విజయ్ తొలి బహిరంగ సభ.. తమిళ హీరోల పూర్తి మద్దతు | Tamil Actors Shares Best Wishes To Thalapathy Vijay TVK Maanaadu, Tweets Goes Viral | Sakshi
Sakshi News home page

Thalapathy Vijay TVK Rally: రాజకీయాల్లోకి విజయ్.. తమిళ హీరోల నుంచి విషెస్

Oct 28 2024 10:12 AM | Updated on Oct 28 2024 10:33 AM

 Tamil Actors Wishes Thalapathy Vijay For Maanaadu Meeting

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్.. విల్లుపురం సమీపంలో తన తమిళ వెట్రి కళగం (TVK) పార్టీ మొదటి మహానాడు సభ నిర్వహించాడు. దీనికి దాదాపు ఎనిమిది ల‌క్ష‌ల మందికి పైగా హాజ‌రయ్యార‌ని అంచ‌నా. ఇందులో తన పార్టీ ఆలోచనలు, 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష‍్యంగా ఏం చేయబోతున్నామో అనే విషయాల్ని విజయ్ చాలావరకు చెప్పుకొచ్చారు. వన్ కమ్యూనిటీ, వన్ గాడ్ అనే సిద్ధాంతంతో తమ పార్టీ ముందుకు వెళ్తుందని క్లారిటీ ఇచ్చారు.

(ఇదీ చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్ కాలేదు.. భార్యపై ఒట్టేసి అబద్ధాలు)

ఇక రాజకీయంగా తొలి సభ పెట్టిన హీరో విజయ్‌కి తమిళ హీరోల నుంచి పూర్తిస్థాయిలో మద్ధతు లభించింది. శివకార్తికేయన్, విజయ్ సేతుపతి, జయం రవి, దర్శకులు నెల్సన్ దిలీప్ కుమార్, వెంకట్ ప్రభు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నటులు శశి కుమార్, వసంత్ రవి, కమెడియన్ సతీశ్, నిర్మాత అర్చన కళపతి.. ఇలా చాలామంది తమిళ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి విజయ్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement