కాజల్‌ కంటికి ఇంపుగా! | special story to heroine kajal agarawal new dress fashion | Sakshi
Sakshi News home page

కాజల్‌ కంటికి ఇంపుగా!

Published Thu, Aug 31 2017 11:44 PM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

కాజల్‌ కంటికి ఇంపుగా! - Sakshi

కాజల్‌ కంటికి ఇంపుగా!

కాజల్‌.. కాటుక.
కంటికి అందాన్నిస్తుంది.
బుగ్గ మీద దిష్టి చుక్క అవుతుంది.
కాజల్‌.. అగర్వాల్‌.
కంటికి ఇంపుగా కనిపిస్తుంది.
సొంపైన డ్రెస్‌కి
అడ్రెస్‌ అవుతుంది.

డిజైనర్‌ నిషికా లుల్లా డిజైన్‌ చేసిన  డ్రెస్‌ ఇది. లైట్‌ పింక్‌ జంప్‌ సూట్‌ ఇది. డిజైనర్‌ ఫ్యాన్సీ ఇయర్‌ రింగ్స్, పొనీటెయిల్‌తో ఒక స్టైలిష్‌ లుక్‌ని తీసుకువచ్చాం. క్యాజువల్‌ వేర్‌కి, వెస్ట్రన్‌ పార్టీలకు ఈ డ్రెస్‌ బాగా సూటవుతుంది.


అనితాడోంగ్రె డిజైన్‌ చేసిన ఇండిగోబ్లూ అసమెట్రికల్‌ ట్యూనిక్‌ ఇది. సర్డార్‌ గబ్బర్‌సింగ్‌ ప్రమోషన్‌కి ఈ డ్రెస్‌ని ఎంపిక చేశాను. కాటన్‌ ఫ్యాబ్రిక్‌ అవడంతో కంఫర్ట్‌ ఉంటుంది. క్యాజువల్‌గా ఏ టైమ్‌లో ధరించినా స్టైలిష్‌గా ఉంటుంది. ఏ శరీరాకృతి గలవారికైనా ఈ స్టైల్‌ నప్పుతుంది.


తానియా ఖనూజా డిజైన్‌ చేసిన డ్రెస్‌ని ఫొటో షూట్‌ కోసం వాడాం. టాప్‌ ముందు భాగంలో కురచగా, వెనకాల పొడవుగా ఉంటుంది. జార్జెట్‌ మెటీరియల్‌పైన సెల్ఫ్‌  ఎంబ్రాయిడరీ చేశారు. భుజాలు, సీటు భాగం వెడల్పుగా ఉండేవారు ఇలాంటి స్టైల్‌ వేసుకుంటే ఇంకా స్లిమ్‌గా కనపడతారు.

డిజైనర్‌ నిషికా లుల్లా డిజైన్‌ చేసిన  డ్రెస్‌ ఇది. లైట్‌ పింక్‌ జంప్‌ సూట్‌ ఇది. డిజైనర్‌ ఫ్యాన్సీ ఇయర్‌ రింగ్స్, పొనీటెయిల్‌తో ఒక స్టైలిష్‌లుక్‌ని తీసుకువచ్చాం. క్యాజువల్‌ వేర్‌కి, వెస్ట్రన్‌ పార్టీలకు ఈ డ్రెస్‌ బాగా సూటవుతుంది.


ఈ మెటాలిక్‌ ఎంబలిష్డ్‌ లెహంగా, స్టైలిష్‌ క్రాప్‌టాప్‌ని శంతను నిఖిల్‌ డిజైన్‌ చేశారు. ఇది డ్రెడిషనల్‌ డ్రెస్‌ అవడంతో సంప్రదాయ వేడకులకు బాగుంటుంది. సినిమా ఆడియోలాంచ్‌ వేడుకకు ఈ డ్రెస్‌ను ఎంపిక చేశాం. ఆమ్రపాలి ఆభరణాలు ఈ లుక్‌కి మరింత వన్నెలు అద్దాయి.


ఒక టీవీ ప్రోగ్రామ్‌లో కాజల్‌ పాల్గొనాల్సి ఉంది. ఈ షోలో ఆమె లుక్‌ ప్రెట్టీగా, అదే టైమ్‌లో డ్రెస్‌ కంఫర్ట్‌ ఉండాలి. అందుకు సమత్వన్‌ బై అంజలీ భాస్కర్‌ డిజైన్‌ ఈ బాడీకాన్‌ డ్రెస్‌ని ఎంచుకున్నాం. వైట్‌ జరా స్నీకర్స్‌ జత చేయడంతో స్టైలిష్‌తో పాటు,
స్పోర్టివ్‌ లుక్‌ వచ్చింది.

ఒక సినిమా ప్రమోషన్‌లో భాగంగా  ప్రెస్‌మీట్‌కోసం ఎంపిక చేసిన బీజ్‌ డ్రెస్‌ ఇది. హ్యాండ్లూమ్, కాటన్‌ సిల్క్‌ మెటీరియల్స్‌తో తానెయా ఖనూజా డిజైన్‌ చేసినదీ డ్రెస్‌. వెస్ట్రన్, నైట్‌ పార్టీలకు ఈ తరహా డ్రెస్‌ బాగా సూటవుతుంది.


ఇకత్‌ ఫ్యాబ్రిక్‌తో డిజైన్‌ చేసిన కోల్డ్‌ షోల్డర్‌ క్యాజువల్‌ వేర్‌ ఇది. నిషికా లుల్లా డిజైన్‌ చేసిన ఈ డ్రెస్‌ మోడల్‌ని ఏ ఫ్యాబ్రిక్‌తోనైనా డిజైన్‌ చేసుకోవచ్చు. క్యాజువల్‌ వేర్‌కి బాగా నప్పే డ్రెస్‌ ఇది.

(కాజల్‌ దుస్తులకు  నీరజ డిస్క్రిప్షన్స్‌ ఇవన్నీ) 
నటి కాజల్‌ అగర్వాల్‌తో నీరజ కోన

సినీ తారల డ్రెస్‌ స్టైలిస్ట్, కాస్ట్యూమ్‌ డిజైనర్‌

నిర్వహణ: ఎన్‌.ఆర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement