు అన్నమాట. అప్పట్లోనే ఈ షర్ట్ ధర గురించి సోషల్ మీడియాలో గట్టిగానే టాక్ వినిపించింది. అయితే మళ్లీ రెండేళ్లకు ఇప్పుడు నాగార్జున సేమ్ షర్ట్‌లో కనిపించడం విశేషం. ఎంత కాస్ట్లీ బట్టలైనా ఒకసారి వేసుకున్న కాస్ట్యూమ్స్‌ను స్పెషల్ ఈవెంట్స్‌లలో రిపీట్ చేయడానికి మామూలుగానే సెలబ్రిటీలు ఇష్టపడరు. కానీ నాగార్జున ఏఎన్నార్ శతజయంతి వేడుకల్లో ఇలా సింపుల్‌గా కనిపించడం నిజంగానే మెచ్చుకోవాల్సిన విషయమంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -
ర్యాంప్ వాక్ చేస్తుండగా ఈడ్చిపడేసిన సిబ్బంది..ఇంతకీ ఏం జరిగిందంటే..
మోడల్స్ వయ్యారాలు, కాస్ట్యూమ్స్‌కి హద్దేలేదు. మారుతున్న ట్రెండ్‌కి తగ్గట్లు చిత్రవిచిత్ర ఫ్యాషన్‌తో కనువిందు చేస్తుంటారు. తాజాగా న్యూయార్క్‌లో జరిగిన ఫ్యాషన్ షోలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ మోడల్ స్టైల్‌గా ర్యాంప్ వాక్ చేస్తుంటే, సిబ్బంది అతన్ని పక్కకి ఈడ్చిపడేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ అవుతుంది. ఇంతకీ అతను ఏం చేశాడు? ర్యాంప్ వాక్ నుంచి ఎందుకు నెట్టేశారన్నది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ట్రెండ్ మారేకొద్ది రకరకాల ఫ్యాషన్ స్టైల్స్ పరాకాష్టకు చేరుతున్నాయి. టాలెంట్ ఎవడి సొత్తూ కాదు అనేది ఎంత నిజమో ఫ్యాషన్ కూడా ఎవడి సొంతం కాదు అన్నట్లు ఉన్నారు చాలామంది. కాస్త వెరైటీగా, చిత్ర విచిత్రమైన డ్రెస్‌లో కనిపిస్తే చాలు అదే ఫ్యాషన్ అనుకుంటున్నారు. చిరిగిన బట్టలు, పగిలిన గ్లాస్ ముక్కలు, ప్లాస్టిక్ కవర్స్.. ఇలా ఒకటేమిటి ఫ్యాషన్‌కు కాదేదీ అనర్హం అన్నట్లు రకరకాల కాస్టమ్స్తో దర్శనం ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇక మోడల్స్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకోండి. హెయిర్ స్టైల్, జ్యువెలరీ, బ్యాగ్స్, చెప్పులు, బట్టలు, ఆఖరికి లిప్‌స్టిక్ కలర్స్‌లో కూడా వెరైటీ కోరుకుంటూ ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా కనిపించాలనుకుంటారు. ఫ్యాషన్ సెన్స్‌తో నిజంగానే చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తారు చాలామంది. మరికొంత మంది మాత్రం తమ స్టైల్‌కు ఫ్యాషన్ అన్న పేరు అంటించేసుకొని వెరైటీ కాస్టూమ్స్‌తో జనాలను కన్ఫ్యూజ్ చేసేస్తుంటారు. తాజాగా న్యూయార్క్ ఫ్యాషన్ షోలో ఇలాంటి వింత ఘటన చోటు చేసుకుంది. అచ్చం మోడల్లా రెడీ అయి వచ్చిన ఓ యువకుడు ర్యాంప్‌పైకి వచ్చి మోడల్లా వాక్ చేశాడు. పాలిథీన్ కవర్నే కాస్టూమ్గా మార్చుకొని వెరైటీ లుక్స్‌తో దర్శనం ఇచ్చాడు. స్టైల్‌గా వాక్ చేస్తూ మోడల్‌లానే బిల్డప్ ఇచ్చాడు. ఇతను నిజంగానే మోడలా? ఈ బట్టలేంట్రా బాబు అని జనాలు ఆలోచించేలోపు నిర్వాహకులు అప్రమత్తమై డమ్మీ మోడల్‌ను పక్కకు ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కవర్‌తో బాడీ కప్పీసి ఇదేం ఫ్యాషన్‌రా బాబు అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, అతని స్టైల్ రియల్ మోడల్‌లానే ఉంది. ఒక్క ఛాన్స్ ఇచ్చి ఉండాల్సింది అంటూ మరికొందరు ఆ యువకుడికి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. Given what passes for fashion these days, I wouldn’t be surprised if that was a real outfit. pic.twitter.com/s4y1fttuwc — Censored Men (@CensoredMen) September 11, 2023 -
‘నిజంగానే నాది కుక్క బతుకయ్యింది!’
వైరల్: మనిషి బుర్రలోంచి చిత్రవిచిత్రమైన ఆలోచనలెన్నో పుడుతుంటాయి. వాటిని ఆచరణలో పెట్టడానికి ఎంతదాకా అయినా వెళ్లే వాళ్లు కొందరు ఉంటారు. ఓ వ్యక్తి కుక్కలాగా కనిపించేందుకు లక్షలు కుమ్మరించాడని ఆ మధ్య చదువుకున్నాం కదా. ఆ వ్యక్తే ఇప్పుడు తెగ భయపడుతున్నాడు. అది ఎందుకో అతని మాటల్లోనే.. జపాన్‌కు చెందిన టోకో ఈ ఏడాది మే నెలలో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. కుక్కలాగా కనిపించేందుకు విపరీతంగా ఖర్చు చేశాడతను. ఏకంగా మన కరెన్సీలో 12 లక్షల రూపాయలతో(అక్కడి కరెన్సీలో రెండు మిలియన్ల యెన్లు) కోలీ అనే డాగ్బ్రీడ్ కాస్టూమ్ను తయారు చేయించుకున్నాడు. ఆల్ట్రా రియలిస్టిక్ కాస్టూమ్‌లో నిజం కుక్కను తలపించాడతను. తద్వారా తన చిన్ననాటి ఊహను నిజం చేసుకున్నాడు కూడా. అయితే.. ఇంతకాలం కుక్క తరహాలో వీడియోలు చేస్తూ పోతున్న టోకో.. ఇప్పుడు సడన్‌గా బాధను. భయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. తాను తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో ఎలాంటి పరిణామానికి దారి తీస్తుందో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ‘‘ఒక జంతువులా ఉండాలని చిన్నప్పుడు అనుకునేవాడిని. కుక్క తరహా జీవనం.. నాకు హాయిగానే అనిపిస్తోంది. కానీ, ఇప్పుడు నాది నిజంగానే కుక్క బతుకు అయ్యింది. రాను రాను ఈ చర్య.. నావాళ్లను నాకు దూరం చేస్తుందనే భయం రేకెత్తిస్తోంది. 【制作事例 追加】 犬 造型スーツ 個人の方からのご依頼で、犬の造型スーツを制作しました。 コリー犬をモデルにしており、本物の犬と同様に四足歩行のリアルな犬の姿を再現しております🐕 詳細はこちら:https://t.co/0gPoaSb6yn#犬 #Dog #着ぐるみ#特殊造型 #特殊造形 pic.twitter.com/p9072G2846 — 特殊造型ゼペット (@zeppetJP) April 11, 2022 #WATCH: Ever wanted to know what it would be like to live life as a dog? One #Japanese man actually has an answer to this question. Toco spent a whopping two million Yen on a realistic #Collie breed costume. @zeppetJP (🎥 via @toco_eevee)https://t.co/025Pbky6qZ pic.twitter.com/e5WCMNmJkd — Arab News Japan (@ArabNewsjp) May 27, 2022 నా స్నేహితులు, కుటుంబ సభ్యులు ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఇప్పటికిప్పుడు ఇది బాగానే ఉండొచ్చు. కానీ, నేనొక వింత మనిషిని అని వాళ్లు తర్వాతి రోజుల్లో అనుకునే ప్రమాదం లేకపోలేదు. అది వాళ్లను నాకు దూరం చేస్తుందనే భయం కలుగుతోంది. వీలైనంత త్వరలో ఈ రూపానికి స్వస్తి పలికేందుకు యత్నిస్తా అని చెబుతున్నాడు టోకో. అలాగని 24 గంటలూ అతను కుక్క కాస్టూమ్లోనే ఉంటున్నాడేమో అనుకోకండి. అప్పుడప్పుడు మాత్రమే ఆ కాస్టూమ్‌లో దూరిపోయి.. కుక్క ప్రవర్తించినట్లే ప్రవర్తించి తన సరదా తీర్చుకుంటున్నాడట. -
వీరివీరి గుమ్మడిపండు.. దీని పేరేమి?
కుక్క అనేదేగా మీ సమాధానం.. కాదు.. మనిషని మేమంటే.. నిజంగా మనిషే.. ఇది కుక్కలా బతకాలనుకున్న ఓ మనిషి కథ.. కొంచెం చిత్రమైనదే అయినా.. జపాన్‌లోని టోకోకు ఎప్పట్నుంచో ఓ కల.. లక్ష్యం.. శునకంలా బతకాలని.. కలలు కంటే సరిపోదని.. దాన్ని నెరవేర్చుకోవడానికి సిద్ధమయ్యాడు. కుక్కంటే ఇష్టం కాబట్టి దాని బాడీ లాంగ్వేజ్ అన్నీ మనోడికి వచ్చు. మరి కుక్కలా కనిపించడం ఎలా? అది కూడా అచ్చం ఒరిజినల్లా కనిపించాలి. దీంతో స్పెషల్ ఎఫెక్ట్స్ కంపెనీ ‘జెప్పెట్’ను సంప్రదించాడు. విషయం చెప్పి.. ఆల్ట్రా రియలిస్టిక్ డాగ్ కాస్ట్యూమ్ తయారు చేయమని అడిగాడు. వాళ్లు కూడా చాలెంజింగ్‌గా తీసుకున్నారు. కుక్కల శరీర నిర్మాణ శైలిని అధ్యయనం చేశారు. 40 రోజుల్లో అస్సలు అనుమానం రాని రీతిలో ఈ కుక్క కాస్ట్యూమ్‌ను తయారు చేశారు. ఎక్కడా రాజీ పడకుండా, చిన్నచిన్న డీటెయిల్స్ కూడా మిస్సవ్వకుండా రూపొందించారు. ఇందుకోసం రూ.11.5 లక్షలు చార్జ్ చేశారు. ఇక అటు టోకో ఆనందానికి అంతే లేదు. ఈ దుస్తులు వేసుకుని.. తన యూట్యూబ్ చానల్లో ఓ వీడియోను పోస్టు చేశాడు. అలాగే ఫొటోస్ను ట్విట్టర్లో పంచుకున్నాడు. ఇంకేముంది... ఆ వీడియోలు స్థానిక టీవీల్లో టెలికాస్ట్ అయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అది చూసిన నెటిజన్లు కొందరు ‘కుక్కలా బతకాలన్న ఆశ ఏందిరా..!?’ అనుకుని ఆశ్చర్యపోతే.. మరికొందరు టోకో ఆశను అర్థం చేసుకుని.. ‘ఇతరులకు హాని కలగకుండా ఆయన జీవితాన్ని ఆయన బతుకుతున్నాడు.. మనకేం’ అని మద్దతునిచ్చారు. అయితే.. ఇప్పటికీ టోకో అలాగే కుక్కలా బతుకుతున్నాడా.. లేక కాస్ట్యూమ్ తీసేసి.. మనిషిలా మారాడా అన్న విషయం మాత్రం తెలియలేదు. -
శ్రీమతి ఆలోచన.. దుస్తులే సందేశం
‘ప్రపంచ పటంలో నా దేశాన్ని నాదైన ప్రత్యేకతతో చూపాలి’ అని బాల్యం నుంచి కలగన్న అమ్మాయి నవదీప్ కౌర్. శ్రీమతి అయి, ఓ బిడ్డకు తల్లైన 32 ఏళ్ల నవదీప్ కౌర్ తన ప్రయత్నాన్ని కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తూనే తనదైన ప్రత్యేకతను ప్రపంచవ్యాప్తంగా చాటింది. సంకల్పం ఉంటే ఎవరైనా తమ కలలను సాధించవచ్చని నిరూపించింది. ఇటీవల అమెరికాలోని లాస్‌వెగాస్‌లో ‘మిసెస్ వరల్డ్–2022’ పోటీలు జరిగాయి. ఈ పోటీలో వివిధ దేశాల నుంచి వచ్చిన పోటీదారులు తమ దుస్తుల ద్వారా వారి మాతృదేశ, సంప్రదాయ, ఆధ్యాత్మిక అంశాలను హైలైట్ అవాలనేది ప్రధానాంశం. బెస్ట్ నేషనల్ కాస్ట్యూమ్ ఎంట్రీ విజేతల విభాగంలో నవదీప్కౌర్ విజేతగా నిలిచింది. భారతదేశం నుంచి ఒడిశాలోని రూర్కెలా ప్రాంతంలో పుట్టి పెరిగిన శ్రీమతి నవదీప్ కౌర్ ధరించిన దుస్తులు చూసిన ప్రతి ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు తమలోని శక్తిని తెలుసుకునే ప్రయత్నం చేశాయి. పాము ముఖాన్ని పోలి ఉండే భారీ తలపాగా, పొడవాటి బంగారు బూట్లు, చేతి ఉపకరణాలతో సహా ఈ దుస్తుల డిజైన్‌లో అనేక పాము అంశాలు ఇమిడి ఉన్నాయి. నాగుపామును పోలిన ఆభరణాలు భుజాలపైన అలంకరించారు. కొత్తదనం, ఐశ్వర్యానికి సూచికగా ఆమె ధరించిన ఈ దుస్తులు మనిషిలోని మూలాధార చక్రం నుండి వెన్నెముక వరకు సూచించే కుండలినీ శక్తి కదలికలను సూచికగా ఈ డిజైన్‌ను తీసుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత అవాంట్ – గార్డె ఫ్యాషన్ హౌజ్‌లోని కళాకారిణి అగీ జాస్మిన్ ఈ దుస్తులను డిజైన్ చేసింది. వీటిని ధరించిన నవదీప్ కౌర్ ఫొటోలు, వీడియోలు చూపరులను మంత్రముగ్దులను చేస్తున్నాయి. దేశ ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచం ముందుకు దుస్తుల ద్వారా తీసుకువచ్చిన నవదీప్ కౌర్ అందరి అభినందనలు అందుకుంటోంది. -
ప్రియురాలి లెహంగాను కాలితో తన్నిన రణ్‌బీర్ కపూర్..
Ranbir Kapoor- Alia Bhatt: బాలీవుడ్ ప్రేమజంట ఆలియా భట్- రణ్‌బీర్ కపూర్ త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటవ్వనున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్దరు కలసి దీపావళి వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలో రణ్‌బీర్- ఆలియాలు ఇద్దరు బ్లూ కలర్ మ్యాచింగ్ కాస్ట్యూమ్స్ వేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేసిన ఈ ప్రేమజంట సరదాగా కొన్ని ఫోటోలు కూడా దిగారు. అయితే, ఆలియా వేసుకున్న లెహంగా కింద నేలను ఊడ్చేస్తోంది. ఈ క్రమంలో ఆమె మెట్లుదిగి కిందకు వెళ్తుండగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అక్కడ నేలపైన బంతిపూలను అందంగా ఆకర్షణీయంగా పరిచారు. ఆ అందాన్ని పట్టించుకోని ఆలియా.. పూలను దాటుకుంటూ ముందుకు వెళ్లింది. అయితే, ఆమె వేసుకున్న నీలిరంగు డ్రెస్ అక్కడున్న పూలపై ఆనుకుంటూ వెళ్లింది. దీంతో వెంటనే రణ్‌బీర్ తన పాదంతో ఆలియా లెహంగా దిగువ భాగాన్ని పక్కకు జరిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రణ్‌బీర్ ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో రణ్‌బీర్ కాస్త చిరాకుగా ఉండటం కనిపిస్తోందని, ఆలియావైపు ఆప్యాయంగా చూడట్లేదని కామెంట్లు చేస్తున్నారు. -
కాజల్ కంటికి ఇంపుగా!
కాజల్.. కాటుక. కంటికి అందాన్నిస్తుంది. బుగ్గ మీద దిష్టి చుక్క అవుతుంది. కాజల్.. అగర్వాల్. కంటికి ఇంపుగా కనిపిస్తుంది. సొంపైన డ్రెస్‌కి అడ్రెస్ అవుతుంది. ►డిజైనర్ నిషికా లుల్లా డిజైన్ చేసిన డ్రెస్ ఇది. లైట్ పింక్ జంప్ సూట్ ఇది. డిజైనర్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్, పొనీటెయిల్తో ఒక స్టైలిష్ లుక్‌ని తీసుకువచ్చాం. క్యాజువల్ వేర్కి, వెస్ట్రన్ పార్టీలకు ఈ డ్రెస్ బాగా సూటవుతుంది. ►అనితాడోంగ్రె డిజైన్ చేసిన ఇండిగోబ్లూ అసమెట్రికల్ ట్యూనిక్ ఇది. సర్డార్ గబ్బర్‌సింగ్ ప్రమోషన్‌కి ఈ డ్రెస్‌ని ఎంపిక చేశాను. కాటన్ ఫ్యాబ్రిక్ అవడంతో కంఫర్ట్ ఉంటుంది. క్యాజువల్‌గా ఏ టైమ్‌లో ధరించినా స్టైలిష్‌గా ఉంటుంది. ఏ శరీరాకృతి గలవారికైనా ఈ స్టైల్ నప్పుతుంది. ►తానియా ఖనూజా డిజైన్ చేసిన డ్రెస్‌ని ఫొటో షూట్ కోసం వాడాం. టాప్ ముందు భాగంలో కురచగా, వెనకాల పొడవుగా ఉంటుంది. జార్జెట్ మెటీరియల్పైన సెల్ఫ్ ఎంబ్రాయిడరీ చేశారు. భుజాలు, సీటు భాగం వెడల్పుగా ఉండేవారు ఇలాంటి స్టైల్ వేసుకుంటే ఇంకా స్లిమ్‌గా కనపడతారు. ►డిజైనర్ నిషికా లుల్లా డిజైన్ చేసిన డ్రెస్ ఇది. లైట్ పింక్ జంప్ సూట్ ఇది. డిజైనర్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్, పొనీటెయిల్తో ఒక స్టైలిష్‌లుక్‌ని తీసుకువచ్చాం. క్యాజువల్ వేర్కి, వెస్ట్రన్ పార్టీలకు ఈ డ్రెస్ బాగా సూటవుతుంది. ►ఈ మెటాలిక్ ఎంబలిష్డ్ లెహంగా, స్టైలిష్ క్రాప్‌టాప్‌ని శంతను నిఖిల్ డిజైన్ చేశారు. ఇది డ్రెడిషనల్ డ్రెస్ అవడంతో సంప్రదాయ వేడకులకు బాగుంటుంది. సినిమా ఆడియోలాంచ్ వేడుకకు ఈ డ్రెస్‌ను ఎంపిక చేశాం. ఆమ్రపాలి ఆభరణాలు ఈ లుక్‌కి మరింత వన్నెలు అద్దాయి. ► ఒక టీవీ ప్రోగ్రామ్‌లో కాజల్ పాల్గొనాల్సి ఉంది. ఈ షోలో ఆమె లుక్ ప్రెట్టీగా, అదే టైమ్‌లో డ్రెస్ కంఫర్ట్ ఉండాలి. అందుకు సమత్వన్ బై అంజలీ భాస్కర్ డిజైన్ ఈ బాడీకాన్ డ్రెస్‌ని ఎంచుకున్నాం. వైట్ జరా స్నీకర్స్ జత చేయడంతో స్టైలిష్‌తో పాటు, స్పోర్టివ్ లుక్ వచ్చింది. ► ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రెస్మీట్కోసం ఎంపిక చేసిన బీజ్ డ్రెస్ ఇది. హ్యాండ్లూమ్, కాటన్ సిల్క్ మెటీరియల్స్‌తో తానెయా ఖనూజా డిజైన్ చేసినదీ డ్రెస్. వెస్ట్రన్, నైట్ పార్టీలకు ఈ తరహా డ్రెస్ బాగా సూటవుతుంది. ► ఇకత్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన కోల్డ్ షోల్డర్ క్యాజువల్ వేర్ ఇది. నిషికా లుల్లా డిజైన్ చేసిన ఈ డ్రెస్ మోడల్ని ఏ ఫ్యాబ్రిక్‌తోనైనా డిజైన్ చేసుకోవచ్చు. క్యాజువల్ వేర్కి బాగా నప్పే డ్రెస్ ఇది. (కాజల్ దుస్తులకు నీరజ డిస్క్రిప్షన్స్ ఇవన్నీ) నటి కాజల్ అగర్వాల్‌తో నీరజ కోన సినీ తారల డ్రెస్ స్టైలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ నిర్వహణ: ఎన్.ఆర్. -
కొంచెం లైట్ గురూ!
ఒక మామూలు డ్రెస్ వేసుకోవడానికి ఎంత టైమ్ పడుతుంది? మహా అయితే రెండు, మూడు నిముషాలు. ప్యాంటు, చొక్కా అయితే అంత టైమ్ కూడా పట్టకపోవచ్చు. చీర అంటే కనీసం ఐదు నిముషాలైనా పడుతుంది. అదే కొంచెం గ్రాండ్‌గా డ్రెస్ చేసుకోవాలంటే మాత్రం మినిమమ్ అరగంటైనా కేటాయించాల్సిందే. ఇప్పుడీ లెక్కలు ఎందుకంటే... ఇటీవల విడుదలైన ‘మొహెంజొ దారో’ సినిమాలో వేసుకున్న ఒక్కో కాస్ట్యూమ్ కోసం పూజా హెగ్డే 25 నిముషాలపైనే వెచ్చించారట. ఆ విషయం గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ- ‘‘నేను నెక్ట్స్ చేయబోయే సినిమాలో హాయిగా జీన్స్, టీ షర్ట్స్ ఉంటే బాగుంటుందనుకుంటున్నా. అవైతే వేసుకోవడానికి చాలా ఈజీ. సెకన్లలో రెడీ అయిపోవచ్చు. ‘మొహెంజొ దారో’ నన్ను కొంచెం కష్టపెట్టింది. వేసుకున్న డ్రెస్, పెట్టుకున్న నగలు అన్నీ బరువుగా ఉండేవి. ఒక్కో కాస్ట్యూమ్‌కి ఎక్కువ టైమ్ కేటాయించాల్సి వచ్చింది. అయినా నేను ఎంజాయ్ చేశాను. ఎందుకంటే, ఇలాంటి సినిమాలు ఎప్పుడో కానీ రావు. నటిగా మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రం. కానీ, ఇమ్మీడియట్‌గా ఇలాంటి సినిమా అంటే కష్టమవుతుంది. అందుకే తేలికగా ఉండే క్యారెక్టర్, లైట్‌గా ఉండే కాస్ట్యూమ్స్ అయితే బాగుంటుందనుకుంటున్నా’’ అన్నారు. తెలుగులో ‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’ తర్వాత వేరే చిత్రాలు కమిట్ కాలేదీ బ్యూటీ. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డి.జె. దువ్వాడ జగన్నాథమ్’లో కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమాలో ఆమె కోరుకుంటున్నట్లుగా బబ్లీ క్యారెక్టర్ అయ్యుంటుంది. -
అందమంతా చీరలో కాదు..
చెంగావి రంగు చీర కట్టుకున్నా చూసేవాళ్ల దిమ్మదిరగాలంటే, అందమంతా చీరలో కాదు.. అది కట్టుకున్న తీరులో ఉండాలి. కంచి పట్టయినా, ధర్మవరం నేత చీరైనా.. రోజువారీ కట్టునే అనుసరిస్తూ ఒంటికి చుట్టుకుంటే సాదాసీదాగా ఉంటుంది. అదే కొంగును ముందుకు వచ్చేలాగానో.. కుచ్చిళ్లకు, కొంగుకు ముడి వేసి చూపిస్తేనో కొత్తగా ఉంటుంది. ఇలా డిఫరెంట్‌గా చీరలు చుట్టడంలో డాలీ జైన్ ఎక్స్పర్ట్. ఎంతలా అంటే రకరకాల చీరలను.. విధవిధాలుగా.. కడుతూ అతివలకు అదనపు సొబగులు అద్దుతున్నారు. డాలీ జైన్ పుట్టింది, పెరిగింది బెంగళూరులో. పెళ్లయ్యే వరకు ఆమెకు చీరంటే ఏంటో తెలియదు. వెస్ట్రన్ డిజైనింగ్స్ ఫాలో అయ్యే డాలీ.. యూనిక్ కాస్ట్యూమ్స్‌లో తళుక్కుమనేది. పెళ్లి డాలీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆమె మెట్టినింట్లో చీర తప్ప మరో కాస్ట్యూమ్‌కు అవకాశం లేదు. గత్యంతరం లేక చీర కట్టడం మొదలుపెట్టింది. అందరు కట్టేలా తనూ కడితే మజా ఏముంటుందని తన మార్క్ చూపించాలనుకుంది. డిఫరెంట్‌గా చీరలు కట్టుకోవడం సాధన చేసింది. ఓ రోజు ఫ్రంట్ పల్లుతో దర్శనమిస్తే.. మరో రోజు గుజరాతీ కట్టులో కనిపించేది.. ఇంకో రోజు కేరళ కుట్టీలా చీర చుట్టుకునేది. ఇలా రోజుకో చీరావతారంలో కనిపించి అత్తింటి వాళ్లను, వారి బంధువుల మనసులు గెలుచుకోవడమే కాదు, వారికీ చీరలు కట్టేది. 6 గజాల చీరలే కాదు, బామ్మల జమానా నాటి 9 గజాల చీరలతో కూడా ప్రయోగాలు చేసేది. తనలో ఉన్న క్వాలిటీని గ్రహించిన డాలీ.. చీర కట్టడాన్నే ప్రొఫెషన్‌గా మలచుకుని శారీ డ్రేపర్ అవతారం ఎత్తింది. చీరతో కనికట్టు.. శారీ డ్రేపర్‌గా మారాక డాలీ దూకుడు పెంచిం ది. దేశంలోని అన్ని సంప్రదాయాలను ఫాలో అవుతూ.. వాటన్నింటినీ చీరకట్టులో చూపిం చేది. బెంగాలీ, రాజస్థానీ చీరకట్టును మిక్స్ చేసి చూపింది. చిన్న చిన్న ఫంక్షన్స్‌లో చీరలు చుట్టిన డాలీ తర్వాతి కాలంలో, సెలబ్రిటీల ఇళ్లలో ఈవెంట్లకు శారీ డ్రేపర్‌గా తనేంటో ప్రూవ్ చేసుకుంది. యుక్తాముఖి, దియా మీర్జా, తనుశ్రీ దత్తా, కంగనా రనౌత్ వీళ్లందరినీ చీరకట్టి సింగారించింది. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ పెళ్లికి ఉపాసనకు చీర చుట్టింది ఈవిడే. హిప్ హాప్, టైట్ ఫిట్, ఫిష్ స్టయిల్, హాఫ్ ముంతాజ్ ఇలా శారీ వేరింగ్ ట్రెండ్స్‌ను పరిచయం చేసింది. ఒళ్లున్న వారిని లావుగా కనిపించకుండా, పొట్టి వారిని.. ఆ లోపం కనిపించకుండా చీరకట్టుతో కనికట్టు చేస్తుంది. రికార్డులు చుట్టి.. శారీ డ్రేపింగ్‌లో ఎప్పటికప్పుడూ కొత్తదనం చూపిస్తున్న డాలీ అందులో రికార్డులు కూడా సొంతం చేసుకుంది. 80 డిఫరెంట్ స్టయిల్స్‌లో చీరలు చుట్టి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఒక్కో చీరను 19 సెకండ్లలో చుట్టి వహ్వా అనిపించుకుంది. తర్వాత ఒక్కో చీరను 18.5 సెకండ్లలో కడుతూ 125 డిఫరెంట్ స్టయిల్స్‌ను చూపించి తన రికార్డును తనే చుట్టేసింది. తాజాగా 225 చీరకట్టుల ప్రయోగానికి సన్నద్ధం అవుతోంది. ‘తరతరాల నుంచి వస్తున్నా చీరలు ఎప్పటికప్పుడూ నయా ట్రెండ్గానే కనిపిస్తాయి. అది చీర గొప్పదనమే. అందులో వస్తున్న కొత్త కొత్త స్టయిల్స్ శారీని నిత్య నూతనంగా ఉంచుతున్నాయి’ అని చెబుతున్న డాలీ శనివారం తాజ్‌బంజారాలో శారీ డ్రేపింగ్ వర్క్‌షాప్ నిర్వహించింది. -
మాతృభాషలో అవకాశం కొట్టేశా!
ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. కానీ, కొంతమంది రెచ్చ గెలిచి ఆ తర్వాత ఇంట గెలుస్తారు. అలాంటివారిలో అదా శర్మ ఒకరు. ఈ చెన్నై చందమామ ‘1920’ చిత్రం ద్వారా హిందీ తెరకు పరిచయమయ్యారు. అనంతరం హిందీలో రెండు, మూడు సినిమాలు చేసి, ‘హార్ట్ ఎటాక్’ ద్వారా తెలుగు తెరపై మెరిశారు. అదా అందచందాలకు మంచి మార్కులే పడినా తెలుగులో వెనువెంటనే మరిన్ని అవకాశాలు సంపాదించుకోలేకపోయారామె. అయితే, కన్నడ రంగం నుంచి ఆమెనో అవకాశం వరించింది. అది కూడా అక్కడి పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ సరసన అని సమాచారం. తాజాగా, తన మాతృభాష తమిళంలో అదా శర్మకు ఓ అవకాశం దక్కింది. ‘‘ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కాస్ట్యూమ్, మేకప్ టెస్ట్ జరుగుతోంది. మాతృభాషలో అవకాశం రావడం చాలా ఆనందంగా, ఉద్వేగంగా ఉంది’’ అని అదా శర్మ వ్యాఖ్యానించారు. ఇక, ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలడిగితే, ‘ఇప్పుడు కాదు.. తర్వాత చెబుతా’ అంటున్నారు. -
అచ్చం అలాగే..! అపురూపమైన ఆభరణాలు!
ముస్తాబు అచ్చమైన బంగారానికైనా మెరుగు అవసరం... మరి అచ్చతెలుగు అమ్మాయికి...?! వజ్రాలు, వైఢూర్యాలకైనా వన్నెలు అద్దాలి... మరి నిలువెత్తు సౌందర్యానికి..?! బంగారంతో పనిలేదు... వజ్రాల వెలుగులూ అక్కర్లేదు... ఎంపిక సులువుగా, అలంకరణ త్వరగా పూర్తవ్వాలి. అంతేనా... అందరిలోనూ కొత్తగా.. ఇంకాస్త బ్రైట్‌గా కనిపించాలి. ప్రత్యేకం అనిపించే డిజైన్లను ఎప్పటికప్పుడు సొంతం చేసుకోవాలి. అదీ తక్కువ ధరలో... బంగారు నగలకు పోటీగా... ఇమిటేషన్, ఫంకీ, కాస్ట్యూమ్, ప్లేటెడ్.. ఆభరణాలెన్నో అతివల మనసులను ఆకట్టుకుంటున్నాయి. ఇవే ఇప్పటి ట్రెండ్‌గా మారాయి. కళగానూ, మెరుపులుగానూ ఉండే ఈ డిజైనరీ ఆభరణాలను ఇష్టపడేవారు కొన్నేళ్లపాటు ధరించాలంటే మన్నిక కోసం జాగ్రత్తలూ ఎంతో అవసరం. బంగారు ఆభరణాలకు ఎలాంటి జాగ్రత్తలైతే తీసుకుంటామో వీటికీ అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలి. క్రిస్టల్స్, రంగురాళ్లు మెరుపు పోకుండా ఉండాలంటే ధరించిన ఆభరణాలను తీసి, భద్రపరిచేటప్పుడు మెత్తటి తడి, పొడి వస్త్రంతో(కళ్లజోడుతో పాటు వచ్చే మెత్తటి క్లాత్ లాంటిది అయి ఉండాలి) మృదువుగా తుడిచి, భద్రపరచాలి. రాళ్లు, క్రిస్టల్స్, లోహం, ముత్యాలు నీరు తగిలినప్పుడు రంగుమారవచ్చు. చేతులు కడుక్కోవడం, బట్టలు ఉతకడం, ఈత కొట్టడం వంటి సందర్భాలలో ధరించిన ఆభరణాలను తీయడం మంచిది. పెర్ఫ్యూమ్, హెయిర్ స్ప్రే, నూనె, మద్యం... లాంటివి ఆభరణాల పై పూతను దెబ్బతీస్తాయి. అలాగే మెరుపు కోల్పోవచ్చు. మెరుపు కోల్పోయిన రాళ్లు, పూసలు, ముత్యాలు ధరించడానికి అనువుగా ఉండవు. బాడీ లోషన్‌కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. చల్లగా, పొడిగా ఉండే ప్రదేశంలో వాటిని జాగ్రత్తపరచాలి. ఆభరణాలను ధరించిన తర్వాత పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోకూడదు. పెర్ఫ్యూమ్ ఆభరణాలకు తగిలేలా స్ప్రే చేయకూడదు. అన్ని ఆభరణాలనూ ప్లాస్టిక్/పేపర్ బ్యాగ్‌లో పెట్టి ఒకే చోట ఉంచరాదు. ఆభరణాలు విరిగిపోవఛిం, రాళ్లు పోవడం వంటివి జరగవచ్చు. ఆభరణాల పెట్టెలో పట్టు/వెల్వెట్ పౌచ్‌లలో భద్రపరచాలి. ఆభరణాలు ధరించి నిద్రపోతే అసౌకర్యంగా ఉండటమే కాదు, అవి విరిగిపోవడం, రంగురాళ్లు ఊడిపోవడం.. వంటివి జరగవచ్చు. అలాగే ఎక్కువ ఎండపడే చోట కూడా భద్రపరచకూడదు. ఆభరణాలు పెట్టే బాక్స్‌లలో భద్రపరచాలి. ఆ బాక్స్ కూడా పెద్ద పెద్ద విభాగాలతో కూడి ఉండాలి. ఆభరణాలు ధరించేవారు... ఆభరణాలను తగిలించే హోల్డర్స్, కంఠాభరణాల స్టాండ్లు, ఆభరణాలు తీసుకోవడానికి అనువైన బాక్స్‌లను సిద్ధం చేసుకోవాలి. ప్రయాణాల సమయంలో ఆభరణాలను తీసుకువెళ్లేటప్పుడు అన్నీ ఒక చోట చుట్టేయకూడదు. దేనికది విడి విడిగా పెట్టాలి. సబ్బు, ఫేస్‌క్రీములు, మాయిశ్చరైజర్లు ఆభరణాలకు అంటకూడదు. దూది ఉండతోనూ, మెత్తని టూత్‌బ్రష్‌తో కొద్దిగా నీళ్లను అద్దుతూ శుభ్రపరచాలి. ఉన్న ఆభరణాలు కొద్దిగా పాడైపోయినా.. మరికొన్ని ఆభరణాలను జత చేసి కొత్తగా తయారుచేయించుకోవచ్చు. ఇందుకు ఇమిటేషన్ జ్యుయలరీ నిపుణులను సంప్రదించవచ్చు. ఆసక్తి ఉండాలేగాని పూసలు, రాళ్లు, చైన్లను ఉపయోగించి కొత్త తరహా ఆభరణాలను రూపొందించుకోవచ్చు. కొన్ని చైన్లను చెవి రింగులు గానూ, నెక్లెస్ ఎక్స్టెండర్స్గానూ వాడవచ్చు. లేదా పెంపుడు జంతువులకు ట్యాగ్గానూ వాడచ్చు. ఆభరణాల ఎంపిక, ధరించడం అనేది వ్యక్తిగత విషయం. కుటుంబసభ్యులకు లేదా స్నేహితులకు మీ గుర్తుగా ఆభరణాలను కానుకగా ఇచ్చేటప్పుడు వారి ఇష్టాయిష్టాలను గమనించాలి. మీరు ఇచ్చే కానుక ఎంత చిన్నదైనా తీసుకున్నవారికి అది ఆనందాన్ని కలిగించాలి. ఉపయోగపడాలి. బంగారు ఆభరణాలంటే అతివలకు అమితమైన ప్రీతి. ఆభరణాల అలంకరణలో పుత్తడిబొమ్మలా మెరిసిపోవాలని కోరుకుంటారు. కానీ, బంగారం అందరికీ అందుబాటులో లేదు. అలాగని చుక్కల లోకం చేరిన బంగారం ధరలు చూసి ఇప్పుడెవరూ డీలా పడటం లేదు. బంగారు ఆభరణాల డిజైన్లను పోలినవి, వాటిని మించినవి, రకరకాల లోహాలతో తయారైనవి, దుస్తులకు తగినవి... ఎన్నింటినో సృజనాత్మకత గల నిపుణులు కళ్లు చెదిరేలా సృష్టిస్తున్నారు. మార్కెట్లో కళ్ల ముందు పెడుతున్నారు. ఇమిటేషన్ ఆభరణాలు: బంగారు ఆభరణాలను పోలిన డిజైన్లు ఇప్పుడు అన్నిచోట్లా లభిస్తున్నాయి. వీటిని వన్‌గ్రామ్ గోల్డ్ జ్యుయలరీ అని కూడా అంటుంటారు. వీటిలో విలువైన రాళ్లు, రత్నాలను కూడా పొదిగి అందంగా తీర్చిదిద్దుతుంటారు. బంగారం మాత్రం ఉపయోగించని ఈ డిజైన్లు తక్కువ ధరకే లభిస్తూ అతివలను ఆకట్టుకుంటున్నాయి. వెండితో తయారుచేసిన ఆభరణాలపై పై పూతగా గోల్డ్ కోటింగ్ వేసే జ్యుయలరీ కూడా ఈ జాబితాలో చేరుతుంది. కాస్ట్యూమ్/ఫ్యాషన్ ఆభరణాలు: ఖరీదు చాలా తక్కువగా ఉండే లోహాలు, రంగురాళ్లు, పూసలతో తయారుచేసిన ఆభరణాలను కాస్ట్యూమ్ జ్యుయలరీ అంటారు. ఇవి ఫ్యాషన్ దుస్తుల అందాన్ని మరింత బహిర్గతం చేసే విధంగా డిజైనర్లు సృష్టిస్తారు. చాలా వరకు దుస్తులకు మ్యాచింగ్ అయ్యే ఆభరణాలను కాస్ట్యూమ్ జ్యుయలరీ అంటారు. ఈ ఆభరణాలు ఎప్పుడూ చాలా తక్కువ ఖరీదులో ఉంటాయి. 1930ల కాలంలో ఈ తరహా ఆభరణాలు వెలుగులోకి వచ్చాయి. జంక్/ఫంకీ ఆభరణాలు: కలప, పూసలు, ఎముకలు, బ్రాస్, టైటా, జంతువుల దంతాలు, కొమ్ములు, పట్టు దారాలు... ఇలాంటివాటితో తయారుచేసిన ఆభరణాలను జంక్ జ్యూయలరీ అంటారు. ప్రపంచంలోని స్త్రీలంతా బంగారు, వజ్రాలు, వెండి, ప్లాటినమ్ ఆభరణాలనే కోరుకుంటారు అనుకోవడం పొరపాటు. జంక్ జ్యుయలరీని ధరించడం ఇప్ప టి ట్రెండ్. ఫంకీ జ్యుయలరీగా కూడా ఇది ప్రసిద్ధి పొందింది.