వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరపున ఆశావహుడు, భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి Vivek Ramaswamy తనలోని టాలెంట్‌ను ప్రదర్శించారు. ఓ ఈవెంట్‌కు హాజరైన ఆయన.. ర్యాప్ కట్టి అల్లాడించారు. అయితే ఈ క్రమంలోనే ఆయన అడ్డు కూడా తగిలింది.
భారత మూలాలున్న వివేక్ రామస్వామి Vivek Ramaswamy అమెరికా అధ్యక్ష ఎన్నిక అభ్యర్థుల(రిపబ్లికన్ పార్టీ) ప్రచారంలో దూసుకుపోతున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో రామస్వామి ‘డా వెక్ ది ర్యాపర్’గా గుర్తింపు పొందాడట కూడా. అందుకే ఆ టాలెంట్‌ను ప్రదర్శించారు. లోవా స్టేట్ ఫెయిర్‌కు హాజరై.. ప్రముఖ ర్యాప్ స్టార్ ఎమినెమ్ ‘లాస్ యువర్‌సెల్ఫ్’ ర్యాప్‌ను తన గొంతుతో కట్టి అక్కడున్నవాళ్లను అలరించారాయన. అయితే..
ఈ పరిణామం జనాలను అలరించినా.. ఎమినెమ్(50)కు నచ్చలేదు. తన మ్యూజిక్‌ను ఎక్కడా వాడొద్దంటూ సున్నితంగానే రామస్వామికి తెలియజేశారు. ఈ మేరకు మ్యూజిక్‌సంస్థ తరపున ఓ లేఖను రామస్వామికి పంపించినట్లు తెలుస్తోంది. ఇక మీదట ఎన్నికల ప్రచారంలో తన మ్యూజిక్‌ను వాడొద్దని లేఖలో ఎమినెమ్, రామస్వామికి తెలియజేశాడు. ఇదిలా ఉంటే.. అమెరికాలో ఎన్నికల ప్రచారంలో ఇలా తమ మ్యూజిక్ వాడొద్దంటూ కోరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత రెండు దఫా ఎన్నికల్లో.. రిహానా, అడెలె మ్యూజిక్‌లను ట్రంప్ తన ర్యాలీలలో అనుమతులు లేకుండానే ఉపయోగించారు.
38 ఏళ్ల వివేక్ రంగస్వామి తనను తాను ‘ట్రంప్ 2.0’గా భావిస్తున్నారు. అయితే.. 2024 అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున నిలబడేందుకు ట్రంప్‌తోనే పోటీ పడుతున్నారు వివేక్. అంతేకాదు.. తానే గనుక అధ్యక్షుడ్ని అయితే ఎలన్ మస్క్‌ని వ్యక్తిగత సలహాదారుగా నియమించుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు.
Rapping Republican: Vivek Ramaswamy's Surprising Eminem Moment
— GOP News (@gopnews2024) August 19, 2023
Vivek Ramaswamy, a Republican presidential candidate and successful biotech entrepreneur, recently showcased a surprising side at the Iowa State Fair. Amidst his political pursuits, Ramaswamy took the stage to rap… pic.twitter.com/4tkvM0aMk5
Comments
Please login to add a commentAdd a comment