Classical dancers
-
కల నెరవేర్చే..అమ్మ అభిమానిక..
తాను నృత్యకారిణిగా కొనసాగాలని, తన కూతురిని కూడా గొప్ప కళాకారిణిగా చూడాలని ఓ కన్నతల్లి ఆరాటం.. మూడేళ్ల వయసులోనే కూతురికి శిక్షణ.. చదువుల వేటలో మార్గాలు వేరుపడినా.. వేర్వేరు రంగాల్లో రాణింపు.. అయినా కూతురితో కలిసి ప్రదర్శన ఇవ్వాలనే ఆ తల్లి ఆశ మాత్రం చిరంజీవిగా ఉండడం.. చివరకు ఆ ఆకాంక్ష జయించడం.. బహుశా కీర్తిశేషులు కళాతపస్వి కె.విశ్వనాథ్ ఉండి ఉంటే ఇదో భావోద్వేగ భరిత వెండితెర కథగా మారి ఉండేదేమో.. హైదరాబాద్ నగరంలోని ఓ ఉన్నత కుటుంబానికి చెందిన తల్లీ కూతుళ్లు కలిసి సమర్పించనున్న సంప్రదాయ నృత్య ప్రదర్శన నేపథ్యం ఆసక్తికరమైనదిగా మారింది.. ‘ఇది అమ్మ చిరకాల ఆకాంక్ష. నాతో కలిసి నృత్య ప్రదర్శన ఇవ్వాలని తను ఎప్పటి నుంచో ఆశపడుతోంది’ నగరంలో ఒక మోడల్‌గా, ఫిట్నెస్ ట్రైనర్‌గా, ఈవెంట్ మేనేజర్‌గా చిరపరిచితమైన అభిమానిక.. మన హైదరాబాద్‌కి చెందిన అమ్మాయే. ఆమె అకస్మాత్తుగా నృత్యకారిణిగా మారడం వెనుక కారణాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. హైదరాబాద్‌కి చెందిన అభిమానిక అమ్మతో కలిసి అడుగులు..ప్రస్తుతం హైకోర్ట్‌లో సీనియర్ లాయర్‌గా ఉన్న దువ్వూరి వత్సలేంద్రకుమారి తొలి అడ్వకేట్ జనరల్ దువ్వూరి నరసరాజు కుమార్తె.. తను మూడేళ్ల వయసు నుంచే నటరాజు రామకృష్ణ దగ్గర శిష్యరికం చేసి నాట్య ప్రదర్శనలు ఇస్తూ వచ్చారు. న్యాయవాదిగా మారినా నాట్యాభిరుచిని కొనసాగించారు. తన కూతురు అభిమానిక కూడా తనలాగే గొప్ప నాట్యకారిణి కావాలని మూడేళ్ల వయసులోనే ఆమెకు కూడా తానే గురువుగా మారి శిక్షణ ప్రారంభించారు. ఆ తర్వాత తన కుమార్తె కూడా ప్రదర్శనలు ఇస్తుంటే తన ఆకాంక్ష నెరవేరుతోందని మురిసిపోయారు. అయితే ఆ తల్లి ఒకటి తలిస్తే.. కాలం మరొకటి తలచింది. చదువుల వేటలో అభిమానిక నాట్యపిపాస అటకెక్కింది. బీటెక్ టాపర్‌గా నిలిచినా.. వ్యక్తిగత అభిరుచి మేరకు ఫిట్నెస్ ట్రైనర్‌గా మోడల్‌గా, ఈవెంట్ మేనేజర్‌గా విజయవంతంగా కొనసాగుతున్నారు అభిమానిక.. ఇప్పుడు తల్లి ఆకాంక్షకు తలొగ్గారు. పాతికేళ్ల తర్వాత.. మారిన ప్రయాణం‘నేను నాట్యానికి పాతికేళ్లుగా దూరమైనా అమ్మ తన ఆశకు మాత్రం దూరం కాలేదు. తరచూ నాకు గుర్తు చేస్తూనే ఉన్నారు. అమ్మ పట్టుదలతో కొన్ని రోజుల్లోనే మళ్లీ నా చిన్ననాటి నాట్య పిపాస తిరిగి ఊపిరి పోసుకుంది. ఇప్పుడు సంపూర్ణమైన ఇష్టంతో నెలల తరబడి కఠినమైన సాధన ద్వారా అమ్మతో కలిసి ప్రదర్శనకు సిద్ధమవుతున్నా.. నిజం చెప్పాలంటే అమ్మ నాట్యానికి నేనో అభిమానిని’ అంటూ భావోద్వేగంతో చెప్పారు అభిమానిక. ‘నృత్యకారిణిగా, న్యాయవాదిగా రెండు పడవల ప్రయాణం విజయవంతంగా కొనసాగిస్తూ వచ్చాను. ఎందరినో శిష్యురాళ్లుగా, నృత్యకారిణులుగా తయారు చేశాను. 2017లో పేరిణిలో తొలి మహిళా నృత్యకారిణిగా ప్రదర్శన ఇచ్చి భారత్ వరల్డ్ రికార్డ్ దక్కించుకున్నాను. వ్యక్తిగతంగా ఎన్ని సాధించినా.. నా కూతురుతో కలిసి నాట్య ప్రదర్శన ఇవ్వాలనేది నా చిరకాల వాంఛ’ అన్నారు వత్సలేంద్ర కుమారి. వయసు పైబడకుండానే.. ‘కేవలం కలిసి నృత్యం చేయడమే కాదు తనతో ధీటుగా చేయాలి కదా.. అందుకే వయసు మరీ పైబడకుండానే చేయాలని అనుకున్నా. ఏమైతేనేం.. ఇన్నాళ్లకు నా కల నెరవేరుతోంది’ అంటూ ఆనందంగా చెప్పారు వత్సలేంద్ర కుమారి.. ఇప్పటిదాకా తల్లీ కూతుర్లు కలిసి నృత్య ప్రదర్శన ఇవ్వడం అనేది లేదని, అది తామిద్దరూ సాధించనుండడం గర్వంగా ఉందన్నారు. కూచిపూడి, భరతనాట్యం మేలు కలయిక లాంటి ఆంధ్రనాట్యం నటరాజ రామకృష్ణ ప్రారంభించారని, ఇటీవల అంతగా ప్రాభవానికి నోచుకోని ఈ నాట్యాన్ని అందరికీ చేరువ చేయాలనేదే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by ABHIMANIKA 🇮🇳 Fashion & Fitness Coach (@abhimanika) (చదవండి: ‘బైక్ పింక్ సర్వీస్': ఓన్లీ మహిళా డ్రైవర్లే..!) -
Alekhya Punjala: కళలతో కరిక్యులమ్
అలేఖ్య పుంజాల... శాస్త్రీయనాట్య పుంజం. ఆమెది యాభై ఏళ్ల నాట్యానుభవం... ముప్పై ఏళ్ల బోధనానుభవం. ఆమె మువ్వలు... కథక్... ఒడిస్సీ.. భరతనాట్యం... కూచిపూడి... అడుగులను రవళించాయి. రాష్ట్రపతి నుంచి పురస్కారం... ఆమెలో సాక్షాత్తూ అమ్మవారిని చూస్తూ ప్రేక్షకులు చేసిన అభివందనం... ఇప్పుడు సంగీతనాటక అకాడెమీకి వన్నెలద్దే బాధ్యతలు... ఆమె నాట్యముద్రలతో పోటీ పడుతున్నాయి. తెలంగాణ సంగీతనాటక అకాడెమీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ’సాక్షి ఫ్యామిలీ’తో ఆమె చెప్పిన సంగతులివి.‘‘తెలంగాణలో కళారీతులు వందల్లో ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రజాబాహుళ్యంలోకి వచ్చాయి. మరుగున పడిన మరెన్నో కళారీతులను అన్వేíÙంచాల్సి ఉంది. నా వంతుగా పరిశోధనను విస్తరించి మరిన్ని కళారీతులను ప్రదర్శన వేదికలకు తీసుకు రావాలనేదే నా లక్ష్యం. సంగీత, నాటక అకాడెమీ కళాకారులకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. కళాకారులందరినీ ఒక త్రాటి మీదకు తీసుకురావాలి. అసలు తెలంగాణ ఉనికి కళలే. ఒక ప్రదేశం గుర్తింపు, అక్కడ నివసించే ప్రజల గుర్తింపు కూడా ఆ సంస్కృతి, కళలతో ముడిపడి ఉంటుంది. తరతరాలుగా కళాకారులు గడ్డు పరిస్థితుల్లో కూడా కళను వదిలేవారు కాదు. కళను బతికించడమే తమ పుట్టుక పరమార్థం అన్నట్లుగా కళాసాధన చేశారు. ప్రస్తుతం మన విద్యావిధానంలో కళలకు సముచిత స్థానం కల్పిస్తూ కరిక్యులమ్ రూ΄÷ందాలి. అందుకోసం కళారీతుల గురించి అధ్యయనం చేస్తున్నాను. కళాంశాన్ని పాఠ్యాంశంగా రూ΄÷ందించాలి. పిల్లలు జీవన శాస్త్రీయ విషయాలతోపాటు శాస్త్రీయ కళలను కూడా పాఠాలుగా చదవాలి.సోషల్ మీడియా దన్ను మా తరంలో కళాసాధనను కెరీర్ ఆప్షన్‌గా ఎంచుకోవడానికి భయపడే వాళ్లు, ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. టెక్నాలజీ విస్తృత మైంది. ఇప్పుడు కళాకారులు సోషల్ మీడియానే పెద్ద కళావేదికగా మలుచుకుంటున్నారు. మా తరంలో కళాకారుల్లో సగానికి పైగా కళాసాధనలోనే జీవితాన్ని వెతుక్కునేవారు. కొంతమంది కళకు దూరమై బతుకుతెరువు బాట పట్టేవారు. ఈ తరంలో నా దృష్టికి వచి్చన విషయాలేమిటంటే... కళాసాధనలో అనతికాలంలోనే గుర్తింపు రావాలని కోరుకుంటున్నారు. సంతృప్తికరమైన గుర్తింపు లేకపోతే కళను వదిలేస్తున్నారు. కొనసాగేవాళ్లు పదిశాతానికి మించడం లేదు. నిజానికి సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం తెలిస్తే గుర్తింపు కూడా అనతికాలంలోనే వస్తుంది. ఈ టెక్నాలజీ యుగంలో వృత్తి–ప్రవృత్తి రెండింటికీ న్యాయం చేసే అవకాశం ఉంది. జీవిక కోసం ఒక ఉద్యోగం చేసుకుంటూ కళాసాధన, కళాప్రదర్శనలు కొనసాగించండి. కళ కోసం చదువును నిర్లక్ష్యం చేయవద్దు. చదువు కోసం కళకు దూరం కావద్దు. రాబోయేతరాల కోసం ఈ వంతెనను నిలబెట్టండి. ఇప్పుడు మన శాస్త్రీయ కళారీతులు విశ్వవ్యాప్తమయ్యాయి. విదేశాల్లో ప్రదర్శనకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. కళాసాధనలో సవాళ్లు మహిళలకు ఎదురయ్యే సవాళ్లు దేహాకృతిని కాపాడుకోవడంలోనే. సంగీతసాధనకు దేహాకృతి పట్ల ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి కాదు, నాట్యకారులకు దేహాకృతితోపాటు శారీరక దారుఢ్యం కూడా అవసరం. ప్రసవం, పిల్లల పెంపకం కోసం ఎక్కువ విరామం తీసుకుంటే కళాసాధనకు దూరమైపోతాం. పిల్లలను పెంచుకుంటూ తమ మీద తాము కూడా శ్రద్ధ తీసుకున్న నాట్యకారులే ఎక్కువ కాలం కొనసాగగలరు. మహిళలకు ఎదురయ్యే పెద్ద చాలెంజ్ ఇదే. కుటుంబం సహకరిస్తే కళకు సంబంధం లేని ఉద్యోగం చేసుకుంటూ, పిల్లలను చూసుకుంటూ కూడా కళాసాధన కొనసాగించవచ్చు.’’ లకుమాదేవి గొప్ప వ్యక్తిత్వం గల మహిళడాక్టర్ సి. నారాయణరెడ్డిగారితో కలిసి ప్రయాణిస్తున్న సందర్భంలో ఆయన రాసిన ‘కర్పూర వసంతరాయలు’ గేయకావ్యాన్ని విన్నాను. 14వ శతాబ్దంలో కొండవీటి రెడ్డిరాజుల ఆస్థానంలో నర్తకి లకుమాదేవి. కావ్యంలో లకుమాదేవి పాత్ర అద్భుతంగా ఉంది. ఆ పాత్రను ప్రదర్శించడానికి నారాయణరెడ్డి గారి అనుమతి తీసుకున్నాను. నాకిష్టమైన పాత్రల్లో మండోదరి, దుస్సల, రుద్రమదేవి, వేలు నాచియార్ పాత్రలు ముఖ్యమైనవి. వేలు నాచియార్ తమిళనాడులో ప్రఖ్యాతి చెందిన మహిళా పాలకురాలు, బ్రిటిష్ పాలకులతో పోరాడిన యోధ. ఆ పాత్రను ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ‘వారియర్ ఉమెన్ ఆఫ్ భారత్’ నాట్యరూపకంలో ప్రదర్శించాను. నేను అమ్మవారి పాత్ర ప్రదర్శించినప్పుడు నాలో అమ్మవారిని చూసుకుని ఆశీర్వాదం కోసం సాష్టాంగ ప్రణామం చేసిన ప్రేక్షకుల అభిమానం ఎంతో గొప్పది. వారి అభిమానానికి సదా కృతజ్ఞతతో ఉంటాను.ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్‌రెడ్డి -
అమెరికాలో భారతీయుని దారుణ హత్య
న్యూయార్క్: అమెరికాలో భారతీయులు, భారతీయ అమెరికన్లపై దాడులు కొనసాగుతున్నాయి. పశ్చిమబెంగాల్‌కు చెందిన శాస్త్రీయ నృత్య కళాకారుడొకరిని దుండగులు కాల్చి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిస్సోరిలోని సెంట్ లూయీస్‌లో మంగళవారం ఈ దారుణం చోటుచేసుకుంది. బీర్భూమ్ జిల్లా సూరికి చెందిన అమర్నాథ్ ఘోష్(34) పీహెచ్డీ కోసం అమెరికాలోని వెళ్లారు. వాషింగ్టన్ వర్సిటీలో చేరారు. మంగళవారం ఉదయం 7.15 గంటల సమయంలో నడిచి వెళ్తుండగా సెంట్ లూయీస్ అకాడమీ సమీపంలో దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడి ఆయన అక్కడికకక్కడే చనిపోయారు. అమర్నాథ్కు తల్లిదండ్రులు, తోబుట్టువులు లేరు. ఆయన మృతి విషయం బంధువులకు ఆలస్యంగా చేరింది. కూచిపూడి, భరతనాట్యాల్లో నిపుణుడైన ఆయన బాలె నేర్చుకుంటూ పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తున్నట్లు ఆయన స్నేహితులు హిమా కుప్ప, రవి కుప్ప తెలిపారు. ఘోష్ మృతిపై షికాగోలోని భారత కాన్సులేట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దీనిపై స్థానిక పోలీసులు, యూనివర్సిటీ అధికారుల తో చర్చించింది. ఆయనను పొట్టన బెట్టుకున్న దుండగులను తక్షణమే పట్టుకోవాలని కోరింది. -
కరచరణో రసి మణిగణ భూషణ... లుక్... ఐ వాజ్ గోనా గో
శాస్త్రీయ నృత్య వేషధారణ అనగానే శాస్త్రీయ నృత్యమే కళ్ల ముందు కదలాడుతుంది. అలా కాకుండా ర్యాప్ వినిపిస్తే ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఈ వీడియో ఉదాహరణ. నటి అదా శర్మ క్లాసికల్ డ్యాన్సర్ వేషంలో అమెరికన్ ర్యాపర్ ఎమెనెమ్ ఐకానిక్ ర్యాప్ ‘ర్యాప్ గాడ్’ ట్రాక్‌తో ‘వావ్’ అనిపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ రీల్ వైరల్‌గా మారింది. శర్మను ప్రశంసలతో ముంచెత్తిన వారిలో హీరో అయుష్మాన్ ఖురాన, నటి ఊర్వశీ రౌటేల, ఇండియన్ ర్యాపర్ రఫ్తార్లాంటి సెలబ్రిటీ కూడా ఉన్నారు. యూట్యూట్ ద్వారా 2013లో విడుదలైన ‘ర్యాప్ గాడ్’ సాంగ్ సూపర్ హిట్ కావడమే కాదు ‘మోస్ట్ వర్డ్స్’ విశేషంతో ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’లోకి ఎంటర్ అయింది. ఎన్నో అవార్డ్లు గెలుచుకుంది. ‘లుక్, ఐ వాజ్ గోనా గో ఈజీ ఆన్ యూ నాట్ టు హార్ట్ యువర్ ఫీలింగ్స్ బట్ ఐయామ్ వోన్లీ గోయింగ్ టు గెట్ దిస్ వన్ చాన్స్ సమ్‌థింగ్ రాంగ్. ఐ కెన్ ఫీల్ ఇట్’ అని శాస్త్రీయ నృత్య వేషధారణతో కనిపిస్తున్న అదా శర్మ పాడుతుంటే ‘వాహ్వా’ అనకుండా ఉండలేము. View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) -
నేడు... రేపటిని చెక్కే ఉలి
‘నీ లక్ష్యాలను, గమ్యాన్ని నిర్ణయించాల్సింది సమాజం కాదు, నువ్వే’ అమ్మ ఈ మాట చెప్పిన క్షణం నుంచి నాకు ప్రపంచం కొత్తగా కనిపించసాగింది. నేను సమాజాన్ని అర్థం చేసుకునే తీరులో పూర్తి మార్పు వచ్చింది’... ప్రఖ్యాత ఒడిషా శాస్త్రీయ నాట్యకారుడు ప్రేమ్ సాహు చెప్పిన మాట ఇది. అలాగే ‘నిన్నటి రోజున నువ్వు నీ రోజును ఎలా గడిపావో గుర్తు చేసుకో. ఈ రోజు అంతకంటే మెరుగ్గా గడవాలి. ఈ రోజు రేపటి రోజును మరింత మెరుగు పరచాలి. అంటే జరిగి పోయిన రోజు... జరగబోయే రోజును చెక్కే ఉలి కావాలి’ అని చెప్పింది ప్రేమ్సాహు వాళ్ల అమ్మ మంజులత. అబ్బాయేనా! ఒడిశా రాష్ట్రం, కటక్ నగరంలో పుట్టిన ప్రేమ్సాహుకి నాట్యసాధన ఇష్టం. అతడికి నాట్యం నేర్పించడం అతడి తల్లికి ఇష్టం. ముప్పై ఏళ్ల కిందటి కటక్ సమాజానికి మాత్రం ఇష్టం లేదు. ప్రేమ్ నాట్యసాధన చేస్తే నవ్వేవారు. నాట్యముద్రల్లో అతడి వేళ్లు సున్నితంగా ఒదిగిపోయేవి. ‘అబ్బాయి లక్షణాలేమైనా ఉన్నాయా’ అని ముఖం మీదనే నవ్వేవారు. పాఠశాల వార్షికోత్సవంలో ప్రదర్శన కోసం ఉత్సాహంగా పేరిచ్చే వాడతడు. ప్రాక్టీస్‌కి వెళ్లడానికి క్లాసు టీచర్ని అనుమతి అడిగినప్పుడు గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తి నోటి వెంట రాకూడని ఎగతాళి మాటలు వచ్చేవి. టీచర్ల వ్యంగ్యం చాలు తోటి పిల్లలు ప్రేమ్‌ని ఏడిపించడానికి. ప్రేమ్ గురించి మాట్లాడాలంటే అతడి జెండర్ గురించిన మాటలు తప్ప మరేవీ పట్టని సమాజాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొడుకుకు ధైర్యం చెప్పింది మంజులత. గెలిపించే తెగింపు ఇదిలా ఉండగా ఓ రోజు... ప్రదర్శన తర్వాత మేకప్ గదిలో ఒక సీనియర్ నటుడు ప్రేమ్‌కు దగ్గరగా వచ్చి తాకాడు, ఆ తాకడంలో ఏదో తేడా ఉందని గ్రహించేలోపు అతడు పద్నాలుగేళ్ల ప్రేమ్‌ని గట్టిగా పట్టుకున్నాడు. అక్కడి నుంచి పారిపోయి ఓ మూల దాక్కుని వెక్కి వెక్కి ఏడ్చాడు. అంతులేని ఆవేదనతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఉరి మెడకు వేసుకునేలోపే... తల్లి ఎప్పుడూ చెప్పే ధైర్య వచనాలు గుర్తు వచ్చాయతడికి. జీవించి చూపించాలనే మొండిధైర్యం అయితే వచ్చింది. కానీ నలుగురిలో కలవడానికి బిడియపడేవాడు. రోజంతా గదిలోనే ఉంటూ గంటల కొద్దీ నాట్యసాధన చేసేవాడు. ఇరవై ఒక్క ఏళ్ల వయసులో ఢిల్లీలోని సాహిత్య కళాపరిషత్‌లో స్కాలర్‌షిప్‌తో సీటు వచ్చింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత మాధవీ ముద్గల్ దగ్గర నాట్యంలో మెళకువలు నేర్చుకున్నాడు. హేతుబద్ధమైన విమర్శను స్వీకరించి ఆత్మపరిశీలన చేసుకోవడం, అసూయతో కూడిన అర్థరహితమైన విమర్శలను మనసుకు పట్టనివ్వకపోవడం కూడా నేర్చుకున్నాడు ప్రేమ్ సాహు. అతడు సాధించిన పరిణతి లండన్‌లోని ఒడిశా సొసైటీ యునైటెడ్ కింగ్డమ్ ఫెస్టివల్ నిర్వహించిన వేడుకల్లో ప్రేమ్ ఇచ్చిన నాట్యప్రదర్శనలో వ్యక్తమైంది. ఆ ప్రదర్శన పూర్తయిన వెంటనే ఒక వృద్ధ మహిళ వేదిక మీదకొచ్చి ‘మనోహరమైన, మనసు పెట్టి చేసిన నీ నాట్యం చూస్తుంటే నాకు ఏడుపాగలేదు’ అని కన్నీళ్లు తుడుచుకుంది. నాట్యకారులకు ఇంతకంటే గొప్ప ప్రశంస మరొకటి ఉండదని చెప్పాడు ప్రేమ్ సాహు. తనను ఈ స్థాయిలో నిలబెట్టింది తన తల్లి అలవరచిన గుండె ధైర్యమేనని చెప్పాడు. ఆమె సింహం లాంటి «గుండెదిటవు కలిగిన మనిషి అని తల్లిని ప్రశంసించాడు ప్రేమ్ సాహు. తల్లితో ప్రేమ్సాహు ప్రేమ్సాహు -
సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని కాదనుకుని..!
సాక్షి,యద్దనపూడి: ప్రస్తుత పోటీ ప్రపంచంలో లక్ష రూపాయల జీతంతో కూడిన సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని దక్కించుకోవడమంటే ఆషామాషీ కాదు. కానీ, ఆమె మాత్రం తనను వెతుక్కుంటూ వచ్చిన ఆ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసుకుంది. శాస్త్రీయ నృత్యంపై ఉన్న మక్కువతో ఆ దిశగా అడుగులు వేసింది. నృత్య రూపకాలపై పరిశోధన చేసి ఆధ్యాత్మిక జతులు, జావళీలకు, సామాజిక ఇతివృత్తాన్ని జోడిస్తూ నృత్య ప్రదర్శనలిస్తూ కళాభిమానుల మన్ననలు అందుకుంది. అంతటితో సరిపెట్టుకోకుండా ఆ విద్యను పదిమందికి నేర్పించేందుకు శిక్షణాలయాన్ని స్థాపించింది. ఎంతో మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తూ నృత్య కళాకారులుగా తీర్చిదిద్దుతోంది. వారితో కలిసి ప్రదర్శనలిస్తూ తాను ఇష్టంగా ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరుకుంది. నాట్యంపై మక్కువతో తనను వివాహం చేసుకున్న సాఫ్ట్వేర్ రంగంలో నిపుణుడైన భర్తకు సైతం గురువుగా మారి నాట్యంలో శిక్షణ ఇచ్చి అతన్ని గొప్ప కళాకారునిగా తయారు చేసింది. ఈ యువ దంపతులిద్దరూ కలిసి ప్రస్తుతం దేశవ్యాప్తంగా నృత్య రూపకాలు ప్రదర్శిస్తూ నాట్య దాంపత్యం కొనసాగిస్తున్నారు. కళాభిమానుల ప్రశంసలు పొందుతున్నారు. వారే, యద్దనపూడి మండలం అనంతవరం గ్రామానికి చెందిన అద్దంకి ఆదిశేష వెంకటసుబ్రహ్మణ్యం, బాలత్రిపురసుందరి దంపతులు. తెనాలికి చెందిన చల్లా బాలత్రిపురసుందరికి చిన్నప్పటి నుంచి శాస్త్రీయ నృత్యమంటే మక్కువ. దస్తగిరి, రంగనాయికి, చింతా రామనాథం, కేవీ సుబ్రహ్మణ్యం వంటి గురువుల వద్ద శాస్త్రీయ నృత్యం అభ్యసించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కూచిపూడిలో ఎంఏ కూడా చేసింది. భావితరాలకు కూచిపూడి కళను అందించాలన్న ఆకాంక్షతో మాస్టర్ ఆఫ్ పర్ఫారి్మంగ్ ఆర్ట్స్ (ఎంపీఏ) కూడా అభ్యసించింది. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నప్పుడు కాలేజీలో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్‌లో ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఎంపికైనప్పటికీ.. నాట్యం కోసం ఆ అవకాశాన్ని కాదనుకుంది. అనంతరం కూడా నెలకు లక్ష రూపాయల వరకూ జీతమిచ్చే ఉద్యోగాలను పలు కంపెనీలు ఆఫర్ చేసినప్పటికీ నిస్సందేహంగా తిరస్కరించింది. ‘ఉద్యోగం చేస్తే బోలెడు మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లలో నేనూ ఒకదాన్నవుతా.. అదే నృత్యం చేస్తే అరుదైన కళాకారిణిగా మిగులుతా’ అనే భావనతో తాను ఎంచుకున్న మార్గం వైపే ముందుకు సాగింది. కళాకారిణిగా నృత్య ప్రదర్శనలు ఇస్తూనే.. 2010లో కల్యాణి కూచిపూడి ఆర్డ్స్ అకాడమీ పేరిట శిక్షణాలయాన్ని స్థాపించింది. శాస్త్రీయ నృత్యంలో ఎంతోమంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి మంచి కళాకారులను తయారు చేసింది. కళాభిమానిని భర్తగా పొంది.. కళాకారునిగా తీర్చిదిద్ది... యద్దనపూడి మండలం అనంతవరం గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ రంగ నిపుణుడు అద్దంకి ఆదిశేష వెంకటసుబ్రహ్మణ్యానికి కూడా సంప్రదాయ నృత్యమంటే ఎంతో ఇష్టం. 2019లో పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో అతని పెద్దలు అనుకోకుండా బాలత్రిపురసుందరి సంబంధం తెచ్చారు. ఆమె గురించి తెలుసుకున్న వెంకటసుబ్రహ్మణ్యం ఆనందంతో ఎగిరి గంతేశాడు. వెంటనే ఆమెను వివాహం చేసుకున్నాడు. అనంతరం కళావేదికలపై తన భార్య చేస్తున్న నృత్యానికి మరింత ఆకర్షితుడై ఎలాగైనా నాట్యం నేర్చుకోవాలని భావించాడు. అనుకున్నదే తడవుగా తన శ్రీమతినే గురువుగా చేసుకుని నెలల వ్యవధిలోనే ఆమె వద్ద నాట్యం నేర్చుకున్నాడు. వివిధ నృత్యరూపకాల పాత్రలకు తగిన హావభావాలు పలికించడంలోనూ నేర్పు సాధించాడు. గతేడాది తిరుమలలో జరిగిన నాదనీరాజనంలో శ్రీనివాసరూప కల్యాణాన్ని భార్యతో కలిసి ప్రదర్శించాడు. మహాశివరాత్రి వేడుకల్లో శ్రీశైలం, శ్రీకాళహస్తి దేవస్థానాల్లో నిర్వహించిన శివకల్యాణం రూపకంలోనూ ఈ దంపతులిద్దరూ శివపార్వతులుగా అభినయించి అభినందనలు అందుకున్నారు. షిరిడీలో బాలసుబ్రహ్మణ్యం ఒక్కరే బాబాగా అభినయించి అందరినీ మెప్పించాడు. భార్యభర్తలిద్దరూ కలిసి భవిష్యత్తులో మరిన్ని నృత్య ప్రదర్శనలు ఇచ్చేందుకు, తమ శిక్షణాలయం ద్వారా మరింత మందికి సంప్రదాయ నృత్యంలో శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. కళామతల్లికి సేవలందించడమే లక్ష్యం : మా ఇద్దరికీ నాట్యమంటే ప్రాణం. రాబోయే రోజుల్లో కూడా ఇలానే మా నాట్య ప్రయాణాన్ని సాగించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. భార్యభర్తలు ఎటువంటి అరమరికలు లేకుండా ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించుకుంటే ఏ రంగంలోనైనా ఇద్దరూ అద్భుత విజయాలు సాధించగలరు. మా అకాడమీ ద్వారా చిన్నారులకు నృత్యం నేరి్పస్తూ కళామతల్లికి సేవలందిస్తాం. -బాలత్రిపురసుందరి, వెంకటసుబ్రహ్మణ్యం దంపతులు -
యూనివర్సల్ 2020 టైటిల్‌కు దివిజ
ఆదిలాబాద్‌టౌన్: ఆమె ఓ నాట్యమయూరి.. తన ప్రదర్శనలతో అందర్ని ఇట్టే ఆకట్టుకుంటోంది.. తాను నృత్యం చేస్తే కనురెప్పలు తిప్పకుండా చూస్తుండిపోవాల్సిందే. లలిత కళలతో పాటు చదువుల్లో కూడా ముందంజలో ఉంది. కర్ణాటక సంగీతం, కూచిపుడి నృత్యం, వీణా, క్యాషియో, గిటార్ వాయించడంలో ఆమె మేటి అని చెప్పడం అతిశయోక్తి కాదు. చిన్ననాటి నుంచే కళల వైపు మొగ్గు చూపుతుండడంతో తల్లిదండ్రులు సైతం ప్రోత్సాహం అందిస్తున్నారు. తండ్రి మహేష్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తుండగా, తల్లి కవిత డ్యాన్స్ మాస్టర్‌గా ఉన్నారు. దీంతో తల్లి చిన్ననాటి నుంచే ఆమెకు కళలను నేర్పించడంతో గురువును మించిన శిశురాలిగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు అందుకుంది. దీంతో పలు అవార్డులతో పాటు గిన్నీస్‌బుక్ ఆఫ్ రికార్డు సాధించింది. యూనివర్సల్ మల్టీ ట్యాలెంట్‌కు ఎంపిక.. ఆదిలాబాద్ పట్టణంలోని బ్రాహ్మణవాడకు చెందిన దివిజ యూనివర్సల్ 2020 మల్టీ ట్యాలెంట్‌కు ఎంపికైంది. తానా, తెలుగు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకులు ఆమెను అభినందించారు. గత నెల 24, 25 తేదీల్లో ఆన్లైన్లో తానా, తెలుగు సాంస్కృతిక కార్యక్రమం ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఆస్ట్రేలియా, కువైట్, న్యూజిలాండ్, యూఎస్ఏతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. సౌందర్య లహరి నైపుణ్యాలు, కూచిపూడి, వీణా, గిటార్, క్యాషియో, తదితర రంగాలకు సంబంధించి 700మంది కళాకారులు పాల్గొన్నారు. అయితే మొదటి దశలో 25మందిని ఎంపిక చేశారు. వీరి ప్రదర్శనలు ఈ–మెయిల్ ద్వారా పంపారు. రెండో దశలో 25నుంచి 11మందిని ఎంపిక చేశారు. ఆ 11మందిలో దివిజ స్థానం సాధించింది. ప్రస్తుతం ఈమె డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. పలు రంగాల్లో ప్రావీణ్యం.. ♦2014లో హైదరాబాద్‌లోని గచ్చిబౌళిలో నిర్వహించిన సిలికాన్ ఆంధ్ర కూచిపుడి నృత్య సమ్మేళనంలో ప్రతిభ కనబర్చింది. వరల్డ్ గిన్నిస్‌బుక్‌లో రికార్డుకెక్కింది. ♦2016లో విజయవాడలో నిర్వహించిన సిలికాన్ ఆంధ్ర కూచిపుడి నృత్య సమ్మేళనంలో ప్రతిభ కనబర్చి మరోసారి గిన్నిస్‌బుక్‌లో రికార్డు సాధించింది. ♦2016లో గోదావరి పుష్కరాల్లో భాగంగా సరస్వతి దేవి పుణ్య క్షేత్రంలో స్వర సంగీత, శాస్త్రీయ నృత్య, కూచిపుడి నృత్య సమ్మేళన ప్రదర్శనతో ఆకట్టుకుంది. గోదావరి పుష్కర అవార్డును అందుకుంది. ♦2016లో జైనథ్‌లోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో నిర్వహించిన శాస్త్రీయ నృత్య పోటీల్లో ప్రతిభ కనబర్చి ప్రముఖ కవి సుద్దాల అశోక్‌తేజ చేతుల మీదుగా అవార్డు అందుకుంది. ♦2017లో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన శాస్త్రీయ నృత్య పోటీల్లో నాట్య కిరణం అవార్డును తమిళనాడు రాష్ట్ర గవర్నర్ రోశయ్య చేతుల మీదుగా అందుకుంది. ♦2017లో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించి ఏబీసీ ఫౌండేషన్, భారత్ ఆర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ కల్చరల్ ఫెస్టివల్లో తెలుగు వరల్డ్ రికార్డుకెక్కింది. ఆ అవార్డును లక్ష్మీపార్వతి చేతుల మీదుగా అందుకుంది. ఇలా చెప్పుకుంటుపోతే అనేక అవార్డులు ఆమె సొంతం.. చిన్ననాటి నుంచే ఇష్టంగా ముందుకు అమ్మ డ్యాన్స్ మాస్టర్ కావడంతో చిన్నప్పటి నుంచే నాకు లలిత కళలు అంటే ఇష్టం. నా ఇష్టాన్ని తెలుసుకొని అమ్మనాన్న ప్రోత్సాహం అందించడంతోనే ముందుకు సాగుతున్నాను. కరోనా నేపథ్యంలో తానా, తెలంగాణ సాంస్కృతి కార్యక్రమాలు ఆన్లైన్లో జరిగాయి. ఇందులో మల్టీ ట్యాలెంట్ టెస్ట్‌కు ఎంపికయ్యాను. ఆ సంస్థ వారు నన్ను అభినందించడం జరిగింది.– దివిజ -
పాలకూర పప్పు, పన్నీర్ రుచిగా వండుతా
సాక్షి, సిటీబ్యూరో: ఆ యువతిది రష్యా. మాస్కోలో బాలీవుడ్ డ్యాన్స్ చూసి ముచ్చట పడింది. భారతీయ సంప్రదాయ నృత్యాల గురించి తెలుసుకుంది. కథక్ నాట్యం పట్ల ఆకర్షితురాలైంది. జీవితాంతం కథక్ నృత్య కళాకారిణిగానే కొనసాగాలని నిశ్చయించుకుంది. 9 ఏళ్ల శిక్షణ తర్వాత తొలిసారిగా సోలో ప్రదర్శన ఇవ్వడానికి తాను నృత్యం నేర్చుకున్న హైదరాబాద్నగరానికి ఇటీవల వచ్చింది. ఆమె కథక్ నృత్యకారిణి కేథరిన్ క్రివెంకో. తొలి నాట్య ప్రదర్శన అనంతరం తన అనుభవాలను ‘సాక్షి’తో ఇలా పంచుకుంది. భారతీయ వంటలు నేర్చుకున్నా.. ఇండియాకు రాకముందు నాకు ఇంగ్లిష్ సరిగా రాదు. కొన్ని హిందీ పదాలు తప్ప ఎక్కువగా తెలియదు. ఇండియా వంటలు వండటం నేర్చుకున్నాను. పాలకూర పప్పు, పన్నీర్, ఎగ్ కర్రీ, బటర్ చికెన్, మేథీ చికెన్ నేర్చుకున్నాను. 2015లో త్యాగరాజ సంగీత కాలేజ్‌లో హిందుస్తానీ సంగీతం నేర్చుకున్నాను. విజయ్ మరార్ వీడియోల్లో పనిచేశాను. తెలంగాణ బతుకమ్మ వీడియోలో ఫ్రెండ్స్‌తో కలిసి కనిపిస్తాను. హైదరాబాద్.. సెల్ఫ్ సఫీషియెంట్.. ఇండియాలో అన్ని ప్రదేశాల కంటే హైదరాబాద్ అంటే ఇష్టం. ఇది నా హోం. ఈ సిటీ ఎందుకు ఇష్టమంటే.. ఇక్కడ ఏం తినాలన్నా లభిస్తుంది. మొఘలాయి, ఆంధ్రా, ఇటాలియన్, చైనీస్, జపనీస్ ఇలా అన్ని క్విజైన్ ఫుడ్స్ లభిస్తాయి. ఇక్కడ అనేక సంస్కృతులు ఉన్నాయి. సంప్రదాయ బద్ధమైన లైఫ్‌కి అవకాశం ఉంది. ఇక్కడ బస్సు, మెట్రో, ఆటోలో కూడా సులభంగా వెళ్లగలం. హైదరాబాద్‌లో భద్రత విషయంలో ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదు. నా వరకు హైదరాబాద్ బ్యూటీ సిటీ. రష్యన్స్ లైక్ లామకాన్.. కథక్ శిక్షణ పూర్తయిన తర్వాత కూడా మధ్య మధ్యలో ఇండియాకు వచ్చి వెళ్లేదాన్ని. స్నేహితులతో కలిసి నృత్య ప్రదర్శనలు ఇచ్చేదాన్ని. డిసెంబర్ 13న నా మొదటి సోలో ప్రదర్శన ఇచ్చాను. కళలకు, కళాకారులకు ఎంతో విలువనిచ్చే లామకాన్లోనే నా మొదటి సోలో ప్రదర్శన ఇవ్వటం నాకు ఎనలేని సంతోషాన్నిచ్చింది. బాలీవుడ్ డ్యాన్స్ బాగా పాపులర్.. కలర్‌ఫుల్ దుస్తులు, జాయ్‌ఫుల్‌గా ఉండటం వల్ల రష్యాలో బాలీవుడ్ డ్యాన్స్ చాలా పాపులర్. మా దేశంలో చాలా చోట్ల బాలీవుడ్ డ్యాన్స్ నేర్పించే సెంటర్లు ఉన్నాయి. 2010లో మాస్కోలోని ఓ స్కూల్లో బాలీవుడ్ డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్లాను. అప్పుడు నాకు ఇండియాలో క్లాసికల్ డ్యాన్సులున్నాయనే సంగతి తెలియదు. అక్కడ బేసిక్ కథక్ స్టెప్స్నేర్పించారు. 10– 15 నిమిషాలు కథక్ డ్యాన్స్ చూపించారు. నాకు చాలా నచ్చింది. అప్పుడు ఫ్రెండ్ ఇండియన్ అంబసీలో కథక్ నేర్పిస్తున్న సంగతి చెప్పింది. అలా కథక్ నాట్య గురువు రాఘవ్రాజ్ భట్ వద్ద ఏడాది పాటు కథక్ నృత్యంలో శిక్షణ పొందాను. తర్వాత ఆయన స్కాలర్షిప్ అప్లై చేసి ఇండియాలో కథక్ నేర్చుకోమ్మని సూచించారు. స్కాలర్‌షిప్‌తో ఇండియాకు వచ్చి ఆకృతి కథక్ కేంద్రంలో మంగళా భట్ వద్ద 2013– 16 వరకు కథక్ నేర్చుకున్నాను. బాలీవుడ్ సినిమాలు చూసేదాన్ని.. చిన్నప్పటి నుంచే నేను బాలీవుడ్ చిత్రాలు చూసేదాన్ని. అలా హిందీ భాష తెలుసు. కుచ్ కుచ్ హోతా హై, రబ్ దే బనాది జోడీ, దిల్ తో పాగల్ హై, దిల్, ఖయామత్ సే ఖయామత్ తక్ నా ఫేవరెట్ చిత్రాలు. మా అమ్మ హిందీ చిత్రాల వీడియో క్యాసెట్లు తీసుకువచ్చేది. రష్యాలో చాలా మంది బాలీవుడ్ చిత్రాలు చూస్తారు. ఇండియాకు వచ్చిన తర్వాతే.. ఇండియన్ డ్యాన్స్ అంటే బాలీవుడ్ డ్యాన్స్ అని అనుకునేదాన్ని.బాలీవుడ్ నృత్యాల్లో కథక్, కూచిపూడి, బాంగ్డా కలిపి ఉంటాయని తెలియదు. ఇండియాకు వచ్చిన తర్వాతే ఈ నృత్యాల గురించి తెలిసింది. బాలీవుడ్ డాన్స్‌తో పాటు భరతనాట్యం, కథక్, కూచిపూడి, మోహిని అట్టం కూడా ఇప్పుడు రష్యాలో విరివిగా నేర్చుకుంటున్నారు. ఇండియన్స్, ఇండియా నుంచి నేర్చుకుని వెళ్లిన వాళ్లు ఈ నృత్యాలు నేర్పిస్తుంటారు. 25 మందికి శిక్షణ ఇస్తున్నా.. ఎప్పటికీ కథక్ నృత్యం చేస్తుండాలని, శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాను. ప్రస్తుతం 25 మంది విద్యార్థులు నా వద్ద శిక్షణ పొందుతున్నారు. కథక్ సరదాగా నేర్చుకునే నృత్యం కాదు. ఈ నృత్యానికి ఆసక్తి, డిసిప్లిన్, శ్రద్ధ లేకపోతే కష్టం. నా దగ్గర కథక్ నేర్చుకుంటున్న వాళ్లలో 19 నుంచి 50 ఏళ్ల వయసున్న వాళ్లున్నారు. -
నాట్యంలో మేటి.. నటనలో సాటి
తల్లి కూచిపూడి నాట్యకారిణి.. తండ్రి గాయకుడు. తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకున్న వారి బిడ్డ శ్రవ్య మానస భోగిరెడ్డి 9 ఏళ్ల ప్రాయంలో కూచిపూడి నృత్యం నేర్చుకునేందుకు నడుంబిగించింది. నాలుగేళల్లో నాట్యంలో చక్కటి ప్రావీణ్యం సాధించి తనను తాను నిరూపించుకునేందుకు ప్రదర్శనలు ఇచ్చింది. ప్రతి వేదికపైనా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఓ పక్క నాట్యంలో నాట్యంలో పీహెచ్డీ చేస్తూనే.. సమాజంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై యువతను చైతన్యం చేసేందుకు స్వయంగా నాటికలు రాసి నటిస్తోంది. మరోపక్క శ్రావ్య మానస నాట్య గురువుగానూ ఇప్పుడు వందల మందికి శిక్షణనిస్తోంది. సాక్షి,సిటీబ్యూరో: మోతీనగర్‌కు చెందిన భోగిరెడ్డి శ్రీనివాస్, లలిత దంపతుల కుమార్తె శ్రవ్యమానస మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో డిగ్రీ, ఎంటెక్ పూర్తి చేసింది. అయితే, ఆమె చిన్నప్పటి నుంచి నాట్యంపై అమితాశక్తి ఉండడంతో అటువైపు అడుగులు వేసింది. ప్రస్తుతం హెచ్‌సీయూలో ప్రొఫెసర్ డాక్టర్ ఎం.ఎస్.శివరాజు పర్యవేక్షణలో డ్యాన్స్‌లో పీహెచ్డీ చేస్తోంది. కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్న సమయంలోనే వెస్ట్రన్ డ్యాన్స్ కూడా చేస్తుండేది. అలా 4వ తరగతిలో ఉన్నప్పుడు స్కూల్ వార్షికోత్సవంలో చేసిన డ్యాన్స్‌కు తొలిసారి బహుమతి అందుకోవడంతో డ్యాన్స్‌పై ప్రేమను పెంచుకుంది. ‘సుమధుర ఆర్ట్స్ అకాడమీ’ని స్థాపించి తను ప్రదర్శనలు ఇస్తూ.. మరో 200 మందికి నాట్యంలో శిక్షణనిస్తోంది. అంతేకాదు.. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలోప్రదర్శనలు ఇచ్చి అందరి మెప్పు పొందింది. మలేసియా, దుబాయ్‌లోనూ.. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ఆహ్వానం మేరకు కృష్ణా, గోదావరి పుష్కరాలకు శ్రవ్యమానస తన బృందంతో పుష్కరాల విశిష్టతను చెబుతూ కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చింది. నగరంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ ప్రదర్శనలు ఇచ్చారు. చిదంబరం, ఒడిశా, ఢిల్లీల్లో జరిగిన ఉత్సవాల్లోనూ తన నాట్యంతో మెప్పించింది. మలేసియాలో జరిగిన దసరా సంబరాలు, అబుదాబిలో ఉగాది, శ్రీరామనవమి వేడుకల్లో తన నాట్యంతో ఆ దేశాల్లోని తెలుగువారిని మంత్రముగ్ధులను చేసింది. మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టాలంటూ శ్రావ్య పలు నాటికలను స్వయంగా రూపొందించి çప్రదర్శనలు ఇస్తోంది. ఇటీవల రవీంద్రభారతిలో ‘నిర్భయ’, యాసిడ్ విక్టమ్ లక్ష్మి అగర్వాల్ పడిన వేదనను శ్రావ్య నటలో చూపిన తీరు ప్రేక్షకులను కన్నీరు పెట్టించింది. కేవలం స్త్రీ పాత్రల కాదు.. ‘శ్రీరాముడు, శివుడు, రావణుడు, మహావిష్ణు, శ్రీకృష్ణుడు’ తదితర పురుష పాత్రల్లోనూ చక్కగా ఒదిగిపోయింది. శ్రావ్య మానస తన నటన, నాట్యంతో ప్రతి వేదికపైనా సత్కారాలు, పురస్కారాలు సైతం అందుకుంది. మొదట్లో లైట్ తీసుకున్నా కూచిపూడి నాట్యాన్ని తొలుత సీరియస్‌గా తీసుకోలేదు.. అయితే ప్రదర్శనలు ఇచ్చేకొద్దీ వచ్చిన ప్రశంసలతో పట్టుదల పెరిగి ఇష్టంగా నేర్చుకున్నా. ఇప్పుడే నేనే గురువుగా వందల మందికి నాట్యం నేర్పుతున్నాను. నా శిష్యులు కూడా ఎంతో పట్టుదలగా నాట్యం నేర్చుకుంటుండడంతో ఈ రంగంపై భక్తిభావం పెరిగింది. – శ్రవ్యమానస భోగిరెడ్డి -
ఈ తెలుగు – ఆ తమిళం
తమిళనాడులో స్థిరపడిన తెలుగు ప్రొఫెసర్... డాక్టర్ ప్రభు కుమారి వనమా. తెలంగాణ సంస్కృతి మీద ఆమె అధ్యయనం చేశారు.తమిళ జానపద నృత్యాలు,తెలంగాణ సాంస్కృతిక కళల మధ్య భావసారూప్యతలపై విస్తృతమైన పరిశీలన జరిపారు.తమిళ మహిళ ‘తమిళిసై’ తెలుగు రాష్ట్రానికి గవర్నర్‌గా వచ్చిన సందర్భంలో... ఈ రెండు ప్రాంతాల సాంప్రదాయిక బాంధవ్యం గురించి సాక్షితో ముచ్చటించారు. డాక్టర్ ప్రభుకుమారి పుట్టింది విజయవాడలో, బాల్యం హైదరాబాద్‌లో గడిచింది. తర్వాత తమిళనాడు బాట పట్టింది వాళ్ల కుటుంబం. సంగీతం, నాట్యం ఆమెకు రెండు కళ్లు. తనకు ఇష్టమైన కళలను కొనసాగించడం కోసమే ఆమె చరిత్ర, పర్యాటక రంగాల్లో అధ్యాపక వృత్తిని ఎన్నుకున్నారు. సరిగమల గురువు అమ్మ ‘‘మా అమ్మ జ్ఞాన ప్రసూన గాయని, కర్ణాటక, హిందూస్తానీ సంగీతంలో నిష్ణాతురాలు. సినిమాల్లో నేపథ్య గాయని. నాన్న పుల్లారావు ఫార్మాసుటికల్ కంపెనీ నిర్వహించేవారు. నన్ను కళారంగంలో అత్యున్నత స్థాయిలో చూడాలనేది మా అమ్మ కోరిక. అందుకోసమే మా కుటుంబం చెన్నైకి మారింది. అమ్మ స్వయంగా నాకు కర్నాటక, హిందూస్తానీ సంగీతంలో సరిగమలు నేర్పించారు. హైదరాబాద్‌లో ఉన్న కాలంలో భరతనాట్యం, కూచిపూడి కథక్‌తోపాటు జానపద నృత్యాలు నేర్చుకున్నాను. జానపద నృత్యంలో... నేను సంగీతానికి అనుగుణంగా అడుగులు వేయడం వరకే పరిమితమైపోయి ఉంటే నా ప్రయాణం ఒక ‘కళాకారిణి’ అనే మైలురాయి దగ్గరే ఆగిపోయేది. జానపద నృత్యాలకు ఆధారమైన సాహిత్యం మీద నాకు కలిగిన మమకారమే నన్ను అధ్యయనకారిణి చేసింది. వీటితోపాటు తబలా, హార్మోనియం, తంబూరా, మృదంగం నేర్చుకోవడం మీద ఆసక్తి కలిగింది. నేను ఎప్పుడు దేని మీద ఇష్టాన్ని కనబరిస్తే వెంటనే అందులో శిక్షణ ఇప్పించేది మా అమ్మ. ప్రతి రంగంలో మేటి అయిన గురువుల దగ్గర శిక్షణ ఇప్పించింది. కూచిపూడి, భరతనాట్యం సుమతీ కౌశల్ గారి దగ్గర నేర్చుకున్నాను. అంజుబాబు గారి శిక్షణలో కథక్, ఫోక్ డాన్సులు నేర్చుకున్నాను. ఆ తర్వాత బెనాసర్లో విజయశంకర్ గారి దగ్గర కథక్‌లో ప్రావీణ్యం సాధించగలిగాను. ప్రతి కళనూ దాని మూలాల వరకు వెళ్లి అధ్యయనం చేయాలనే కోరిక... ఈ రోజు నన్ను ప్రపంచదేశాలకు పరిచయం చేసింది. జనాన్ని కలిపేది జానపదాలే జానపద గేయాలు సాధారణంగా బృందగానాలే అయి ఉంటాయి. జానపద నృత్యాలను కూడా సామూహికంగానే చేస్తారు. జన సామాన్యాన్ని ఒక త్రాటి మీదకు తీసుకువచ్చే మాధ్యమాలివి. ముఖ్యంగా తమిళనాడు – తెలంగాణ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధం చాలా బలమైనదనే చెప్పాలి. భావసారూప్యాల విశ్లేషణ చేస్తే... రెండు సంప్రదాయాలు కూడా ప్రకృతి మీద ఆధారపడి మనిషి జీవికను నిర్మించుకున్నవే అని తెలుస్తుంది. తెలంగాణలో బోనాలు అని చేస్తారు. ఈ వేడుకలో భక్తులు అమ్మవారికి పసుపు నీటిని చల్లుతూ భోజనాన్ని సమర్పిస్తారు. తమిళనాడులో చేసే ‘కరగాట్టం’ వేడుకలో కూడా కుండ తల మీద పెట్టుకుని నృత్యం చేస్తూ దేవుడికి ఆహారం, నీటిని సమర్పిస్తారు. రెండు వేడుకల్లోనూ ఘటాన్ని తల మీద పెట్టుకుని లయబద్ధంగా డాన్స్ చేయడమే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ కోలాటం– అక్కడ కోలాఠం తెలుగు రాష్ట్రాల్లో కోలాటం బాగా ప్రసిద్ధి. ఇదే ఆట తమిళనాడులోనూ ఉంది. అయితే అక్కడ ‘కోలాఠం’ అని ఠని ఒత్తి పలుకుతారు. ఆటంతా దాదాపుగా ఒకటే. ప్రత్యేకంగా ఆడపిల్లలకు నేర్పిస్తారు. తమిళనాడులో కోలాఠం ఆడడానికి ప్రత్యేకంగా పండుగలేవీ అక్కర్లేదు. ఆడవాళ్లు పనులు లేని సమయంలో ఆటవిడుపుగా కోలాఠం ఆడుకుంటారు. ఇక తెలంగాణలో మహిళలు ప్రధానంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలాంటిదే తమిళనాడులో ‘కుమ్మి’. ఆంధ్రప్రదేశ్‌లో గొబ్బెమ్మ ఆడినట్లన్న మాట. బతుకమ్మ అమరికలో పూలే ప్రధానంగా ఉంటాయి. గొబ్బెమ్మ ఆటలో, కుమ్మి ఆటలో ముగ్గు వేసి మధ్యలో పూలను అమర్చి చుట్టూ తిరుగుతూ ఆడుతారు. బతుకమ్మ అయినా, గొబ్బెమ్మ అయినా, కుమ్మి అయినా... అలంకరించే పూలలోనే ఉంది అసలు రహస్యం. బతుకమ్మను అలంకరించే పూలు కానీ, కుమ్మి ఆట కోసం ముగ్గు మధ్య అమర్చే పూలు... ఆడవాళ్లు జడలో పెట్టుకోని పూలే. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. మనదేశంలో పూచే ప్రతి పువ్వూ ఔషధగుచ్ఛమే. ఈ వేడుకలు జడలో పెట్టుకోని పూలలో ఉన్న ఔషధగుణాలను దగ్గర చేస్తాయి. గొప్ప బంధం సాంస్కృతికంగా తమిళనాడుకి తెలుగు రాష్ట్రాలకు విశ్వాసాల పరంగా కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. మహాభారతం, రామాయణం వంటి పౌరాణిక ఇతిహాసాల ఇతివృత్తాలతో మనం వీధి భాగవతాలు చెప్పుకుంటాం. వాటిని తమిళనాడులో తేరుకూట్ అంటారు. తమిళనాడు, తెలంగాణలు కల్చర్‌ను చాలా బాగా కాపాడుకుంటున్నాయి. ఏపీలో గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పోవడం, ఆధునికత వైపు పరుగుల మధ్య సంస్కృతి పరిరక్షణ కుంటుపడుతోంది. సంప్రదాయం– సాధికారత మనదేశం గత కొన్ని దశాబ్దాలుగా మహిళ సాధికారత కోసం ఎన్నో ఉపాధి మార్గాలను చూపిస్తోంది, శిక్షణనిస్తోంది. అన్నింటికంటే పెద్ద ఉపాధి మార్గం మన సంప్రదాయ జానపద నృత్యంలోనే ఉంది. కల్చరల్ టూరిజం ద్వారా ప్రధానంగా మూడు అంశాలు అభివృద్ధి చెందుతాయి. స్థానిక సంప్రదాయాన్ని అంతరించి పోకుండా కాపాడుకోగలగడం సాధ్యమవుతుంది. కళారీతులను మెరుగుపరుచుకోవడంలో సృజనాత్మకత మెరుగుపడుతుంది. మూడవది టూరిజానికి నిరంతరతను సాధించడం. టూరిజానికి నిరంతరత అని ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... ఎంత గొప్ప టూరిస్ట్ స్పాట్ అయినా సరే... ఒక ప్రదేశానికి ఒకసారి వెళ్లిన వాళ్లు సాధారణంగా మళ్లీ వెళ్లరు. కల్చరల్ టూరిజమ్ అలా కాదు. స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా వేడుకలు జరుగుతుంటాయి. ఒక్కో వేడుకలో ఒక్కో రకమైన సాంస్కృతిక కళల ప్రదర్శన జరుగుతుంటుంది. దాంతో ఒక టూరిస్టు... ఒక ప్రదేశానికి మళ్లీ మళ్లీ రావడానికి అవకాశాలు పెరుగుతాయి. ఒక టూరిస్ట్ రావడం వల్ల ఆదాయం వచ్చేది ఆ కళా ప్రదర్శనకు మాత్రమే కాదు. ఆ టూరిస్ట్ బస, భోజనాల కోసం హోటల్, రెస్టారెంట్ వ్యాపారాలు పెరుగుతాయి. అక్కడి ప్రత్యేకమైన వస్తువులను కొంటారు కాబట్టి హస్తకళాకృతుల అమ్మకాలు పెరుగుతాయి. అందుకే మహిళల ఆర్థిక స్వావలంబనకు మన సంప్రదాయ కళలను మించిన మార్గాలు మరేవీ ఉండవనే చెప్తాను. మన ఆట, పాట, హస్తకళ... ప్రతిదీ మనకు అన్నం పెట్టే వనరే. ఆర్థిక స్వావలంబనకు పెద్ద ఆలంబన మన ఫోక్ ఆర్ట్స్. వృత్తి– ప్రవృత్తి నేను చదివిన కోర్సు ఎంపిక నా అభిరుచికి అనుగుణంగా జరిగింది. అందుకే వృత్తి ప్రవృత్తి ఒకటిమిళితమై పోయాయి. ఒక తబలా వాదన, ఒక కథక్ ప్రదర్శన, శాస్త్రీయ– జానపద సంప్రదాయ కళలను పాఠంగా చెప్పడం... ప్రతిదీ సంతోషాన్నిచ్చే అంశాలే అయ్యాయి. ఇవన్నీ నన్ను విదేశాల్లో మన సాంస్కృతిక ప్రదర్శనల వైపు, పుస్తక రచన వైపు నడిపించాయి. ఇక నేను ఎడిటర్‌గా మరో అవతారం ఎత్తడానికి కారణం కూడా భారతీయ సంప్రదాయం, సంస్కృతి, సాంస్కృతి కళల ప్రచురణ కోసమే. మెడికల్, హోటల్, సినిమా ఇండస్ట్రీ తమ రంగాల కోసం జర్నల్స్ నడుపుతున్నాయి. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయం, పర్యాటకం కోసం ఒక పత్రిక రూపకల్పన చేశాను. మనదేశం గురించి తెలుసుకోవాలనుకునే విదేశీయులకు ఇది బాగా ఉపయోగపడుతోంది’’ అని చెప్పారు ప్రభుకుమారి. తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు అమ్మానాన్నలతో కలిసి సాంస్కృతిక పత్రిక కాపీని అందచేస్తున్న ప్రభుకుమారి సమాజమే పెద్ద పాఠశాల ప్రభుకుమారి వనమా చెన్నైలోని భారతి ఉమెన్స్ కాలేజ్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టారికల్ స్టడీస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్. ఆమె ఎంఏ, ఎమ్టిటిఎమ్, ఎమ్‌ఫిల్, డబుల్ పీహెచ్డీ. తమిళ్ లిటరేచర్‌లో డిప్లమో, సిటిజెన్స్ లీగల్ రైట్స్‌లో డిప్లమో, డీలిట్ చేశారు. ప్రస్తుతం జానపద కళల మీద విస్తృతంగా పరిశోధన చేస్తున్నారు. భారతీయ సంప్రదాయ కళల పరిరక్షణ కోసం చెన్నైలో ‘వనమా ఆర్ట్, ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్’ను నిర్వహిస్తున్నారు. భారతీయ సంస్కృతి, చరిత్ర పరిశోధనాంశాల మీద రీసెర్చ్ చేసే పరిశోధక విద్యార్థుల కోసం ‘బై యాన్యువల్ జర్నల్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్, కల్చర్, హెరిటేజ్ అండ్ టూరిజమ్’ (జెఐఏసిహెచ్టి) పేరుతో జర్నల్ను నడుపుతున్నారు. పరిశోధనలు, జానపద కళల కోసం ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా ‘ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గారి చేతుల మీదుగా ‘కంట్రీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ నుంచి ‘బాల సహ్యోగ్ అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ పురస్కారం అందుకున్నారు. చంఢీఘర్‌లో హిస్టరీ అండ్ టూరిజమ్ నిర్వహించిన సదస్సులో బెస్ట్ అకడమీషియన్ అవార్డు అందుకున్నారు. ‘ఉమెన్ స్టడీస్ అండ్ సోషల్ సైన్సెస్’ అంశం మీద ఆమె ప్రసంగించారు. ఆమె సూచించిన అనేక అంశాలను ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలుగా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది. ‘‘మనం అక్షరాలు నేర్చుకుని, పుస్తకాలతో చదవడం ద్వారా విజ్ఞానాన్ని సొంతం చేసుకోగలుగుతున్నాం... అని అనుకుంటాం. కానీ అక్షరాలు, పుస్తకాలు కేవలం మనకు విజ్ఞానాన్ని అందించే మాధ్యమాలు మాత్రమే. మనం నిజంగా నేర్చుకునేది సమాజం నుంచే’’ అంటారు ప్రభుకుమారి. ‘‘ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారిన నేపథ్యంలో జ్ఞానం... ఏదో ఒక మారుమూల అలా ఉండిపోవడం లేదు. ఒక మూల నుంచి మరో మూలకు సులువుగా చేరుతోంది. ఒకరి కల్చర్ మీద మరొకరికి ఆసక్తి పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో మన కల్చర్ మనకు అన్నం పెట్టే మాధ్యమం అవుతోందని మాత్రం మర్చిపోవద్దు’’ అన్నారు ప్రభుకుమారి.– వాకా మంజులారెడ్డి -
అభినయ శిల్పం
‘‘నాట్యం కేవలం కళగా మాత్రమే కనిపిస్తుంది. కానీ అది ఒక మాధ్యమం. నిరంతర ప్రవాహం. నాట్యం మన భారతీయ సంస్కృతికి దర్పణం మాత్రమే కాదు, నాట్యం ద్వారా మనం సోషల్ సైన్స్ నేర్చుకుంటాం. మనిషి వికాసాన్ని ప్రతిబింబించే పాఠాలు ఇందులో ఉన్నాయి’’ అంటోంది నాట్యవేదిక మీదకు రంగ ప్రవేశం చేయబోతున్న పద్దెనిమిదేళ్ల ప్రకృతి ప్రశాంత్. గుజరాతీ కుటుంబం ప్రకృతి తండ్రి ప్రశాంత్‌ది నాలుగు తరాల కిందట హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన గుజరాతీ వ్యాపార కుటుంబం. ఆమె తల్లి ప్రతీక్షకు భరతనాట్యంలో ప్రవేశం ఉంది. శాస్త్రీయ నాట్యం పట్ల ప్రతీక్షకు ఉన్న ఆసక్తి... ప్రకృతికి కూచిపూడిని పరిచయం చేసింది. కూచిపూడి నాట్యకారిణి యామినీ రెడ్డి శిష్యరికంలో ప్రకృతి కూచిపూడి అడుగులు వేసింది. ఎనిమిదేళ్ల వయసులో మొదలైన నాట్యముద్రలు ఇప్పుడు రంగప్రవేశం చేయడానికి సిద్ధమయ్యాయి. పరిణామ క్రమం ‘‘నాట్యసాధన ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ప్రదర్శనలో తొలి అంశం గణేశ ప్రార్థన ఉంటుంది. అంటే... మనం మొదలు పెట్టిన పనికి అంతరాయాలు ఎదురవకుండా సజావుగా సాగేలా చేయమని వినాయకుణ్ని కోరుకోవడం. ఇందులో... మన పని విజయవంతంగా పూర్తి కావాలని మనకు మనం సంకల్పం చెప్పుకోవడం ఉంది. మనల్ని మనం పాజిటివ్‌గా మలుచుకోవడమన్నమాట. ఇక దశావతారాల ప్రదర్శన... ప్రాణి పుట్టుక నుంచి మనిషిగా పరిణామం చెందిన విధానాన్ని చెప్తుంది. ప్రాణి సంచారం మొదట నీటిలో మొదలై తర్వాత నేలమీదకు పాకిన తీరును ప్రతిబింబిస్తుంది. ప్రాణి సంచారం నుంచి క్రమానుగతంగా సాగిన మనిషి వికాసాన్ని తెలియచేస్తుంది. మనిషి ఉపయోగించిన ఉపకరణాల ద్వారా ఆదిమ మానవుడి నుంచి ఆధునిక మానవుడిగా అభివృద్ధి చెందిన వైనం తెలుస్తుంది. చారిత్రక మీరా మీరాబాయి పాత్రను అభినయించడం అంటే చరిత్రను చదవడమే. రాజపుత్ర కుటుంబాల నేపథ్యంతోపాటు మొఘలు పాలకులను తెలుసుకుంటాం. ఇంకా... ఆధ్యాత్మికతలో ఇమిడి ఉన్న నవవిధ భక్తి మార్గాల గురించి తెలుస్తుంది. ఇందులో నేను ప్రదర్శిస్తున్న ‘తారణ’ హిందూస్తానీ సంగీతం ఆధారంగా కూర్చిన రూపకం. పండిట్ రవిశంకర్ భరతనాట్యంలో కంపోజ్ చేసిన తారణకు మా గురువు (యామినీరెడ్డి) గారి తల్లిదండ్రులు రాజారెడ్డి, రాధారెడ్డి కూచిపూడిలో రూపొందించారు. ఇలాంటి కంపోజిషన్స్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రాంతాల మధ్య సమైక్యతను కూడా ఒంటపట్టించుకుంటాం. ప్రాంతాల వారీగా అనేక సాహిత్యాలు నాట్యంలో ఇమిడిపోతాయి. సాహిత్యంలో దాగిన తత్వం అలవడడానికి నాట్యసాధన ఓ మార్గం. 14వ శతాబ్దపు అమిర్ ఖుస్రూ సాహిత్యంలోని సూఫీ తత్వాన్ని ప్రేక్షకులకు చేరవేస్తోంది నాట్యం. సాహిత్యం అక్షరాస్యులకు పండితులకే పరిమితం, పామరులకు, నిరక్షరాస్యులకు చేరే మార్గం నాట్యం. అందుకు ప్రతిరూపమే ‘చాప్ తిలక్’.పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అన్ని వయసుల వాళ్లూ ఎంజాయ్ చేసే ప్రదర్శన ‘తారంగం’. ఈ రూపకాన్ని ఇత్తడి పళ్లెం అంచుల మీద చేస్తాం. నాట్యసాధనతో దేహంలోని నాడీ వ్యవస్థ చైతన్యవంతమవుతుంది. నాట్యం గొప్ప సైన్స్ మాత్రమే కాదు. శారీరకంగానూ, మానసికంగానూ సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే సాధనం. ఈ ఆదివారం (జూలై 21) శిల్పకళావేదిక (హైదరాబాద్, హైటెక్ సిటీ)లో రంగప్రవేశం ప్రదర్శన ఇస్తున్నాను. ఇందులో గణేశ ప్రార్థన, దశావతారాలు, మీరా భజన్, తారణ, చాప్ తిలక్, తారంగం ఆరు అంశాలను ప్రదర్శిస్తున్నాను’’ అని వివరించింది ప్రకృతి. వినయమే భూషణం మా అమ్మాయి స్కూల్ రోజుల్లో టామ్ బాయ్‌లా ఉండేది. కానీ ఎంతో మృదువుగా, వినయంగా మాట్లాడుతుంది. తనలో నాకు బాగా నచ్చేది ఆ వినయమే. తను ఆటలాడుతున్నప్పుడు ధైర్యానికి ప్రతిరూపంగా కనిపిస్తుంది, డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ముకుళించుకున్న మొగ్గలా కనిపిస్తుంది. ‘నాట్య తరంగిణి’ డాన్స్స్కూల్ ప్రకృతిని సమగ్రంగా తీర్చిదిద్దింది.– ప్రతీక్ష, ప్రకృతి తల్లి నాట్య నిర్మాణం ముంబయిలోని కమలా రహేజా విద్యానిధి స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో సీటు వచ్చింది. ప్రతి శని, ఆదివారాల్లో హైదరాబాద్‌కి వచ్చి డాన్స్ క్లాసులకు హాజరవుతాను. మా గురువుల కుటుంబమే నాకు స్ఫూర్తి. వారిలాగానే డాన్స్ కోసం జీవితాన్ని అంకితం చేయాలనుకుంటున్నాను. ఆర్కిటెక్చర్ కోర్సు పూర్తయ్యేటప్పటికీ నా ఆలోచనలకు కొత్తరూపు వస్తుంది. ఇంటిని చూడగానే ఇది నాట్యకారుల ఇల్లు అనిపించేలా డిజైన్ చేయగలగాలనేది నా కోరిక.– ప్రకృతి,కూచిపూడి నాట్యకారిణి ఆలోచనలకు ఆకృతి ప్రకృతి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నీరజ్ పబ్లిక్స్కూల్లో చదివింది. టెన్నిస్ బాగా ఆడేది. స్పోర్ట్స్ పర్సన్ అవుతుందనుకున్నారు తల్లిదండ్రులు. స్కూల్లో మూడు సబ్జెక్టుల్లో టాపర్‌గా ఉంటూ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లోనూ చురుగ్గా ఉండేది. స్కూల్ హెడ్ గర్ల్ బాధ్యతలను కూడా సమర్థంగా నిర్వర్తించింది. చిరక్లో ప్లస్‌టూలో 94 శాతం తెచ్చుకుంది. ప్రకృతి కెరీర్ ప్లాన్స్ గురించి మాట్లాడుతూ... ‘‘ఈ తరం పిల్లలు తమ కెరీర్‌ని తమకు తామే నిర్ణయించుకోగలుగుతున్నారు. తల్లిదండ్రులమనే హోదాలో అమ్మానాన్నలు తమ ఇష్టాలను పిల్లల మీద రుద్దడం సరికాదు. పైగా ఈ తరం పిల్లలు తల్లిదండ్రులకు అ అవకాశం ఇవ్వడం లేదు కూడా. టెన్త్ క్లాస్ వరకు నేను చూసిన ప్రకృతి వేరు, ప్లస్ వన్, ప్లస్ టూలో నేను చూసిన ప్రకృతి వేరు. ఆ రెండేళ్లలో తన కెరీర్ మీద ప్రకృతికి స్పష్టమైన ఆకృతి వచ్చింది. ఫైనల్ ఎగ్జామ్స్ సమయంలో కూడా డాన్స్ క్లాసులకు వెళ్లేది. డాన్స్ తనకు స్ట్రెస్ బస్టర్‌గా ఉంటుంది. డాన్స్‌కు దూరం కానని చెప్పేసింది. అలాగే డాన్స్ కోసం చదువుకు దూరం కానని కూడా చెప్పింది. ప్లస్ టూ సెలవుల్లో మూడు నెలల పాటు ఢిల్లీలో ఉండి రంగప్రవేశానికి ప్రాక్టీస్ చేసింది. పెద్దల ఆశీర్వాదం కోసం వేదిక మీదకు వస్తోంది. ప్రకృతి మా ఇంట్లో తొలితరం కళాకారిణి’’ అన్నారు ప్రతీక్ష ఉద్వేగంగా.– వాకా మంజులారెడ్డి -
ఛార్మి నృత్య గీతానికి ధీటుగా నర్తనం..
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: భరత వేదముగా.. నిరత నాట్యముగా.. అంటూ పౌర్ణమి సినిమాలో కథానాయకి ఛార్మి చేసిన నృత్య గీతం సంగీతాభిమానులనే కాదు.. నాట్యాభిమానులను ఉర్రూతలూగిస్తుంది. ఈ నృత్య గీతికలో ఛార్మి ప్రదర్శించిన నాట్య హోయలు.. నాట్య భంగిమలు.. అభినయాలకు ఏ మాత్రం తీసిపోకుండా సినిమాల్లో ఆ నృత్యాన్ని తిలకిస్తున్నామన్న అనుభూతిని అమలాపురానికి చెందిన ఓ నాట్య మయూరి తన ప్రదర్శనలతో కలిగిస్తోంది. తలపైన... రెండు అరచేతుల్లో అగ్ని కీలలతో మండతున్న ముంతలను ఉంచుకుని నాట్యమాడే ఆ ఎనిమిది నిమిషాల గీతానికి ఈ నర్తకి నయన మనోహరంగా నాట్యం చేస్తుంది. అమలాపురంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న అడపా శ్రీలక్ష్మి గత ఎనిమిదేళ్లలో అనేక నృత్య ప్రదర్శనలతో ఎంతో పేరు తెచ్చుకుంది. తన పదో ఏట నుంచే నృత్యం వైపు నడక మొదలు పెట్టింది. ఫ్రెంచి యానానికి చెందిన నాట్య గురువు నల్లా హైమావతి వద్ద నాట్యం నేర్చుకుంది. జిల్లాలో ఎక్కడ నృత్య పోటీలు ఏర్పాటు చేసినా. ఏదైనా సభలు, వేడుకలు జరిగినా ఆరంభంలో శ్రీలక్ష్మి నృత్య ప్రదర్శన విధిగా ఉంటుంది. శ్రీలక్ష్మి తల్లిదండ్రులు అడపా శ్రీమన్నారాయణ, మల్లేశ్వరి కూడా ఆమె అభీష్టానికి బాసటగా నిలిచి ప్రోత్సహించారు. ఓ సారి తన నృత్య ప్రదర్శనను ఆద్యంతం తిలకించిన సినీ నటుడు కృష్ణంరాజు దంపతులు శ్రీలక్ష్మిని అభినందించి ఆశీర్వదించారు. పౌర్ణమి సినిమాలో ‘భరత వేదముగా...నిరత నాట్యముగా’ నృత్య గీతికను ప్రదర్శిస్తే ప్రేక్షకుల నుంచి హర్షధ్వానాలు.. బహుమతుల పంటలు పరిపాటి. శ్రీలక్ష్మికి నృత్యంతో పాటు ఇటీవల కాలంలో సినిమాల్లో నటించాలన్ని కోరిక కూడా తోడైంది. సినీ ఆర్టిస్ట్ కావాలన్న లక్ష్యంతో కోనసీమలోని ఔత్సాహిక సినీ కళాకారులకు వేదికగా ఇటీవల ఏర్పాటైన కోనసీమ ఫిలిం క్లబ్లో శ్రీలక్ష్మి సభ్యత్వాన్ని పొంది ఏదైనా సినిమాలో అవకాశం వస్తే అల్లుకుపోయేందుకు సిద్ధంగా ఉంది. నర్తకిగా కీర్తిని సాధించాలని.. నటిగా సినిమాల్లోకి వెళ్లాలన్న ఆమె లక్ష్యాలు నెరవేరాలని ఆశిద్దాం. -
రెక్కలు తొడిగి రివ్వున ఎగిరి..
ఆమె కలల ప్రపంచాన్ని జయించింది.. వినువీధిలోవిహరించింది.. రెక్కలు తొడిగి.. రివ్వున ఎగిరింది.. గ‘ఘన’ విజయం లిఖించింది.. ఆమే నగరానికి చెందిన మొట్టమొదటి పైలట్ షోమాసూర్. 2001లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో కోపైలట్‌గా ప్రస్థానం ప్రారంభించి పైలట్‌గా ఎదిగింది. పైలట్‌గా 17 ఏళ్లుగా సేవలందిస్తున్న షోమాసూర్.. గొప్ప నృత్యకారిణి కూడా. భరతనాట్యంలో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ అందుకుంది. ‘ఇది అమ్మ నాకిచ్చిన బహుమతి. అనునిత్యం ఆమె నాకు అండగా నిలిచింది. ఎంతో ప్రోత్సహించింది. నేనీ స్థాయిలో ఉండడానికి కారణం మా అమ్మే’ అని చెబుతున్న షోమాసూర్ ప్రస్థానం ఆమె మాటల్లోనే... సాక్షి, సిటీబ్యూరో :మా స్వస్థలం పశ్చిమబెంగాల్. మా కుటుంబం చాలా ఏళ్ల క్రితమే హైదరాబాద్‌లో స్థిరపడింది. నేను ఇక్కడే పుట్టిపెరిగాను. నాన్న దిలీప్కుమార్సూర్. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌గా పని చేశారు. అమ్మ చందనాసూర్ గృహిణి. అన్నయ్య డాక్టర్ రాజన్సూర్ టొరంటోలో కేన్సర్ వైద్య నిపుణుడు. చదువంతా సిటీలోనే సాగింది. ఉస్మానియా వర్సిటీలో బీఈ పూర్తి చేశాను. ఆ సమయంలోనే పైలట్ కావాలనే నా ఆశయాన్ని అమ్మానాన్నల ముందుంచాను. నాన్నయితే ఎట్టిపరిస్థితుల్లోనూ వద్దన్నారు. ‘నువ్వు అమ్మాయివి కదా.. చాలా కష్టాలు ఉంటాయి. వద్దులే’ అన్నారు. ఆయన ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీర్ కదా.. ఆ రంగంలో ఉండే ఇబ్బందులు ఆయనకు తెలుసు. అందుకే ఆ మాటన్నారు. కానీ అది నా కల. నా కలలకు ఊపిరిలూది నన్ను పైలట్‌గా నిలబెట్టిన ఘనత మాత్రం మా అమ్మదే. అమ్మ పట్టుదలతో నన్ను పైచదువులకు ప్రోత్సహించారు. శిక్షణనిప్పించారు. అమ్మ ప్రోద్బలంతో నాన్న దిగిరాక తప్పలేదు. బేగంపేట్‌లోని ఏపీ ఫ్లైయింగ్ క్లబ్లో ప్రాథమిక శిక్షణ తీసుకున్నాను. ఆ తర్వాత జర్మనీలో శిక్షణ పొందాను. 2001 జనవరి 8న నా కల సాకారమైంది. ఎయిర్ ఇండియా (ఇండియన్ ఎయిర్‌లైన్స్) ‘ఎయిర్‌బస్–320’లో ఎయిర్ కమాండర్ ట్రైనింగ్ కెప్టెన్‌తో పాటు కో–పైలట్‌గా విధుల్లో చేరాను. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే పూర్తిస్థాయి పైలట్ (ఎయిర్‌కమాండర్)గా బాధ్యతలు చేపట్టాను. 2016 వరకు ఎయిర్‌బస్–320పైలట్‌గా పని చేశాను. ప్రస్తుతం ఎయిర్ ఇండియాకే చెందిన డ్రీమ్‌లైనర్ ‘బోయింగ్–787’ పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. ప్రయాణం... ఓ సాహసం లండన్, ప్యారిస్, రోమ్, కోపెన్హెగన్, సింగపూర్, బ్యాంకాక్, జపాన్, ఆస్ట్రేలియా... ఇలా విధి నిర్వహణలో భాగంగా ప్రపంచంలోని చాలా నగరాలు చుట్టేశాను. పైలట్ జీవితం ప్రతిక్షణం సాహసమే.. ప్రకృతితో నిరంతర పోరాటమే. టేకాఫ్ అయ్యేటప్పుడు ఉన్న వాతావరణం ల్యాండ్ అయ్యేటప్పుడు ఉండదు. ఏ దేశంలో ఎలాంటి వాతావరణం ఉంటుందో తెలియదు. ఇండియా నుంచి బయలుదేరే సమయంలో చాలా ఆహ్లాదంగా ఉంటుంది. కానీ గమ్యస్థానానికి చేరే సమయానికి దట్టమైన పొగమంచు ఉండొచ్చు. జోరుగా వర్షం పడొచ్చు. అప్పుడు ఏమీ కనిపించదు. ల్యాండింగ్ కష్టమవుతుంది. వందలాది ప్రయాణికులతో వేల కిలోమీటర్లు సాగిన ప్రయాణం ఒక ఎత్తైతే.. విమానం ల్యాండింగ్ ఒక ఎత్తు. అందుకే ప్రతి క్షణం చాలెంజింగ్‌గా ఉంటుంది. సాంకేతిక అంశాల్లోనూ శిక్షణ ఉంటుంది. అకస్మాత్తుగా సమస్యలు తలెత్తినప్పుడు సరిదిద్దుకొనే పరిజ్ఞానం తప్పనిసరి. ఒకసారి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నాను. ఇంజిన్‌లో సమస్య తలెత్తింది. అప్పటికప్పుడు మరమ్మతులు చేసుకొని తిరిగి ఢిల్లీకి వెళ్లాను. బహుశా ఆ సమయంలో 150 మందికి పైగా ప్రయాణికులు ఉండొచ్చు. విభిన్న జీవనం... పైలట్ జీవనశైలి చాలా భిన్నంగా ఉంటుంది. వారానికి కనీసం 35 గంటల డ్యూటీ ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ, అక్కడి నుంచి లండన్, తిరిగి దుబాయ్ లేదా బ్యాంకాక్... ఇలా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లాల్సి రావొచ్చు. దీంతో భిన్నమైన జీవనశైలి తప్పదు. లండన్‌లో ఉదయం 8:30 గంటలకు బ్రేక్‌ఫాస్ట్ టైమ్. కానీ మనకు అది మధ్యాహ్నం ఒకటిన్నర లంచ్ టైమ్. రాత్రి 11గంటలకు హైదరాబాద్‌లో ఇంటి నుంచి బయలుదేరి 2గంటలకు ఢిల్లీకి చేరుకుంటాను. అక్కడి నుంచి ఏ ప్యారిస్కో వెళ్లాలి. అప్పుడక్కడ అకస్మాత్తుగా వాతావరణం మారిపోతుంటుంది. అలా నిద్రపోవాల్సిన సమయంలో మెలకువగా.. మెలకువగా ఉండాల్సిన వేళల్లో నిద్రపోవడం తప్పదు. పూర్తిగా ప్రకృతికి భిన్నంగా సాగే పయనమిది. కానీ ఇందులో సంతృప్తి ఉంటుంది. విభిన్న నగరాల సంస్కృతులు, జీవన విధానాలు ప్రతక్యక్షంగా చూడొచ్చు. ఇప్పటివరకు 15వేల గంటలు విధులు నిర్వహించి రికార్డు సృష్టించాను. కలలు కనండి... పైలట్‌గా నన్ను నిలబెట్టడంలోనే కాదు... భరతనాట్యం, పియానోలోనూ అమ్మే శిక్షణనిప్పించారు. నాకు అన్ని విధాల అండగా నిలిచింది నా కుటుంబమే. నా భర్త ఆనంద్గుప్తా ప్రోత్సాహం, సహకారం ఎంతో ఉంది. ఇంటి వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటారు. మాకు ఒక అమ్మాయి. కెనడాలో చదువుకుంటోంది. కలలు కనండి. ఆ కలలను సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమించండి. అమ్మాయిలు అద్భుతాలు సాధించగలరు. -
ఆ రోజుల్లో దేవదాసీలనేవారు..
సుస్వరాల సంగీతం.. శాస్త్రీయ నృత్యం.. ప్రయోగాలు చేస్తూ అనంత కీర్తిపతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎగురవేసిన ఘనత. మూడేళ్ల ప్రాయంలో మొదలైన ప్రస్థానం.. కళకు వయస్సుతో నిమిత్తం లేదని చాటుతూ ఇప్పటికీ ఆ గళం గలగల పారుతుంటే.. ఆ పాదం ఎందరో కళాకారులకు స్ఫూర్తినిస్తోంది. దేశ విదేశాలకు ఇక్కడి చిన్నారుల ప్రతిభను పరిచయం చేస్తూనే.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే శాస్త్రీయ సంగీత, నృత్యాలలో లెక్కకు మించి నిష్ణాతులను తీర్చిదిద్దిన విదుషీమణి సంధ్యామూర్తి. అనంతపురం కల్చరల్: సంగీతమైనా, నాట్యమైనా గాంధర్వ కళ. జన్మతః అదృష్టం ఉంటేనే అబ్బుతుంది. మా పిల్లలెవరూ పూర్తిస్థాయి నాట్య రంగంలో లేకపోవడమే అందుకు నిదర్శనం. బంధాలు, బంధుత్వాలు శాశ్వతం కాకపోయినా.. కళను నమ్ముకుంటే జీవితాంతం తోడుంటుంది. జీవితాన్ని రంగులమయం చేయగలిగిన సత్తా ఒక్క కళకు మాత్రమే ఉంది. శిష్యులు కూడా గురువుల పట్ల గౌరవభావంతో మెలిగినప్పుడే నాట్యంలో ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశం దక్కుతోంది. నేను పుట్టి పెరిగింది అనంతలోనే. మూడేళ్ల ప్రాయంలోనే మా నాన్న పీఎస్ శర్మ ప్రోత్సాహంతో నాట్య ప్రవేశం చేశా. అప్పట్లో ఆయన లలిత కళాపరిషత్ సెక్రటరీ. మైసూరు నుంచి అనంతపురానికి వచ్చిన నాట్యకోవిదులు వరదరాజ అయ్యంగార్ వద్ద భరతనాట్యం, పార్వతీశం వద్ద కూచిపూడిలో శిక్షణ తీసుకున్నా. చెన్నైకి చెందిన అన్నామలై చెట్టియార్ వద్ద శాస్త్రీ సంగీతం నేర్చుకున్నా. అప్పటికి నా వయస్సు ఐదేళ్లు మాత్రమే. అప్పట్లో భక్త కబీరు నాటకంలో కబీరు కుమారునిగా, భూ కైలాస్ నాటకంలో బాల వినాయకునిగానూ నటించా. పరాయి రాష్ట్రాల్లోనూ అనంత కీర్తి మా ఆయన కృష్ణమూర్తి ఏపీ లైటింగ్స్‌లో జీఎంగా ఉండేవారు. అంతకు ముందు వేరే ఉద్యోగాలు చేయడం వల్ల మా పెళ్లయిన తర్వాత కేరళలోని ఆళువా ప్రాంతంలో ఉండేవాళ్లం. కొన్ని నెలలకంతా చుట్టుపక్కల వారికి సంగీతం, నాట్యం నేర్పించడానికి అవకాశం రావడంతో ఏడేళ్ల పాటు గురువుగా మారిపోయాను. అలాగే గుజరాత్లో ఉన్నప్పుడు నడియాడ్ ప్రాంతంలో మరో మూడేళ్లు అక్కడా టీచర్ అవతారం ఎత్తి భరతనాట్యం నేర్పించాను. ఇప్పటికీ నా శిష్యులు పలకరిస్తూనే ఉంటారు. 1969 తర్వాత పూర్తిగా అనంతపురంలోనే ఉంటూ సంగీత, నాట్యాలను నేర్పిస్తున్నా. భరతనాట్యమే నృత్యమనుకునేవారు నేను నాట్యం ప్రారంభించిన రోజుల్లో భరత నాట్యమంటేనే శాస్త్రీయ నృత్యం. అది కూడా పదేళ్లలోపు వారైతే ఆడపిల్లలు నేర్చుకోవచ్చు. ఆడవేషాలైనా మగవారే వేసేవాళ్లు. కూచిపూడి నాట్య సంప్రదాయమంటే యక్షగానం, వీధి భాగవతార్లు మాత్రమే వీధుల్లో ప్రదర్శించేవారు. అయితే వెంపటి చినసత్యం రాకతో కూచిపూడికి మహర్దశ వచ్చింది. ప్రస్తుతం సినిమాలో ఉన్న మంజుభార్గవి, ప్రభతో పాటు శోభానాయుడు మొదలైన వాళ్లంతా రంగస్థలం ఎక్కి కొత్త సంప్రదాయానికి నాంది పలికారు. ఆ స్ఫూర్తి నేను రంగస్థలంపై ప్రయోగాలు చేసేందుకు కారణమైంది. ఎన్నోమార్లు వెంపటి చినసత్యం నన్ను మెచ్చుకున్నారు. అలాగే వేదాంతం సత్యనారాయణ మా ఇంటికొచ్చేవారు. వారందరి చలువతో మహిళలు భరతనాట్యంతో పాటు కూచిపూడి నేర్చుకోగలుగుతున్నారు. 1969లోనే శ్రీ నృత్య కళా నిలయం వరదరాజ అయ్యంగార్ తర్వాత కృష్ణకుమార్ లలిత కళా పరిషత్‌లో, అప్పారావు కృష్ణ కళామందిరంలో శాస్త్రీయ నృత్యాలు నేర్పించారు. అమీర్‌బాషా కూడా నృత్యంలో శిక్షణిచ్చేవారు. వీరి స్ఫూర్తితో 1969లో శ్రీనృత్య కళానిలయాన్ని తీర్చిదిద్దాం. జిల్లాలోనే ఇది తొలి సంగీత, నాట్య పాఠశాలగా గుర్తింపు ఉంది. వేలాది మంది విద్యార్థులకు శాస్త్రీయ నృత్యం నేర్పిన మా పాఠశాల నుంచే నాట్య గురువులుగానూ ఎదిగారు. ముఖ్యంగా ప్రత్యూష, మహాలక్ష్మి ‘విదూషీ’ శిక్షణ పొందారు. నృత్యంతో ఆత్మవిశ్వాసం శాస్త్రీయ నృత్యంతో ఆధ్యాత్మిక భావజాలంతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. కళకు వయస్సుతో సంబంధం లేదని చాటడంలోనూ ఈ నృత్యం పాత్ర ఎనలేనిది. భారతీయ సంస్కృతీ, పురాణ ఇతిహాసాల విశిష్టత నృత్యాలలో ధరించే పాత్రలు కళ్లకు కడతాయి. ఆ రోజుల్లో దేవదాసీలనేవారు.. మా చిన్నప్పుడు మహిళలకు రంగస్థలం ఎక్కే అర్హత లేదు. అలా చేశారంటే దేవదాసీలనో, భోగంవారనో భావించేవారు. దానికి భయపడి ఎవ్వరూ నాట్య రంగంలో ప్రవేశించలేదు. కళపై ఉన్న అభిమానంతో మా నాన్న నాకు పద్నాలుగేళ్లు వచ్చే వరకు చెప్పించి ఆ తర్వాత మాన్పించారు. అది కూడా పెద్ద పెద్ద విద్వాంసులను ఇంటికే రప్పించి సంగీత నృత్యాలు నేర్పించారు. అప్పటికి ఊరంతా కలిపినా పట్టుమని పది మంది కూడా శాస్త్రీయ నృత్యం నేర్చుకునే వారు లేరంటే ఆశ్చర్యమనిపిస్తుంది. మేము ఆ రోజుల్లోనే వారికి రూ.25 ఇచ్చేవాళ్లం. ఇప్పుడది ఏ నాలుగైదు వేలకో సమానం. ప్రపంచ రికార్డు ప్రదర్శనలు పెళ్లయిన తర్వాత మా వారి ఉద్యోగ రీత్యా అనేక రాష్ట్రాలు తిరగాల్సి వచ్చింది. ఆయా ప్రాంతాల్లోనూ నేను నాట్యం నేర్పించాను. అనంతపురం చేరుకున్న తర్వాత మా శిష్య బృందంతో న్యూఢిల్లీ, పూణే, బెంగళూరు, కోల్‌కతా, ఒడిశా తదితర ప్రధాన నగరాలతో పాటు విదేశాల్లోనూ ప్రదర్శనలిచ్చాం. ముఖ్యంగా 2014లో 155 మంది సంగీత కళాకారులతో ‘అన్నమయ్య శత అష్టోత్తర సంకీర్తనార్చన’ను ఏడు గంటల పాటు నిర్విరామంగా చేపట్టి ప్రపంచ రికార్డును నమోదు చేశాం. మరుసటి సంవత్సరం 2015లో 135 మంది శాస్త్రీయ నృత్య కళాకారులతో ‘దశదేవతా నృత్యారాధన’ను ఏడు గంటల పాటు నిర్వహించి మరో ప్రపంచ రికార్డును అనంత కీర్తిని విశ్వవ్యాప్తం చేశాం. వారసులంతా ఘనులే.. ఒక్కోసారి మా శిష్యులను తలచుకుంటే నాకే ఆశ్చర్యమనిపిస్తుంది. నా దగ్గర విద్య నేర్చుకున్న నాట్య మయూరి శోభారాణి హైదరాబాద్‌లో, ప్రసన్న లక్ష్మి మైసూరులో, శివప్రసాద్ అనంతపురంలో.. హరినాథబాబు, వారిజ హిందూపురంలో, ప్రత్యూష గుంతకల్లులో, మహాలక్ష్మి బెంగళూరులో గొప్ప శిక్షకులుగా శిక్షణాలయాలు నిర్వహిస్తున్నారు. ఇక మా అమ్మాయి అను«రాధ ఎంఏ డాన్స్ చేసి ఓ కార్పొరేట్ విద్యాసంస్థలో కల్చరల్ కోఆర్డినేటర్‌గా ఉంది. ఇలా మా విద్య కీర్తితో పాటు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది. బయోడేటా పూర్తి పేరు : గుంటూరు సంధ్యామూర్తి జననం : అనంతపురం పుట్టిన తేదీ : 22–06–1953 తల్లిదండ్రులు : పీఎస్ శర్మ, సరస్వతమ్మ భర్త : కృష్ణమూర్తి సంతానం : నందకుమార్(కొడుకు), అనురాధ(కూతురు) తొలి ప్రదర్శన: 1956లో లలితకళా పరిషత్తులో అరంగేట్రం అవార్డులు : కళానీరాజనం, సంగీత నృత్య సరస్వతి, ఉగాది పురస్కారం, నాట్యరత్న, అనంత ఆణిముత్యం స్ఫూర్తి : నాన్నగారితో పాటు నాట్య విద్వాంసులు వరదరాజ అయ్యంగార్ -
సత్యా సమరసఖి సుందరం
దీపావళికి కారణమైన ఘటన నరకాసుర వధ! ఈ సమరంలో సొమ్మసిల్లిన కృష్ణుడికి వెన్నంటి ఉన్న భాగస్వామి సత్యభామ! ఆ గాథతో భామ ఓ పౌరాణిక పాత్రగానే కాదు.. మన నాట్యకళల్లోనూ తారగా నిలిచింది. అందం, ఆత్మాభిమానం.. అలక, కినుక.. రౌద్రం, ధైర్యం.. సమరం, విజయం.. వంటి లక్షణాలతో నేటి వనితలకూ ప్రేరణనిస్తోంది! దీపావళినిచ్చిన ఈ ధీర భూమికను, కొనియాడిన వివిధ నాట్యరీతుల్లో ఆ భూమికను పోషించిన నర్తకీమణులు సత్య గురించి చెప్పిన సత్యాలు.. సమరం.. విజయం సత్యభామ.. భూదేవి రూపం. నరకాసురుడు ఆమె కొడుకు. ఈ కథ చెప్పే పరమార్థం ఏంటంటే.. చెడు చేసేవాడు కొడుకైనా సరే ఆ తల్లి సహించదు. అందుకే సంహరించి అంతమొందిస్తుంది. సర్వమానవాళికి విజయాన్నిస్తుంది. సత్యభామ పరిపూర్ణమైన స్త్రీకి నిజమైన నిర్వచనం. స్త్రీ, పురుషుడు అన్న భేదం లేకుండా మనుషులంతా తల్లిలాగే ఆలోచించాలి. అప్పుడే చెడు తలంపన్నది ఎవరి మనసుల్లోకి రాదు. స్త్రీల మీద ఈ దాష్టీకాలూ ఉండవ్. - అచ్యుత మానస (కూచిపూడి, కథక్, భరతనాట్య కళాకారిణి) అందం.. ఆత్మాభిమానం ‘కూచిపూడి’లో సత్యభామ ప్రత్యేకం. ఆమెదే భామాకలాపం. చాలా స్ఫూర్తిదాయకమైన పాత్ర. అందం.. లాలిత్యం.. ధైర్యం.. ధీరత్వం ఆమె సొంతం. కృష్ణుడిని ఎంత ప్రేమిస్తుందో అంత సాధిస్తుంది.. చివరకు అంతే అండగా నిలబడుతుంది. ఒక స్త్రీకి ఉండాల్సిన లక్షణాలవి. సరైన సమయంలో తన శక్తియుక్తులతో చెడును సంహరిస్తుంది. భామా కలాపంలో సత్యభామగా వేయడం నా అదృష్టం. ఈ పాత్ర నాకు లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఐ లవ్ టు బీ ఎ ఉమన్. ఈ జన్మలోనే కాదు ఏ జన్మకైనా! - అలేఖ్య పుంజల (కూచిపూడి కళాకారిణి) ప్రశాంతం.. ప్రకాశం.. చెడు మీద మంచి విజయమే సత్యభామ రూపం. మైథాలజీలో ఆ పాత్ర స్త్రీ శక్తికి, యుక్తికి ప్రతిరూపం. పౌరాణికాల్లో ఆ ఉనికి ఉందీ అంటే నిజజీవితంలోనూ ఆ పాత్ర అవసరం ఉన్నట్టే. ఎప్పటికైనా చీకటి తొలిగి వెలుగు రావాల్సిందే. స్త్రీ తన సమస్యల చీకటిపై పోరాడి వెలుగు పరిష్కారాల్ని పొందాలి. జీవితమంతా ప్రశాంతం.. ప్రకాశం! ఇదే దీపావళి స్ఫూర్తి! -మంగళాభట్ (కథక్ నాట్య కళాకారిణి) రౌద్రం.. ధైర్యం.. ఒకసారి సిడ్నీలోని తెలుగువాళ్లు ఆ ఏడాది దీపావళికి సత్యభామ, నరకాసురుడు కాన్సెప్ట్‌తో నా నాట్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు. దీపావళి వెనకున్న కథనంతా ముందుగా తెలుసుకొని.. కాన్సెప్ట్‌ను డిజైన్ చేసుకున్నాను. దానికనుగుణంగా కర్ణాటక సంగీత బాణీలనూ సమకూర్చుకున్నాం. అవన్నీ స్టేజ్ మీద నా నాట్యంగా చూసిన అక్కడి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్. సత్యభామ పాత్రను అర్థం చేసుకొనే అవకాశాన్నీ నాకిచ్చిందా పెర్ఫార్మెన్స్. మామూలప్పుడు అంత లాలిత్యంగా కనిపించే ఆమె నరకాసురుడి వధలో ఎంతో రౌద్రం.. అంతకుమించిన ధైర్యం కనబరుస్తుంది. - స్మితామాధవ్ (భరతనాట్య కళాకారిణి) - సరస్వతి రమ