మాతృభాషలో అవకాశం కొట్టేశా! | Adah Sharma to act in Ranavikrama | Sakshi
Sakshi News home page

మాతృభాషలో అవకాశం కొట్టేశా!

Published Thu, Jul 17 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 10:23 AM

మాతృభాషలో అవకాశం కొట్టేశా!

మాతృభాషలో అవకాశం కొట్టేశా!

ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. కానీ, కొంతమంది రెచ్చ గెలిచి ఆ తర్వాత ఇంట గెలుస్తారు. అలాంటివారిలో అదా శర్మ ఒకరు. ఈ చెన్నై చందమామ ‘1920’ చిత్రం ద్వారా హిందీ తెరకు పరిచయమయ్యారు. అనంతరం హిందీలో రెండు, మూడు సినిమాలు చేసి, ‘హార్ట్ ఎటాక్’ ద్వారా తెలుగు తెరపై మెరిశారు. అదా అందచందాలకు మంచి మార్కులే పడినా తెలుగులో వెనువెంటనే మరిన్ని అవకాశాలు సంపాదించుకోలేకపోయారామె. అయితే, కన్నడ రంగం నుంచి ఆమెనో అవకాశం వరించింది.

అది కూడా అక్కడి పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ సరసన అని సమాచారం. తాజాగా, తన మాతృభాష తమిళంలో అదా శర్మకు ఓ అవకాశం దక్కింది. ‘‘ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కాస్ట్యూమ్, మేకప్ టెస్ట్ జరుగుతోంది. మాతృభాషలో అవకాశం రావడం చాలా ఆనందంగా, ఉద్వేగంగా ఉంది’’ అని అదా శర్మ వ్యాఖ్యానించారు. ఇక, ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలడిగితే, ‘ఇప్పుడు కాదు.. తర్వాత చెబుతా’ అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement