![Adah Sharma dresses up as classical dancer - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/25/adasharma.jpg.webp?itok=yEoeq9Ne)
శాస్త్రీయ నృత్య వేషధారణ అనగానే శాస్త్రీయ నృత్యమే కళ్ల ముందు కదలాడుతుంది. అలా కాకుండా ర్యాప్ వినిపిస్తే ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఈ వీడియో ఉదాహరణ. నటి అదా శర్మ క్లాసికల్ డ్యాన్సర్ వేషంలో అమెరికన్ ర్యాపర్ ఎమెనెమ్ ఐకానిక్ ర్యాప్ ‘ర్యాప్ గాడ్’ ట్రాక్‌తో ‘వావ్’ అనిపించింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ రీల్ వైరల్‌గా మారింది. శర్మను ప్రశంసలతో ముంచెత్తిన వారిలో హీరో అయుష్మాన్ ఖురాన, నటి ఊర్వశీ రౌటేల, ఇండియన్ ర్యాపర్ రఫ్తార్‌లాంటి సెలబ్రిటీ కూడా ఉన్నారు.
యూట్యూట్ ద్వారా 2013లో విడుదలైన ‘ర్యాప్ గాడ్’ సాంగ్ సూపర్ హిట్ కావడమే కాదు ‘మోస్ట్ వర్డ్స్’ విశేషంతో ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’లోకి ఎంటర్ అయింది. ఎన్నో అవార్డ్‌లు గెలుచుకుంది.
‘లుక్, ఐ వాజ్ గోనా గో ఈజీ ఆన్ యూ నాట్ టు హార్ట్ యువర్ ఫీలింగ్స్ బట్ ఐయామ్ వోన్లీ గోయింగ్ టు గెట్ దిస్ వన్ చాన్స్ సమ్‌థింగ్ రాంగ్. ఐ కెన్ ఫీల్ ఇట్’ అని శాస్త్రీయ నృత్య వేషధారణతో కనిపిస్తున్న అదా శర్మ పాడుతుంటే ‘వాహ్వా’ అనకుండా ఉండలేము.
Comments
Please login to add a commentAdd a comment