ప్రియురాలి లెహంగాను కాలితో తన్నిన రణ్‌బీర్‌ కపూర్‌.. | Viral Video: Ranbir Kapoor Kicks Alia Bhatts Lehenga | Sakshi
Sakshi News home page

Ranbir Kapoor- Alia Bhatt: ఆలియా భట్‌ లెహంగాను కాలితో తన్నిన రణ్‌బీర్‌ కపూర్‌..

Published Mon, Nov 29 2021 8:27 PM | Last Updated on Tue, Nov 30 2021 7:45 AM

Viral Video: Ranbir Kapoor Kicks Alia Bhatts Lehenga - Sakshi

Ranbir Kapoor- Alia Bhatt: బాలీవుడ్‌ ప్రేమజంట ఆలియా భట్‌- రణ్‌బీర్‌ కపూర్‌ త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటవ్వనున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్దరు కలసి దీపావళి వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలో రణ్‌బీర్‌- ఆలియాలు ఇద్దరు బ్లూ కలర్‌ మ్యాచింగ్‌ కాస్ట్యూమ్స్‌ వేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌ ఎంజాయ్‌ చేసిన ఈ ప్రేమజంట సరదాగా కొన్ని ఫోటోలు కూడా దిగారు.

అయితే,  ఆలియా వేసుకున్న లెహంగా కింద నేలను ఊడ్చేస్తోంది. ఈ క్రమంలో ఆమె మెట్లుదిగి కిందకు వెళ్తుండగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అక్కడ నేలపైన బంతిపూలను అందంగా ఆకర్షణీయంగా పరిచారు. ఆ అందాన్ని పట్టించుకోని ఆలియా.. పూలను దాటుకుంటూ ముందుకు వెళ్లింది. అయితే, ఆమె వేసుకున్న నీలిరంగు డ్రెస్‌ అక్కడున్న పూలపై ఆనుకుంటూ వెళ్లింది. దీంతో వెంటనే రణ్‌బీర్‌ తన పాదంతో  ఆలియా లెహంగా దిగువ భాగాన్ని పక్కకు జరిపారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రణ్‌బీర్‌ ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో రణ్‌బీర్‌ కాస్త చిరాకుగా ఉండటం కనిపిస్తోందని, ఆలియావైపు ఆప్యాయంగా చూడట్లేదని  కామెంట్లు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement