‘శశికళ సీఎం అవుతారని అనుకోను’ | Gautami comments on AIADMK crisis | Sakshi
Sakshi News home page

‘శశికళ సీఎం అవుతారని అనుకోను’

Published Wed, Feb 8 2017 7:24 PM | Last Updated on Wed, Apr 3 2019 8:58 PM

‘శశికళ సీఎం అవుతారని అనుకోను’ - Sakshi

‘శశికళ సీఎం అవుతారని అనుకోను’

చెన్నై: జయలలితకు శశికళ నటరాజన్ నిజమైన వారసురాలు కాదని సినీ నటి గౌతమి అన్నారు. ‘చిన్నమ్మ’ ముఖ్యమంత్రి అవుతుందని తాను అనుకోవడం లేదని ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. తమిళనాడు రాజకీయాలను చూస్తే బాధ కలుగుతోందని వ్యాఖ్యానించారు. జయలలితకు నిజమైన వారసుడు పన్నీర్ సెల్వం అని పేర్కొన్నారు.

తన వారసులు ఆయననే అని ‘అమ్మ’ చాలాసార్లు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒక్కసారి కూడా ఆయనను ‘అమ్మ’ దూరం పెట్టలేదన్నారు. పన్నీర్ సెల్వం ఎంతో విధేయతగా ఉన్నారని, ఆయనను కాదని సీఎం పదవిని వేరొకరికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. శశికళ చాలా విషయాలు బయటకు తెలియనివ్వలేదని ఆరోపించారు. పన్నీర్ సెల్వం మంచి పాలన అందించగలరన్న నమ్మకాన్ని గౌతమి వ్యక్తం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement