breaking news
Tamilaga Vettri Kazhagam
-
TVK: విజయ్ సంచలన వ్యాఖ్యలు
కోలీవుడ్ అగ్ర నటుడు, తమిళగ వెట్రి కగళం అధినేత విజయ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఎల్టీటీఐ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్‌పై తీవ్రస్థాయిలో ప్రశంసలు గుప్పించారాయన. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యలో ప్రభాకరన్ మాస్టర్ మైండ్ అన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా విజయ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రచార యాత్రలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో శనివారం నాగపట్టణంలో జరిగిన టీవీకే ప్రచార సభలో విజయ్ భావోద్వేగంగా ప్రసంగించారు. ‘‘ఈళం తమిళులు మన సంతతి వాళ్లు. వాళ్లు శ్రీలంకలో ఉన్నా.. ప్రపంచంలో ఏమూల ఉన్నా సరే.. తమ నాయకుడ్ని కోల్పోయిన బాధలో ఉండి ఉంటారు. ఆయన(ప్రభాకరన్‌ను ఉద్దేశించి..) వాళ్లకు తల్లి లాంటి ప్రేమను పంచారు. శ్రీలంక తమిళుల కోసం మనం గొంతెత్తడం మన బాధ్యత’’ అని ప్రసంగించారు.నాగపట్టణం శ్రీలంక సమీపంలో ఉండడం.. ఈళం తమిళుల సమస్య కారణంగా మత్స్యకారుల జీవనోపాధి తీవ్రంగా ప్రభావితం కావడం వల్ల విజయ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో మత్స్యకారుల సమస్యలపైనా ఆయన మాట్లాడారు. ‘‘మేం డీఎంకేలా ప్రభుత్వంలా సుదీర్ఘమైన లేఖలు రాసి.. ఆపై మౌనంగా ఉండిపోం. మత్య్సకారుల సమస్యలకు పరిష్కారం చూపిస్తాం. ఇది టీవీకే ప్రధాన అజెండా కూడా అని అన్నారు. మత్య్సకారుల జీవితాలు ఎంత ముఖ్యమో.. ఈలమ్ తమిళుల జీవితాలు కూడా మాకు అంతే ముఖ్యం అని అన్నారాయన. అయితే శ్రీలంక తమిళులకు విజయ్ మద్దతు ప్రకటించడం ఇదేం తొలిసారి కాదు. శ్రీలంక అంతర్యుద్ధ (2008 చివరి నుంచి 2009 మే వరకు) సమయంలో ఉత్తర శ్రీలంకలోని ముల్లివాయ్క్కాల్ ప్రాంతంలో సైన్యం చేతిలో తమిళులు ఊచకోతకు గురికావడం తీవ్ర దుమారం రేపింది. దీనికి నిరసగా చెన్నైలో జరిగిన నిరాహార దీక్ష కార్యక్రమంలో విజయ్ పాల్గొని శ్రీలంక తమిళులకు సంఘీభావం ప్రకటించారు. అయితే ఆ సమయంలో శ్రీలంక తమిళులకు మద్దతు ఇవ్వడం అంటే ఎల్టీటీఈకి మద్దతు ఇచ్చినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. కానీ.. గతంలో కరుణానిధి సహా తమిళనాడుకు చెందిన ఏ రాజకీయ నేత కూడా నేరుగా ప్రభాకరన్‌పై ఈ స్థాయిలో ప్రశంసలు గుప్పించిన దాఖలాలు లేవు. ప్రభాకరన్‌ను తాను ఉగ్రవాదిగా చూడడని.. అయితే ఈళం తమిళుల కోసం ఎల్టీటీఈ లక్ష్యాలు గొప్పవే అయినా.. ఆచరించే పద్దతులు సరికావంటూ కరుణానిధి బహిరంగంగానే చెబుతుండేవారు. అలాంటి విజయ్ ఇప్పుడు బహిరంగంగా ప్రభాకరన్‌పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ రియాక్షన్విజయ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ సీనియర్ నేత మాణికం ఠాగూర్ స్పందిస్తూ.. ప్రభాకరన్ LTTE అధినేతగా, భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు కుట్ర పన్నిన వ్యక్తి అనే విషయం గుర్తుంచుకోవాలి. అలాంటి వ్యక్తిని పొగడటం భారత ప్రజల భావోద్వేగాలను దెబ్బతీయడమే. పైగా ఎల్టీటీఈపై భారత ప్రభుత్వ నిషేధం ఉంది. అలాంటప్పుడు ఆ గ్రూప్ అధినేతను పొగడడం చట్టపరంగా, నైతికంగా అనుచితం అని మాణికం ఠాగూర్ అన్నారు.ఎల్టీటీఈ ప్రస్థానంLTTE (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈళం) అనేది 1976లో స్థాపితమైన ఒక సాయుధ సంస్థ. శ్రీలంకలో స్వతంత్ర తమిళ ఈళం ప్రాంతం కోసం దశాబ్దాల పాటు పోరాటం చేసింది. ఫలితంగా ఆ సంస్థకు, సైన్యానికి మధ్య జరిగిన అంతర్యుద్ధంలో వేలాది శరణార్థులుగా భారత్‌కు వచ్చారు. అయితే.. ఆ సమయంలో భారత ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ (IPKF) పేరిట సైన్యాన్ని శ్రీలంకకు పంపించారు. మూడేళ్లపాటు అది ఆ సాయుధ సంస్థతో యుద్ధం చేసి 1990లో భారత్‌కు తిరిగి వచ్చేసింది. అయితే.. ఈ చర్యను ద్రోహంగా భావించిన ఎల్టీటీఐ ప్రతీకారం కోసం ఎదురు చూసింది. 1991లో శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన రాజీవ్ గాంధీ.. మానవ బాంబు జరిపిన ఆత్మాహుతి దాడిలో మరణించారు. ఈ ఘటన తర్వాత అప్పటి భారత ప్రభుత్వం ఎల్టీటీఈని నిషేధించింది. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు LTTE అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ మరియు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ పొట్టు అమ్మన్ కలిసి కుట్ర పన్నినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే.. రాజీవ్ గాంధీని తామే హతమార్చినట్లు ఎల్టీటీఈ ఏనాడూ అధికారికంగా ఒప్పుకోలేదు. అలాగని ఖండించనూ లేదు. చివరకు 2009లో శ్రీలంక సైన్యం చేతిలో ఎల్టీటీఈ ఓడిపోవడమే కాకుండా.. ఆ గ్రూప్ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ హతమయ్యారు. అప్పటితో LTTE అంతరించిపోయింది. -
సరికొత్త ఆయుధంతో అరవ రాజకీయాల్లో యుద్ధం!
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. అరవ రాజకీయాలు ఇప్పటి నుంచే వేడెక్కుతున్నాయి. ద్రవిడ ఉద్యమ పితామహుడిగా పేరున్న పెరియార్ జయంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఓ ఏఐ వీడియోను రిలీజ్ చేయడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇది డీఎంకేకు ప్రచారంగానే కాకుండా.. అటు ప్రత్యర్థి విజయ్ టీవీకే పార్టీకి కౌంటర్‌గానూ ఉందన్న చర్చ నడుస్తోందక్కడ. తమిళనాడు రాజకీయాలు కొత్త పుంతలు తొక్కాయి. ట్రెండ్‌కు తగ్గట్లే రాజకీయ పార్టీలు టెక్నాలజీని పుణికిపుచ్చుకున్నాయి. పార్టీల ఐటీ విభాగాల క్రియేటివిటీతో ‘పొలిటికల్ డిజిటల్ వార్’ ఇప్పుడక్కడ హాట్ టాపిక్‌గా మారింది. మైకుల్లో మాటలు, సోషల్ మీడియాలో పోస్టులకు అదనంగా అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనే ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారు. పైగా ప్రత్యర్థులను నేరుగా విమర్శించాల్సిన అవసరం లేకుండానే ఆ సెల్ఫ్ ప్రమోషన్ వీడియోలు భలేగా ఉపయోగపడుతున్నాయి పార్టీలకు. తాజాగా.. విజయ్ తమిళగ వెట్రి కళగం (TVK) ఓ ఏఐ జనరేటెడ్ వీడియోను రిలీజ్ చేసింది. 32 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో డీఎంకే వ్యవస్థాపకుడు, తమిళనాడు తొలి ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై విజయ్‌పై ప్రశంసలు గుప్పించినట్లు ఉంది. అదే సమయంలో తన సొంత పార్టీ డీఎంకే విధానాలను విమర్శించినట్లుగా ఉంది. ఈ వీడియో తమిళనాట నిన్నంతా ట్రెండింగ్‌లో కొనసాగింది. அண்ணாவின் வழியில்... தம்பி விஜய் ஆட்சி! என்று எல்லோரும் சொல்லட்டும்."தமிழக வெற்றிக்கழகம் வெல்லட்டும்" pic.twitter.com/jyh4SoxTrz— TVK IT Wing Official (@TVKHQITWingOffl) September 15, 2025ఈ పరిణామంపై డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. డీప్‌ఫేక్ వీడియోలతో విజయ్ టీవీకే పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆ పార్టీ ప్రతినిధి శరవణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి కోసం ఉపయోగించాల్సిన సాంకేతికతను ఇలా.. ప్రజాస్వామ్య విలువలను దిగజారుస్తూ ఉపయోగించడం బాధాకరమని అన్నారాయన. ఈ క్రమంలో బీజేపీతో డీఎంకే రహస్య బంధంలో ఉందంటూ విజయ్ చేస్తున్న ఆరోపణలనూ శరవణన్ తోసిపుచ్చారు. ఇదిలా ఉండగానే.. విజయ్ టీవీకే పార్టీ పెరియార్ సిద్ధాంతాలను పూర్తిగా స్వీకరించలేదు. కానీ ఆయన భావజాలం నుంచి సామాజిక న్యాయం, మహిళా సాధికారత, హేతువాదం వంటి అంశాలను మాత్రం తీసుకుంటానని విజయ్ బహిరంగంగానే చెప్పాడు. ఈ క్రమంలో పెరియార్ ఫొటో దీంతో తాజా ఏఐ జనరేటెడ్ వీడియోతోతద్వారా స్టాలిన్ రాజకీయ నేరేటివ్‌ను తిరిగి తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. పోనుపోను ఈ డిజిటల్ క్యాంపెయిన్ వ్యక్తిగతంగానూ లక్ష్యంగా చేసుకునే అవకాశం లేకపోలేదు!.தந்தை பெரியார் - இனப்பகையைச் சுட்டெரிக்கும் பெருநெருப்பு! தமிழினத்தின் எழுச்சிக்கான பகுத்தறிவுப் பேரொளி!தந்தை பெரியார் என்றும் - எங்கும் நிலைத்திருப்பார்!#PeriyarForever #Periyar #SocialJusticeDay pic.twitter.com/B4RvgXCgzH— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) September 17, 2025 -
‘‘రజినీ సర్.. ఆయన మీలా ప్యాకేజీ స్టార్ కాదు’’
తమిళనాడు రాజకీయాల్లో మామూలుగా హీటెక్కలేదు. వచ్చే ఎన్నికల్లోనూ స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఘన విజయం సాధిస్తుందంటూ సూపర్‌స్టార్ రజినీకాంత్ చేసిన బహిరంగంగా చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. ఇవి మరో అగ్రనటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ అభిమానులకు సాధారణంగానే మంట పుట్టించాయి.స్టార్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్.. ఎంకే స్టాలిన్‌పై రజినీ కురిపించిన ప్రశంస ఇది. ‘‘స్టాలిన్ తమిళనాట మాత్రమే కాదు భారతీయ రాజకీయాల్లో ఓ ధృవతార. కేంద్రంలోని ప్రభుత్వానికి మాత్రమే కాదు.. పాత, కొత్త ప్రత్యర్థులకు ఇప్పుడు ఆయన ఓ సవాల్‌గా మారారు. నా స్నేహితుడు తన మార్క్ చిరునవ్వుతోనే రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్నారు’’ అంటూ ఓ ఈవెంట్లో రజినీకాంత్ వ్యాఖ్యానించారు. అయితే..అన్నింటికీ మించి.. డీఎంకే పార్టీ ఒక మర్రి చెట్టు లాంటిది. ఎలాంటి తుఫానునైనా తట్టుకునే శక్తి ఉంది ఓ బలమైన కామెంట్ చేశారు. ఈ ఎఫెక్ట్‌తో సోషల్ మీడియాలో విజయ్ అభిమానులు ఊగిపోతున్నారు. అందుకు కారణం.. రజినీకాంత్ ఈ వ్యాఖ్యలు చేయడానికి ఒక్కరోజు ముందు విజయ్ తన రాజకీయ పార్టీకి కీలకమైన ప్రస్థానం ప్రారంభించారు. తిరుచిరాపల్లి నుంచి ప్రజా యాత్ర (మీట్ ది పీపుల్) ప్రారంభించారు. ఆ సభలో అలవి కాని హామీలిచ్చారంటూ డీఎంకేపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో తాజా రజినీకాంత్ కామెంట్లు విజయ్ను ఉద్దేశించి చేసినవేనన్న చర్చ ప్రముఖంగా నడుస్తోందక్కడ.దళపతినే అంటారా?.. రజినీ కామెంట్లతో అరవ రాజకీయంలో స్టార్ వార్ మరింత ముదిరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కామెంట్లు చేసిన టైంలో మరో సీనియర్ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ కూడా అక్కడే నవ్వుతూ కనిపించారు. కమల్ ఇప్పటికే డీఎంకే కూటమికి మద్దతు అనే సంగతి తెలిసిందే. దీంతో.. రాజకీయంగా అడుగులు వేయలేని వాళ్లు, సొంతగా పార్టీని నడిపించుకోలేని వాళ్లు.. ఒంటరిపోరుకు సిద్ధమైన విజయ్ను విమర్శించడమా? అంటూ అభిమానులు మండిపడుతున్నారు. దీనికి తోడు..మొన్నటిదాకా బీజేపీకి సపోర్ట్‌గా మాట్లాడిన రజినీకాంత్.. ఇప్పుడు అనూహ్యంగా డీఎంకేకు అనుకూలంగా మాట్లాడడం ఆయన డబుల్ స్టాండర్డ్‌కు నిదర్శనమని, రీల్లో సూపర్‌స్టార్ అయినప్పటికీ రియల్ లైఫ్‌లో రజినీకాంత్ ప్యాకేజీ స్టార్ అని, విజయ్ అలా ప్యాకేజీ స్టార్ ఏనాటికి కాబోరని తిట్టిపోస్తున్నారు.సూపర్ స్టార్ ట్యాగ్‌తో మొదలై..స్టార్డమ్ పెరిగిపోయే క్రమంలో.. రజనీకాంత్ అభిమానులతో విజయ్ అభిమానుల వైరం మొదలైంది. అయితే విజయ్ పొలిటికల్ ఎంట్రీతో అది మరింత ముదురుతూ వస్తోంది. గతంలో సినిమా ఈవెంట్లలోనూ స్టేజ్ మీద రజినీకాంత్ ‘‘కుక్క, కాకి’’ అంటూ ఏవో పిట్టకథలతో తీవ్ర విమర్శలు గుప్పించేవారు. ఆ సమయంలో విజయ్ అభిమానులు ఆయన్ని టార్గెట్ చేసేవారు. అంతేకాదు స్వయంగా విజయ్ కూడా అంతే సెటైరిక్‌గా తన సినిమా ఈవెంట్లలో ఆ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి.ఈ క్రమంలో.. కిందటి ఏడాది విల్లుపురంలో జరిగిన టీవీకే తొలి మహానాడు తర్వాత రజినీకాంత్ విజయ్ను ప్రశంసించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే ఈలోపే.. రాజకీయాల్లో తన ప్రధాన ప్రత్యర్థిగా విజయ్ ప్రకటించిన డీఎంకే, స్టాలిన్‌ను రజినీకాంత్ పొగడ్తలతో ముంచెత్తడంతో పరిస్థితి మళ్లీ మునుపటికి వచ్చింది.రజినీ వెనకడుగులు.. 1995–1996.. రజినీకాంత్ హవా కొనసాగుతున్న రోజులు. ఆ సమయంలోనే రాజకీయాలపై ఆయన తొలిసారిగా పెదవి విప్పారు. అప్పటి జయలలిత ప్రభుత్వంపై అవినీతి విమర్శలు గుప్పిస్తూ.. డీఎంకేకు మద్దతు ప్రకటించారాయన. ఆ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయంలో ఆయన మద్దతూ కీలకంగా మారింది. అయితే..2000 నుంచి దశాబ్దం పాటు ఆయన రాజకీయాలపై మౌనం పాటించారు. బాబా సినిమా టైంలోనూ ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం విస్తృతంగా నడిచినప్పటికీ.. ఆయన కేవలం సామాజిక అంశాలపై మాత్రమే స్పందిస్తూ వచ్చారు. దీంతో రజినీ పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. చివరకు..అయితే పాతికేళ్ల అభిమానుల నిరీక్షణకు తెర దించుతూ.. 2017 డిసెంబర్ 31వ తేదీన రజినీకాంత్ నుంచి రాజకీయ పార్టీ స్థాపన ప్రకటన వెలువడింది. దీంతో అభిమానులు ఆనందంతో ఊగిపోయారు. 2020 టైంలో ఆ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆ సమయంలో తమిళనాట కోలాహాలం నడిచింది. అదే సమయంలో.. ఆయన తీవ్ర అనారోగ్యం బారిన పడడం, మరోపక్క కరోనా విజృంభణతో ఆయన వెనకడుగు వేశారు. తన ఆరోగ్య కారణాల రిత్యా రాజకీయ ప్రయత్నాలు విరమించుకుంటున్నట్లు స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో ఆయన అభిమానులు చల్లబడ్డారు.అయితే.. అప్పటి నుంచి రాజకీయంగా మాత్రం ఆయన తన అభిప్రాయాలను స్వేచ్ఛగానే వెల్లడిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో కొన్నాళ్ల కిందట ఓ ప్రచారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.విజయ్ సూటిగా.. తమిళ సినీ నటుడు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ (Thalapathy Vijay).. గత దశాబ్ద కాలంగా సామాజిక సేవా కార్యక్రమాలు, స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులకు మద్దతు వంటి చర్యల ద్వారా రాజకీయంగా చురుకుగా ఉన్నారు. అవినీతి, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా తమిళనాడుకు మౌలిక మార్పు అవసరం అని మొదటి నుంచి చెబుతూ వస్తున్నారాయన. ఈ క్రమంలో ఆయన ఏనాడూ.. ఏ పార్టీకి మద్దతు ప్రకటించింది లేదు. అయితే.. ఆయన అభిమాన సంఘాలు(Vijay Makkal Iyakkam) మాత్రం 2011, 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తూ వచ్చాయి. ఈ క్రమంలో.. నోట్ల రద్దు, జీఎస్టీ, డిజిటల్ చెల్లింపులు తదితర అంశాలపై ఆయన తన సినిమాల్లో సెటైర్లు ఉండేలా చూడడంతో కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకమనే చర్చ నడిచింది. అయితే.. డీఎంకేను రాజకీయ విరోధిగా, బీజేపీని సైద్ధాంతిక విరోధిగా పేర్కొంటూ 2024లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమిళగ వెట్రి కళగం (TVK) అనే పార్టీని స్థాపించారు.తాము ఏ కూటమికి చెందిన వాళ్లం కాదని.. 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం సింహం సింగిల్‌గానే వస్తుందని.. అధికారం కోసం జరుగుతున్న పోరులో పొత్తు కోసం కలిసొచ్చే పార్టీలకు ఆహ్వానమంటూ బహిరంగంగా చిన్నపార్టీలను ఆహ్వానించారాయన. ఏమిటీ ప్యాకేజీ గోల?!అధికార డీఎంకే కుటుంబానికి చెందిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గతకొన్నేళ్లుగా అక్కడి అగ్ర హీరోలతో బిగ్‌డీల్(కళ్లు చెదిరే రెమ్యునరేషన్లు, బోనస్‌గా కాస్ట్లీ గిఫ్ట్‌లు కూడా) కుదుర్చుకుని వరుస ప్రాజెక్టులు చేస్తూ వస్తోంది. ఈ లిస్ట్‌లో రజినీకాంత్, కమల్‌హాసన్‌లు కూడా ఉండడం గమనార్హం. రాజకీయంగా తమ ఎదుగుదలకు ఆటంకంగా మారకూడదనే ఉద్దేశంతో వాళ్లను ఇలా బుజ్జగిస్తోందని ముమ్మర ప్రచారం నడిచింది. తమిళనాట తమకు ప్రతిపక్ష అన్నాడీఎంకే-బీజేపీ మధ్యే ఎన్నికలు జరగాలని డీఎంకే తొలి నుంచి భావిస్తోంది. రజినీకాంత్ కంటే విజయ్‌కు తమిళనాట ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది. దీంతో సొంత పార్టీ ప్రకటన కంటే ముందే ఆయన్ను తమ వైపునకు తిప్పే ప్రయత్నమూ డీఎంకే చేసింది. కానీ రాజకీయ అడుగులు వేయాలని బలంగా ఫిక్స్ అయిన విజయ్ ఆ ప్యాకేజీకి ఒప్పుకోలేదని.. అందుకే ఇప్పుడు ఆయన టార్గెట్ అయ్యారన్నది ఆ ప్రచార సారాంశం(దీనిని విజయ్ ఫ్యాన్సే నడిపించారనే టాక్ కూడా ఉంది). ఇక.. ఏడాదిన్నర కాలంగా డీఎంకే ప్రభుత్వంపై విజయ్ తరచూ విమర్శలు గుప్పించడం.. తాజా మధురై మానాడులో అంకుల్ అని స్టాలిన్‌ను సంబోధిస్తూ విజయ్ విమర్శలు చేయడాన్ని డీఎంకే సీరియస్‌గా భావించింది. ఈ క్రమంలోనే కేసులతో ఇబ్బంది పెడుతోందన్న విమర్శ బలంగా వినిపిస్తోందక్కడ. అయితే.. ఇంత సీరియస్ ఆరోపణలపై ఇటు రాజకీయంగా గానీ, అటు సినిమాలపరంగానూ ఏ ఒక్కరూ స్పందించకపోవడం గమనార్హం.ఇదీ చదవండి: డీఎంకేకు నిద్రలేకుండా చేస్తున్న విజయ్! -
డీఎంకేకు నిద్రలేకుండా చేస్తున్న విజయ్!
విమర్శలు, వ్యంగ్యాస్త్రాలను(ట్రోల్స్+మీమ్స్) పట్టించుకోకుండా తమిళ రాజకీయాల్లో సరికొత్త సంచలనం దిశగా సినీ హీరో విజయ్ అడుగులేస్తున్నారు. మీట్ ది పీపుల్ పేరిట ఈ శనివారం నుంచి రాష్ట్ర పర్యటనలు చేపట్టనున్నారు. అయితే జనాల్లోకి వెళ్లే క్రమంలో.. తమిళనాడు డీజీపీకి ఆయన ఓ లేఖ రాశారు. తన పర్యటనల రిత్యా అవసరమైన భద్రత కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారాయన. ఈ క్రమంలో సంచలన ఆరోపణలకే దిగారాయన. తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK)కు బలమైన పునాది వేయడం మాత్రమే కాదు.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో అధికార కైవసమే లక్ష్యంగా విజయ్ అడుగులేయబోతున్నారు. సెప్టెంబర్ 13వ తేదీన తిరుచ్చి నుంచి ప్రత్యేక ప్రచార రథం బయల్దేరనుంది. అలా మొత్తం 38 జిల్లాల్లో పర్యటిస్తూ.. ప్రజలతో మమేకం అయ్యేలా కార్యక్రమాలతో (సభలు, సమావేశాలు, ర్యాలీలు, ముఖాముఖి, రౌండ్ టేబుల్ మీటింగ్స్) నిర్వహిస్తుంది. డిసెంబర్ 20వ తేదీన మధురైలో సభ ద్వారా టీవీకే విజయ్ మీట్ ది పీపుల్ పర్యటన ముగియనుంది. అయితే.. టీవీకే చర్యలతో అధికార డీఎంకే నేతలకు నిద్రలేకుండా పోతోందని విజయ్ అంటున్నారు. టీవీకే కేడర్‌పై వరుసగా కేసులు పెట్టడాన్ని ఖండిస్తూ ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారాయన. ఆ పార్టీ కార్యదర్శి ఆనంద్‌తో పాటు తిరుచ్చి పార్టీ విభాగం నేతలపైనా తాజాగా కేసు నమోదు అయ్యింది. అయితే.. ఈ పరిణామంపై విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీకేకు అధికారంలో ఉన్నపార్టీ భయపడుతోందా? అని ప్రశ్నించారాయన. డీఎంకే ఇప్పుడు టీవీకే గురించే ఆలోచించడం మొదలుపెట్టింది. 24 గంటలూ అదే ఆలోచనతో ఉంటోంది. ఆ పార్టీ నేతలకు నిద్ర కరువైంది. ఈ క్రమంలోనే పోలీసులపై ఒత్తిడి చేస్తూ కేసులు పెట్టిస్తోంది. కొంపదీసి.. టీవీకేకు డీఎంకే భయపడుతోందా? అని ప్రశ్నించారాయన. తమిళనాడు రాజకీయాల్లో తారలకు ప్రజలు అధికారం కట్టబెట్టడం కొత్తేం కాదు. శివాజీ గణేషన్, విజయ్‌కాంత్, శరత్‌కుమార్, కమల్‌హాసన్.. ఇలా ఎందరో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రజినీకాంత్ లాంటి భారీ ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉన్న తార ఆ దిశగా అడుగు వేసినట్లే వేసి.. వెనక్కి వెళ్లిపోయారు. అయితే.. ఎంజీఆర్, జయలలిత ఏకంగా ముఖ్యమంత్రులు అయ్యారు. వీళ్లందరితో పోల్చుకుంటే.. విజయ్‌కు ఇప్పుడున్న మాస్ ఫాలోయింగ్ చాలాచాలా ఎక్కువే. ఆ అభిమానాన్నే ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని విజయ్ ఉవ్విళ్లూరుతున్నారు.తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, విజయ్ చేపట్టిన “మీట్ ది పీపుల్” పర్యటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విజయ్ గత ఏడాది రాజకీయాల్లోకి అడుగుపెట్టి, రెండు మానాడు(మహానాడు)లను విజయవంతంగా నిర్వహించారు. మదురైలో జరిగిన రెండో మహానాడులో ప్రజల మధ్యకి వస్తున్నట్టు ప్రకటించి.. రాజకీయ ప్రత్యర్థి డీఎంకే, సైద్ధాంతిక విరోధి బీజేపీ లతోనే తమ పోరాటం అని కుండబద్దలు కొట్టారు. తాను, తన టీవీకే ఏ కూటమిలో భాగం కాబోమని.. కలిసొచ్చే పార్టీలకు రేపు అధికారం గనుక దక్కితే వాటా ఇస్తామని చెప్పారు. విజయ్ ఈ ప్రకటన అక్కడి రాజకీయాల్లో అలజడి రేపింది. పలు పార్టీలోని సీనియర్ నేతలు విజయ్ ఆఫర్‌కు టెంప్ట్ అవుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో అసంతృప్త నేతలతో పాటు ఓట్ షేరింగ్ ఉన్న పార్టీలు, కుల ఓట్లను రాబట్టే పార్టీలు సైతం విజయ్ టీవీకేతో కూటమిగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నాయి. ప్రజల సమస్యలపై నేరుగా స్పందించేందుకు, వారి అభిప్రాయాలను స్వీకరించేందుకు ఈ పర్యటనను ప్రజా ఉద్యమంగా మార్చాలని విజయ్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ మీట్ ది పీపుల్‌పై అధికార డీఎంకే ఓ కన్నేసింది. విజయ్ పర్యటనను నిశితంగా పరిశీలించాలని, ప్రత్యర్థి వ్యూహానికి చెక్ పెట్టేలా పునరాలోచనలు చేయాలని ఆ పార్టీ అధినేత, సీఎం స్టాలిన్ సీనియర్లకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే టీవీకే కేడర్‌పై ఈ సమయంలోనే కేసులు నమోదు అవుతుండడంతో డీఎంకేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే విజయ్ మాత్రం ఇలాంటివాటికి వెనకడుగు వేయబోనని అంటున్నారు. 1967లో అన్నాదురై కాంగ్రెస్ ఆధిపత్యానికి గండికొట్టినట్లు.. 1977 అన్నాడీఎంకేతో ఎంజీఆర్ డీఎంకేను గద్దె దించినట్లు.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిపోరుతో అధికారం కైవసం చేసుకుని తానూ చరిత్ర సృష్టిస్తానని చెబుతున్నారు. జనంలోకి వెళ్తున్న విజయ్.. రెండు నెలలపాటు నాన్‌స్టాప్ పర్యటనలు చేపట్టబోతున్నారు. మొదటి విడతలో 10 జిల్లాల్లో పర్యటించేందుకు రూట్‌మ్యాప్ సిద్ధం చేశారు. శనివారం కీలక కార్యక్రమాలు జరుగుతాయి. ఆదివారం ఒకే ఒక్క కార్యక్రమం నిర్వహిస్తారు. మధ్యలో సెప్టెంబర్ 27, అక్టోబర్ 25వ తేదీన చెన్నైకి విజయ్ చేరుకుంటారు. పార్టీ ప్రకటన నుంచి మానాడు విజయవంతం దాకా.. విజయ్ వెంట నడిచింది యువతే. కాబట్టి యువత మద్దతుతోనే తన పర్యటనలను విజయవంతం చేసుకోవాలని విజయ్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: విజయ్ టీవీకే.. ఆ పార్టీకే ఫ్లస్ -
షాకింగ్ సర్వే.. ఆ పార్టీ నెత్తిన పాలు పోసే పనిలో విజయ్!!
ఏ పార్టీతో పొత్తు ఉండదు. సింహం ఎప్పటికీ సింహమే!. సింగిల్‌గానే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతాం అంటూ తమిళగ వెట్రి కళగం (Tamilaga Vetri Kazhagam) అధినేత, ప్రముఖ నటుడు విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మధురైలో జరిగిన టీవీకే మానాడు సూపర్ సక్సెస్ కావడంతో విజయ్ను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలను ప్రముఖ పార్టీలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో.. తమిళనాడులో జరిగిన ఓ సర్వే వెల్లడించిన విషయాలు టీవీకే సహా అక్కడి రాజకీయ పక్షాలకు ఝలక్ ఇచ్చాయి. తమిళనాడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే.. డీఎంకే అత్యధిక సీట్లు కైవసనం చేసుకుంటుందని తెలిపింది. ప్రతిపక్ష ఎన్డీయే కూటమికి 3 సీట్లు దక్కవచ్చని, అదే సమయంలో విజయ్ టీవీకేకు జీరో ఎదురుకావొచ్చని ఆ సర్వే పేర్కొంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి తమిళనాడులో అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 39 స్థానాలను కూటమిలోనే పార్టీలోనే కైవసం చేసుకున్నాయి. అయితే ఇప్పటికిప్పడు జరిగితే మాత్రం 36 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. సంక్షేమ పథకాలతో పాటు హిందీ భాషా వ్యతిరేక ఉద్యమం, నీట్ పోరాటాలు డీఎంకే గెలుపును ప్రభావితం చేసే అంశాలుగా పేర్కొంది.ఇక.. బీజేపీ అన్నాడీఎంకే ఎన్డీయే కూటమికి మూడు స్థానాలు మాత్రమే దక్కవచ్చని పేర్కొంది. అయితే.. ఓటు శాతం మాత్రం 18% నుంచి 37%కి పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. 2024లో ఈ కూటమికి ఒక్క సీటు కూడా రాలేదు. ఇక తమిళనాడులో రాబోయే కాలంలో జరిగే ఎన్నికలకు విజయ్ టీవీకే పార్టీ అదనపు ఆకర్షణగా నిలవబోతోంది. ఈ పార్టీ ఇప్పటిదాకా ఏ ఎన్నికల్లో పోటీ చేసింది లేదు. అయితే ఇప్పటికప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఏ స్థానం దక్కకపోవచ్చని(0 సీట్లు) ఆ సర్వే వెల్లడించింది. విజయ్ పార్టీ పెట్టి ఏడాది పైనే అవుతోంది. అయితే అందులో ముఖాలేవీ జనాలకు పెద్దగా తెలిసినవి కావు. జనాలకు తెలిసిన ముఖాలు టీవీకేలో చేరేందుకు ప్రయత్నిస్తున్నా.. విజయ్ అందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు జనాల్లోకి ఇంకా బలంగా ఆ పార్టీ చొచ్చుకుపోవాల్సిన అవసరం ఉంది. అయితే డీఎంకే వ్యతిరేకతను టీవీకే ఓట్ల రూపంలో మార్చుకోవాలని విజయ్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఒకవేళ ఇప్పుడు ఎన్నికలు జరిగితే.. టీవీకే పార్టీతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ చీలే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా డీఎంకేకే లాభం కలగించవచ్చని సర్వే పేర్కొంది. తద్వారా.. టీవీకేతో ఎన్డీయే కూటమికే భారీ నష్టం కలగవచ్చని స్పష్టం చేసింది. ఇండియా టుడే సీవోటర్ Mood of the Nation ఆగస్టు 2025 పేరిట నిర్వహించిన ఈ సర్వే నిర్వహించింది. జూలై 1 నుండి ఆగస్టు 14, 2025 మధ్య 2 లక్షల మందికి పైగా ప్రజల అభిప్రాయాలను సేకరించి రూపొందించబడింది. సర్వే లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో జరిగినప్పటికీ మరో ఏడేనిమిది నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకూ సమీకరణాలు ఇలాగే కొనసాగితే మాత్రం.. డీఎంకే నెత్తిన విజయ్ టీవీకే పాలు పోసినట్లే అవుతుందన్న చర్చ జోరుగా నడుస్తోందక్కడ. -
అది ఓట్ల రాజకీయం.. మేం పట్టించుకోం
అగ్రనటుడు, తమిళగ వెట్రి కళగం (Tamilaga Vettri Kazhagam) అధినేత విజయ్ మధురై మహనాడులో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేంద్రాన్ని, ప్రధాని మోదీని విమర్శించే క్రమంలో కచ్చతీవు ద్వీపం అంశం తెరపైకి తెచ్చారాయన. అయితే తాజాగా విజయ్ డిమాండ్‌పై శ్రీలంక(Sri Lanka Reacts Actor Vijay) స్పందించింది. కచ్చతీవును తిరిగి భారత్‌లో చేర్చాలంటూ విజయ్ మధురై టీవీకే సభలో కేంద్రాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారంటూ శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్ అభిప్రాయపడ్డారు. విజయ్ వ్యాఖ్యలను ఓ మీడియా ప్రతినిధి ఆయన వద్ద ప్రస్తావించగా.. ‘‘కచ్చతీవు ముమ్మాటికీ శ్రీలంకదే. ఇలాంటి వ్యాఖ్యలు ఓట్ల కోసం చేసే రాజకీయ ప్రకటనలు మాత్రమే. దక్షిణ భారతదేశంలో ఎన్నికల కాలంలో రాజకీయ ప్రయోజనాల ఇలాంటివెన్నో చెబుతుంటారు. భారత కేంద్ర ప్రభుత్వమో, దౌత్యాధికారులో ఈ అంశంపై ఎలాంటి అధికారిక వ్యాఖ్యలు చేయలేదు. అందువల్ల శ్రీలంక సార్వభౌమత్వం కొనసాగుతుంది. ఇలాంటి ప్రకటనలతో మేం ప్రభావితం కాబోం. శ్రీలంకకు చెందిన కచ్చతీవు విషయంలో దౌత్యస్థాయిలో జరిగే చర్చలే ముఖ్యం’’ అని అన్నారాయన. ఆగస్టు 21న మదురైలో జరిగిన సభలో విజయ్ మాట్లాడుతూ.. మత్స్యకారుల హక్కులను కాపాడడంలో కేంద్రం విఫలమైందని విమర్శలు గుప్పించారు. శ్రీలంక నౌకాదళం దాడుల వల్ల 800 మంది తమిళనాడు మత్స్యకారులు బాధపడుతున్నారని పేర్కొన్నారు. ‘‘మీరు పెద్దగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. చిన్న పని చేయండి. కచ్చతీవును తిరిగి పొందండి, అది మా మత్స్యకారుల భద్రతకు సరిపోతుంది’’ అని విజయ్ ప్రధాని మోదీని ఉద్దేశించి అన్నారు.Popular actor Thalapathi Vijay who left the Silver Screen to mount the political platform, challenges @PMOIndia to take back the Katchchateevu island to protect Tamilnadu fishermen from Sri Lanka navy attacks. pic.twitter.com/btpiP6Z0AI— LankaFiles (@lankafiles) August 26, 2025కచ్చతీవు ఒక చిన్న ద్వీపం. తమిళనాడు రామేశ్వరంకు సమీపంలో.. భారత్-శ్రీలంక మధ్య పాక్ జలసంధిలో ఉంది. ద్వీపంలో సెయింట్ ఆంటోనీ ప్రార్థన మందిరంలో ఏటా జరిగే ఉత్సవాలకు తమిళనాడు నుంచి ప్రజలు హాజరవుతుంటారు. 1974లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని అప్పటి భారత ప్రభుత్వం కచ్చతీవు భూభాగాన్ని శ్రీలంకకు అప్పగించింది. అయితే రాజ్యాంగ సవరణ లేకుండా అప్పగించడంపై వివాదం నడుస్తోంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం, ఇది రామనాథపురం జమీందారిలో భాగంగా ఉండేది. అందుకే ఇది భారత్‌దే అని వాదనలు తొలినాళ్ల నుంచే ఉన్నాయి. తమిళ మత్స్యకారులు ఈ ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే సమయంలో శ్రీలంక నౌకాదళం దాడులు, అరెస్టులు చేస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో ప్రతి ఎన్నికల సమయంలో కచ్చతీవు అంశం చర్చకు వస్తోంది. కానీ శాశ్వత పరిష్కారం మాతరం దొరకడం లేదు. -
దళపతి విజయ్‌పై కేసు పెట్టిన ఫ్యాన్
ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కగళం(TVK) అధినేత విజయ్‌కు ఓ అభిమాని షాకిచ్చాడు. మధురై మహనాడులో తనపై విజయ్ బౌన్సర్లు తనపై దాడి చేశారంటూ ఆయన అభిమానే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వ్యక్తిగత సిబ్బందితోపాటు విజయ్‌పైనా కేసు నమోదు అయ్యింది.ప్రముఖ నటుడు, తమిళిగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ (Actor Vijay)పై కేసు నమోదైంది. ఆగస్టు 21వ తేదీన మదురై పరపతిలో జరిగిన టీవీకే పార్టీ కార్యక్రమంలో తనపై దాడి జరిగిందని శరత్‌కుమార్ అనే అభిమాని ఫిర్యాదు చేశారు. సభ ప్రారంభ సమయంలో వేదికపై విజయ్ వేదిక మీద నడుచుకుంటూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగాడు. ఆ సమయంలో.. కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. విజయ్ నడుస్తున్న వేదికపైకి ఎక్కి హల్చల్ చేశారు. ఈ క్రమంలో.. విజయ్‌కు దగ్గరగా వచ్చిన ఆ వ్యక్తిని బౌన్సర్లు ఎత్తి స్టేజ్ అవతల పారవేసే ప్రయత్నం చేశారు. అయితే అదృష్టవశాత్తూ అతను కింద పడలేదు. ఆ సమయంలో విజయ్ సైతం తన బౌన్సర్లను కాస్త తగ్గమంటూ సైగ చేసి చూపించాడు. అయితే.. ఆ యువకుడు వేదికకు ఉన్న పైప్‌ను పట్టుకుని వేలాడి కిందకి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్ రూపేణా విపరీతంగా వైరల్ అయ్యింది. த.வெ.க மாநாட்டில் தொண்டரை தூக்கி வீசிய பாதுகாவலர்கள்.. நடவடிக்கை எடுக்கக்கோரி கண்காணிப்பாளரிடம் புகார்.. த.வெ.க தொண்டர் வேதனை பேட்டி#TVKManaadu | #Vijay | #Police | #Complaint | #Bouncers pic.twitter.com/AKgg1vdrM3— Polimer News (@polimernews) August 27, 2025 TVK Vijay Manaadu Issue | Perambalur | "பவுன்சர்கள் என்ன தூக்கி கெடாசிட்டாங்க"இளைஞர் பரபரப்பு புகார்#tvkvijay | #Vijay | #tvk | #perambalur | #thanthitv pic.twitter.com/t7WAXyQshW— Thanthi TV (@ThanthiTV) August 27, 2025 దీంతో మనస్తాపం చెందిన శరత్.. నటుడిని కలిసేందుకు వెళ్తుండగా అడ్డుకొన్న బౌన్సర్లు తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపించారు. దీంతో పోలీసులు విజయ్, ఆయన బౌన్సర్లపై కేసు నమోదు చేశారు. ‘‘నేను ఆయన్ని చూసేందుకు వచ్చా. కానీ, ర్యాంప్ నుంచి నన్ను కిందకు తోసేశారు. నాకు గాయాలయ్యాయి. ఘటనకు కారకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాను’’ అని శరత్ తన తల్లితో సహా మీడియాతో మాట్లాడాడు. ఫిర్యాదు ఆధారంగా విజయ్, ఆయన వ్యక్తిగత సిబ్బందిపై బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: స్టాలిన్ అంకుల్.. వెరీ వెరీ రాంగ్ అంకుల్! -
సింహం ఎప్పుడూ సింహమే
సాక్షి, చెన్నై: సింహం ఎప్పటికీ సింహంగానే ఉంటుందని నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ చీఫ్ విజయ్ స్పష్టం చేశారు. బీజేపీ, డీఎంకేలతో ఎన్నికల పొత్తు పెట్టుకోబోమని, ఆ రెండు పార్టీలు తమకు బద్ధ శత్రువులని విమర్శించారు. ఆత్మగౌరవంతోనే ముందుకు సాగుతామన్నారు. తమిళనాడులోని మదురైలో గురువారం జరిగిన పార్టీ రెండో మహాసభకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు మద్దతు కూడగట్టుకోవడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ సభలో ఆయన ప్రసంగించారు. తమ రాజకీయ శత్రువు డీఎంకే కాగా, సైద్ధాంతిక శత్రువు బీజేపీ అని పేర్కొన్నారు. టీవీకే ఎవరికీ భయపడదు, మాఫియా వ్యాపారాలు చేయదు అని వ్యాఖ్యానించారు. తమిళనాడు బలం మొత్తం మనతోనే ఉంది. ఫాసిస్ట్ బీజేపీ, విషపూరిత డీఎంకేకి వ్యతిరేకంగా పోరాడుదాం అంటూ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ‘సింహం ఎప్పుడూ ప్రత్యేకమే. దాని గర్జన 8 కిలోమీటర్ల మేర ప్రతిధ్వనిస్తుంది. వేటకు మాత్రమే బయటకు వస్తుంది. అడవిలో నక్కలు చాలానే ఉంటాయి. సింహం మాత్రం ఒక్కటే. అదే అడవికి రాజు. ఇదే మా స్పష్టమైన ప్రకటన’అని విజయ్ పేర్కొన్నారు.మిస్టర్ పీఎం మోదీజీ.. సీఎం స్టాలిన్ అంకుల్!మిస్టర్ నరేంద్ర దామోదర దాస్ మోదీ జీ అంటూ అని సంబోధించిన విజయ్..తమిళనాడు ప్రజల ఆకాంక్షలను బీజేపీ పట్టించుకోవడం లేదన్నారు. అరెస్టయిన తమిళ జాలర్లను విడిపించాలి..కచ్ఛతీవును తిరిగి స్వాధీనం చేసుకోవాలి, నీట్‌ను రద్దు చేయాలని ఆయన డిమాండ్లు వినిపించారు. బీజేపీది బానిసల కూటమి అని విమర్శలు ఎక్కుబెట్టారు. ఆర్ఎస్ఎస్కు బీజేపీ బానిస అని, బీజేపీకి అనేక రాష్ట్ర పార్టీలు బానిసలుగా మారి మైనారిటీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఆ బానిసలలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ టీవీకే ఉండబోదని స్పష్టం చేశారు. అదేవిధంగా, మైడియర్ అంకుల్ అంటూ సీఎం స్టాలిన్‌ను ఉద్దేశించి విమర్శలను ఎక్కుపెట్టారు. మహిళలకు నెలకు రూ.వెయ్యి ఇస్తే సరిపోతుందా? వాళ్ల రోదనలు వినిపించడం లేదా? పరంధుర్ ఎయిర్‌పోర్టుతో భూములు కోల్పోయిన రైతులు, మత్స్యకారుల ఆవేదన ఆలకించారా? మనస్సాక్షి ఉంటే సమాధానం ఇవ్వండని సవాల్ విసిరారు. మైడియర్ అంకుల్ వినిపిస్తుందా ప్రజా గళం? త్వరలో ప్రజల్లోకి వెళ్తున్నా. మనస్సు విప్పి మాట్లాడుతా..ఇక తమరికి నిద్ర కరువైనట్టే అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలోని మొత్తం 234 స్థానాలలో తానే అభ్యర్థి అని, తనను ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
విజయ్ టీవీకే సభలో తొక్కిసలాట.. పలువురి పరిస్థితి విషమం!
సాక్షి,చెన్నై: కోలీవుడ్ అగ్రనటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన బారీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగింది. మధురైలో గురువారం సాయంత్రం జరుగుతున్న ఈ సభకు సుమారు నాలుగు లక్షల మంది హాజరుకాగా.. తొక్కిసలాటతో 400మంది అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఒకరు మరణించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళగ వెట్రి కగళం(టీవీకే) గురువారం మధురైలో నాలుగు లక్షలమందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. మధురై జిల్లాలోని మధురై-తూత్తుకుడి హైవేలో పరపతిలో టీవీకే రెండవ రాష్ట్ర బహిరంగ సభ జరుగుతోంది. 501 ఎకరాల్లో సచివాలయం ఆకారంలో ఈ సభను ఏర్పాటు చేసింది.ఈ భారీ బహిరంగ సభకు హాజరైన అశేష జనసంద్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఏ పార్టీతో పొత్తుపెట్టుకోవడం లేదని ఇళయదళపతి హీరో విజయ్ ప్రకటించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే బరిలో దిగుతుందని స్పష్టం చేశారు. బీజేపీ, డీఏంకేలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. టీవీకే పార్టీ సిద్ధాంతానికి ఈ రెండు పార్టీలు శత్రువులని పేర్కొంది. -
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మాదే
చెన్నై: వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయం తధ్యమని తమిళ ప్రముఖ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ జోస్యం చెప్పారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం విజయ్ ఎన్నికల శంకరావం పూరించారు. పార్టీని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లేలా మైటీవీకే పేరుతో యాప్‌ను లాంచ్ చేశారు. బుధవారం టీవీకే పార్టీ ప్రధాన కార్యాలయం పనయూర్‌లో బూత్ లెవల్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో విజయ్ మాట్లాడారు. రాష్ట్రంలో జరగనున్న 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మేం భారీ విజయం సాధిస్తాం. టీవీకే తరహా కొత్త పార్టీలు 1967,1977 జరిగిన నాటి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాయి. ఆ రెండు దఫాల ఎన్నికల్లో అప్పటికే రాష్ట్రంలో బలమైన పార్టీలను.. ఈ కొత్త పార్టీలు ఓటమిని రుచిచూపించాయి. ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కంజీవరం నటరాజన్ అన్నాదురై సిద్ధాంతాల్ని ప్రస్తావించారు. అన్నాదురై తరహాలో ప్రజల్ని కలవబోతున్నాం. ప్రజల్లో ఉండటం, వారితో ప్రణాళికలు రచిచడం, ప్రజల కోసం జీవించడం. ఈ పనిలు సరిగ్గా చేస్తే ఎన్నికల్లో విజయం ఖాయం. దీంతో పాటు ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా ఎన్నికల్లో గెలవగలం. అందుకే మై టీవీకే పేరుతో యాప్ లాంచ్ చేసినట్లు చెప్పారు. ఈ యాప్ ద్వారా ప్రజల్లోకి పార్టీ చొచ్చుకుని పోయేలా కార్యకలాపాలు నిర్వహించనున్నాం’ అని తెలిపారు -
రాజకీయాల్లోకి కీర్తి సురేష్.. ఆ పార్టీలో చేరనుందా?
సినీ కథానాయికలు ఎప్పుడు ఏ అవతారం ఎత్తుతారో చెప్పడం సాధ్యం కాదు. నటి కీర్తి సురేష్ గురించి ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. బాలనటిగా రంగప్రవేశం చేసిన ఈమె ఒక సమయంలో ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఆశ పడ్డారట. ఓ భేటీలో తన ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. అయితే కథానాయికిగా రంగ ప్రవేశం చేసి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఇదు ఎన్నమాయం చిత్రంతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ తొలి చిత్రం ఆశించిన విజయాన్ని అందించింది. ఆ తరువాత నటించిన చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో స్టార్ హీరోయిన్ స్టేటస్‌కు చేరుకున్నారు. అలాగే తెలుగులో మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించి ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. ఆ తరువాత బాలీవుడ్ ప్రేక్షకులను బేబీ జాన్ చిత్రంతో పలకరించారు. అలాగే తన 15 ఏళ్ల స్నేహితుడిని గత ఏడాది చివరిలో పెళ్లి చేసుకుని ఇల్లాలుగా మారారు. ఆ కారణం చేతనో, వరుస అపజయాల కారణంగానో కీర్తి సురేష్‌కు అవకాశాలు తగ్గాయి. వివాహానంతరం ఈ బ్యూటీ కొత్త చిత్రం ఏదీ చేయలేదు. అంతకు ముందు నటించిన ఉప్పు కారం అనే చిత్రం ఇటీవలే ఓటీటీలో విడుదల అయ్యింది.సినిమా అవకాశాలు తగ్గినా కమర్షియల్‌గా నటిస్తూ బిజీగానే ఉన్నారు. కాగా ఇటీవల ఈమె మదురైలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. అక్కడ ఆమెను చూడగానే కొందరు అభిమానులు టీవీకే..టీవీకే అంటూ నటుడు విజయ్ పార్టీ పేరు చెబుతూ కేకలు పెట్టారు. అందుకు కారణం లేకపోలేదు. కీర్తిసురేష్ నటుడు విజయ్‌కు జంటగా రెండు చిత్రాల్లో నటించారు. దీంతో కీర్తి సురేష్ నటుడు విజయ్ ప్రారంభించిన టీవీకే పార్టీలో చేయబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో సమాచారం వైరల్ అయ్యింది. దీనిపై కీర్తి సురేష్ స్పందించలేదు. దీంతో ఆమెకు రాజకీయాలపై ఆసక్తి ఉందని, విజయ్ పార్టీలో చేరడానికి సిద్ధం అవుతున్నారని ప్రచారం జోరందుకుంది. అందుకే విజయ్ అభిమానులు ఆమెను చూడగానే టీవీకే అంటూ కేకలు పెట్టారు. మరి నటి కీర్తి సురేష్ నిర్ణయం ఏమిటో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. -
టీవీకే సీఎం అభ్యర్థిగా నటుడు విజయ్
తమిళగ వెట్రి కళగం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ అధినేత, ప్రముఖ నటుడు విజయ్(Joseph Vijay Chandrasekhar) పేరును శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.శుక్రవారం ఉదయం చెన్నైలోని పార్టీ ప్రధానకార్యాలయంలో విజయ్ అధ్యక్షతన టీవీకే పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో విజయ్ను సీఎం అభ్యర్థిగా ఎన్నుకుంది టీవీకే కార్యవర్గం. అలాగే.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. అంతేకాదు పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. ‘‘బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోంది. ఆ పార్టీ విష రాజకీయాలు తమిళనాడులో చెల్లవు. ఈ ఎన్నికల్లో వేర్పాటువాదులతో పొత్తు ఉండదు’’:::విజయ్ వచ్చే నెలలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని, అటుపై ఎన్నికల దాకా గ్రామగ్రామాన బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. విజయ్ను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకెళ్లేందుకు అవసరమయ్యే కార్యాచరణను సిద్ధం చేయడానికి, దానిని అమలు చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని టీవీకే భావిస్తోంది.అంతేకాదు.. తాజాగా అమిత్ షా చేసిన ఆంగ్ల భాష కామెంట్లు.. తమిళనాడుపై నేరుగా చేసిన దాడిగా టీవీకే పేర్కొంటూ ఖండించింది. బలవంతంగా హిందీని, సంస్కృత భాషను తమిళనాడులో ప్రవేశపెట్టే ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తీర్మానంలో టీవీకే స్పష్టం చేసింది. అలాగే.. ఎలక్టోరల్ రివిజన్ చేపట్టాలన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని టీవీకే తప్పుబట్టింది. ఇది బీజేపీకి అనుకూలంగా జరుగుతున్న ప్రయత్నమేనని, రాష్ట్రంలో మైనారిటీల ఓట్లను తగ్గించే ప్రయత్నమేనని ఆరోపించింది. భారత సినీ పరిశ్రమలో అగ్రహీరోగా కొనసాగుతున్న విజయ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి తమిళనాట మాత్రమే కాదు.. యావత్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అనూహ్యంగా.. 2024 ఫిబ్రవరి 2వ తేదీన సెక్యులర్ సోషియల్ జస్టిస్ అనే సిద్దాంతంతో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని విజయ్ ప్రకటించారు. అదే ఏడాది అక్టోబర్ 27న విల్లుపురం జిల్లా విక్రవండిలో తొలి రాజకీయ మహాసభ నిర్వహించగా.. అది సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ మహాసభ వేదికగా.. తన పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు ప్రకటించారాయాన. పెరియార్, అంబేడ్కర్, కామరాజ్, వేలు నాచియార్ తదితరుల ఆశయాలపై నడుస్తానని స్పష్టం చేశారు. అప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. నీట్, జాతీయ నూతన విద్యా విధానం.. త్రిభాషా సిద్ధాంతం అమలు లాంటి అంశాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందిస్తూ రాజకీయంగానూ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. -
అజిత్ కుమార్ కుటుంబాన్ని ఓదార్చిన విజయ్
సాక్షి, చెన్నై: ఒకప్పుడు ప్రజల రక్షణకు ప్రతీకగా నిలిచిన ఖాకీ యూనిఫాం.. ఇప్పుడు అమానవీయ ఘటనలకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తమిళనాడు శివగంగై జిల్లాలో పోలీసుల చిత్ర హింసలకు ప్రాణాలు అజిత్ కుమార్ (28) కుటుంబాన్ని తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, ప్రముఖ నటుడు విజయ్ (Vijay) పరామర్శించారు. బుధవారం మదపురంలోని బాధితుడు అజిత్ కుమార్ కుటుంబాన్ని కలిశారు. అజిత్ కుమార్ ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందించడంతో పాటు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం, విజయ్ మాట్లాడుతూ.. ఇలాంటి అమానవీయ ఘటనలు జరుగకూడదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై హైకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు (SIT) వేయాలని డిమాండ్ చేశారు.తమిళనాట యువకుడు అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్ సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. అజిత్ కుమార్ (27) అనే యువకుడు శివగంగై జిల్లాలోని మదపురం భద్రకాళి అమ్మన్ ఆలయంలో తాత్కాలిక భద్రతా సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ క్రమంలో జూన్ 27న ఓ మహిళ తన బంగారు ఆభరణాలు పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ నిమిత్తం పోలీసులు అజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టారు. అజిత్‌పై పోలీసుల అమానుషంవిచారణ పూర్తి కావడంతో అజిత్‌ను పోలీసులు వదిలేశారు. మళ్లీ మరోసారి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల తర్వాత అంటే జూన్ 29న బాధితుడికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పోలీసులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మరణించారు. కానీ పోస్టు మార్టం నివేదికలో మాత్రం పోలీసులు తీరుపై అనుమానాలు వెల్లువెత్తాయి. పోస్టుమార్టం నివేదికలో అజిత్ కుమార్ తల, ఛాతీ, శరీరంపై 30 నుంచి 40 వరకు గాయాలైన ముద్రలు ఉన్నట్లు తేలింది. లాఠీ దెబ్బలు, చింతపండు పొడి నోట్లో, ప్రైవేట్ పార్ట్స్‌లో నింపడం వంటి అమానుష చర్యలు జరిగినట్లు తేలింది. సివిల్ డ్రెస్‌లో పోలీసులు..అజిత్‌పై దాడిమరణం అనంతరం వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజీల్లో సైతం అజిత్ కుమార్ పోలిస్ స్టేషన్‌కు వెళ్లే ముందు ఆరోగ్యంగా ఉన్నాడు. కానీ పోలీసుల చిత్ర హింసలతో తీవ్రంగా గాయపడిన స్థితిలో బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది. సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీసులు అజిత్ కుమార్‌ను అతను పనిచేసే భద్రకాళి అమ్మన్ ఆలయం వెనక్కి తీసుకెళ్లి కొడుతున్న దుశ్యాలు వెలుగులోకి రావడం కలకలం రేగింది. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులపై చర్యలకు ఉపక్రమించింది.#Shocking A video has surfaced showing police attacking Ajith Kumar, a youth from Sivaganga. The police's First Information Report (FIR) claimed that Ajith died due to epilepsy and injuries sustained from a fall. #AjithkumarMysteryDeath #CustodyDeath @TheFederal_News pic.twitter.com/otW1AicDGZ— Mahalingam Ponnusamy (@mahajournalist) July 1, 2025ఎస్పీ అశిష్ రావత్‌పై వేటు అజిత్ కుమార్ మరణానికి కారణమైన ఐదుగురు పోలీసుల్ని తమిళనాడు పోలీస్ శాఖ అదుపులోకి తీసుకుంది. హెడ్ కానిస్టేబుళ్లు కన్నన్, ప్రభు, కానిస్టేబుళ్లు రాజా, ఆనంద్, శంకరమణికంతో పాటు వారికి సహకరించిన డ్రైవర్ రామచంద్రన్‌ను సస్పెండ్ చేసింది. శివగంగై ఎస్పీ అశిష్ రావత్‌పై వేటు వేసి.. రామనాథపురం ఎస్పీకి అదనపు బాధ్యతలు అప్పగించింది.మరోవైపు లాకప్ డెత్‌లో మరణించిన అజిత్ కుమార్ కేసును మద్రాస్ హైకోర్టు విచారించింది. విచారణలో ఓ హంతకుడు కూడా ఇలా దాడి చేయడూ అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎం స్టాలిన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి సీబీ సీఐడీ విచారణకు ఆదేశించారు. బీజేపీ,ఏఐడీఐఏంకేతో పాటు ఇతర పార్టీలు సీబీఐ విచారణ కోరుతున్నాయి. -
తమిళ పాలిటిక్స్.. పార్టీ నేతలకు విజయ్ కీలక ఆదేశాలు
సాక్షి, చెన్నై: పార్టీ పరంగా కమిటీలు, పదవుల భర్తీ ప్రక్రియలన్నీ ఈ నెలాఖరులోపు ముగించే విధంగా ముఖ్య నేతలకు తమిళగ వెట్రి కళగం నేత విజయ్ ఆదేశాలు ఇచ్చారు. పార్టీ కార్యక్రమాలను జూన్ నుంచి విస్తృతం చేయడానికి సిద్ధమయ్యారు. పార్టీ ఏర్పాటుతో జిల్లాల కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీలను విజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో ముఖ్య పదవులన్నీ దాదాపుగా భర్తీ అయ్యాయి. ఇతర కమిటీలలో కొన్ని పదవుల భర్తీ కసరత్తులు జరుగుతున్నాయి. ఎన్నికలకు మరికొన్ని నెలలు ఉన్న దృష్ట్యా, ఇక ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యాచరణలో విజయ్ ఉన్నారు.ప్రస్తుతం విజయ్ నటిస్తున్న జననాయగన్ చిత్ర షూటింగ్ ఈనెలతో ముగియనున్నట్టు తెలిసింది. ఆ తర్వాత జూన్ మొదటి వారం నుంచి విజయ్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా ప్రజల్లో ఉండబోతున్నారు. ఇందులో భాగంగా విజయ్ పర్యటనలకు సంబంధించి గత రెండు రోజులుగా చెన్నైలో జిల్లాల కార్యదర్శుల సమావేశం విస్తృతంగా సాగుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ పర్యవేక్షణలో ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ పరంగా అన్ని ప్రక్రియలను, పదవుల భర్తీని ఈ నెలాఖరులోపు ముగించాలని విజయ్ ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. జూన్ నుంచి ఆయన పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండబోతున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ సైతం సిద్ధమవుతోంది. -
విజయ్‌కు 105 సీట్లు?
సాక్షి, చెన్నై: విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీకి రానున్న ఎన్నికలలో 105 సీట్లలో గెలుపు ఖాయం అన్నది వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా మూడు నెలలుగా సాగిన సర్వే ఆధారంగా ఈ వివరాలు సోమవారం బయట పడ్డాయి. గత ఏడాది విజయ్ తమిళగ వెట్రికళగం పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత క్రమంగా పార్టీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు. పార్టీ ఆవిర్భావ వేడుక అనంతరం కొంత కాలం విజయ్ సినీమా షూటింగ్ బిజీలో పడ్డారు. గత మూడు నాలుగు నెలలుగా పార్టీ కార్యక్రమాలపై మళ్లీ దృష్టి పెట్టి, ప్రజలలోకి దూసుకెళ్లే కార్యాచరణలో ఉన్నారు. ఆ పార్టీ వర్గాలు విజయ్ పార్టీ పేరు, జెండాను విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టారు. బూత్ కమిటీలు తమ పనిని వేగవంతం చేశారు. ఇక, విజయ్ ప్రజా పర్యటనకు కార్యచరణలో ఉన్నారు. ఈ షెడ్యూల్ త్వరలో వె లువడనుంది. ఈ పరిస్థితులలో గత మూడు నెలలుగా సోషల్ మీడియాతో పాటూ పలు వర్గాల నుంచి ఓ సంస్థ సేకరించిన అభిప్రాయాలు, నిర్వహించిన సర్వే మేరకు తాజాగా విజయ్ కు 105 సీట్లు ఖాయం అన్న సమాచారం చర్చకు దారి తీసింది. ఈ సర్వే మేరకు 2026 అసెంబ్లీ ఎన్నికలలో విజయ్‌కు 95 నుంచి 105 సీట్లతో ఆపటుగా 34.55 శాతం ఓట్లు దక్కబోతున్నట్టుగా సామాజిక మాధ్యమంలో సమాచారం వైరలైంది. అలాగే డీఎంకే కూటమికి 75 నుంచి 85 స్థానాల వరకు 30.20 శాతం ఓటింగ్‌తో, అన్నాడీఎంకేకు 55 నుంచి 65 సీట్లు 28.85 శాతం ఓట్లతో దక్కే అవకాశాలు ఉన్నాయన్న ఈ సమాచారం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. తమకు అనుకూలంగా సర్వేలు వస్తుండడంతో మరింతగా శ్రమించేందుకు తమిళగ వెట్రి కళగం వర్గాలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా తమ తమ ప్రాంతాలలో గోడ ప్రచారాలను విస్తృతం చేయడానికి చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ప్రైవేటుకు చెందిన ప్రహరీ గోడలు, ప్రదేశాలలో గోడ ప్రచారం కోసం ముందస్తుగా బుక్ చేసుకుంటుండడం గమనార్హం. -
హీరోపై అభిమానంతో పిచ్చి పని.. కానిస్టేబుల్ సస్పెన్షన్
భద్రతా విధుల్లో ఉండాల్సిన ఒక పోలీసు కానిస్టేబుల్ తన అభిమాన హీరో కోసం వెళ్లి సస్పెండ్ అయ్యాడు. తమిళగ వెట్రి కళగం నేత విజయన్ను కలిసిన పోలీసు కానిస్టేబుల్ కదిరవన్‌ను సస్పెండ్ చేస్తూ మధురై పోలీసు కమిషనర్ లోకనాథన్ ఆదేశాలు జారీ చేశారు. విజయ్ ప్రస్తుతం కొడైకెనాల్లో జన నాయగన్ షూటింగ్ బిజీలో ఉన్నారు. ఆయన కోసం అభిమానులు కొడైకెనాల్‌కు పోటెత్తుతున్నారు. అదే సమయంలో మదురై మీనాక్షి అమ్మవారి ఆలయ ఉత్సవాలు జరుగుతున్నాయి. దీంతో కదిరవన్‌కు అక్కడ డ్యూటీ వేశారు. అయితే, భద్రతా విధులలో ఉండాల్సిన కానిస్టేబుల్ సెలవు పెట్టి మరీ కొడైకెనాల్లో పత్యక్షం కావడం చర్చకు దారి తీసింది. యూనిఫాంను పక్కన పెట్టి తానో అభిమాని అని చాటుకునే దిశగా ఆయన విజయ్ను కలిసి వచ్చారు. అయితే, విధులను పక్కన పెట్టినందుకు గాను కదిరవన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రజల కోసం పనిచేయాల్సిన కదిరవన్ తన యూనిఫామ్‌ను తొలగించి విజయ్ రాజకీయ పార్టీ కండువాను ధరించాడు. ఆపై ఆయనతో ఫోటోలు దిగాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. -
వక్ఫ్ సవరణ చట్టంపై హీరో విజయ్ కీలక నిర్ణయం
ఢిల్లీ: సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 4న పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ చట్టంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ అంశాన్ని ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలతో పాటు పలువురు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో తాజాగా విజయ్ సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ వారంలో సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. సుదీర్ఘ చర్చ, తీవ్రస్థాయి వాదోపవాదాల అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు–2025పై పార్లమెంటు ఆమోదముద్ర పడింది. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్యే లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించడం తెలిసిందే.రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. 13 గంటలకు పైగా జరిగిన చర్చ అనంతరం ఓటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా జరిగింది. దాదాపుగా ప్రతి సవరణపైనా ఓటింగ్‌కు విపక్షాలు పట్టుబట్టాయి. వాటి సవరణలన్నీ వీగిపోయాయి. చివరికి బిల్లు ఆమోదం పొందింది. దానికి అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. వక్ఫ్ బిల్లును లోక్‌సభ 288–232 ఓట్లతో ఆమోదించడం తెలిసిందే. వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేశారు. రాష్ట్రపతి సంతకంతో చట్టంగా రూపుదాల్చింది. -
విజయ్-పీకే జోడి.. హిట్టయ్యేనా? (చిత్రాలు)
-
‘ఏంటి బ్రో ఇది.. ఎల్కేజీ,యూకేజీ పిల్లల కొట్లాటలా ఉంది’
చెన్నై: ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం,బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మధ్య తారా స్థాయికి చేరిన త్రీభాషా సూత్రం వివాదంపై ప్రముఖ హీరో, తమిళగ వెట్రి కళగం (టీవీకే)అధినేత విజయ్ విమర్శలు గుప్పించారు. తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదాన్ని చిన్న పిల్లల కొట్లాటతో పోల్చారు.వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో అత్యధిక అసెంబ్లీ స్థానాల్ని కైవసం చేసుకునే దిశగా, వీలైతే అధికారంలోకి వచ్చేలా టీవీకే అధ్యక్షుడు విజయ్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం టీవీకే తొలి వార్షికోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా విజయ్ జాతీయ విద్యావిధానం – 2020 (NEP-2020) పై మాట్లాడారు. త్రిభాషా సూత్రం ప్రకారం.. రాష్ట్రాలు తప్పనిసరిగా త్రిభాషా (హిందీ, ఇంగ్లిష్, ప్రాంతీయ భాష) సూత్రాన్ని అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానం అమలు చేయకపోతే కేంద్రం రాష్ట్రాలకు నిధులు కేటాయించమని కేంద్రం ప్రకటించిందంటూ వస్తోన్న ఆరోపణలపై నవ్వారు. త్రిభాషను అమలు చేయాలని కేంద్రం అనడం.. హిందీ కారణంగానే ఉత్తరాదిలో ప్రాంతీయ భాషల పరిధి తగ్గుతుందని, దాన్ని అమలు చేయబోమని డీఎంకే అనడం ఎల్కేజీ, యూకేజీ పిల్లల గొడవలా ఉందని వ్యాఖ్యానించారు. త్రిభాషా సూత్రంపై సోషల్ మీడియాలో డీఎంకే, బీజేపీ చేస్తున్నక్యాంపెయిన్‌ను తప్పుబట్టారు. వీళ్లు సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్‌తో కుటిల రాజకీయం చేస్తున్నారు. ఒకరు డ్యాన్స్ చేస్తుంటే.. మరొకరు పాటపాడుతున్నారు. వీళ్లిద్దరి గొడవ ఎల్కేజీ, యూకేజీ పిల్లల కొట్లాటలా ఉంది. సోషల్ మీడియాలో పోరాటం చేస్తూ మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి బ్రో .. ఇది.. చాలా తప్పు బ్రో అని ఎద్దేవా చేశారు.అదే సమయంలో త్రిభాషా విధానాన్ని విజయ్ వ్యతిరేకించారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. తాము అన్ని భాషలను గౌరవిస్తామని, తమిళనాడు భాషా విధానాన్ని భంగపరిచే ఉద్దేశ్యంతో రాజకీయంగా ఏ భాషనైనా బలవంతంగా రుద్దేందుకు యత్నిస్తే మాత్రం వ్యతిరేకిస్తామన్నారు. త్రిభాష సూత్రం అమలును అంగీకరించకపోతే.. తమిళనాడుకు రావాల్సిన 2 వేల400 కోట్ల నిధులను కేంద్రం నిలిపివేస్తామనడం సరికాదన్నారు. కేంద్రం నుంచి ఆ నిధులను పొందడం తమ హక్కు అని ఆయన అన్నారు.రెండు పార్టీలపై సెటైర్లు వేస్తూ బీజేపీ,డీఎంకేలు.. అవి ఫాసిజం, పాయసం లాంటివి.. వాళ్లు ఫాసిజం, ఫాసిజం, ఫాసిజం అని మాట్లాడుతారు. అవి ఏంటి? పాయసమా? అంటూ సెటైర్లు వేశారు విజయ్. -
#GETOUT: తమిళనాట పొలిటికల్ హీట్.. విజయ్, పీకే ప్లానేంటి?
చెన్నై: తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. నేడు సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ మొదటి ఆవిర్భావ దినోత్సవం. ఈ నేపథ్యంలో చెన్నైలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు పార్టీ చీఫ్ విజయ్. ఈ కార్యక్రమానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాజరవుతున్నారు. దీంతో, తమిళ పాలిటిక్స్ రసవత్తరంగా మారింది.కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీని స్థాపించి ముందుకు సాగుతున్నారు. నేడు పార్టీ మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. చెన్నైలోని మామల్లపురంలో భారీ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు దాదాపు మూడు వేల మంది ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ఈ క్రమంలో పాస్‌లను సైతం అందించారు. ఇక తమిళనాడులో వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీలతో పొత్తులపై, ప్రచార యాత్రలపై విజయ్ కీలకమైన ప్రకటన చేస్తారని సమాచారం. పార్టీ అధ్యక్షుడు నటుడు విజయ్ సహా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో పాటు టీవీకే ఇతర ముఖ్య నేతలు ఈ సభకు హాజరుకానున్నారు. దీంతో, వేదికపై నుంచి కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.தமிழக மக்களின் தலையெழுத்தை மாற்றப்போகும் கையெழுத்து ❤️#Getout #TVKForTN pic.twitter.com/3yAUgiQqZ7— Mʀ.Exᴘɪʀʏ (@Jana_Naayagan) February 26, 2025హాట్ టాపిక్ బ్యానర్..మరోవైపు.. టీవీకే పార్టీ ఆవిర్భావ వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మొత్తం 6 అంశాలను ప్రస్తావించారు. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తూ #GETOUT అనే హ్యాష్ ట్యాగ్‌ను చేర్చారు. ఈ బ్యానర్‌పై విజయ్ సంతకం కూడా చేశారు. అందులో మహిళల భద్రత, సంక్షేమానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాలు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. ఇక నియంతృత్వ పాలనను సాగిస్తూ ప్రజా గొంతులను అణిచివేయడం, ఓటు బ్యాంకుల కోసం కులమతాల పేరుతో ప్రజలను విడగొట్టడాన్ని కూడా ఈ పోస్టర్లో పేర్కొన్నారు. పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఆర్భాటాలు చేస్తున్నారని ఆరోపించారు. నూతన విద్యా విధానం, త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా పోరాడటానికి ప్రతిజ్ఞ చేద్దామని కూడా ఆ పోస్టర్లో ఉంది.அமைதியான அரசியலை உருவாக்கும் அமைதியான தலைவன்!#GetOut #vijay #tvk pic.twitter.com/AZQXVGVZZB— தமிழச்சி TVK (@tvkvijay_4tn) February 26, 2025 என் நெஞ்சில் குடி இறுக்கும்.... 🔥🥹#TVKForTN #TVKVijay @TVKVijayHQ #தமிழகவெற்றிக்கழகம்#இரண்டாம்_ஆண்டில்_தவெக#Getout pic.twitter.com/mFysxwb0IL— MASTER_JD_❤️🔥 (@badlucksarath12) February 26, 2025 -
విజయ్ Y కేటగిరీ భద్రతపై రాజకీయ దుమారం
చెన్నై: అగ్రనటుడు, టీవైకే పార్టీ అధినేత విజయ్‌కు కేంద్రం ‘వై’ కేటగిరీ భద్రతను కేటాయించింది. రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా మారడం, పైగా తరచూ జనాల్లోకి వెళ్తుండడంతో ఆయన ప్రాణాలకు ముప్పు కలగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంతోనే హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది.నటుడు, రాజకీయనేత అయిన విజయ్(Vijay)తో పాటు పలువురు ప్రముఖుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తాజాగా కేంద్ర హోం శాఖకు నివేదికలు ఇచ్చాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో(Intelligence Bureau) సూచనల మేరకు వాళ్లందరికీ ‘ఎక్స్, వై, జెడ్’ కేటగిరీల కింద ప్రత్యేక భద్రత కల్పించేందుకు కేంద్ర హోం శాఖ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఫిబ్రవరి 13వ తేదీన ఓ నోటిఫికేషన్ కూడా రిలీజ్చేసింది. తాజా నిర్ణయంతో.. ఒకరు లేదా ఇద్దరు కమాండోలతో పాటు 8-11 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది విజయ్‌కు భద్రతగా ఉండనున్నారు. అయితే..ఈ వ్యవహారం(Vijay Security Row) తమిళనాట రాజకీయ విమర్శలకు దారి తీసింది. విజయ్‌కు రాష్ట్ర ప్రభుత్వమే ఇలాంటి భద్రత ఎందుకు కల్పించలేకపోయిందని బీజేపీ ప్రశ్నలు సంధించింది. ‘‘విజయ్ తమిళనాట ప్రజాదరణ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి భద్రతకు ముప్పు పొంచి ఉందనే సమాచారం ఉన్నప్పుడు.. ఇక్కడి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. డీఎంకే ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించేందుకు ముందుకు రావొచ్చు కదా?’’ అని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ప్రశ్నించారు. దీనిపై డీఎంకే నుంచి బదులు రావాల్సి ఉంది.మరోవైపు.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో విజయ్ను ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీ ఆడుతున్న డ్రామా ఇదని అన్నాడీఎంకే(AIADMK) ఆరోపిస్తోంది. నిజాయితీగా విజయ్‌కు కేంద్రం భద్రతను ఇచ్చి ఉంటే ఫర్వాలేదు. కానీ, రాజకీయం కోసం చేసి ఉంటే మాత్రం.. తమిళనాడులో అలాంటి పాచికలు పారవు’’ అని అన్నాడీఎంకే నేత మునుస్వామి చురకలటించారు.కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కు తమిళనాడులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కిందటి ఏడాది ఫిబ్రవరిలో తమిళగ వెట్రి కజగం అనే పార్టీని ప్రకటించారు. రాష్ట్రంలో డీఎంకే, కేంద్రంలోని బీజేపీకి తన పార్టీ ప్రత్యామ్నాయమని ప్రకటించారాయన. ఆ మధ్య నిర్వహించిన ఓ బహిరంగ సభకు అశేషమైన స్పందన లభించింది కూడా. తరచూ జనాల్లో వెళ్తున్నారు కూడా. ఇక విజయ్ కదలికలను రాజకీయ వర్గాలు నిశితంగా పరిశీలిస్తూ వస్తున్నాయి. అలాగే.. మాజీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తోనూ ఆయన తరచూ భేటీ అవుతూ వస్తున్నారు. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలనే లక్ష్యంగా ఆయన టీవీకేను ముందుకు తీసుకెళ్తున్నారు.ఇదీ చదవండి: కళ్లు చెదిరిపోయేలా.. జయలలిత ఆస్తులు! -
విజయ్ పార్టీలో ఆటో డ్రైవర్‌కు కీలక పదవి
సాక్షి, చెన్నై: నాగరిక రాజకీయం అంటూ ముందుకు సాగుతున్న తమిళగ వెట్రి కళగం నేత విజయ్ తన పార్టీ రూపు రేఖలను వినూత్నంగా తీర్చిదిద్దుతున్నారు. సూట్ కేసులతో విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చే వారిని పక్కన పెట్టి, తన అభిమానిగా చేసిన సేవలకు గుర్తింపు ఇస్తున్నారు. ఇందులో భాగంగా చెన్నైలో ఓ జిల్లాకు ఆటోడ్రైవర్‌ను కార్యదర్శిగా నియమించారు. కోయంబత్తూరులో దివ్యాంగుడికి జిల్లా కార్యదర్శి పదవి కేటాయించారు. గృహిణిగా ఉన్న తన వీరాభిమానికి రామనాధపురం జిల్లా కార్యదర్శి పదవి అప్పగించారు. వివరాలు.. తమిళగ వెట్రి కళగం ఆవిర్భావం, జెండా ఆవిష్కరణ, మహానాడు నిర్వహణ అంటూ అన్నీ వినూత్నంగా విజయ్ నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. 2026 అసెంబ్లీ ఎన్నికలే తన లక్ష్యం అంటూ ముందుకు సాగుతున్న ఆయన ప్రజా ప్రయాణానికి శ్రీకారం చుట్టినా, ఇంకా పూర్తిస్థాయిలో రాజకీయాలతో ప్రజలలోకి చొచ్చుకెళ్లలేదు. ఇందుకోసం కసరత్తులు జరుగుతున్నాయి. అదే సమయంలో పార్టీ పరంగా జిల్లాల కమిటీల ఏర్పాటును విస్తృతం చేశారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, కొన్ని చోట్ల రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక జిల్లా, మరికొన్ని చోట్ల మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక జిల్లాను తీర్చిదిద్ది కమిటీలను ప్రకటిస్తూ వస్తున్నారు. ఒక్కో జిల్లాకు ఒక కార్యదర్శి, ఒక సంయుక్త కార్యదర్శి, ఒక సహాయ కార్యదర్శి, ఒక కోశాధికారితో పాటూ 10 మంది సర్వ సభ్య సమావేశం సభ్యులను నియమిస్తున్నారు. ఈ పది మందిలోనూ నలుగురు మహిళలను తప్పనిసరిగా నియమిస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు విడతలుగా కార్యదర్శులు జాబితాను విడుదల చేశారు. ప్రతి విడతలతోనూ 19 చొప్పున జిల్లాలకు కమిటీలు ఉంటూ వచ్చాయి.సాధారణ కార్యకర్తలకు గుర్తింపు ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు తన అభిమాన సంఘాల్లో శ్రమిస్తున్న సాదాసీదా వ్యక్తులను గుర్తించి వారికి పదవులు అప్పగిస్తుండటం విశేషం. ఇందులో భాగంగా దక్షిణ చెన్నై ఉత్తర జిల్లా కార్యదర్శి టీ నగర్‌కు చెందిన కె. అప్పును నియమించారు. ఈ అప్పు ఆటో డ్రైవర్, రోజు వారి ఆటో నడపడం ద్వారా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. విజయ్ను గుండెల్లో పెట్టుకుని ఆయనే సర్వం అని ముందుకెళ్తూ వచ్చిన అప్పుకు పార్టీలో గుర్తింపు కల్పించారు. జిల్లా కార్యదర్శి పదవి అప్పగించి, రాజకీయ ప్రయాణానికి అవసరమయ్యే అన్ని బాధ్యతలను పార్టీ చూసుకునే దిశగా ఏర్పాట్లు చేయడం విశేషం. అలాగే, కోయంబత్తూరు తూర్పు జిల్లా కార్యదర్శిగా దివ్యాంగుడైన బాబును నియమించారు. మూడు చక్రాల వాహనంలో తిరుగుతూ విజయ్ కోసం ప్రాణాలరి్పంచేందుకు సిద్ధం అని చెప్పుకుంటూ వచ్చిన బాబును గుర్తించి పదవి అప్పగించడం మరో విశేషం. ఇక, తనకు వీరాభిమానిగా ఉన్న గృహిణి మలర్ వెలి జయబాలను గుర్తించి రామనాథపురం జిల్లా కార్యదర్శి పదవిని అప్పగించారు. పదవులు తమకంటే తమకు ఇవ్వాలని అనేక మంది తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వస్తుంటే, తనకు నిజమైన సేవకులుగా ఉండే వారిని గుర్తించి విజయ్ పదవులను అప్పగిస్తుండడం గమనార్హం. విజయ్ అభిమానాన్ని చూస్తారేగానీ, నోట్లను, షూట్ కేసులను కాదు అని ఆటో డ్రైవర్ అప్పు పేర్కొంటున్నారు. తన లాంటి వారికి రాజకీయ గుర్తింపు కలి్పంచే విధంగా పదవి అప్పగించిన విజయ్ను సీఎం చేయడమే లక్ష్యంగా శ్రమిస్తానని దివ్యాంగుడైన బాబు పేర్కొంటున్నారు. -
రాజకీయం ‘అదిరింది’.. అమిత్ షాకు విజయ్ కౌంటర్
చెన్నై: బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే అమిత్ షా వ్యాఖ్యలకు ఇండియా కూటమి నేతలు కౌంటర్ ఇవ్వగా తాజాగా తమిళనాడు నేత, నటుడు విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షాను టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేశారు.అమిత్ షా వ్యాఖ్యలపై తమిళగ వెట్రి కళగం నేత విజయ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘అంబేడ్కర్ పేరు వింటే కొందరికి అలర్జీ. ఆయన సాటిలేని రాజకీయ మేధావి. స్వేచ్ఛా వాయువులు పీల్చిన భారత ప్రజలందరూ అంబేద్కర్‌ను గౌరవించారు. అంబేద్కర్ అనే పేరు వింటే మనసు, పెదవులకు సంతోషంగా ఉంటుంది. ఆయనను అవమానించడాన్ని సహించబోమంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన బీజేపీనే టార్గెట్ చేసి ఇలా కామెంట్స్ చేశారని పలువురు చెబుతున్నారు.Our TVK President @tvkvijayhq strongly condemned the Union Home Minister Amit Shah for disrespecting Ambedkar, our ideological leader. He said such insults are unacceptable and expressed his disapproval on behalf of the Tamilaga Vettri Kazhagam 🙏🏼🔥 pic.twitter.com/SzKpJ05laV— velpparsuriya (@SuriyaCreation3) December 18, 2024ఇదిలా ఉండగా.. నటుడు విజయ్ తన రాజకీయ పార్టీ టీవీకే పార్టీ మొదటి ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా అంబేద్కర్ తన పార్టీ సైద్దాంతిక గురువు అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. విజయ్ వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అంతకుముందు పార్లమెంట్ సమావేశాల సందర్బంగా అమిత్ షా క్షమాపణలు చెప్పాలంటూ విపక్షాలు నిరసనలకు దిగాయి. దీంతో, పార్లమెంటు ఉభయ సభలు బుధవారం దద్దరిల్లాయి. సభలోనే కాకుండా బయటా ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేశాయి. అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండు చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీనే ఇప్పటిదాకా అంబేడ్కర్‌ను అవమానిస్తూ వస్తోందని, తామే ఆయనను సంపూర్ణంగా గౌరవిస్తున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.ఇదే సమయంలో తన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందని అమిత్ షా వివరణ ఇచ్చారు. పదే పదే అంబేడ్కర్ పేరును జపించే బదులు.. ఏ దేవుడిని స్మరించుకున్నా ఏడు జన్మలదాకా స్వర్గ ప్రాప్తి లభించేదని అమిత్ షా మంగళవారం రాజ్యసభలో వ్యాఖ్యానించినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. అయితే తమకు అంబేడ్కరే దేవుడని ఆ పార్టీ స్పష్టం చేస్తూ అమిత్ షా క్షమాపణలు చెప్పడంతోపాటు రాజీనామా చేయాలని లేదంటే ప్రధాని ఆయనను తొలగించాలని డిమాండు చేసింది. కాంగ్రెస్‌కు బుధవారం విపక్షాలు తోడవడంతో పార్లమెంటు దద్దరిల్లింది. మరోవైపు దేశవ్యాప్తంగా అమిత్ షాకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనలు నిర్వహించాయి. -
విజయ్ కోసం స్థలాన్ని ఇచ్చిన రైతులు..విందుతో పాటు.. (ఫొటోలు)
-
తమిళగ వెట్రి కళగం పార్టీపై వార్తలు.. నిజమేనా?
చెన్నై : 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తమిళగ వెట్రి కగళం (టీవీకే) పార్టీని స్థాపించారు. అయితే ఆ పార్టీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకి నెటింట్లో ట్రెండ్ అవుతున్న ఆ వార్త నిజమేనా? దీనిపై దళపతి విజయ్ ఏమన్నారు2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే- ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పొత్తు పెట్టుకోనున్నాయని తమిళ ప్రధాన మీడియా సంస్థలు పలు కథనాల్ని ప్రచురించాయి. అందుకు గత అక్టోబర్ నెలలో టీవీకే పార్టీ తొలి బహిరంగ సభలో విజయ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని కొన్ని ఆధారాల్ని జత చేశాయి.అక్టోబర్‌లో విల్లుపురం జిల్లా విక్రవాండిలోని వీసాలై గ్రామంలో తమిళగ వెట్రి కళగం ఆవిర్భావోత్సవం, సిద్ధాంతాల వేడుకైన పార్టీ తొలి బహిరంగ సభ జరిగింది. ఆ సభలో విజయ్ డీఎంకే, బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అయితే ఎక్కడా ఏఐఏడీఎంకే గురించి ఎక్కడా మాట్లాడలేదని హైలెట్ చేశాయి.అయితే, ఈ కథనాలపై విజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఏఐఏడీఎంకేతో టీవీకే పొత్తు అనేది పూర్తిగా అబద్ధమని ఖండించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలు లేకుండా టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుంది. ప్రజల మద్దతుతో మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ విశ్లేషకుల ముసుగులో మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుందని, ఇలాంటి అవాస్తవ, తప్పుడు వార్తలను పట్టించుకోవద్దని తమిళనాడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను’అని టీవీకే ఎక్స్ వేదికగా వివరణిచ్చింది. தலைமை நிலையச் செயலக அறிவிப்புதமிழக வெற்றிக் கழகத்தின் முதல் மாநில மாநாட்டில் கழகத்தின் கொள்கைகள், கொள்கை எதிரி, அரசியல் எதிரி, தேர்தல் நிலைப்பாடு குறித்தும் தமது உரையில் கழகத் தலைவர் அவர்கள் தெளிவாக, விளக்கமாக எடுத்துரைத்துள்ளார். கழகத் தலைவர் அவர்களின் வழிகாட்டுதலின்படி…— TVK Party Updates (@TVKHQUpdates) November 18, 2024 -
హీరో విజయ్‌కు ఉదయనిధి స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్
జట్టుగా వచ్చినా.. సింగిల్‌గా వచ్చినా డోంట్ కేర్ అంటున్నారు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. ఇటీవల రాజకీయ రంగ ప్రవేశం చేసిన స్టార్ హీరో విజయ్‌కు పరోక్షంగా సవాల్ విసిరారు ఈ యువనేత. వచ్చే ఎన్నికల్లోనూ తామే గెలుస్తామని దీమా ప్రదర్శించారు. హీరో విజయ్ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తొలి బహిరంగ సభలో తమపై పరోక్షంగా విమర్శలు చేసిన విజయ్‌పై డీఎంకే నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా విజయ్‌కు కౌంటర్ ఇచ్చారు. కొత్త పార్టీలు ఎన్ని వచ్చినా తమకు తిరుగులేదని, 2026లోనూ తిరిగి అధికారంలోకి వస్తామంటూ ‘దళపతి’కి పరోక్షంగా జవాబిచ్చారు. తంజావూరులో గురువారం జరిగిన భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ 75వ వ్యవస్థాపక దినోత్సవంలో ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారు.తమిళగ వెట్రి కజగం (టీవీకే) పేరుతో పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్.. అక్టోబరు 27న విల్లుపురం జిల్లా విక్రవండిలో మానాడు పేరుతో మొదటి బహిరంగ సభ పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ద్రవిడ నమూనా పేరుతో తమిళనాడును ఒక కుటుంబం దోచుకుంటోందని ఇన్‌డైరెక్ట్‌గా స్టాలిన్ ఫ్యామిలీపై ఎటాక్ చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలను వదిలేసి తమను మాత్రమే విమర్శించడంతో విజయ్‌పై డీఎంకే నాయకులు మాటల దాడి పెంచారు.ఎంత మంది వచ్చినా మాదే గెలుపుఅయితే తమిళనాడు ప్రజలు తమ వెంటే ఉన్నారని, ఎంత మంది వచ్చినా డీఎంకే నీడను కూడా తాకలేరని తాజాగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. ప్రజారంజక పాలన అందిస్తున్నామని, 2026 లోనూ అధికారాన్ని నిలబెట్టుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏడోసారి డీఎంకే పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, దీన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. ‘2026 అసెంబ్లీ ఎన్నికల్లో మనల్ని వ్యతిరేకించేవారంతా జట్టు కట్టినా.. ఢిల్లీ నుంచి వచ్చినా, స్థానికంగా ఏ దిక్కు నుంచి వచ్చినా డీఎంకేనే గెలుస్తుంది. మా పార్టీని నాశనం చేయాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతార’ని వార్నింగ్ ఇచ్చారు. కాగా, విజయ్ను ఉద్దేశించే ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారని తమిళ ప్రజలు చర్చించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో వీరిద్దరి మధ్య రాజకీయ వైరం మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయితే విక్రవండిలో మానాడు సభ సందర్భంలో విజయ్‌కు ఉదయనిధి శుభాకాంక్షలు చెప్పడం విశేషం.చదవండి: హీరో విజయ్.. రాజకీయ ప్రవేశం ఇండియా కూటమికే లాభంవిజయ్ ఓడిపోతాడు..మరోవైపు సూపర్‌స్టార్ రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ.. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం పార్టీకి గెలుపు అవకాశాలు లేవని, విజయ్ కూడా ఓడిపోతాడని జోస్యం చెప్పారు. మదురైలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవడం అంటే మామూలు విషయం కాదన్నారాయన.చదవండి: ‘దళపతి’ అడుగుల ముద్ర పడేనా?69 సినిమాపై విజయ్ ఫోకస్కాగా, విజయ్ ప్రస్తుతం తన 69 సినిమాపై ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడంతో ఇదే ఆయన అఖరి సినిమాగా ప్రచారం జరుగుతోంది. దళపతి రాజకీయ జీవితానికి ఉపయోగపడేలా ఈ సినిమా ఉంటుందని టాక్. హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. -
‘దళపతి’ అడుగుల ముద్ర పడేనా?
‘సామాజిక స్పృహ టు రాజ్యాధికారం, వయా సినిమా.’ తమిళనాట ఏడున్నర దశాబ్దాలుగా రాజ్యమేలుతున్న రాజకీయ ఫార్ములా! సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని యత్నించి వెనకడుగు వేసిన చోట, సినీ తుఫాన్ విజయ్‌కాంత్ రాజకీయంగా మెరుపు మెరిసి కనుమరుగైన చోట, మరో దిగ్గజ నటుడు కమల్‌హాసన్ పార్టీ పెట్టి ఇప్పటికీ నిలదొక్కుకోలేకపోతున్న చోట... ఇంకో నటుడు ‘దళపతి’ విజయ్ కొత్త పార్టీ పెట్టారు. ‘‘మారా ల్సింది సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక్కటేనా? రాజకీయాలు కూడా మారాలి’’ అన్న ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో హోరెత్తాయి. రజనీకాంత్ తర్వాతి తరంలో అత్యధిక అభిమాన గణం ఉన్న నటుడిగా గుర్తింపు పొందిన విజయ్ ఆగమనం తమిళనాడు రాజకీయాల్లో మార్పు తెస్తుందా?తమిళ నటుడు విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పేరిట కొత్త పార్టీని ప్రకటించి, అక్టోబరు 27న విక్రవండిలో మొదటి బహిరంగ సభ నిర్వహించారు. ఒక ఎంజీఆర్, ఒక కరుణానిధి, ఓ జయ లలిత... సినీరంగ నేపథ్యంతో రాజకీయాలకు వచ్చి, తమదైన ముద్ర వేయడమే కాకుండా తమిళనాడు సామాజికార్థిక, రాజకీయ స్థితి గతుల్నే మార్చిన చరిత్ర కొనసాగింపే తాజా పరిణామం. తీవ్రమైన భావోద్వేగాలకు నెలవైన తమిళ నేలలో ‘దళపతి’ ప్రభావమెంత? ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు రాజకీయాలు భిన్నమైనవి. అసెంబ్లీలో ప్రత్యర్థి సభ్యులు భౌతికదాడికి పాల్పడి అవమానించినపుడు, ‘ఒక్క డీఎంకే సభ్యుడు కూడా లేని సభకే మళ్లీ వస్తా’నని దివంగత ముఖ్యమంత్రి జయలలిత శపథం చేస్తే, అటువంటి సభనే ఏర్పరచిన తమిళ తీర్పు ఒక భావోద్వేగ చరిత్ర! ఆత్మ గౌరవ ఉద్యమాన్ని, జస్టిస్ పార్టీని కలిపి 1944లో రామస్వామి పెరియార్ ‘ద్రావిడర్ కజగం’ (డీకే) ఏర్పాటు చేశారు. అర్ధ శతాబ్ధానికి పైగా తమిళనాడును పాలిస్తున్న ద్రవిడ కజగం పార్టీలన్నీ ఈ డీకే నుంచి పుట్టినవే! పెరియార్‌తో విబేధాలు రావడంతో డీకే నుంచి బయటకొచ్చిన అన్నాదురై... 1949లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) స్థాపించారు. ద్రవిడ సిద్ధాంతాల ప్రకారం బ్రాహ్మణులు,కాంగ్రెస్, బీజేపీ ఉత్తరాది ఆర్యుల పార్టీల పెత్తనం చెల్లదు. అన్నాదురై తర్వాత డీఎంకేలో ఉంటూ ద్రవిడ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రచయిత కరుణానిధి 1969లో ముఖ్యమంత్రి అయ్యారు. కరుణానిధి తన గురువు అన్నాదురై సిద్ధాంతాలకు విరు ద్ధంగా పని చేస్తున్నారని ఆరోపిస్తూ... నటుడు ఎంజీ రామచంద్రన్ డీఎంకే నుంచి బయటకు వచ్చి 1972లో అన్నా డీఎంకే పార్టీని స్థాపించారు. ఆ రోజుల్లో నటునిగా తిరుగులేని ప్రజాకర్షణ కలిగిన ఎంజీఆర్, 1977లో అన్నాడీఎంకేని గెలిపించి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఎంజీఆర్ వారసత్వాన్ని జయలలిత కొనసాగించారు. డీఎంకే, అన్నా డీఎంకేలు కేంద్ర ప్రభుత్వాలకు అవసరమైనపుడు ఆ మేరకు మద్దతునిచ్చినా... తమిళనాడులో ఆ యా జాతీయ పార్టీలు బలపడ కుండా అవి నివారించగలిగాయి. దీంతో 5 దశాబ్దాలుగా అక్కడి రాజకీయాలు డీఎంకే వర్సెస్ అన్నా డీఎంకేగా నడుస్తున్నాయి. ఎంజీఆర్ స్ఫూర్తితో చాలామంది నటులు రాజకీయ ప్రవేశం చేశారు కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ మినహా ఎవరూ అంతటి విజయం సాధించలేకపోయారు. ఎంజీఆర్ కొత్త పార్టీ పెట్టడానికి ముందు నటించిన సినిమాలను తన రాజకీయ ఆశయాలను ప్రచారం చేయడానికి వాడుకున్నారు. ఇటీవల విజయ్ సినిమాల్లో కూడా ఇదే తంతు కనిపించింది. 2018లో విజయ్ నటించిన సర్కార్ చిత్రంలో... హీరో రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని చూసి షాక్ తిని, రాజకీయ నాయకుడిగా మారుతాడు. ఈ సినిమాలోనే, ఆ సమయంలో అధి కారంలో ఉన్న అన్నాడీఎంకేను అవమానించేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. కానీ, మొదటి బహిరంగ సభలో విజయ్ అన్నాడీఎంకేను ఒక్కమాటా అనలేదు! ఇటీవల విడుదలైన పలు చిత్రాల్లో పరోక్షంగా పంచ్ డైలాగ్స్‌తో డీఎంకేను విమర్శించారు. పెరియార్, అన్నా పేర్లను స్మరిస్తూ ద్రవిడ నమూనా పేరుతో తమిళనాడును ఒక కుటుంబం దోచుకుంటోందని విమర్శిస్తూ, ఆ పార్టీయే మన శత్రువని విజయ్ ప్రకటించారు. హేతువాది పెరియారే తన పార్టీకి విధాన మార్గదర్శి, కానీ పెరియార్ నాస్తిక సిద్ధాంతాన్ని మాత్రమే తాము అంగీకరించమని చెప్పారు. ఈ విషయంలో ‘ఒకటే వంశం – ఒకటే దేవుడు’ అన్న ‘అన్నా’ సూత్రాన్ని పాటిస్తామన్నారు. విధానపరంగా తమ సిద్ధాంతంలో ద్రవిడ, తమిళ జాతీయవాదం మధ్య విభజన లేదని వ్యాఖ్యానిస్తూ, ఆ రెండూ తనకు రెండు కళ్ళు అని చెప్పారు. పరస్పర విరుద్ధాంశాలపై అభిప్రాయానికి పొంతన లేకపోవడంతో విజయ్ సిద్ధాంతాల్లో స్పష్టత కొరవడినట్టు కనిపిస్తోంది. పార్టీల పేర్లను ప్రస్తావించకుండా, మతోన్మాద బీజేపీ తమ సైద్ధాంతిక ప్రత్యర్థిగా చెప్పినప్పటికీ, డీఎంకేకు వ్యతిరేకంగా మాట్లాడి నంతగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడకపోవడం పలు ఊహాగానా లకు ఆస్కారం కల్పిస్తోంది. కుల గణన నిర్వహించాలనీ, విద్య ఉద్యో గాల్లో దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలనీ చెప్పిన విజయ్, మైనారిటీల గురించి, వారి భద్రత గురించి ఎక్కడా ప్రస్తావించక పోవడమే ఆయనలోని ద్వైదీభావనకు నిదర్శనం! పలు తమిళ ఫ్యాన్ పేజీల్లో ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్‌తో విజయ్‌కు పోలికలు తేవడం చూడొచ్చు. వీరిరువురు ఒకరి సినిమాలు ఇంకొకరు రీమేకులు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. రాజకీయంగా కూడా ఇలాంటి రీమేక్ జరుగుతుందనే చర్చను అభిమానులు తెరపైకి తెస్తున్నారు. విజయ్, పవన్ మధ్య సామ్యాలు ఉన్నన్ని వైరుధ్యాలు కూడా ఉన్నాయి. పైగా, తెలుగు, తమిళ రాజకీయాలకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని గమనించాలి. ఏపీలో జనసేన అధికార భాగస్వామ్య పక్షమైన ప్పటికీ, వాస్తవానికి ఆ పార్టీ ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలపడలేదు. ఎన్నికల ఫలితాల్లో నూరు శాతం సక్సెస్ రేట్ సాధించినప్పటికీ, పకడ్బందీ పార్టీ వ్యవస్థ ఏర్పడలేదు. రాజకీయ సిద్ధాంత విధానా ల్లోనూ స్పష్టత లేదు. విజయ్ టీవీకేకూ ఇదే వర్తిస్తుంది. ఎంజీఆర్ పార్టీ పెట్టడానికీ, ఇతర నటులు పార్టీ పెట్టడానికీ తేడా ఉంది. ఎంజీఆర్ డీఎంకేను విడిచిపెట్టినప్పుడు, ఆయన అప్పటికే పార్టీలో నంబర్ త్రీగా ఉన్నారు. పదేళ్లు శాసనసభ అనుభవం గడించి ఉన్నారు. డీఎంకే కోశాధికారిగా పనిచేశారు. తమిళనాడులో కొత్త పార్టీలు పెట్టడానికి ఎవరో ఒకరి సపోర్ట్ ఉంటుందనే వాదన ఉంది. ఎంజీఆర్ వెనుక ఇందిరాగాంధీ ఉన్నారు. కొంతమేరకు విజయం సాధించగలిగిన నటుడు విజయకాంత్ వెనక పన్రుటి ఎస్. రామచంద్రన్ వంటి అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు ఉన్నారు. మరి, విజయ్ వెనుక కూడా ఎవరైనా ఉండొచ్చు అనే అనుమానా లున్నాయి. ‘‘2026 అసెంబ్లీ ఎన్నికల్లో మాకే మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాం. భావసారూప్య పార్టీలతో పొత్తులకు, కూటమి ఏర్పాట్లకూ సిద్ధమే. మాతో పొత్తు పెట్టుకున్న వారినే అధికారంలో భాగస్వాము లను చేస్తాం’’ అని విజయ్ చెప్పారు. కానీ, సోషల్ మీడియాను దాటి క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే మెజారిటీ సులభంగా కనిపించదు. మరోవైపు, అన్నాడీఎంకే ముందు పరోక్షంగా పొత్తు సంకేతాలు ఉంచి నట్లయ్యింది. ఒకవేళ ఆయన అన్నాడీఎంకేతో కలిసి నడిస్తే కూటమిగా విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2021లో అధికార డీఎంకే 37.7 శాతం ఓట్లు సాధించగా, అన్నాడీఎంకే 33.29 శాతం ఓట్లు సాధించింది. విజయ్ పార్టీ వచ్చే రెండేళ్లు క్షేత్రస్థాయిలో ఉంటే 7 శాతం వరకు ఓట్లు సాధించవచ్చు. అంటే, విజయ్ అన్నా డీఎంకేతో కలిస్తే, డీఎంకేకు నష్టం కలుగుతుంది. ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి, డీఎంకేకు లబ్ధి చేకూరుతుంది. అందుకే ఉభయ ద్రవిడ పార్టీలు విజయ్ అడుగులనూ, ఆయనకు లభించే ప్రజాదరణనూ జాగ్రత్తగా గమనిస్తున్నాయి.దిలీప్ రెడ్డి వ్యాసకర్త ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
జమిలి ఎన్నికలపై విజయ్ పార్టీ కీలక నిర్ణయం
చెన్నై: సినీ నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీతో తమిళనాట రాజకీయం హీటెక్కింది. తాజాగా టీవీకే పార్టీ అధినేత విజయ్.. స్టాలిన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. అలాగే, జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ మేరకు టీవీకే(తమిళిగా వెట్రి కగజం) పార్టీ తీర్మానం కూడా చేయడం విశేషం.దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై తీవ్ర చర్చ నడుస్తోంది. 2027లోనే జమిలీ ఎన్నికలు వస్తాయని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నటుడు విజయ్‌కి చెందిన టీవీకే పార్టీ.. జమిలి ఎన్నికలు సహా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. నేడు చెన్నైలో విజయ్ అధ్యక్షతన టీవీకే పార్టీ నేతల కీలక సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పార్టీ ఎజెండాను ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న విషయంపై చర్చించారు. ఇదే సమయంలో జమిలి ఎన్నికలకు తమ పార్టీ వ్యతిరేకమని విజయ్ ప్రకటించారు. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా సమావేశంలో తీర్మానం చేశారు. అలాగే, నీట్ పరీక్షపై కూడా తాజాగా తీర్మానం చేశారు.ఇదే సమయంలో తమిళనాడులోకి స్టాలిన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు విజయ్. రాష్ట్రంలో అబద్దపు హామీలు ఇచ్చి స్టాలిన్ అధికారంలోకి వచ్చారని అన్నారు. కులగణన ప్రక్రియ జాప్యంపై అధికార డీఎంకే వైఖరిని తప్పుబట్టారు. ఇక, తమిళనాడులో ద్విభాషా సిద్ధాంతమే అమలులో ఉండాలని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో హిందీ అమలుకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో హిందీకి రాష్ట్రంలో చోటులేదని స్పష్టం చేశారు. కేంద్రం పెత్తనం లేకుండా రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా.. ఇటీవలే విజయ్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాజకీయ ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా టీవీకే పార్టీ పోటీపై క్లారిటీ ఇచ్చారు. తమిళనాడు 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. అలాగే, ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని చెప్పుకొచ్చారు. క్షేత్రస్థాయిలో మహిళలకే తమ పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. -
విజయ్ తొలి బహిరంగ సభ.. తమిళ హీరోల పూర్తి మద్దతు
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్.. విల్లుపురం సమీపంలో తన తమిళ వెట్రి కళగం (TVK) పార్టీ మొదటి మహానాడు సభ నిర్వహించాడు. దీనికి దాదాపు ఎనిమిది లక్షల మందికి పైగా హాజరయ్యారని అంచనా. ఇందులో తన పార్టీ ఆలోచనలు, 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఏం చేయబోతున్నామో అనే విషయాల్ని విజయ్ చాలావరకు చెప్పుకొచ్చారు. వన్ కమ్యూనిటీ, వన్ గాడ్ అనే సిద్ధాంతంతో తమ పార్టీ ముందుకు వెళ్తుందని క్లారిటీ ఇచ్చారు.(ఇదీ చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్ కాలేదు.. భార్యపై ఒట్టేసి అబద్ధాలు)ఇక రాజకీయంగా తొలి సభ పెట్టిన హీరో విజయ్‌కి తమిళ హీరోల నుంచి పూర్తిస్థాయిలో మద్ధతు లభించింది. శివకార్తికేయన్, విజయ్ సేతుపతి, జయం రవి, దర్శకులు నెల్సన్ దిలీప్ కుమార్, వెంకట్ ప్రభు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నటులు శశి కుమార్, వసంత్ రవి, కమెడియన్ సతీశ్, నిర్మాత అర్చన కళపతి.. ఇలా చాలామంది తమిళ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి విజయ్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)இன்று தனது புதிய பயணத்தை தொடங்கவிருக்கும் விஜய் சாருக்கு எனது மனமார்ந்த வாழ்த்துகள் 🙏❤️ @tvkvijayhq— Sivakarthikeyan (@Siva_Kartikeyan) October 27, 2024தவெக கட்சியின் முதல் மாநில மாநாடு சிறக்க,.தவெக தலைவர் விஜய் சாருக்கும், தொண்டர்களுக்குவாழ்த்துகள் #TVK_maanadu pic.twitter.com/dk9hU9wSDy— VijaySethupathi (@VijaySethuOffl) October 27, 2024Congratulations Thalapathy @actorvijay Anna on this incredible milestone #TVKMaanaadu 👍🏼Bring the same passion and dedication to politics that you’ve shown in cinema. Wishing you a great success on this new journey !!!— Jayam Ravi (@actor_jayamravi) October 27, 2024My hearty wishes to my dear @actorvijay sir for ur new beginning today ❤️💥👍💐— Nelson Dilipkumar (@Nelsondilpkumar) October 27, 2024Best wishes @tvkvijayhq na, as u beginning this inspiring new journey with today’s #Maanaadu !! May your vision bring positive change and light to many na!! 🙏🏽❤️🔥 #TVKMaanaadu pic.twitter.com/6QjxinH5Dx— venkat prabhu (@vp_offl) October 27, 2024Wishing Dearesr Anna ❤️🔥 @actorvijay @tvkvijayhq #TVKFlagAnthem 💥All the Very Best And Super Successfull #TVK_maanadu 💥✨⭐️ pic.twitter.com/tdGVpswl6z— thaman S (@MusicThaman) October 27, 2024உங்கள் வரவு, எளிய மக்களுக்கான பெரிய நம்பிக்கையாக அமையட்டும். 👍நல் வாழ்த்துகள்…விஜய் சார் @actorvijay @tvkvijayhq #TVKMaanaduoct27 #Thalapathy#தமிழகவெற்றிக்கழகம் pic.twitter.com/rAVGa4oj6z— M.Sasikumar (@SasikumarDir) October 27, 2024My heartfelt wishes to @actorvijay sir, for your wonderful start today, You have been truly an inspiration to many of us not only through your films alone, soon will be remembered and appreciated for your political journey too in the coming years…I am sure today will be a…— Vasanth Ravi (@iamvasanthravi) October 27, 2024திரைத்துறையைப் போல் இதிலும் வெற்றிக் கொடி நாட்ட வாழ்த்துக்கள் @tvkvijayhq sir 💪👏❤️ pic.twitter.com/1HdRmQngJV— Sathish (@actorsathish) October 27, 2024Wishing you the very best @tvkvijayhq na for the #TVK_maanadu today 🙌🔥 pic.twitter.com/CZyBS4z2wL— Archana Kalpathi (@archanakalpathi) October 27, 2024#தமிழகவெற்றிக்கழகம் மாற்றத்தை எதிர்பார்த்து வாழ்த்துகிறோம் வெற்றி பெற @actorvijay sir ☺️ pic.twitter.com/nzDH8VYXJZ— சாய் தன்ஷிகா (@SaiDhanshika) October 27, 2024 -
విజయ్ సభకు హోరెత్తిన జనసంద్రం (ఫొటోలు)