
చెన్నై: తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. నేడు సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ మొదటి ఆవిర్భావ దినోత్సవం. ఈ నేపథ్యంలో చెన్నైలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు పార్టీ చీఫ్ విజయ్. ఈ కార్యక్రమానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాజరవుతున్నారు. దీంతో, తమిళ పాలిటిక్స్ రసవత్తరంగా మారింది.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీని స్థాపించి ముందుకు సాగుతున్నారు. నేడు పార్టీ మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. చెన్నైలోని మామల్లపురంలో భారీ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు దాదాపు మూడు వేల మంది ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ఈ క్రమంలో పాస్‌లను సైతం అందించారు.
ఇక తమిళనాడులో వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీలతో పొత్తులపై, ప్రచార యాత్రలపై విజయ్ కీలకమైన ప్రకటన చేస్తారని సమాచారం. పార్టీ అధ్యక్షుడు నటుడు విజయ్ సహా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో పాటు టీవీకే ఇతర ముఖ్య నేతలు ఈ సభకు హాజరుకానున్నారు. దీంతో, వేదికపై నుంచి కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
தமிழக மக்களின் தலையெழுத்தை மாற்றப்போகும் கையெழுத்து ❤️#Getout #TVKForTN pic.twitter.com/3yAUgiQqZ7
— Mʀ.Exᴘɪʀʏ (@Jana_Naayagan) February 26, 2025
హాట్ టాపిక్ బ్యానర్..
మరోవైపు.. టీవీకే పార్టీ ఆవిర్భావ వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మొత్తం 6 అంశాలను ప్రస్తావించారు. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తూ #GETOUT అనే హ్యాష్ ట్యాగ్‌ను చేర్చారు. ఈ బ్యానర్‌పై విజయ్ సంతకం కూడా చేశారు. అందులో మహిళల భద్రత, సంక్షేమానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాలు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. ఇక నియంతృత్వ పాలనను సాగిస్తూ ప్రజా గొంతులను అణిచివేయడం, ఓటు బ్యాంకుల కోసం కులమతాల పేరుతో ప్రజలను విడగొట్టడాన్ని కూడా ఈ పోస్టర్‌లో పేర్కొన్నారు. పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఆర్భాటాలు చేస్తున్నారని ఆరోపించారు. నూతన విద్యా విధానం, త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా పోరాడటానికి ప్రతిజ్ఞ చేద్దామని కూడా ఆ పోస్టర్‌లో ఉంది.
அமைதியான அரசியலை உருவாக்கும் அமைதியான தலைவன்!#GetOut #vijay #tvk pic.twitter.com/AZQXVGVZZB
— தமிழச்சி TVK (@tvkvijay_4tn) February 26, 2025
என் நெஞ்சில் குடி இறுக்கும்.... 🔥🥹#TVKForTN #TVKVijay @TVKVijayHQ #தமிழகவெற்றிக்கழகம்#இரண்டாம்_ஆண்டில்_தவெக#Getout pic.twitter.com/mFysxwb0IL
— MASTER_JD_❤️🔥 (@badlucksarath12) February 26, 2025