rap
-
కరచరణో రసి మణిగణ భూషణ... లుక్... ఐ వాజ్ గోనా గో
శాస్త్రీయ నృత్య వేషధారణ అనగానే శాస్త్రీయ నృత్యమే కళ్ల ముందు కదలాడుతుంది. అలా కాకుండా ర్యాప్ వినిపిస్తే ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఈ వీడియో ఉదాహరణ. నటి అదా శర్మ క్లాసికల్ డ్యాన్సర్ వేషంలో అమెరికన్ ర్యాపర్ ఎమెనెమ్ ఐకానిక్ ర్యాప్ ‘ర్యాప్ గాడ్’ ట్రాక్‌తో ‘వావ్’ అనిపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ రీల్ వైరల్‌గా మారింది. శర్మను ప్రశంసలతో ముంచెత్తిన వారిలో హీరో అయుష్మాన్ ఖురాన, నటి ఊర్వశీ రౌటేల, ఇండియన్ ర్యాపర్ రఫ్తార్లాంటి సెలబ్రిటీ కూడా ఉన్నారు. యూట్యూట్ ద్వారా 2013లో విడుదలైన ‘ర్యాప్ గాడ్’ సాంగ్ సూపర్ హిట్ కావడమే కాదు ‘మోస్ట్ వర్డ్స్’ విశేషంతో ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’లోకి ఎంటర్ అయింది. ఎన్నో అవార్డ్లు గెలుచుకుంది. ‘లుక్, ఐ వాజ్ గోనా గో ఈజీ ఆన్ యూ నాట్ టు హార్ట్ యువర్ ఫీలింగ్స్ బట్ ఐయామ్ వోన్లీ గోయింగ్ టు గెట్ దిస్ వన్ చాన్స్ సమ్‌థింగ్ రాంగ్. ఐ కెన్ ఫీల్ ఇట్’ అని శాస్త్రీయ నృత్య వేషధారణతో కనిపిస్తున్న అదా శర్మ పాడుతుంటే ‘వాహ్వా’ అనకుండా ఉండలేము. View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) -
వివేక్ రామస్వామిలో ఈ టాలెంట్ కూడా!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరపున ఆశావహుడు, భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి Vivek Ramaswamy తనలోని టాలెంట్‌ను ప్రదర్శించారు. ఓ ఈవెంట్‌కు హాజరైన ఆయన.. ర్యాప్ కట్టి అల్లాడించారు. అయితే ఈ క్రమంలోనే ఆయన అడ్డు కూడా తగిలింది. భారత మూలాలున్న వివేక్ రామస్వామి Vivek Ramaswamy అమెరికా అధ్యక్ష ఎన్నిక అభ్యర్థుల(రిపబ్లికన్ పార్టీ) ప్రచారంలో దూసుకుపోతున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో రామస్వామి ‘డా వెక్ ది ర్యాపర్’గా గుర్తింపు పొందాడట కూడా. అందుకే ఆ టాలెంట్‌ను ప్రదర్శించారు. లోవా స్టేట్ ఫెయిర్‌కు హాజరై.. ప్రముఖ ర్యాప్ స్టార్ ఎమినెమ్ ‘లాస్ యువర్సెల్ఫ్’ ర్యాప్‌ను తన గొంతుతో కట్టి అక్కడున్నవాళ్లను అలరించారాయన. అయితే.. ఈ పరిణామం జనాలను అలరించినా.. ఎమినెమ్(50)కు నచ్చలేదు. తన మ్యూజిక్‌ను ఎక్కడా వాడొద్దంటూ సున్నితంగానే రామస్వామికి తెలియజేశారు. ఈ మేరకు మ్యూజిక్సంస్థ తరపున ఓ లేఖను రామస్వామికి పంపించినట్లు తెలుస్తోంది. ఇక మీదట ఎన్నికల ప్రచారంలో తన మ్యూజిక్‌ను వాడొద్దని లేఖలో ఎమినెమ్, రామస్వామికి తెలియజేశాడు. ఇదిలా ఉంటే.. అమెరికాలో ఎన్నికల ప్రచారంలో ఇలా తమ మ్యూజిక్ వాడొద్దంటూ కోరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత రెండు దఫా ఎన్నికల్లో.. రిహానా, అడెలె మ్యూజిక్‌లను ట్రంప్ తన ర్యాలీలలో అనుమతులు లేకుండానే ఉపయోగించారు. 38 ఏళ్ల వివేక్ రంగస్వామి తనను తాను ‘ట్రంప్ 2.0’గా భావిస్తున్నారు. అయితే.. 2024 అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున నిలబడేందుకు ట్రంప్‌తోనే పోటీ పడుతున్నారు వివేక్. అంతేకాదు.. తానే గనుక అధ్యక్షుడ్ని అయితే ఎలన్ మస్క్‌ని వ్యక్తిగత సలహాదారుగా నియమించుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. Rapping Republican: Vivek Ramaswamy's Surprising Eminem Moment Vivek Ramaswamy, a Republican presidential candidate and successful biotech entrepreneur, recently showcased a surprising side at the Iowa State Fair. Amidst his political pursuits, Ramaswamy took the stage to rap… pic.twitter.com/4tkvM0aMk5 — GOP News (@gopnews2024) August 19, 2023 -
సంగీతంతో సమరభేరి.. అయినా సరే, ‘తగ్గేదే లేదు’
సంగీతానికి రాళ్లు కరుగుతాయి అంటారు... అదేమిటోగానీ సెర్బియాలోని ఆల్–ఫిమేల్ రోమా బ్యాండ్ తమ సంగీతంతో శతాబ్దాలుగా తిష్ట వేసిన పురుషాధిక్య భావజాలంపై సమరభేరీ మోగిస్తోంది. బాల్య వివాహాలను నుంచి గృహహింస వరకు స్త్రీలు ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలను పాటలుగా పాడి వినిపిస్తుంది. కేవలం సమస్య గురించి మాట్లాడడమే కాదు వాటికి పరిష్కార మార్గాన్ని కూడా సూచిస్తోంది.ఆల్–ఫిమేల్ రోమా బ్యాండ్‌ది నల్లేరుపై నడకేమీ కాదు. ‘పెళ్లివిందు దగ్గర బ్యాండ్ వాయించండి. మీ వల్ల ఒరిగేదేమీ ఉండదు’ అని వెక్కిరించిన వాళ్లు కొందరైతే ‘మా పిల్లల పెళ్లి గురించి మాట్లాడడానికి మీరెవరు!’ అంటూ భౌతికదాడులు చేసినవారు ఇంకొందరు. అయినా సరే, ‘తగ్గేదే లేదు’ అంటు ముందుకు సాగుతున్నారు. బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని, దీన్ని అరికట్టడానికి సెర్బియన్ ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినా దాని వల్ల పెద్దగా ఫలితం రాలేదు. అయితే రోమా బ్యాండ్ ప్రచారం వల్ల తరతరాల సంప్రదాయ ఆలోచనల్లో గణనీయమైన మార్పు వస్తుంది. ‘మీకంటూ ఒక సొంతవ్యక్తిత్వం ఉంది. భవిష్యత్‌ను నిర్మాణం చేసుకునే హక్కు పూర్తిగా మీ మీదే ఉంది’లాంటి మాటలు వినేవారికి మొదట ఆశ్చర్యంగా అనిపించేవి. ఆ తరువాత వాటి విలువను గ్రహించడం మొదలైంది’ అంటోంది 24 సంవత్సరాల సిల్వియా సినాని అనే సభ్యురాలు. ఫిమేల్ బ్యాండ్ ఇచ్చిన చైతన్యంతో చాలామంది బాల్యవివాహాలకు దూరంగా ఉన్నారు. చదువులపై దృష్టి కేంద్రీకరించారు. చిత్రమేమిటంటే ‘రోమా బ్యాండ్’లోని కొందరు సభ్యులకు కూడా తెలిసీ తెలియని వయసులో బాల్యవివాహాలు జరిగాయి. వారు తమ అనుభవాలను, ఎదుర్కొన్న కష్టాలను చెబుతుంటే వినేవారికి కంటతడి తప్పదు. అనుభవాన్ని మించిన జ్ఞానం ఏముంటుంది! ర్యాప్ అండ్ ట్రెడిషనల్ రోమా–ఫోక్ బీట్ మిళితం చేసి శ్రోతలను ఆకట్టుకుంటున్న ఈ ‘ఆల్–ఫిమేల్ బ్యాండ్’ సభ్యులు ఒకప్పుడు స్థానిక ‘బాయ్స్ బ్యాండ్’లో పనిచేసిన వాళ్లే. అక్కడ రకరకాలుగా అవమానాలు ఎదుర్కొన్నవారే. ‘ఎవరి కోసమో ఎందుకు మన కోసం మనం’ అంటూ ఆల్–ఫిమేల్ బ్యాండ్ మొదలైంది. అప్పుడు కేవలం వినోదం కోసం అయితే ఇప్పుడు ‘స్త్రీ చైతన్యం’ ప్రధాన ఎజెండాగా పనిచేస్తోంది. ఒకప్పడు సెర్బియాకే పరిమితమైన ఈ బ్యాండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఆదర్శం అయింది. -
జీవితంలో అది తల్చుకోకుండా వంట చేయను
రసొడే మే కౌన్ థా? (వంటగదిలో ఉన్నది ఎవరు?) అనే ర్యాప్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో అంత స్పెషల్ ఏముంది అనుకునేరు? మరేం లేదు.. సాథ్ నిభానా సాథియా(కోడలా కోడలా కొడుకు పెళ్లామా) సీరియల్లో అత్త క్యారెక్టర్ కోకిలాబెన్ వంటగదిలో పొయ్యి మీద ఖాళీ కుక్కర్ పెట్టి ఉంది. అది చేసింది ఎవరు అంటూ అంటూ గోపిని ప్రశ్నిస్తూ కోడలికి చీవాట్లు పెడుతుంది. అందుకు ఆమె ఏడుస్తూ వంటగదిలో ఉంది రాశి అని చెప్తుంది. ఈ సన్నివేశాన్ని క్యాచ్ చేశాడు సంగీత దర్శకుడు యశ్‌రాజ్ ముఖటే. ఆ డైలాగ్‌లకు మ్యూజిక్ జోడించి వదిలాడు. అంతే.. అది కాస్తా నెటిజన్ల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. (చదవండి: లోలోపల భయంగా ఉన్నా.. పైకి నవ్వేదాన్ని’) అటు ఆ సన్నివేశం, ఇటు ఈ ర్యాప్ సాంగ్ రెండింటినీ కలిపి మీమ్స్ రాయుళ్లు ఫన్నీ మీమ్స్ సృష్టిస్తూ నెటిజన్లకు నవ్వులు పంచుతున్నారు. కోకిలా బెన్లా నటించిన రూపల్ పటేల్ దత్తా.. పాట బాగుందని యశ్రాజ్కు ఫోన్ చేసి మరీ మెచ్చుకున్నారు. అలాగే సీరియల్లో రాశిగా కనిపించిన రుచ హసబ్నీస్ కూడా తనకీ ర్యాప్ సాంగ్ తెగ నచ్చిందని చెప్పుకొచ్చారు. తాజాగా ఈ పాటపై స్టార్ చెఫ్ వికాస్ ఖన్నా స్పందించారు. "దీని గురించి ఆలోచించకుండా నా జీవితంలో కుక్కర్లో శనగల కూర చేయను కాబోలు" అని ట్విటర్లో రాసుకొచ్చారు. మరోవైపు ఈ ఒక్క వీడియోతో యశ్‌రాజ్ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ఫాలోవర్లు కూడా భారీగానే పెరిగారు. (చదవండి: సర్జరీ చేశారు.. ఇంటికి వచ్చేశా: నటుడు) I dont think that I can ever cook chane in cooker again in my life without thinking about this. 🤣 https://t.co/doFqYxli1S — Vikas Khanna (@TheVikasKhanna) August 24, 2020 Double standards by #KokilaModi justice for #rashiben #RasodeMeinKaunTha #gopibahu pic.twitter.com/mEVJyqhlbI — Poonam Naik💎 (@P00Naik) August 24, 2020 How many of u feel the same... 😂🤪 #RasodeMeKonTha #RasodeMeinKaunTha #yashrajmukhate u made entire India crazy by this pic.twitter.com/HlaenHCkZh — Akash R R Upadhye (@AkashUpadhye) August 26, 2020 -
అసిఫా దోషులను శిక్షించాలి
తిరుపతి అర్బన్ /కల్చరల్ : జమ్ము కాశ్మీర్ కథువాలో చిన్నారి అసిఫాపై అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు రుద్రరాజు శ్రీదేవి, నగర అధ్యక్షురాలు బుర్రా సావిత్రియాదవ్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం నుంచి నగర వీధుల్లో ర్యాలీగా నిర్వహించి గాంధీ విగ్రహం వద్ద ముగించారు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నా, నిర్భయ చట్టం అమలులో ఉన్నా ఫలితం లేకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు ప్రమీలమ్మ, రిటైర్డ్ ప్రిన్సిపాల్ స్వరాజ్య లక్ష్మి, వివిధ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. క్రైస్తవుల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం వచ్చాక మహిళలపై పెరిగిపోతున్న అత్యాచారాలు, అరాచకాలను అరికట్టాలని అసీఫా దోషులను శిక్షించాలని, పాస్టర్ అరుళ్ అరసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిన్నారి అసీఫా హత్యను ఖండిస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ తిరుపతి క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి తిరుపతి నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో పాస్టర్స్ రాజేంద్రన్, భీమిరెడ్డి, విజయకుమార్, డానియేల్, జాన్‌పాల్, దీలీప్, జయపాల్, ప్రమీల, జమిలా, క్రైస్తవులు, చిన్నారులు పాల్గొన్నారు. -
బేటీ బచావో .. మోడీ హటావో
గుంతకల్లు టౌన్ : కథువాలో చిన్నారి ఆసీఫాను అత్యాచారం చేసి హత్యచేసిన మానవ మృగాలను ఉరితీయాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గం సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. చిన్నారి ఆసీఫాను హత్యచేసిన దుండగులను కఠినంగా శిక్షించడంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కాగడాల ప్రదర్శన నిర్వహించారు. స్థానిక వైఎస్సార్ విగ్రహం వద్ద నుంచి గాంధీచౌక్ తిరిగి అంబేడ్కర్ సర్కిల్ వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. ఈ సందర్భంగా వై.వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ పసిప్రాణాన్ని చిత్రవధలకు గురిచేసి నిర్ధాక్షిణ్యంగా చంపేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన మానవ మృగాలను క్షమించరాదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల రామాంజినేయులు, పట్టణ, మండల అధ్యక్షులు సుంకప్ప, మోహన్‌రావు, కౌన్సిల్ ఫ్లోర్‌లీడర్ ఫ్లయింగ్‌మాబు, కౌన్సిలర్ టి.గోపి, మైనార్టీ విభాగం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అహమ్మద్‌బాషా, ఎంబీ.మౌలా, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏపీ రాష్ట్ర సంచార జాతుల సం ఘం ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసులు, సీపీఎం పట్టణ కార్యదర్శి భజంత్రీశీనా ఆధ్వర్యంలో ప్రజా, ముస్లీం, రాజకీయ సంఘాలు ర్యాలీ నిర్వహించారు. పొట్టిశ్రీరాములు సర్కిల్లో నిందితుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. గుత్తి : కతువాలో అభం, శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై అతి పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ గుత్తిలో మంగళవారం రాత్రి అన్ని మతాలు, కులాలు, పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, ఐద్వా మహిళలు,చిన్నారులు, మహిళలు భారీ ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఆర్అండ్బీ బంగ్లా వద్ద నుంచి గాంధీ సర్కిల్ మీదగా ఆర్టీసీ బస్టాండ్, రాజీవ్ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం గాంధీ సర్కిల్ వద్ద మానవ హారం చేపట్టారు. నిరసనలో సుమారు 1500 మంది పాల్గొన్నారు. గుత్తి ఆర్ఎస్లో : గుత్తి ఆర్ఎస్లో దక్షిణ మధ్య రైల్వే నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి అసిఫా హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. అలాగే గుత్తి షటిల్ క్రీడాకారులు, యువకులు ట్రాన్స్‌కో కార్యాలయంలోని ఇండోర్ స్టేడియంలో ఘనంగా నివాళులర్పించారు. గుంతకల్లు : జమ్ము కాశ్మీర్‌లోని కథువా ప్రాంతంలో ఎనిమిదేళ్ల చిన్నారి ఆసిఫాను ఆత్యాచారం చేసి, హత్య చేసిన మానవ మృగాలను నడిరోడ్డుపై ఉరితీయాలని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆసిఫా హత్యను నిరసిస్తూ మంగళవారం మజ్దూ ర్ యూనియన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ గుంతకల్లు డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు సుదర్శన్‌రాజు, విజ య్‌కుమార్, సహయ కార్యదర్శులు కేఎం డీగౌస్, బాలాజీసింగ్, మస్తాన్‌వలి, కోశాధికారి శ్రీనివాసశర్మ, నాయకులు పీ.విజ య్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నగేష్‌చౌదరిపై రౌడీషీట్
రాప్తాడు : యువకుడిపై ఆటవికంగా దాడిచేసి గాయపరిచిన నగేష్‌చౌదరిపై రౌడీషీట్ తెరుస్తామని అనంతపురం డీఎస్పీ మల్లికార్జునవర్మ తెలిపారు. ఆదివారం ఆయన రాప్తాడు పోలీసుస్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఈ నెల 28న రాప్తాడులోని పండమేరు వంక రైల్వే బ్రిడ్జి సమీపంలో యల్లనూరు మండల కేంద్రానికి చెందిన చిన్న ఓబులేసుపై జరిగిన దాడి గురించి ఆరా తీశారు. దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్న కొంత మందిని పిలిపించి విచారణ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పండమేరు వంకలో చిన్న ఓబులేసుపై దాడి జరిగిన మాట వాస్తమేనన్నారు. దాడి జరుగుతుందని స్థానికులు పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగానే ఎస్ఐ ధరణిబాబు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడికి తాగునీరు అందించి.. 108 ద్వారా అనంతపురం ఆస్పత్రికి తరలించారన్నారు. దాడి చేసిన నగేష్ చౌదరికి ఘటన స్థలంలోనే ఎస్ఐ ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చి స్టేషన్‌కు తరలించారన్నారు. ఆ రోజే నగేష్ చౌదరిపై సెక్షన్ 324, 341 కింద కేసు నమోదు చేశారన్నారు. నిందితునికి ఎలాంటి రాచమార్యదలూ చేయడం లేదన్నారు. ప్రతి రోజు కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు. గ్రామాల్లో అ సాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, శాంతి భద్రతలను విఘాతం కల్పించే అలాంటి వారిని సహించేది లేదన్నారు. ఎవరైనా రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తామన్నారు. మట్కా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై నిరంతర నిఘా ఉంచామన్నారు. ఒకసారి దొరికి అనంతరం వారిలో మార్పు రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిచ్చారు. చట్టపరమైన కేసులు నమోదు చేసి రౌడీషీట్లు తెరుస్తామన్నారు. -
బాలికపై అత్యాచారం
ఆలస్యంగా వెలుగుజూసిన వైనం నిందితుడిపై కేసులు నమోదు వినుకొండ రూరల్(గుంటూరు) : బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి నిందితుడిపై ఫిర్యాదుచేసేందుకు పోలీసుస్టేషన్‌కు వెళ్లినా సరైన సహకారం అందకపోవడంతో మూడురోజులుగా మానసిక వేదనతో కుంగిపోయింది. స్థానిక మహిళలకు విషయం చెప్పగా వారు ఆమె భుజం తట్టి మేమున్నామంటూ ధైర్యం చెప్పడంతో ఎట్టకేలకు శుక్రవారం నిందితుడిపై కేసు నమోదు చేశారు. మైనర్ బాలిక బుధవారం రాత్రి ఇంటి ఆవరణలో నిద్రిస్తుంది. అదే ఇంట్లో గత ఏడు నెలలుగా అద్దెకు ఉంటున్న విశాల్ బాలిక వద్దకు వచ్చి అర్ధరాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనుమానం వచ్చి కూతురు నిద్రిస్తున్న మంచం వైపు తల్లి చూసింది. గమనించిన విశాల్ ఒక్కసారిగా అక్కడి నుంచి పరారయ్యాడు. బాలికకు అధిక రక్తస్రావం కావడంతో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేర్పించారు. బాలిక తేరుకోవడంతో స్థానికులు వెంకాయమ్మకు మద్దతుగా నిలిచారు. ఏఎస్సై పూర్ణ చంద్రరావు కేసు నమోదు చేసి సెక్షన్ 307 క్లాస్(2), సెక్షన్ 10తో పాటు మరికొన్ని సెక్షన్లతో విశాల్‌పై కేసు నమోదు చేశారు. సీఐ శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. -
పోలీస్ స్టేషన్లో మహిళపై రేప్
శ్రీనగర్: రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారిపై ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన జమ్మూ,కశ్మీర్ లోని చోటుచేసుకుంది. అఖ్ నూర్ సబ్ డివిజన్ లోని కౌర్ పోలీసు స్టేషన్ లో ఈ దుర్ఘటన జరిగింది. ఇందుకు సాటి మహిళా పోలీసు సహకరించడం మరో దారుణం. అత్యాచారం జరిగిందని, ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితురాలికి ఈ చేదు అనుభవం ఎదురైంది. తమ కూతురును 15 రోజుల క్రితం నిరేప్ చేసి ఒక వ్యక్తి కిడ్నాప్ చేశాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వారం క్రితం ఇద్దరిని అరెస్ట్ చేసి స్టేషన్ కుతరలించారు.