prashanth kishore
-
బీహార్‌లో ఉద్రిక్తతలు.. ప్రశాంత్ కిషోర్‌పై కేసు నమోదు
పట్నా: బీహార్‌లో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(BPSC) ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకల వ్యవహారం మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అభ్యర్థులు ఆందోళన చేస్తున్న క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో, పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ నేత ప్రశాంత్ కిషోర్, కోచింగ్ సెంటర్ల యజమానులు, మరో 700 మంది నిరసనకారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.బీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలపై బీహార్‌లో ఉద్రిక్తతలకు దారి చేసింది. ఆదివారం వేలాది మంది అభ్యర్థులు పట్నాలోని గాంధీ మైదాన్ వద్ద ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో సీఎం నివాసం వైపు ర్యాలీగా బయల్దేరేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.అంతకుముందు.. విద్యార్థుల నిరసనకు జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ మద్దతు ప్రకటించారు. అయితే, నిరసనలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ర్యాలీలకు, నిరసనలను అనుమతి లేకున్నా ప్రశాంత్ కిషోర్ అభ్యర్థులను రెచ్చగొట్టారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రేరేపించారని పోలీసులు తెలిపారు. తమ మార్గదర్శకాలను పాటించని కారణంగా ప్రశాంత్ కిషోర్, కోచింగ్ సెంటర్ల యజమానులు, మరో 700 మంది నిరసనకారులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. Mild-Lathi Charge according to ANI. pic.twitter.com/64cfgklI07— Mohammed Zubair (@zoo_bear) December 29, 2024ఇదిలా ఉండగా.. డిసెంబర్ 13న నిర్వహించిన బీపీఎస్సీ కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో గత 10 రోజులకు పైగా నిరుద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్నారు. పరీక్షను రద్దు చేసి.. కొత్తగా మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. పరీక్షను రద్దు చేసే ప్రసక్తే లేదని అధికారులు తేల్చి చెప్పారు. అయితే, ఈ పరీక్షలను పారదర్శకంగానే నిర్వహించామని.. విద్యార్థుల వాదనలకు ఎలాంటి ఆధారాల్లేవని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో విద్యార్థులు తమ ఆందోళనల్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. -
అటు ఒక పీకే..ఇటు ఒక పీకే..బాబూ సరిపోయిందా?
-
బయటపడ్డ బాబు పీకేల చీకటి బంధం
-
బిహార్‌లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా?
సాక్షి, విశాఖపట్నం: ప్రశాంత్ కిశోర్ పార్టీ బిహార్‌లో దిక్కుమొక్కూ లేకుండా చిత్తుగా ఓడిపోనున్న తరహాలోనే చంద్రబాబు–పవన్‌కళ్యాణ్ ఓటమికి సిద్ధంగా ఉన్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. బిహార్‌లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా? అని ప్రశాంత్ కిశోర్‌పై విరుచుకుపడ్డారు. డబ్బులు తీసుకుని కన్సల్టెన్సీలో ఒక డైరెక్టర్‌గా ఉండే ప్రశాంత్ కిషోర్ బిహార్‌లో సొంతంగా పార్టీ పెట్టుకున్నాడని, ఇంట గెలవని వాడి మాటలను ఏపీ ప్రజలు నమ్మరని చెప్పారు. ఆదివారం విశాఖలోని సర్క్యూట్ హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ పలుమార్లు రహస్యంగా భేటి అవుతున్నారని, అందులో భాగంగానే రెండు రోజుల క్రితం కూడా హైదరాబాద్‌లో ఇద్దరూ రహస్యంగా కలుసుకున్నట్లు పలు పత్రికల్లో వచ్చిందన్నారు. ‘డీబీటీ, అభివృద్ధి రెండూ చేయలేని చంద్రబాబుకు ప్రజలు ఓటు వేస్తారన్నట్లు ప్రశాంత్‌కిశోర్ చెప్పడానికి కారణం నెలరోజులు క్రితం చంద్రబాబు ఇంట్లో జరిగిన సమావేశమే కదా? ఆ తర్వాత రహస్యంగా పలుమార్లు ప్రశాంత్ కిశోర్ చంద్రబాబును కలవడం నిజం కాదా? ఒక పీకే వల్ల కావడంలేదని చంద్రబాబు రెండో పీకేని కూడా తెచ్చుకున్నారు’ అని పేర్కొన్నారు. ఒక స్టేట్మెంట్తో మొత్తం ప్రజల నాడిని మార్చేయొచ్చని, తాను మహా మాంత్రికుడినని అనుకుంటున్న ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి చివరకు తన సొంత రాష్ట్రం బిహార్‌లో రాజకీయ భిక్షగాడిగా మారాడని ఎద్దేవా చేశారు. పేదలకు మేలు చేస్తూ అవినీతికి తావులేకుండా అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఓట్లు వేయకుంటే చంద్రబాబులా అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసేవారికి ఓట్లు వేస్తారా? అని ప్రశ్నించారు. బాబు, పీకే పన్నాగాలు తిప్పికొడతాం.. చంద్రబాబు, చెల్లని రూపాయి ప్రశాంత్ కిషోర్ కొత్త ఎత్తుగడలకు పన్నాగాలు పన్నుతున్నారని, వాటిని ఎన్నికల్లో తిప్పికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా వైఎస్సార్సీపీనే గెలుస్తుందని సామాన్యులు సైతం చెబుతున్నారని గుర్తు చేశారు. సామాన్యులు చెప్పేది నెగ్గుతుందా? లేక చెల్లని రూపాయి ప్రశాంత్ కిశోర్ చెప్పేది నెగ్గుతుందా? అనేది మీరే చూస్తారన్నారు. చంద్రబాబే గెలుస్తాడనుకుంటే మేనిఫెస్టోలో సంక్షేమం గురించి అది చేస్తా.. ఇది చేస్తానంటూ ఎడాపెడా హామీలివ్వాలని ప్రశాంత్ కిశోర్ ఎందుకు సలహా ఇచ్చారని ప్రశ్నించారు. ఏపీలో అసలు సర్వే టీం లేని ప్రశాంత్ కిశోర్ డీబీటీకి ప్రజలు ఓట్లు వేయరని ఎలా చెప్పారని ప్రశ్నించారు. అభివృద్ధి లేకుంటే వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం ఐదేళ్లుగా ఎలా పురోగమిస్తాయని సూటిగా నిలదీశారు. బిహార్‌లో చెల్లనికాసులా మారడంతో ఇక్కడ కొన్ని కాసులైనా ఏరుకుందామనే ఉద్దేశంతో చంద్రబాబుతో డీల్ కుదుర్చుకున్నారని చెప్పారు. ఆ డీల్‌లో భాగంగా చేస్తున్న ప్రకటనలను ఏపీలో ఉన్న 5.30 కోట్ల మంది ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల ముందు కూడా టీడీపీ భారీ విజయం సాధించనున్నట్లు లగడపాటి రాజగోపాల్‌తో చంద్రబాబు జోస్యం చెప్పించారని, ఆ తరువాత ఏం జరిగిందో తెలిసిందేనని మంత్రి వ్యాఖ్యానించారు. -
టీడీపీని బతికించడం నా వల్ల కాదు.. చేతులెత్తేసిన పీకే
-
వైఎస్ఆర్సీపీపై భయంతోనే ప్రశాంత్ కిషోర్‌ను కలిశారు: సిదిరి అప్పలరాజు
-
మైండ్ గేమ్..పీకే అండ్ పీకే ఫార్ములా !
-
చంద్రబాబుతో పీకే మీటింగ్‌లో ఏం జరిగిందంటే..?
టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీపై ఇప్పుటికే వైఎస్సార్సీపీ నేతలు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, అసలు పీకేతో చంద్రబాబు భేటీ ఎలా జరిగింది.. వీరి భేటీ కోసం టీడీపీ ఎన్ని ప్లాన్స్ చేసింది. ఎంత డబ్బు ముట్టజెప్పారు అనేది ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు పీకేపై తీవ్ర విమర్శలు చేసి మళ్లీ ఇప్పుడు ఆయనతోనే సమావేశమవడంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఇంతకీ చంద్రబాబుతో పీకే భేటీ ఎలా జరిగిందో, ఏం చర్చించుకున్నారో.. ఆయన సన్నిహితుడు ఒకరు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.. ►ప్రశాంత్ కిషోర్ పోల్ కన్సల్టెన్సీని వదిలి రాజకీయాల్లోకి వెళ్లారు. టీడీపీకి అత్యంత ఆప్తులు కొంతమంది ప్రశాంత్ కిషోర్‌తో పదేపదే చంద్రబాబు గారిని ఒకసారి కన్సల్ట్ అవ్వండి అని అడిగారు. దీంతో, ఫైనల్‌గా నిన్న(శనివారం) మీటింగ్‌కు ఓకే చెప్పారు. దానికి ప్రతిఫలంగా రూ.20కోట్లు, స్పెషల్ విమానం ఏర్పాటు చేశారు. ► చర్చల్లో భాగంగా ప్రశాంత్ కిషోర్‌ని ఈ కొద్ది రోజులైనా టీడీపీ కోసం వ్యూహకర్తగా పనిచేయాలని కోరగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. తాను ఇప్పుడు ఐప్యాక్‌తో లేనని, దానిని లీడ్ చేస్తున్న వ్యక్తులు ఆల్రెడీ వేరే పార్టీతో టై అప్‌లో ఉన్నారని తెలిపారు. ►దీంతో, తమకు ఐప్యాక్‌తో పనిలేదు మీరు ఒక టీమ్ ఫామ్ చేసి ఇవ్వండి. దానికి మీరు అడిగింది చెల్లిస్తాం అనగా.. ప్రస్తుతానికి బీహార్‌లో పార్టీ బలోపేతం పనుల్లో ఉన్నాను.. నేను చేయలేను.. కావాలంటే ప్రతీనెలా ఒకరోజు కేటాయిస్తాను.. ఇదే ఫీజు చెల్లించండి చాలు అని చెప్పారు. ప్రస్తుతానికి కొన్ని సూచనలు చెప్తాను, వాటిని చేస్కోండి అని సలహా ఇచ్చారు. ►అభ్యర్థులను సెలెక్ట్ చేసి వెంటనే ప్రజల్లోకి పంపండి. పాత అభ్యర్థులను పెట్టుకుంటే మీకు అసలుకే మోసం వస్తుంది. మీ పొత్తు పట్ల ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వండి. కులాల ప్రాతిపదికన మీరు కలిసారని ఇప్పటికే జనం బాగా నమ్ముతున్నారు. మీ పార్టీ.. మీ మీడియా ఒకే స్టాండ్ తీసుకోండి.. ఓవర్ హైప్ క్రియేట్ చేయాలి అనే ఆలోచనతో రాంగ్ డైరెక్షన్ వైపు తీసుకెళ్తున్నారు. ►గతంలో ఇచ్చిన హామీలు చేయలేదు అనే బ్లాక్ మార్క్ మీపై ఉన్నందున పదికి మించి హామీలు ఇవ్వకండి. మీ గత చరిత్ర పట్ల జనానికి పూర్తి అవగాహన ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే బాగా చేస్తాం, ఆయన కంటే ఎక్కువ ఇస్తాం అనే టాపిక్ రానివ్వకండి. మీరు పోటీ పడలేరు. గతంలో హామీలను అమలు చేయలేదు. ప్రజల్లో మీ ప్రకటనలకు, వాగ్దానాలకు, హామీలకు అంతగా విశ్వసనీయత లేదు. ►మీరు సంక్షేమం గురించి తక్కువ మాట్లాడి.. అభివృద్ధి గురించి ఎక్కువగా మాట్లాడండి. అయినా మీరు అభివృద్ధి కూడా చేయలేదు కదా?. అమరావతి ప్రస్తావన అత్యవసరం అనుకుంటే తప్ప.. వాంటెడ్‌గా తీసుకురావద్దు. దానివల్ల మీకు ప్రయోజనం సున్నా. మీరు ఐదేళ్లలో సృష్టించింది భ్రమరావతి మాత్రమే. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను టార్గెట్ చేసి రాష్ట్రం దివాళా తీసింది, అన్యాయం జరిగిపోతోంది అని ప్రచారం చేస్తే మీరు మరింత ఇబ్బందుల్లోకి వెళ్లారు. అలా కాకుండా..పరిపాలనలోని లోపాలను మీకు చేతనైతే బయటికి తీయండి. జనవరి 15 తర్వాత ఇక్కడ లేదా ఢిల్లీలో మళ్లీ కలుద్దాం అని వెళ్ళిపోయాడు. ఫైనల్‌గా ప్రశాంత్ కిషోర్ టీడీపీకి పనిచేయలేను అని చెప్పి వెళ్లినట్టు సమాచారం. -
పీకేతో భేటీ.. చంద్రబాబు ఏం చేస్తాడంటూ కొడాలి నాని సెటైర్లు
సాక్షి, కృష్ణా: టీడీపీ అధినేత చంద్రబాబు అవుట్‌డేటెడ్ పొలిటీషియన్ అని సెటైరికల్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబును కలిస్తే భూమి బద్దలైపోతుందా? అని ప్రశ్నించారు. అలాగే, గతంలో ప్రశాంత్ కిషోర్‌ను దారుణంగా తిట్టిన విషయాలు ఎల్లో బ్యాచ్ మరిచిపోయిందా? అని విమర్శలు చేశారు. కాగా, కొడాలి నాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఎంత మంది పీకేలను తెచ్చి పెట్టుకున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు. ఐప్యాక్‌తో ప్రశాంత్ కిషోర్‌కు సంబంధం లేదు. ప్రశాంత్ కిషోర్ మేము ఇప్పటికే పూర్తిగా వాడేశాం. పీకే బుర్రలో గుజ్జంతా అయిపోయింది. మేము పీకేను వ్యూహకర్తగా పెట్టుకున్నప్పుడు బీహార్ నుంచి వచ్చినోడు ఏం పీకుతాడు అని చంద్రబాబు ఆరోపించారు. మరి ఇప్పుడు ఎల్లో బ్యాచ్ చేస్తున్నదేంటి?. ఆనాడు మనకంటే గొప్పోళ్లు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా తమ్ముళ్లూ అన్నాడు కదా. రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు.. ప్రశాంత్ కిషోర్ గురించి ఏం అన్నారో అందరికీ తెలుసు. చంద్రబాబును ప్రశాంత్ కిషోర్ కలిస్తే ఎల్లో మీడియా హడావుడి చేస్తోంది. ఇండియా కూటమిలో చేరమని చెప్పేందుకే చంద్రబాబును పీకే కలిశారు. చంద్రబాబు అవుట్‌డేటెడ్ పొలిటీషియన్. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చి చేసేదేమీ లేదు. బాబాయ్‌ను చంపడానికి పీకేనే ప్లాన్ చేశారని, జనాన్ని రెచ్చగొట్టడానికే కోడికత్తితో పొడిపించుకున్నారని అప్పుడు అన్నారు. మరి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో చంద్రబాబు పీక కోయించుకుంటాడా?. ఏం చేస్తారో వాళ్లకే తెలియాలి. పీకేకు ఐప్యాక్‌తో సంబంధమే లేదు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు అయిపోయాక వ్యూహకర్తగా తప్పుకుని ఆయన రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. చంద్రబాబు ఒకవైపు పవన్ కల్యాణ్‌ను పెట్టి బీజేపీతో చర్చలు జరుపుతున్నాడు. మరోవైపు ఇంకో పీకేను పెట్టి కాంగ్రెస్‌తో చర్చలకు తెరలేపాడు. చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతం. కేంద్రంలో బీజేపీ వస్తుందా? లేక కాంగ్రెస్ వస్తుందో తెలియక ఆందోళనకు గురవుతున్నాడు’ అంటూ విమర్శించారు. -
ఎవరో చేసిన తప్పుకి నన్ను ఇలా చేయడం కరెక్ట్ కాదు
-
పీకే, చంద్రబాబు మీటింగ్ పై..పేర్ని నాని సెటైర్లు
-
బిహారీ డకాయిట్ !..ప్రశాంత్ కిషోర్-బాబు భేటీ
-
ఆ భేటీ వెనుక కథేంటంటే.. : మంత్రి అంబటి
సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌పై మంత్రి అంబటి రాంబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ భేటీపై మంత్రి అంబటి సెటైరికల్ కామెంట్స్ చేశారు. అంబటి సూటి ప్రశ్నలు.. ప్రశాంత్ కిశోర్ (పీకే) తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబు పార్టీపై కాన్ఫిడెన్స్ లేనప్పుడే పీకే వ్యూహం అవసరమన్న లోకేశ్ ఇప్పుడు టీడీపీపై కాన్ఫిడెన్స్ తగ్గిందని ఆయన్ను రప్పించారా? ఆనాడు పీకేను నోటికొచ్చినట్లు తిట్టిన తండ్రీ కొడుకులు ఇప్పుడు అదే పీకేతో మంతనాలు.. వ్యూహ రచనలు ఇవీ పూర్తిగా గతి తప్పిన తండ్రీ కొడుకుల రాజకీయాలు బాబు, లోకేశ్‌ల ద్వంద్వ వైఖరి ప్రజలు గమనించాలి టీడీపీ వ్యూహకర్తగా రాలేనన్న ప్రశాంత్ కిషోర్ అయినా ఢిల్లీ వెళ్లి కాళ్లు పట్టుకుని రప్పించారంట!. ఆ కలయిక ఆశ్చర్యకరం.. టీడీపీ వ్యూహకర్త ‘పీకే’ అనగానే.. నాలో కించిత్ ఆశ్చర్యం కలిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన బీహార్‌కు చెందిన ప్రశాంత్ కిశోర్ ఈరోజు చంద్రబాబు, లోకేశ్‌ను కలిశారని మీడియాలో చూశాం. ఆయన తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా పనిచేయబోతున్నారని మీడియాలో వచ్చింది. ఢిల్లీ నుంచి ఆయన వస్తుంటే రిసీవ్ చేసుకోవడానికి లోకేశ్ ఎయిర్‌పోర్టుకు కూడా వెళ్లడం జరిగింది. ఈ సంఘటన చూసినప్పుడు నాకు కించిత్ ఆశ్చర్యం కలిగింది. అది ఎందుకనేది గతాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆనాడేమో బీహార్ డెకాయిట్.. ప్రశాంత్ కిశోర్ ఒక రాజకీయ వ్యూహకర్త. దేశంలో అనేక రాజకీయ పార్టీలకు ఆయన వ్యూహకర్తగా పని చేసిన సందర్భాలున్నాయి. అతని వృత్తి అది. గతంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పని చేశారు. ఇక్కడ మేము స్పష్టంగా తెలియపరుస్తున్న విషయం ఏమంటే, ఆయన మా పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన రోజుల్లో ఇదే చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ ఏం మాట్లాడారు? ఆయనపై ఎలాంటి కామెంట్స్ చేశారనేది గుర్తు చేసుకోవాలి. ‘ఆయన (ప్రశాంత్ కిషోర్) పీకే కాదు. బీడీ అన్నాడు చంద్రబాబు నాయుడు. బీడీ అంటే బీహార్ డెకాయిట్’ అని ఆనాడు చంద్రబాబు విమర్శించారు. దీన్ని తెలుగు ప్రజలు గుర్తు చేసుకోవాలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ‘పీకే’ తోక కత్తిరిస్తామంటూ.. ఎక్కడ్నుంచో పీకే అంట.. బీహార్ నుంచి వచ్చాడంట. ఆయన తోక కత్తిరిస్తాం.. ఇక్కడకొచ్చి ఆయనేం చేస్తాడు.. ఏమీ చేయలేడు..’ అంటూ తండ్రీకొడుకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అంతేకాదు, కోడికత్తి గురించి.. బాబాయిని హత్య చేయించారంటూ.. మతకల్లోలాలు సృష్టించారు.. ఎన్నెన్నో హత్యలు చేయించారంటూ.. ఇవన్నీ కూడా బీహార్ నుంచి వచ్చిన డెకాయిట్ ప్రశాంత్ కిశోర్‌నే చేయించాడని సాక్షాత్తూ నారా చంద్రబాబునాయుడు నోటికొచ్చినట్లు దుయ్యబట్టారు. తండ్రీకొడుకుల దిగజారుడుతనం.. అప్పట్లో మంత్రిగా ఉన్న లోకేశ్ కూడా పీకే గురించి ఏమన్నాడంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలపై నమ్మకం లేకనే పీకేను తెచ్చుకున్నామంటూ మాట్లాడాడు. ఇవన్నీ నేను ఇప్పుడెందుకు గుర్తు చేస్తున్నానంటే.. చంద్రబాబు, లోకేశ్ ఎంతగా దిగజారిపోతారో అందరూ గుర్తించాలి. అవసరమైతే, వారిద్దరూ ఎవరి కాళ్లయినా ఎలా పట్టుకుంటారో కూడా ప్రజలంతా గుర్తు పెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. సొంత పార్టీపైన వారికి నమ్మకం లేకేనా?.. ఒకప్పుడు బీహార్ డెకాయిట్ అన్నటువంటి ప్రశాంత్ కిశోర్‌నే మా పార్టీకి వ్యూహకర్తగా కావాలంటూ.. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ ఢిల్లీ వెళ్లి ఆయన్ను బతిమిలాడి తెచ్చుకున్నారు. అంటే, వారికి వారి పార్టీ మనుగడపై కాన్ఫిడెన్స్ లేదనేది తేటతెల్లమైందని గుర్తు చేస్తున్నాను. ఈ విషయం ప్రజలకు కూడా అర్ధమై ఉంటుందనుకుంటున్నాను. ఎంత మంది ‘పీకే’లు వచ్చినా.. ఆ పీకే (పవన్ కళ్యాణ్) అయినా.. ఈ పీకే (ప్రశాంత్ కిషోర్) అయినా తెలుగుదేశం పార్టీని బతికించే పరిస్థితి లేదని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, నేనొక విషయాన్ని అందరి దృష్టికి తెస్తున్నాను. ‘మెటీరియల్ మంచిది కాకపోతే, మేస్త్రీ ఏం చేస్తాడు..?’ అని అంటున్నాను. ఇదే విషయాన్ని ఇప్పటికే నేను ట్వీట్ ద్వారా కూడా ప్రజలకు వివరించాను. సో.. ఎంతమంది మేస్త్రీలు వచ్చినా మెటీరియల్ బాగ లేకపోతే ఏం చేసేది లేదని రాష్ట్ర ప్రజలతో పాటు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అర్ధం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. చచ్చిన శవం టీడీపీ.. పోస్టుమార్టంకే పీకే.. వైద్యులు రెండు రకాలుగా పనికొస్తారంట. ఒకటి చికిత్స చేయడానికి.. రెండు చనిపోయినప్పుడు పోస్టుమార్టం చేయడానికి పనికొస్తారట. కనుక, ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ అనే వ్యూహకర్త చనిపోయినటువంటి తెలుగుదేశం పార్టీకి పోస్టుమార్టం చేయడానికి మాత్రమే పనికొస్తాడు తప్ప ప్రాణం పోయడానికి పనికిరాడనే వాస్తవాన్ని ఇవాళ కాకపోతే రేపైనా అర్ధమౌతుంది. అందుకే ఎంతమంది ప్రశాంత్ కిశోర్లైనా.. ఎంత మంది పవన్‌కళ్యాణ్‌లు కట్టకట్టుకుని వచ్చినా.. ఎన్ని వ్యూహాలు రచించినా తెలుగుదేశం పార్టీని బతికించడం సాధ్యం కాదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఓడించడం అంతకన్నా సాధ్యం కాదనే విషయం అర్ధం చేసుకోవాల్సిందిగా చెబుతున్నాను. రానంటే.. కాళ్లు పట్టుకున్నారట!.. తెలుగుదేశం పార్టీకి కొత్త వ్యూహకర్త అవసరమొచ్చింది. అంటే, రాబిన్‌శర్మ పని అయిపోయిందన్నమాట. ఇంతకుముందు పనిచేస్తున్న వ్యూహకర్త వల్ల పార్టీ పైకి రాలేదు. ఇంకా దిగజారిపోయిందని అర్ధం. చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేస్తే.. లోకేశ్ సడన్‌గా ఢిల్లీలో మాయమై.. పీకే దగ్గరకు వెళ్లి ఆయన కాళ్లు పట్టుకున్నాడని చెప్పారు. అప్పుడు పీకే నేను రానన్నాడు. తెలుగుదేశం పార్టీ అనేది చచ్చిన పాము. దాన్ని నేను బతికించలేనని చెప్పినా కూడా.. పీకే కాళ్లు పట్టుకుని బతిమాలుకుని ఇక్కడకు రప్పించారనే సంగతిని మేమూ వింటున్నాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అంటూ కామెంట్స్ చేశారు. -
ప్రశాంత్ కిషోర్‌తో చంద్రబాబు భేటీ
ఖర్మ ఏంచేస్తాం.. కాలం తిరగబడి వెంటాడితే ఎలాంటివారైనా నేలచూపులు చూడాల్సిందే. ప్రధానులను తయారు చేశాను.. నేను విజనరీని.. చాణక్యుడిని అంటూ బోలెడు ఎచ్చులకు పోయిన చంద్రబాబు తాను ఎవరినైతే దొంగ అని ఆరోపించారో మళ్ళీ ఆయనతోనే చెట్టాపట్టాల్ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. టైం వస్తే అంతే.. గతంలో 2019లో ఎన్నికలకు ముందు ‘బీహారీ దొంగ’ అని చంద్రబాబు నిందించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అవసరం ఇప్పుడు పడింది. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఈ ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పని చేశారు. ఆ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఈయన మీద ఇష్టానుసారం మాట్లాడారు. బీహారీ దొంగ రాష్ట్రాన్ని పాడుచేస్తున్నారు. ఓట్లు తొలగిస్తున్నారు.. నా ఓటు కూడా తీసేస్తారేమో అంటూ సెటైర్లు వేశారు. అక్కసు వెళ్లగక్కారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయింది. ఎవర్ని తిట్టామో వాళ్ళ కాళ్లే పట్టుకోవాల్సిన ఖర్మ వస్తుంది. తెలుగుదేశం పార్టీ 2019లో ఘోర ఓటమి తరువాత పూర్తిగా కునారిల్లింది. క్యాడర్ చల్లబడిపోయింది. లోకేష్ సైతం ఎంత హైప్ చేస్తున్నా లేవడం లేదు. దీంతో అదే ప్రశాంత్ కిషోర్ టీమ్‌లో పని చేస్తున్న రాబిన్ శర్మను వ్యూహకర్తగా పెట్టుకుని ఇదేమి ఖర్మ.. బాదుడే బాదుడు. లోకేష్ ఎర్ర డైరీ వంటి పలు వ్యూహాలు అమలు చేసారు.. అయినా పని జరగలేదు... ఇక ఇటు సీఎం జగన్ తన పథకాలు.. వలంటీర్లు.. గృహసారధుల టీమ్‌తో ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. దీంతో భయానికి గురైన చంద్రబాబు ప్రశాంత్ కిశోర్ ఉంటే బాగుండు అని భావించి ఆయన్ను కలిసే ఏర్పాటు చేయమన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నన్నిరోజులు ఢిల్లీలో మకాం వేసిన లోకేష్ మొత్తానికి పీకేను పట్టుకున్నా చివరి రోజుల్లో వచ్చి తానేం చేయలేనని చేతులెత్తేశారు. అయినా ఆశ చావని చంద్రబాబు శతథా ప్రయత్నించి ఆయన్ను ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గన్నవరం తీసుకొచ్చారు. ఒకే ఫ్లైట్‌లో హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చిన ప్రశాంత్ కిషోర్, లోకేష్. pic.twitter.com/VkOakSSSL — Telugu Scribe (@TeluguScribe) December 23, 2023 కాసేపటి క్రితం లోకేష్.. చంద్రబాబు.. ప్రశాంత్ కిశోర్.. రాబిన్ శర్మ తదితరులు సమావేశమై.. రానున్న ఎన్నికల్లో గట్టెక్కే మార్గం గురించి మల్లగుల్లాలు పడుతున్నారు. వాస్తవానికి ఇప్పుడొచ్చి తానూ ఏమీ చేయలేనని ఇప్పటికే చెప్పినా వీళ్ళు వదలకపోవడంతో ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఎవరెవరు కూటమి కట్టినా తన పొత్తుమాత్రం జనంతో అని ఇప్పటికే తేల్చి చెప్పిన సీఎం జగన్ ప్రజల మద్దతును పొందేందుకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న మీమ్ గతంలో ఓ మీడియా ఛానెల్‌తో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పీకేను తట్టుకోలేమని అందుకే వదిలించుకున్నామని చెప్పారు తెలంగాణ గురించి మొత్తం తమకే తెలుసు అన్నట్టుగా పీకే బృందం వ్యవహరిస్తుందని, పార్టీని తామే నడుపుతామన్నట్టుగా ఉంటుందని కూడా వ్యాఖ్యానించాడు. కేసీఆర్‌కు మించిన రాజకీయ వ్యూహకర్త ఎవరూ లేరని అందుకే తాము ఈ ఎన్నికల్లో పీకే లాంటివారిని పెట్టుకోలేదని చెప్పుకొచ్చారు. - సిమ్మాదిరప్పన్న -
పబ్లిసిటీ కోసం పీకే ఏదైనా చేస్తారు.. నితీష్ సెటైరికల్ కౌంటర్
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. మళ్లీ బీజేపీతో చేరుతారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంచనా వేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా, పీకే వ్యాఖ్యలపై సీఎం నితీష్ స్పందించారు. పీకే మంచి వయస్సు మీద ఉన్నాడంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. ఈ అంశంపై నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. పీకే తన పబ్లిసిటీ కోసం ఏదైనా మాట్లాడతారు. ఆయన తన ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేసుకోవచ్చు. మేము వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ వయసు మీద ఉన్నాడని, కాబట్టి ఏదైనా మాట్లాడగలడని సెటైరికల్‌గా కామెంట్స్ చేశారు. అయితే, ఒకప్పుడు పీకే అంటే తనకు మంచి గౌరవ భావం ఉండేదని చెప్పారు. తాను అతడికి గౌరవం ఇచ్చినా అతడు మాత్రం తనను అగౌరవ పర్చాడని విమర్శించారు. ఇక, అంతకుముందకు నితీష్ కుమార్‌పై పీకే మాట్లాడుతూ.. ‘బీజేపీతో ఆయన తెగదెంపులు చేసుకున్నారా? అది అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన ఇంకా ఆ పార్టీతో టచ్‌లోనే ఉన్నారు!. ఇందుకు సాక్ష్యం కూడా ఉంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఇంకా కొనసాగుతున్న జేడీయూ నేత హరివంశ్ అందుకు సాక్ష్యం. ఇప్పటికే ఆయన్ని పదవి నుంచి తప్పుకోవాలని నితీశ్ ఆదేశించి ఉండాల్సింది. లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సింది. కానీ, అలా జరగలేదు. ఎందుకంటే హరివంశ్ ద్వారా నితీశ్ ఇంకా బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు’ అని ప్రశాంత్ పేర్కొన్నారు. #WATCH | "...He speaks for his own publicity & can speak whatever he wants, we don't care. He's young. There was a time when I respected him...those whom I respected had disrespected me: Bihar CM Nitish Kumar on Prashant Kishor's remark that he's in touch with BJP pic.twitter.com/ZPdmQUDSkr — ANI (@ANI) October 21, 2022 -
ఇక ముహూర్తమే!: కొత్త జాతీయ పార్టీకి కేసీఆర్ బాస్.. చక్రం తిప్పనున్న పీకే..
ప్రత్యామ్నాయ ఎజెండా.. ‘తెలంగాణ మోడల్’ జెండా! ► టీఆర్ఎస్ జెండాను పోలిన రీతిలో కొత్త పార్టీ పతాకం.. ఎన్నికల గుర్తుగా కారును కొనసాగించేలా ఎన్నికల సంఘాన్ని కోరాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కొత్త పార్టీ ఎజెండా కూడా ఖరారైనట్టు సమాచారం. ► తెలంగాణ ఉద్యమం ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో కొనసాగగా.. ఇంచుమించు ఇవే అంశాలను జాతీయ ఎజెండాలోనూ ఎత్తుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. విద్యుత్ సమస్య, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత, వివిధ రంగాల్లో టీఆర్ఎస్ సర్కారు ప్రగతిని రోల్ మోడల్‌గా చూపనున్నట్టు సమాచారం. ► పార్టీ ఎజెండాను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీలుగా.. వివిధ రంగాలకు చెందిన వారిని కూడగట్టే పనిని మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌కు అప్పగించినట్టు తెలిసింది. ► దేశంలోని పలువురు వ్యవసాయ, ఆర్థిక, నీటి పారుదల, విద్యుత్, పాలనా రంగాల నిపుణులతో కేసీఆర్ ఇప్పటికే మంతనాలు జరిపారు. మొత్తంగా దేశం ముందు పెట్టాల్సిన ప్రత్యామ్నా య, ఆర్థిక ఎజెండాను రూపొందించే బాధ్యతను హైదరాబాద్‌లోని ఓ సామాజిక, ఆర్థిక అధ్యయన బృందానికి అప్పగించినట్టు తెలిసింది. ► ఇక పార్టీ ఎజెండాపై విస్తృత ప్రచారం కల్పించేందుకు దేశవ్యాప్తంగా పలు వర్సిటీల్లో సదస్సులు నిర్వహించేలా ఇప్పటికే కొన్ని విద్యార్థి బృందా లను సిద్ధం చేసినట్టు సమాచారం. ► తెలంగాణ ఉద్యమ వ్యాప్తి, టీఆర్ఎస్ విస్తరణలో కీలకపాత్ర పోషించిన ‘సాంస్కృతిక కళారూపాలను కొత్త పార్టీకి కూడా జోడించనున్నారు. దీనికి అవసరమైన సాహిత్యం, కళాకారులు వంటి అనేక అంశాలపై కసరత్తు జరుగుతోంది. సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండాతో జాతీయ పార్టీ ఏర్పాటుకు టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. మూడు రోజులుగా ప్రగతిభవన్‌లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో మంతనాలు జరిపిన కేసీఆర్.. కొత్త పార్టీకి సంబంధించిన విధి విధానాలకు తుది రూపునిచ్చినట్టు తెలిసింది. ‘భారత రాష్ట్ర సమితి’, ‘భారత నిర్మాణ సమితి’, ‘భారత ప్రజా సమితి’లలో ఒక పేరును ఖరారు చేసి.. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద కొత్త పార్టీని రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ చురుగ్గా కొనసాగుతున్నట్టు సమాచారం. ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు మంచి రోజులు ఉండటంతో సరైన ముహూర్తం చూసి.. కొత్త జాతీయ పార్టీ పేరు, ఎజెండా, నియమావళి, జెండా, ఎన్నికల గుర్తు తదితరాలను ప్రకటించేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. దీంతో త్వరలోనే కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు పార్టీవర్గాలు చెప్తున్నాయి. ఈ కొత్త జాతీయ పార్టీలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు కూడా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా కేసీఆర్ వ్యవహరించనుండగా.. ప్రశాంత్ కిషోర్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శి లేదా సెక్రటరీ జనరల్ హోదా కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఏర్పాట్లపై తుది కసరత్తు.. ‘భారత రాష్ట్ర సమితి’ లేదా ‘భారత నిర్మాణ సమితి’గా టీఆర్ఎస్ అవతరించే పక్షంలో.. ఆపై రాష్ట్రంలోనూ కొత్త పేరుతోనే మనుగడ సాగించనుంది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు కొత్త జాతీయ పార్టీకి చెందిన గుర్తు, ఎజెండాపైనే ఎన్నికల బరిలోకి దిగే అవకాశముంది. జాతీయ పార్టీగా అవతరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ పేరిట ఉన్న ఆస్తులు, బ్యాంక్ డిపాజిట్లు తదితరాలను కొత్త పార్టీ పేరిట మార్పిడి చేసేందుకు ఉన్న న్యాయపరమైన అవకాశాలు, చిక్కులపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. కొత్త జాతీయ పార్టీ ఆవిర్భావ ప్రకటనతోపాటు జాతీయ కార్యవర్గం/పొలిట్ బ్యూరోను కేసీఆర్ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. వివిధ రాష్ట్రాల్లో భావ సారూప్యత కలిగిన చిన్న పార్టీలు, వివిధ సామాజిక సంస్థలు, సంఘాలను విలీనం చేసుకుంటూ కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్టు సమాచారం. కొత్త పార్టీ కార్యవర్గంలో రాజకీయ నేతలకంటే వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మేధావి వర్గానికి పెద్దపీట వేయడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండాపై తమ చిత్తశుద్ధిని చాటాలని కేసీఆర్ భావిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఢిల్లీలో బహిరంగ సభ పెట్టి.. కేసీఆర్ జాతీయ పార్టీ స్థాపనపై ప్రకటన చేశాక.. జూలై మొదటి వారంలో దేశ రాజధాని ఢిల్లీ లేదా పరిసర రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఆ సభకు తెలంగాణతోపాటు ఉత్తరాది నుంచి జన సమీకరణ చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజయ్యేలా జాగ్రత్తలు తీసుకోనున్నట్టు తెలిసింది. ఉత్తరాదిన పార్టీ విస్తరణకు అనువైన వాతావరణం ఉందని భావిస్తూ.. ఉత్తరాది రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలని నిర్ణయించారు. దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలతో రాజకీయ శూన్యత లేదనే అభిప్రాయంతో ఉన్న కేసీఆర్.. సందర్భాన్ని బట్టి ముందుకు సాగాలని భావిస్తున్నారు. రైతు నేత రాకేశ్ తికాయత్ సేవలను వినియోగించుకోవడం, యూపీలో ఆర్ఎల్డీ, జార్ఖండ్‌లో జేఎంఎం, బిహార్‌లో ఆర్జేడీ, యూపీలో సమాజ్‌వాదీ వంటి పార్టీలతో ఏ తరహా సంబంధాలను కొనసాగించాలనే కోణంలోనూ కేసీఆర్ కొంతమేర స్పష్టతకు వచ్చినట్టు తెలిసింది. రాష్ట్రాల వారీగా రాజకీయ పరిస్థితులు, కలిసి వచ్చే పార్టీలు, నేతల వివరాలతో పీకే బృందం ఇప్పటికే నివేదికలు రూపొందించినట్టు సమాచారం. కొత్త పార్టీకి ‘సినీ గ్లామర్’! జాతీయ రాజకీయాల్లో వీలైనంత త్వరగా కుదురుకోవాలని భావిస్తున్న సీఎం కేసీఆర్.. కొత్త పార్టీకి సినీ గ్లామర్‌ను కూడా అద్దుతున్నారు. ఇప్పటికే నటుడు ప్రకాశ్‌రాజ్ కేసీఆర్‌తో సన్నిహితంగా మెలుగుతుండగా.. మరో నటుడు సోనూసూద్ కూడా కొత్త పార్టీలో కీలక బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది. సోషల్ మీడియా దన్నుతో.. జాతీయ స్థాయిలో కొత్త పార్టీ విస్తరణ కోసం కొన్ని జాతీయ మీడియా సంస్థల సాయం తీసుకోవడంతోపాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను విస్తృతంగా ఉపయోగించుకునేలా ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే వ్యూహ రచన చేశారు. జాతీయ రాజకీయాలు, బీజేపీ విధానాలపై కేసీఆర్ హిందీలో చేసిన ప్రసంగాల్లోని అంశాలు ఇప్పటికే సామాజిక మాధ్య మాల ద్వారా ఉత్తరాది రాష్ట్రాల్లో చక్కర్లు కొడుతున్నాయని.. వేల సంఖ్యలో కామెంట్లు, లైక్‌లు వస్తున్నాయని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. -
గెలుపుపై నమ్మకం లేకే పీకే చెంత కేసీఆర్: ఈటల రాజేందర్
పాలమూరు: తెలంగాణ ప్రజల నాడి తెలిసిన కేసీఆర్‌కు పీకే అవసరం ఎందుకు వచ్చిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా సంక్షేమ పాలన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు డబ్బులు లేని సర్కార్ రూ.250 కోట్లు వెచ్చించి ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. ఇక్కడి రైతులను పట్టించుకోని ఈ ప్రభుత్వ అధినేత.. దేశ ప్రధాని కావాలనే ఆశతో ఇతర రాష్ట్రాల్లోని రైతులకు నష్టపరిహారంగా ఇస్తున్న సొమ్ము తెలంగాణ ప్రజలది కాదా?.. అని నిలదీశారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవటం ఖాయమని ఈటల జోస్యం చెప్పారు. ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారని, టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ అవతరించబోతోందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు ఓటేసినా.. టీఆర్ఎస్కు ఓటేసినా కేసీఆరే తిరిగి అధికారంలోకి వచ్చి ఆయనే సీఏం అవుతారని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీనే భావిస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని అందిపుచ్చుకునేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. ç -
దేశంలో రాజకీయ శూన్యతను పూరించాలి.. సీఎం కేసీఆర్–పీకే భేటీలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: దేశంలో నెలకొన్న రాజకీయ శూన్యతను పూరించేందుకు జాతీయస్థాయిలో కీలకపాత్ర పోషించాల్సిందేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కృత నిశ్చయంతో ఉన్నారని.. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా బీజేపీయేతర, కాంగ్రెసేతర పక్షాలతో సంబంధాలను కొనసాగించాలని నిర్ణయించారని తెలిసింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని త్వరలోనే ఖరారు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 10న జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో వెల్లడైన అభిప్రాయాలకు అనుగుణంగా.. జాతీయ స్థాయిలో రాజకీయ అరంగేట్రంపై సరైన సమయంలో, సరైన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఆదివారం ప్రగతిభవన్‌లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో భేటీ అయిన సీఎం కేసీఆర్.. జాతీయ పార్టీ ప్రకటన, రాష్ట్రపతిఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, రాబోయే ఎన్నికలు, ఎమ్మెల్యేలు– ప్రభుత్వ పనితీరుపై పీకే బృందం చేసిన సర్వే నివేదికలపై చర్చించారు. ప్రగతిభవన్‌లో సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ భేటీలో కేసీఆర్, పీకేతోపాటు మంత్రి హరీశ్‌రావు కూడా పాల్గొన్నారు. జాతీయ పార్టీ కావాలంటే ఎలా..? ‘‘కేంద్రంలో బీజేపీ పాలనలో అశాంతి పెరిగిపోయింది. నియంతృత్వ పోకడలు పెచ్చుమీరాయి. ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైన నేపథ్యంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను పూరించేందుకు జాతీయ రాజకీయాల్లో బలీయమైన శక్తిగా అవతరించడమే మార్గం..’’అని సీఎం కేసీఆర్, పీకే భేటీలో అభిప్రాయానికి వచి్చనట్టు తెలిసింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ను జాతీయ పారీ్టగా మార్చడంపై దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న అభిప్రాయాలపైనా చర్చించినట్టు సమాచారం. రాష్ట్రాల వారీగా అధికారంలో, ప్రతిపక్షంలో ఉన్న పారీ్టలు, ఆయాచోట్ల కొత్త జాతీయ పారీ్టకి ఉన్న అనుకూలతలపై చర్చించినట్టు తెలిసింది. దేశంలో ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పశి్చమబెంగాల్తోపాటు ఇతర రాష్ట్రాలకు విస్తరించే ఆలోచనతో ఉంది. ఢిల్లీలో ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో అధికారాన్ని కైవసం చేసుకొని దేశం వైపు చూస్తోంది. శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయబోయే పార్టీ విధివిధానాలు ఎలా ఉండాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ‘దీదీ’సమావేశానికి వెళ్లాలని నిర్ణయం! రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో విపక్షాల ఉమ్మడి అభ్యరి్థని నిలబెట్టి బీజేపీకి షాకివ్వాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశి్చమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (దీదీ) ఇప్పటికే నిర్ణయించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సహా 22 మంది వివిధ పార్టీల నేతలకు లేఖలు రాశారు. సీఎం కేసీఆర్‌కు స్వయంగా ఫోన్ చేసి 15న ఢిల్లీలో జరిగే సమావేశానికి రావాలని కోరారు. ఈ నేపథ్యంలోనే గతంలో తృణమూల్ కాంగ్రెస్‌కు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్‌తో ప్రస్తుత పరిణామాలపై సీఎం కేసీఆర్ చర్చించినట్టు సమాచారం. 15న జరిగే సమావేశానికి వెళ్లాడమా, లేదా అన్న అంశంపై అభిప్రాయాలు పంచుకున్నట్టు సమాచారం. కేసీఆర్ వెళ్లలేని పక్షంలో కేటీఆర్నుగానీ, పార్టీ తరఫున మరో ప్రతినిధినిగానీ ఢిల్లీకి పంపాలని నిర్ణయానికి వచి్చనట్టు తెలిసింది. ఇదే సమయంలో జాతీయ రాజకీయాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు సాగాలని భావనకు వచి్చనట్టు సమాచారం. రాష్ట్రంలో ఎన్నికలు, సర్వేలపైనా చర్చ? రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయనే అంశాలపై ప్రశాంత్‌కిషోర్ నేతృత్వంలోని ఐప్యాక్ బృందం ఇటీవల సర్వే చేసి కేసీఆర్‌కు నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. తర్వాత ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌తో పీకే భేటీ అయి చర్చించారు కూడా. ఈ నేపథ్యంలో జిల్లాలు, నియోజకవర్గాల వారీగా అనుసరించాల్సిన వ్యూహాలపై వారు మరోసారి చర్చించినట్టు తెలిసింది. పార్టీ బలహీనంగా ఉన్న చోట ఆప్షన్లు ఎలా ఉండాలనే దానిపైనా మంతనాలు సాగించినట్టు సమాచారం. కేసీఆర్‌తో ఉండవల్లి భేటీ – జాతీయ రాజకీయాలపైనే చర్చ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ప్రవేశంపై చర్చ సాగుతున్న నేపథ్యంలో.. ఏపీకి చెందిన ఉండవల్లి ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలకపాత్ర పోషించే అంశం, కొత్త పార్టీ ఏర్పాటు, టీఆర్ఎస్ను జాతీయ పారీ్టగా మార్చడంలో ఉన్న సాంకేతిక ఇబ్బందులపై చర్చించినట్టు తెలిసింది. ప్రశాంత్ కిషోర్‌తో భేటీ ముగిశాక సాయంత్రం 6 గంటల తర్వాత ఈ భేటీ జరిగింది. ఇందులో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. -
పీకే సర్వే.. పనితీరే గీటురాయి..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ముందస్తు ఎన్నికల హడావుడి.. జాతీయ రాజకీయాల దిశగా టీఆర్ఎస్ అడుగుల నేప థ్యంలో అన్ని జిల్లాల్లో పార్టీ నేతల మధ్య ఉన్న పొరపొచ్చా లపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీలోని విభేదాలపై ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓడిపోయిన నేతలు, జెడ్పీ చైర్మన్లతో ప్రత్యేకంగా చర్చించారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ‘ఎమ్మెల్యేలు, నేతల పనితీరు ఆధారంగానే టికెట్లు వస్తాయి. పీకే సర్వేను కూడా ప్రామాణికంగా తీసుకుంటాం. కొన్ని కఠిన నిర్ణయా లకు కూడా వెనుకాడం. ఇప్పటి నుంచే మీ పనితీరు మెరుగు పరుచుకోవాలి. పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాలి. గతంలో రెండుసార్లు జిల్లాలో చేదు ఫలి తాలు వచ్చాయని, ఈసారి అవి పునరావృతం కావొద్దని, పదికి పది స్థానాలను సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజలు ఈసడించుకునేలా అధికార యంత్రాంగాన్ని సొంత పనులకు వినియోగించుకోవద్దు. దీనివల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది’అని అన్నారు. సమావేశానికి ఎంపీ నామా నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాగా స్థానికంగా లేకపోవడంతో ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హాజరుకాలేదు. బీఆర్ఎస్ కోర్ కమిటీ మీటింగ్‌కు పిలుస్తాం జాతీయస్థాయిలో పార్టీ నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టారని, భారత్ రాష్ట్రీయ సమితి(బీఆర్ఎస్) ఏర్పా టు చేస్తున్నామని, త్వరలోనే పార్టీ ప్రకటన ఉంటుందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ కోర్ కమిటీ మీటింగ్‌కు సంబం ధించి ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలకు కూడా ఆహ్వానాలు అం దుతాయని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇప్పుడు వచ్చినట్లుగానే భావించి అందరూ నియోజకవర్గాల్లో, గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాలని సూచించారు. -
Prashant Kishor: 40 మందికిపైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి నో టికెట్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రత్యర్థి పారీ్టల రాజకీయ ఎత్తుగడలను నిశితంగా గమనిస్తున్న అధికార టీఆర్ఎస్ మరోవైపు సొంత పార్టీ నేతల పనితీరుపైనా దృష్టి సారించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్ ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. ఐ ప్యాక్ నివేదికల నేపథ్యంలో 40 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి అవకాశం దక్కక పోవచ్చని తెలుస్తోంది. శాసనసభ నియోజకవర్గాలవారీగా ప్రస్తుత ఎమ్మెల్యేలతో పాటు సెగ్మెంట్ పరిధిలోని ఇతర ముఖ్య నేతల పనితీరు, గుణగణాలపై టీఆర్ఎస్ లోతుగా వివరాలు సేకరిస్తోంది. ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ‘ఐ ప్యాక్’బృందం ఈ మేరకు నివేదికలు రూపొందిస్తోంది. ఇప్పటికే సుమారు 70 నియోజకవర్గాలకు సంబంధించిన నివేదికలు టీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వద్దకు చేరాయి. మరో 40కి పైగా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, నేతల పనితీరుపై నివేదికలకు ఈ నెల 20లోగా తుది రూపు వచ్చే అవకాశముంది. వివిధ కోణాల్లో సేకరిస్తున్న సమాచారాన్ని క్రోడీకరించి రూపొందిస్తున్న ఈ నివేదికల ఆధారంగా క్షేత్ర స్థాయిలో దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో పాటు వచ్చే ఎన్నికల్లో గెలుపు వ్యూహానికి కూడా ఇప్పటినుంచే పదును పెట్టాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. మీడియా సంబంధాలపైనా విశ్లేషణ ప్రధాన మీడియా, వాటి ప్రతినిధులతో పార్టీ పరంగా ఉన్న సంబంధాలు, సమాచారం పంపిణీ, సామాజిక మాధ్యమాల్లో పార్టీకి అనుకూలం, ప్రతికూలంగా జరుగుతున్న ప్రచారం తదితరాలను కూడా ఐ ప్యాక్ బృందాలు అంచనా వేస్తున్నాయి. మీడియాలో వస్తున్న ప్రతికూల ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఎలాంటి కంటెంట్ (అంశాలు) అవసరమనే కోణంలోనూ మదింపు జరుగుతోంది. మరోవైపు వివిధ సందర్భాల్లో పార్టీ తరఫున మీడియాలో గళం విప్పుతున్న ప్రతినిధుల సమర్ధత, వారికి వివిధ అంశాలపై ఉన్న అవగాహన, వారి భాషా పరిజ్ఞానం తదితరాలను కూడా ఐ ప్యాక్ విశ్లేషిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పారీ్టలు ఏ తరహా ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి, ఆ పారీ్టకి ఉన్న మీడియా సంబంధాలపై కూడా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇటీవల నివేదికలు అందజేసింది. అన్ని వైపుల నుంచీ ఆరా.. పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పూర్తి వివరాలను ఐ ప్యాక్ బృందం సేకరిస్తోంది. వైవాహిక స్థితి, కుటుంబంలో ఎవరైనా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారా, ఏయే పదవుల్లో ఉన్నారు? ఎలాంటి పనితీరు కనపరుస్తున్నారు? వంటి కోణాల్లో బృందాలు ఆరా తీస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేలు, నేతల ఆర్థిక స్థితిగతులు, వారికి ఉన్న వ్యాపార నిర్వహణ బాధ్యతలు చూస్తున్నదెవరు?, పార్టీ, సామాజిక కార్యక్రమాల్లో ఎంత మేర చురుగ్గా పనిచేస్తున్నారు? తదితర వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేపై ప్రతికూలత ఉండే పక్షంలో ఎవరు సరైన ప్రత్యామ్నాయం అనే కోణంలోనూ సమాచార సేకరణ జరుగుతోంది. పార్టీలో అంతర్గత గ్రూపులు, వీటి వెనుక ఉన్న కీలక నేతలు, పార్టీ యంత్రాంగంపై గ్రూపు రాజకీయాల ప్రభావం తదితర అంశాలను కూడా నివేదికలో పొందుపరుస్తున్నారు. ఇలావుండగా ఇతర పారీ్టల నుంచి టీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేతలు లేదా ఇతర పారీ్టల్లో బలమైన నేతల వివరాలు కూడా ఈ నివేదికల్లో ఉన్నట్టు తెలుస్తోంది. విపక్ష ఎమ్మెల్యేల పనితీరు, వారి బలాబలాలను కూడా అంచనా వేస్తున్న ఐ ప్యాక్ బృందాలు ఆ మేరకు నివేదికలు రూపొందిస్తున్నట్టు సమాచారం. -
ఈ చింత తీరేదెట్లా?
చింతలు ఎక్కువైనప్పుడు చింతన తప్పదు. సమస్యలతో సతమతమవుతున్న శతాధిక వర్ష కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల పాటు ఆ పనే చేసింది. కానీ, రాజస్థాన్‌లోని ఉదయపూర్ చింతన్ శిబిర్‌లో కొంత దృఢ నిశ్చయంతో, కొన్ని నవ సంకల్పాలు చెప్పుకున్నా... కాంగ్రెస్ పార్టీని వెంటాడుతున్న చింతలు మాత్రం తీరేలా కనిపించడం లేదు. శిబిరాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొన్నామని ఊపిరి పీల్చుకొనే లోగా, ఆ పార్టీకి ఒకటికి రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. ఎన్నికలు రానున్న గుజరాత్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు హార్దిక్ పటేల్, ఇటీవలే ఎన్నికలు ముగిసిన పంజాబ్‌లో పార్టీ మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్ ఇద్దరూ రోజుల తేడాలో పార్టీకి గుడ్‌బై చెప్పారు. సునీల్ వెంటనే బీజేపీ కండువా కప్పుకుంటే, హార్దిక్ రేపోమాపో ఆ పనే చేయనున్నట్టు వార్త. ఇవి చాలదన్నట్టు రానున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఘోర పరాజయం తప్పదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తాజా జోస్యం. ఇవేవీ అనూహ్యం కాకున్నా, గాలి ఎటు వీస్తోందో అర్థమై, భవిష్యత్తు కళ్ళ ముందే కనిపిస్తూ కాంగ్రెస్‌ను కలవరపెడుతోంది. బలమైన ఏకవ్యక్తి నాయకత్వం కింద ఒక పార్టీయే దేశ రాజకీయాలను శాసించడం మంచిది కాదని 1970, 80లలో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ అనుభవాలు చెప్పకనే చెబుతున్నాయి. కానీ, బలహీన అజెండా తప్ప మూడు రోజుల మథనంతో కాంగ్రెస్ సాధించినదేమిటంటే సంతృప్తికర మైన సమాధానం లేదు. సమస్యలున్నట్టు గుర్తించారన్న ఊరటే తప్ప, సమగ్రమైన పరిష్కారం కోసం ప్రయత్నం కనిపించదు. యాభై ఏళ్ళ లోపు వారికి సీట్లలో రిజర్వేషన్, వారసులకు సీట్ల కేటాయింపులో పరిమితి విధింపు, పార్టీ ఆఫీస్ బేరర్లకు నిర్ణీత పదవీకాలం, వివిధ సలహా సంఘాల ఏర్పాటు లాంటి పై పై చర్యలతో పార్టీ ఎదుర్కొంటున్న పెను సంక్షోభాన్ని నివారించడం అయ్యే పనీ కాదు. వరుస పరాజయాలు, ‘జీ–23’గా పేరుపడ్డ పార్టీ సీనియర్ల ధిక్కారస్వరం, ప్రశాంత్ కిశోర్ చూపిన చేదు నిజాలు, ఇచ్చిన సలహాలు – ఇవేవీ కాంగ్రెస్‌ను సుప్త చేతనావస్థ నుంచి ఇంకా కదిలించినట్టు లేవు. నవ తరాన్ని ఆకట్టుకొనే ప్రయత్నాలు, పార్టీకి జవజీవాలిచ్చే ఆలోచనలు అధిష్ఠానం చేస్తోందా అంటే అనుమానమే. సంక్షేమ పథకాలు, సంస్థాగతంగా ఎస్సీ – ఎస్టీ – ఓబీసీలకు కోటాలు, యాత్రల లాంటివి ప్రకటించినా, అవి ఇప్పటికే అరిగిపోయిన అస్త్రాలు. మోదీ రెండోసారి గెలవ గానే, పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ తప్పుకున్నాక ఇప్పటి దాకా కాంగ్రెస్ దాదాపు చుక్కాని లేని నావే. 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కోరి మరీ తనను కాంగ్రెస్‌లోకి తెచ్చుకున్న రాహుల్ పైనే పరోక్ష విమర్శలతో యువ పాటీదార్ నేత హార్దిక్ పటేల్ తన రాజీనామా సమర్పిం చడం గమనార్హం. పార్టీ తప్పకుండా అధికారం నిలబెట్టుకుంటుందని ఏడాది క్రితం అనుకున్న పంజాబ్ పీఠాన్ని లేనిపోని నాయకత్వ మార్పులతో చేజేతులా పోగొట్టుకున్న ఘనత కాంగ్రెస్ యువ అధినాయకత్వానిదే. పంజాబ్, మధ్యప్రదేశ్‌లలో రాహుల్ కానీ, యూపీలో ప్రియాంక కానీ పార్టీని కనీసం గౌరవనీయ స్థానంలో నిలపలేకపోవడం నెహ్రూ వారసుల వైఫల్యం. రాజకీయాలు పార్ట్‌టైమ్ ఉద్యోగం కాదనీ, కష్టపడితేనే ఫలితాలొస్తాయనీ వారికింకా అర్థమైనట్టు లేదు. కాంగ్రెస్‌కు కష్టాలు కొత్త కావు. కానీ, వచ్చే సార్వత్రిక ఎన్నికలు మాత్రం జీవన్మరణ సమస్యే. ఆ లోగా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రీ–ఫైనల్స్. 2014లో 44, ఆ తర్వాత 2019లో 52 స్థానాలే గెలిచి, గడచిన రెండు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. జాతీయస్థాయిలో ఆ పార్టీ ఓట్ షేర్ 1984లో యాభై ఏళ్ళ అత్యధికమైన 49.1 శాతానికి చేరింది. ఇప్పుడది 19 శాతం దగ్గర తారట్లాడుతోంది. గత 8 ఏళ్ళలో జరిగిన 50 అసెంబ్లీ ఎన్నికల్లో 37 ఎన్నికల్లో ఆ పార్టీ పరా జయం పాలైంది. ప్రస్తుతం రెండే రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీ స్వయంగా అధికారంలో ఉంది. రానున్న కాలం పార్టీకి అత్యంత కీలకమనేది అందుకే. 2019 ఎన్నికల్లో 170 స్థానాల్లో వరుసగా 2 సార్లు ప్రజాక్షేత్రంలో ఓటమి పాలైనవారినే అభ్యర్థులుగా ఎంచుకోవడం లాంటి తప్పులెన్నో కాంగ్రెస్ విజయావకాశాల్ని దెబ్బతీశాయి. ఈసారైనా అలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి. సంస్థాగత బలహీనతలు, ఎదురుగా ఉన్న సవాలు అన్నీ తెలిసినా – కాంగ్రెస్ తగినరీతిలో స్పందిస్తున్న దాఖలా లేదు. ఏళ్ళూ పూళ్ళూ గడుస్తున్నా పార్టీని పీడిస్తున్న సమస్యల్లో మార్పు లేదు. ప్రశాంత్ కిశోర్ ఆ మధ్య గణాంకాలతో సహా ఎత్తిచూపినవీ సరిగ్గా అవే. ఇప్పటికైనా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాలి. బలమైన ప్రత్యర్థిని ఓడించాలంటే, వ్యూహం ఉండాలి. ఉమ్మడి ప్రత్యర్థిపై పోరుకు బలమైన ప్రాంతీయ పార్టీలను కలుపుకొని పోవాలన్న వాస్తవాన్ని నిరాకరిస్తే నష్టమే. సంకల్పమే కాదు... నిరంతర శ్రమ, సమష్టి తత్త్వం అవసరం. అధిష్ఠానం నుంచి అడుగున కార్యకర్త దాకా పేరుకుపోయిన జడత్వాన్ని వదిలించుకోవాలి. పార్టీలు, విదేశీ పర్యటనల ఇమేజ్‌ని చెరుపుకొని, అధినేతలూ త్యాగాలకు సిద్ధపడితే పార్టీని నిలబెట్టవచ్చు. ఇవాళ్టికీ దేశంలో బీజేపీకి బలమైన జాతీయ ప్రతిపక్షంగా తమకున్న సానుకూలతను కాంగ్రెస్ ఉపయోగించుకోవచ్చు. అందుకు కొత్త తరంతో, క్రొంగొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. వారసత్వం కన్నా ప్రతిభకు పట్టం కట్టాలి. దానికి ఎవరెంత సిద్ధంగా ఉన్నారన్నదే ప్రశ్న. ఆ దిశగా తొలి అడుగులు పడితే ఏ చింతన శిబిరాలైనా సఫలమైనట్టు! -
‘జన సురాజ్’ ప్రకటించిన ప్రశాంత్ కిశోర్
పట్నా: బిహార్‌లో మా ర్పుతీసుకువచ్చేందుకు ‘జన్ సురాజ్’ వేదికను ఆరంభిస్తున్నట్లు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గురువారం ప్రకటించారు. ప్రస్తుతానికి రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదని, భవిష్యత్‌లో జన్ సురాజ్ వేదికే పార్టీగా మారే అవకాశాలుండొచ్చని చెప్పారు. బిహార్‌లో మార్పుకోరుకునే తనలాంటి 18వేల మందితో టచ్‌లో ఉన్నానని చెప్పారు. వీరందరినీ తాను తలపెట్టిన పాదయాత్రకు ముందే వ్యక్తిగతంగా కలిసేందుకు యత్నిస్తానని చెప్పారు. గాంధీజీ చెప్పిన సరైన చర్యలే మంచి రాజకీయమన్న సూక్తి ఆధారంగా తానీ జన్ సురాజ్‌ను ఆరంభించానని తెలిపారు. సంవత్సరంలో 3వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని, రాష్ట్రం నలుమూలలా వీలైనంత మందిని కలవాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు. లాలూ, నితీశ్ సాధ్యమైనంత మేర సాధికారత తెచ్చేందుకు యత్నించారని, కానీ రాష్ట్రం అభివృద్ధి సూచీల్లో అట్టడుగునే ఉందని తెలిపారు. బిహార్‌కు కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమన్నారు. అదే సమయంలో బెంగాల్లో మమతతో పనిచేయడంపై జవాబిస్తూ అక్కడ టీఎంసీకి పూర్తి యంత్రాంగం ఉందని, బిహార్‌లో అంతా కొత్తగా ఆరంభించాలని చెప్పారు. బిహార్‌లో ఓబీసీల హవా అధికం, తాను బ్రాహ్మిణ్ కావడం వల్లనే భవిష్యత్ సీఎంగా ముందుకురాలేకపోయారన్న ప్రశ్నకు బదులిస్తూ బిహార్‌లో ప్రస్తుతం మోదీకి అత్యధిక ఓట్లు రాబట్టే సత్తా ఉందని, కానీ బిహార్‌లో ఆయన కులస్తులెందరున్నారని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: తమిళనాడులో నీట్‌పై రగడ.. ఢిల్లీ తలుపు తట్టిన గవర్నర్ -
Sakshi Cartoon: సారీ! ఇంత క్రిటికల్ కేసు డీల్ చేయడం నావల్ల కాదు
-
కాంగ్రెస్‌కు బిగ్ షాకిచ్చిన ప్రశాంత్ కిషోర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బిగ్ షాకిచ్చారు. కాంగ్రెస్‌లో చేరాలంటూ పార్టీ అధిష్టానం అందించిన ఆఫర్‌ను పీకే నిరాకరించారు. తాను పార్టీలో చేరడం లేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సుర్జేవాలా ధ్రువీకరించారు. పీకే నిర్ణయాన్ని గౌరవిస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా కొంతకాలంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనికితోడు ఇటీవల పీకే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇతర నాయకులతో భేటీ అవ్వడంతో కాంగ్రెస్‌లో చేరిక దాదాపు ఖరారైనట్లేనని అంతా భావించారు. అంతేగాక కాంగ్రెస్‌లో చేరి బాధ్యతలు చేపట్టాలని పీకేను సోనియా గాంధీ ఆహ్వనించారు. ఈ మేరకు పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే సోనియా ప్రతిపాదనను నిర్ధ్వందంగా తిరస్కరించారు. Following a presentation & discussions with Sh. Prashant Kishor, Congress President has constituted a Empowered Action Group 2024 & invited him to join the party as part of the group with defined responsibility. He declined. We appreciate his efforts & suggestion given to party. — Randeep Singh Surjewala (@rssurjewala) April 26, 2022 -
కాంగ్రెస్‌లో పీకే చేరికకు ఓకేనా..? సీనియర్ల షరతులేంటి?
సాక్షి, న్యూడిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరికపై ఇంకా క్లారిటీ రాలేదు. అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో జరిగిన కీలక సమావేశంలో 12మందికిపైగా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. పీకే 2024 రోడ్‌మ్యాప్‌పై సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై విస్తృతస్థాయిలో చర్చించారు. దీంతోపాటు పార్టీ బలోపేతానికి, సమస్యల పరిష్కానికి ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ 2024 అనే కమిటీని సోనియా ఏర్పాటు చేశారు. సోనియా నివాసంలో మూడుగంటలపాటు జరిగిన సమావేశంలో ప్రశాంత్ కిశోర్ ఎంట్రీపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రశాంత్ కిశోర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవాలా వద్దా అనే అంశంపై కాంగ్రెస్ నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఒకవేళ పార్టీలో చేరితే, ఏం బాధ్యతలు అప్పగించాలనే విషయంపైనా చర్చ జరిగింది. పీకే 2024 రోడ్‌మ్యాప్‌పై మెజార్టీ సభ్యులు సానుకూలంగానే ఉన్నారని సమాచారం. అయితే, ప్రశాంత్ కిశోర్ పార్టీలో చేరాక మరే ఇతర రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయవద్దని, ఎలాంటి సేవలు అందించవద్దని కాంగ్రెస్ సీనియర్లు షరతులు పెట్టారట. దీనిపై తుదినిర్ణయం సోనియాగాంధీదే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిశోర్ ఎంట్రీపై ఇప్పటికే రచ్చ మొదలైంది. చదవండి👉 పీకే చర్చ మీడియాలో మాత్రమే జరుగుతోంది: భట్టి రాష్ట్రాల ఇంఛార్జ్‌లుగా ఉన్న కొందరు జనరల్ సెక్రటరీలు పీకే చేరికను వ్యతిరేకిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రధాన కార్యదర్శులపై ప్రశాంత్ కిశోర్ నెగెటివ్ రిపోర్ట్ ఇవ్వడమే దీనికి కారణమని తెలుస్తోంది. రాష్ట్రాల్లో ఇంఛార్జ్‌లుగా ఉన్నవారు కొందరికి అనుకూలంగా పనిచేస్తున్నారని.. దీనివల్ల క్షేత్రస్థాయిలో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని కుండబద్దలు కొట్టారంట పీకే. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ చేసిన ట్వీట్లు చర్చనీయాంశంగా మారాయి. టీ కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిషోర్ టెన్షన్ మొదలైందని దీనిని బట్టి తెలుస్తోంది. ఇదిలాఉండగా.. మే 13, 14, 15 తేదీల్లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో చింతన్ శిబిరం జరగనుంది. దేశవ్యాప్తంగా 400మంది కాంగ్రెస్ నేతలు ఈ భేటీకి హాజరవుతారు. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలు, అధ్యక్ష ఎన్నికలు సహా వివిధ అంశాలపై చింతన్ శిబిరంలో చర్చిస్తారు. చింతన్ శిబిరానికి తేదీలు ఖరారైన నేపథ్యంలో ఈ లోపే పార్టీలో పీకే చేరికపై క్లారిటీ వచ్చేస్తుందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. మరి కాంగ్రెస్ షరతులకు ప్రశాంత్ కిశోర్ అంగీకరిస్తారా..? లేదా అన్నది తెలియాల్సి ఉంది. చదవండి👉 పీకే టీమ్‌కు ఓకే.. -
ఇక పీకేకు టీఆర్ఎస్కు సంబంధం ఉండదు: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు మారుతాయని, 2023 ఏప్రిల్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తుం దని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తుపెట్టుకునే ప్రసక్తేలేదని స్పష్టంచేశారు. కేసీఆర్ బందిపోటు, కాలనాగు కంటే ప్రమాదకారి అని, పాలుపోసినవారిపై విషంకక్కే అలాంటి వారితో కలిసేది లేదని తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ పెద్దలంతా తమకు స్వయంగా చెప్పా రన్నారు. అయినా, 2004లో, 2014లో కాంగ్రెస్‌ను నిలువునా మోసం చేసిన బందిపోటుతో తామెందుకు పొత్తు పెట్టుకుంటామని ప్రశ్నించారు. వచ్చేనెల 6న వరంగల్‌లో నిర్వహించే రైతు సంఘర్షణ సభ సన్నాహక సమావేశాల్లో భాగంగా రేవంత్‌రెడ్డి సోమవారం కరీంనగర్లో పర్యటించారు. బైకు ర్యాలీ అనంతరం ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. మోదీ వ్యతిరేక కూటమిలో కలుపుకొనేందుకే కేసీఆర్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ (పీకే) సమావేశం జరి గిందంటూ వచ్చిన వార్తలపై స్పందించారు. ‘ఇటీవల సోనియాగాంధీతో భేటీ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రశాంత్‌కిశోర్ సుముఖత వ్యక్తం చేశారు. అప్పుడు పార్టీ అంబికాసోనీ, జైరాం రమేశ్, చిదంబరం, ప్రియాంకాగాంధీ తదితర ఎనిమిది మంది సభ్యులతో ఒక కమిటీ వేసింది. దేశంలో ఐప్యాక్ సంస్థ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ, ఇతర ప్రాంతీయ పార్టీలతో తెగదెంపులు చేసుకుంటేనే కాంగ్రెస్‌లో చేరాలని ఆ కమిటీ స్పష్టంచేసింది. అందుకే కాంగ్రెస్‌లో చేరేముందు ఐప్యాక్‌తో తనకు సంబంధాల్లేవన్న విషయం చెప్పడానికే పీకే.. కేసీఆర్‌తో భేటీ అయ్యారు’ అని రేవంత్ చెప్పారు. పీకే.. కాంగ్రెస్‌లో చేరాక ఐప్యాక్‌కు దూరంగా ఉంటారని మంత్రి కేటీఆర్ కూడా చెప్పారని గుర్తుచేశారు. ఈ లెక్కన తామెక్కడా టీఆర్ఎస్తో కలిసే ప్రసక్తే లేదన్నారు. ఒకసారి పీకే కాంగ్రెస్ కండువా కప్పుకున్నాక, ఆయన పార్టీ కార్యకర్త అవుతారనని రేవంత్ చెప్పారు. పార్టీ ఆ దేశించిన ప్రకారం.. ఆయన దేశంలో మిజోరాం, మేఘాలయ, తెలంగాణ ఇలా ఎక్కడైనా పనిచేయాల్సిందేనన్నారు. 2018 నుంచి 82,400 మంది రైతుల ఆత్మహత్య ‘రాష్ట్రంలో రైతులు మద్దతు ధర లేక, పండించిన పంటకు ప్రోత్సాహం లేక అష్టకష్టాలు పడుతున్నారు. 2018 నుంచి 82,400 మంది పైచిలుకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతుల కష్టాలు తీర్చేందుకు మరోసారి తెలంగాణ రైతాంగ స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమించాలి. రైతులతో వరి వద్దన్న సీఎం మాత్రం 150 ఎకరాల్లో వరి వేసిన విధానాన్ని కాంగ్రెస్ వెలుగులోకి తేవడం, వరుసగా రైతు దీక్షలు చేయడంతోనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు ముందుకొచ్చింది’ అని రేవంత్ చెప్పారు. ‘ర్యాడిసన్’ కేసును ఎన్సీబీకి అప్పగించాలి సాక్షి, హైదరాబాద్: ఈనెల 3న ర్యాడిసన్ బ్లూ హోటల్ ఆవరణలోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన కేసు దర్యాప్తును కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అప్పగించాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సోమవారం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ కేసు దర్యాప్తును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డైరెక్టరేట్ ఆఫ్ రెవె న్యూ ఇంటెలిజెన్స్ , ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లతోపాటు ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అప్పగించాలని కోరుతూ ఈనెల 14న వినతిపత్రం సమర్పించినా స్పందన లేదని తెలిపారు. -
మోదీని ఓడించడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు: బీజేపీ లక్ష్మణ్
తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. టీఆర్ఎస్తో ఎన్నికల వ్యూహకర్త చర్చలు జరపడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లక్ష్మణ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ప్రధాని మోదీని మూడో సారి అధికారంలోకి రానివ్వకూడదని పీకే(ప్రశాంత్ కిషోర్) లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ గొడుగు కిందకు తీసుకొస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ బి టీం. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలవి చీకటి ఒప్పందాలు. ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఎన్ని పార్టీలు ఏకమైన ప్రధాని మోదీని ఏమీ చేయలేరు. మూడో సారి కూడా దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. మొన్నటి వరకు బీజేపీ, కాంగ్రెస్‌యేతర ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నించారు. పీకేతో భేటీ తర్వాత కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. పీకే వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్‌తో కేసీఆర్ పనిచేయబోతున్నారు. పీకే, కేసీఆర్ వ్యూహాలు తెలంగాణలో పనిచేయవు. తెలంగాణ ప్రజలు నమ్మరు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గతంలో పొత్తులు పెట్టుకున్నాయి. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తాం. టీఆర్ఎస్కు ఎవరు ప్రత్యర్థి అనే విషయం ప్రజలకు తేలియదా..? బీజేపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి కేటీఆర్ ఓర్వలేకపోతున్నారు.’’ అని అన్నారు. ఇది కూడా చదవండి: కరప్షన్.. కలెక్షన్.. కేసీఆర్..! : ఆర్ఎస్పీ -
సీఎం కేసీఆర్‌తో ముగిసిన పీకే భేటీ.. టెన్షన్లో ఎమ్మెల్యేలు!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టెన్షన్ మొదలైంది. వరుసగా రెండు రోజులుగా ముఖ్యమంత్రి కేసీర్తో పీకే మంతనాలు జరుపతున్న విషయంత తెలిసిందే. ఆదివారం సీఎం కేసీఆర్ జరిగిన పీకే భేటీ ముగిసింది. అయితే కేసీర్‌కు ప్రశాంత్ కిషోర్‌కు పలు నియోజకవర్గాకుల సంబంధించిన సర్వే రిపోర్టులు అందజేసినట్లు సమాచారం. పీకే భేటీతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా ఆదివారం జరిగిన భేటీలో జాతీయ రాజకీయాలపై పీకే.. సీఎం కేసీఆర్‌తో సుధీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే తెలంగాణలో పీకే టీమ్ సర్వేలు చేస్తున్న విషయం తెలిసిందే.కాంగ్రెస్ పార్టీలో పీకే చేరుతారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీతో ముందుకు కొనసాగుతారా? లేదా? అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఈ భేటీలో ఐప్యాక్ టీమ్ చేసిన సర్వే రిపోర్టులను టీఆర్ఎస్ పార్టీకి అందిస్తుందని పీకే.. కేసీఆర్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. తాను కాంగ్రెస్‌లో చేరిన తన సంస్థ ఐప్యాక్ టీఆర్ఎస్ కోసం పని చేస్తుందని కేసీఆర్‌కు ప్రశాంత్ కిషోర్ తెలిపినట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాలు, బీజేపీని ఢీకొట్టడంపై ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ కొనసాగింది. భవిష్యత్తులో మూడో కూటమి ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌ను కూడా కలుపుకుపోవాలనే విషయంపై ఆలోచించాలని కేసీఆర్‌ను ప్రశాంత్ కిషోర్ కోరినట్లు సమాచారం. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఒక్కతాటిపై ఉంటేనే ఆ పార్టీని గద్దె దింపాలని పీకే వివరించారు. ఐప్యాక్.. తెలంగాణలో వచ్చే ఎన్నికల వరకు టీఆర్ఎస్ కోసం పని చేయనుంది. పీకేతో భేటీ అనంతరం సీఎం కేసీఆర్.. ప్రగతి భవన్ నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లారు. చదవండి: గడీల రాజ్యం పోయి.. గరీబోళ్ల ప్రభుత్వం రావాలి: బండి సంజయ్ -
నాకు పీకే చెప్పారు.. టీఆర్ఎస్కు 30 సీట్లు కూడా రావు: కేఏ పాల్
సనత్‌నగర్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు 30 సీట్లు కూడా రావని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తనకు చెప్పినట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. టీఆర్ఎస్ అధికారానికి దూరమవుతుందనే కేసీఆర్ చెంత నుంచి ‘పీకే’జారుకున్నారని ఎద్దేవా చేశారు. శనివారం హైదరాబాద్‌లోని తన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్ మాట్లాడుతూ 2008లో కేసీఆర్ తనను కలిసి తెలంగాణకు మద్దతు కోరగా ఇచ్చానని చెప్పారు. చదవండి👉🏾 వరంగల్ నుంచే కేసీఆర్ చీడ వదిలిద్దాం కానీ టీఆర్ఎస్ 8 ఏళ్ల పాలనలో మిగులు బడ్జెట్ రాష్ట్రం కాస్తా ప్రస్తుతం రూ. 4.12 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మారిందన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు తన కుమారుడిని సీఎం చేసేందుకు సిద్ధమయ్యారని పాల్ విమర్శించారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూపంపిణీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కుల, మత, కుట్ర రాజకీయ పార్టీలకు స్వస్తి చెప్పి మార్పు తీసుకొద్దామని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో తాను పర్యటిస్తానని.. చారిటీ నుంచి రూ. 7,500 కోట్లు ప్రజాసంక్షేమానికి ఖర్చు చేస్తాన్నారు. చదవండి👉🏻 ‘బీజేపీ బుల్డోజర్’ అంటే కేటీఆర్‌కు భయం: జీవీఎల్ -
పీకే చేరికపై రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తలు అవసరం లేదని, పార్టీలో నాయకులు తప్ప వ్యూహకర్తలు ఉండరని తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతాడని అన్నారు. శనివారం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పీకేకు ఏ బాధ్యతలు అప్పగిస్తుందనే విషయాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని పేర్కొన్నారు. పీకే పార్టీలో చేరిన తర్వాత ఇతర పార్టీలకు పని చేస్తానంటే కుదరదని అన్నారు. పీకేను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేదే.. వ్యూహకర్త సునీల్ కొనుగోలు అనుకోవచ్చని తెలిపారు. తెలంగాణలో ఓడిపోయే టీఆర్ఎస్లో పొత్తు ఉండదని పేర్కొన్నారు. కేసీఆర్‌కు బర్త్‌డే విష్ చేప్తే.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని రాహుల్ గాంధీ చెప్పారని అన్నారు. టీఆర్ఎస్ విషయంలో రాహుల్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని పేర్కొన్నారు. మే 6 రాష్ట్ర ప్రజలకు మరింత స్పష్టత ఇస్తారని రేవంత్‌రెడ్డి తెలిపారు. -
ప్రశాంత్ కిషోర్ అంటేనే ఓ బ్రాండ్
జైపూర్: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరుతున్న నేపథ్యంలో హస్తం పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్.. ప్రశాంత్ కిషోర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంత్ కిశోర్ అంటేనే ఓ బ్రాండ్ అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రశాంత్ కిషోర్.. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ వెంట నడిచారని, ఆ తర్వాత సీఎం నితీశ్ కుమార్‌తో కొంత కాలం ఉన్నారని అన్నారు. ఆ తర్వాత పంజాబ్‌లో కాంగ్రెస్ వెంట నడిచారని తెలిపారు. ఎన్నికల సమయంలో తాము కూడా ఏజెన్సీలు, విశ్లేషకుల నుంచి సలహాలు తీసుకుంటామన్నారు. ప్రశాంత్ కిషోర్ సేవలను, అనుభవాన్ని వినియోగించుకుంటామని అన్నారు. ప్రశాంత్ కిశోర్ అనుభవం ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయడానికి ఎంతో ఉపకరిస్తుందని గెహ్లోత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. రాజస్థాన్ సీఎం గెహ్లాట్ బుధవారం ఉదయం జైపూర్ నుంచి ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ ప్రతిపాదించిన చింతన్ శిబిర్ కార్యక్రమంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. ఇక, వచ్చే నెలలో కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్ రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో నిర్వహించనున్నట్టు గెహ్లాట్ తెలిపారు. -
కాంగ్రెస్ పెద్దలతో ప్రశాంత్ కిశోర్ సమావేశం
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేతలతో 5 గంటలపాటు సమావేశమయ్యారు. ప్రియాంకా గాంధీ, అంబికా సోనీ, పి.చిదంబరం, జైరామ్ రమేశ్, కేసీ వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా ఇందులో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలతో పీకే భేటీ కావడం గత మూడు రోజుల్లో ఇది రెండోసారి. ఈ ఏడాడి ఆఖర్లో జరగబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది. పీకే త్వరలో కాంగ్రెస్‌లో చేరుతారంటున్నారు. ఆయన శనివారం సోనియా గాంధీ సమక్షంలో పూర్తిస్థాయి ప్రజంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 370 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని సూచించారు. సోనియాతో మెహబూబా ముఫ్తీ భేటీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ సోమవారం సమావేశమయ్యారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వారిద్దరూ చర్చించుకున్నట్లు తెలిసింది. దేశం ఇప్పటిదాకా భద్రంగా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఘనతేనని మెహబూబా ముఫ్తీ కితాబిచ్చారు. మరిన్ని పాకిస్తాన్లను సృష్టించాలని అధికార బీజేపీ కోరుకుంటోందని ఆరోపించారు. -
ప్రశాంత్ కిషోర్ వల్లే కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పా..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎన్నికల్లో ఓటముల పరంపర కొనసాగుతుండటంతో ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్‌ను వీడిన సంగతి తెలిసిందే. కాగా, కాంగ్రెస్ పార్టీని వీడటంపై తృణముల్ కాంగ్రెస్ నేత శత్రుఘ్న సిన్హా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తాను తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాల కీలక పాత్ర ఉందని అన్నారు. ఈ సందర్భంగానే టీఎంసీ పార్టీలో చేరడం మర్యాదగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా టీఎంసీపైనే ఉందన్నారు. అసన్సోల్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో తాను పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం కాంగ్రెస్ సంక్షోభం ముంగిట్లో ఉందన్నారు. ఇలాంటి సమయంలో ఆ పార్టీపై విమర్శలు చేయడం ఇష్టం లేదన్నారు. అలాగే, కాంగ్రెస్‌లో తప్పులు ఎక్కడ జరిగాయో.. తాను ఎందుకు బయటకు వచ్చానో త్వరలో చెబుతానని అన్నారు. మరోవైపు.. బెంగాల్‌లోని అసన్సోల్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ టీఎంసీ అభ్యర్థిగా శత్రుఘ్న సిన్హాను బరిలోకి దింపుతున్నామని ప్రకటించారు. మరో ఉప ఎన్నిక బాలిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా జరుగుతుండటంతో కేంద్ర మాజీ మంత్రి, సింగర్ బబుల్ సుప్రియోను బాలిగంజ్ నుంచి రంగంలోకి దింపుతున్నట్టు మమతా బెనర్జీ ట్విట్టర్లో పేర్కొన్న విషయం తెలిసిందే. -
ప్రధాని మోదీకి ప్రశాంత్ కిషోర్ కౌంటర్.. ‘సాహెబ్’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో పూర్తి మెజార్టీతో దూసుకెళ్లింది. ముఖ్యంగా యూపీలో మరోసారి భారీ విజయాన్ని అందుకుంది. ఉత్తరప్రదేశ్ ఓట్లరు అధికార యోగి ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇచ్చారు. కాగా, ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్య విజయమని మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ నిర్ణయాలు, విధానాలను ప్రజలు నమ్మిన కారణంగాన తమ పార్టీకి భారీ మెజార్టీ వచ్చిందన్నారు. ఈ క్రమంలోనే 2024 సార్వత్రిక ఎన్నికల తీర్పును ప్రజలు 2022లోనే తెలియజేశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా మోదీ వ్యాఖ్యలపై ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ స్పందిస్తూ ప్రధానికి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించిన ప్రశాంత్ కిషోర్.. మోదీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. మోదీ వ్యాఖ్యలు ప్రతిపక్షాలపై సైకాలజికల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి చేసినవే అని ఆరోపించారు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బేస్ చేసుకొని బీజేపీవైపు ఓటర్లను ఆకర్షించేందుకే ప్రధాని మోదీ తెలివిగా ఇలా మాట్లాడారని అన్నారు. ఈ విషయం సాహెబ్‌కు కూడా తెలుసంటూ సెటైరికల్‌గా విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఆ ఏడాదిలోని పరిణామాల వల్ల డిసైడ్ అవుతుంది తప్ప రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా కాదని కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని తెలిపారు. ఆయన వ్యాఖ్యలకు జనం ఆకర్షితులు కావొద్దని అన్నారు. దీంతో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. Battle for India will be fought and decided in 2024 & not in any state #elections Saheb knows this! Hence this clever attempt to create frenzy around state results to establish a decisive psychological advantage over opposition. Don’t fall or be part of this false narrative. — Prashant Kishor (@PrashantKishor) March 11, 2022 -
తెలంగాణ సీఎం కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ
-
ఫలితాలు రానేలేదు .. ప్రశాంత్ కిషోర్‌పై సంచలన ఆరోపణలు
పనాజీ: రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్, గోవా తృణముల్ కాంగ్రెస్ చీఫ్ కిరణ్ కండోల్కర్ మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. కండోల్కర్.. ప్రశాంత్ కిషోర్‌పై సంచలన ఆరోపణలు గుప్పించారు. ఫిబ్రవరి 14వ తేదీన గోవాలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. అయితే, ఈ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్‌కు ఎన్నికల సలహాదారులుగా ప్రశాంత్ కిషోర్ బృందం వ్యవహరించింది. ఇదిలా ఉండగా కిరణ్ కండోల్కర్ మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ సలహాదారు I-PAC(ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) తమ పార్టీ అభ్యర్థులను విడిచిపెట్టిందని విమర్శించారు. కాగా, ప్రశాంత్ కిషోర్, అతని బృందం తీరుతో కలత చెందానని అన్నారు. ఈ క్రమంలోనే తాను తృణమూల్ కాంగ్రెస్ గోవా యూనిట్ చీఫ్ పదవిని వదులుకోవడం లేదని స్పష్టం చేశారు. అయితే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీకి I-PAC (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) సాయం అందించిన విషయం తెలిసిందే. మరోవైపు, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్.. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజిపి)తో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. కండోల్కర్.. ఆల్డోనా అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయగా, అతని భార్య కవిత తృణమూల్ టిక్కెట్‌పై థివిమ్ నుండి పోటీ చేశారు. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగనుంది. -
ప్రశాంత్ కిషోర్ సర్వేతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో మొదలైన గుబులు
-
అప్పుడు వీడిపోయారు.. ఇప్పుడు కలిశారు.. వారి భేటీతో బీజేపీకి టెన్షన్!
పాట్నా: దేశ రాజకీయ వర్గాల్లో మరో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ బీహార్ సీఎం నితీష్ కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ సమావేశమయ్యారు. వీరి భేటీపై సర్వత్ర చర్చ జరుగుతోంది. కాగా, శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సీఎం నితీష్, పీకే కలిసి భోజనం చేశారు. అనంతరం దాదాపు రెండు గంటల పాటు వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ విషయాన్ని నితీష్ కుమార్ ధృవీకరించారు. అయితే, ఈ భేటీని రాజకీయ కోణంలో చూడవద్దంటూ సీఎం అభిప్రాయపడ్డారు. అంతకు ముందున్న సత్సంబంధాలతోనే తాము కలిసినట్టు వెల్లడించారు. మరోవైపు పీకే మాట్లాడుతూ.. నితీష్ కుమార్‌ను మర్యాదపూర్వకంగానే కలిసినట్టు తెలిపారు. కొన్ని రోజుల క్రితం సీఎం ఒమిక్రాన్ బారినపడినప్పడు ఆయనకు ఫోన్ చేసినట్టు చెప్పారు. అప్పుడు నితీష్ తనకు కలవాలని కోరినట్టు పేర్కొన్నారు. అందుకే తామిద్దరం ఇప్పుడు కలిసినట్టు వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా బీహార్‌లో 2020లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో నితీష్ కుమార్ పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్న పీకే.. అనూహ్యంగా పార్టీని వీడారు. అప్పటి నుంచి వీరిద్దరూ మళ్లీ కలుసుకోలేదు. ఇదిలా ఉండగా.. నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ ఇటీవల పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడం సాధ్యమే అంటూ పీకే కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో నితీష్, పీకే భేటీపై బీజేపీ శ్రేణులు సైతం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. -
కేసీఆర్ గ్యారేజ్! కారుకు ‘మరమ్మతు’లపై అధినేత దృష్టి..!
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సీరియస్‌గా దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్ని కలకు ఇంకా ఏడాదిన్నరకు పైగా గడువు ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు ఉండబోవని ఓ వైపు సంకేతాలు ఇస్తూనే మరోవైపు ఎన్నికలు లక్ష్యంగా పార్టీని చక్కబెట్టాలని భావిస్తున్నారు. నిఘా సంస్థల నివేదికలు, వివిధ సర్వేల ద్వారా పరిస్థితిని మదింపు చేస్తూనే మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేస్తున్నారు. విపక్షాలు చేస్తున్న హడావుడి రాష్ట్ర రాజకీయాలపై ఎంత మేర ప్రభావం చూపుతుంది? పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందా? అనే కోణంలో లెక్కలు కడుతు న్నారు. చాలాచోట్ల విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేల వివాదాస్పద వైఖరి విపక్షా లకు అనుకూలంగా మారకూడదనే ఉద్దేశంతో దిద్దు బాటు చర్యలు కూడా చేపట్టాలని భావిస్తున్నారు. కాగా క్షేత్రస్థాయి పరిస్థితులపై అధినేత కేసీఆర్‌కు వివిధ రూపాల్లో నివేదికలు చేరుతుండటంతో పార్టీ నేతల్లో అలజడి మొదలైంది. సర్వేల నిర్వహణకు ప్రశాంత్ కిషోర్ బృందంతో టీఆర్ఎస్ కలిసి పనిచేస్తుండటంతో వారిచ్చే ఫీడ్‌బ్యాక్ ఎలా ఉందనే కోణంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు. అధ్యక్షుడి దృష్టికి పలు అంశాలు – ముగ్గురు మంత్రులు స్థానిక వివాదాల్లో తలదూర్చడం, ఓ మంత్రి తన జిల్లాలో పార్టీ యంత్రాంగాన్ని సమన్వయ పరచడంలో విఫలం కావడాన్ని కేసీఆర్ సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలిసింది. – ఖమ్మం జిల్లాలో 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒకే స్థానానికి పరిమితం కావడం, వలసలు ప్రోత్సహించినా పార్టీ పరిస్థితి మెరుగు కాకపోవడానికి గల కారణాలపై సర్వే ద్వారా వివరాలు రాబడుతున్నారు. – ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు వలస వచ్చిన చోట పాత కొత్త నేతల నడుమ తీవ్రమైన సమన్వయ లోపం ఉన్నట్లు గుర్తించారు. తాండూరు, నకిరేకల్, కొల్లాపూర్ వంటి నియోజకవర్గాలతో పాటు ఖమ్మం జిల్లాలో చాలాచోట్ల ఈ తరహా పరిస్థితి ఉన్నట్లు తేలింది. – ఆదిలాబాద్‌లో ఒకటి, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో రెండు, నల్లగొండలో మూడు, రంగారెడ్డిలో నాలుగేసి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఆశించిన స్తాయిలో లేదని సర్వేల్లో వెల్లడైనట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై ఆశలు ఒకవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా కేసీఆర్ కసరత్తు కొనసాగిస్తుంటే.. మరోవైపు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ ఎప్పుడు జరుగుతుందా అని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. గత ఏడాది మేలో రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేయడంతో ఎనిమిది నెలలుగా కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. మంత్రివర్గంలో స్వల్పమార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్నా ఎప్పుడనేది అంతు చిక్కడం లేదు. గత నెలలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ కొంత వేగం పుంజుకున్నట్లు కనిపించినా ముందుకు సాగడం లేదు. పార్టీ జిల్లా, రాష్ట్ర కార్యవర్గాల ఏర్పాటు ఉంటుందని చెబుతున్నా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభం, పార్టీ యంత్రాంగానికి సంస్థాగత శిక్షణ కార్యక్రమాలు కూడా ముందుకు సాగడం లేదు. ఫిబ్రవరిలో కేసీఆర్ జిల్లాల పర్యటన! వాస్తవానికి గత ఏడాది చివరి నుంచే పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాల్లో వేగం పెంచేలా కార్యాచరణ సిద్ధం చేసినా కోవిడ్ కేసులు సంఖ్య పెరుగుతుండటంతో తాత్కాలికంగా వాయిదా పడినట్లు సమాచారం. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత ఫిబ్రవరి రెండో వారం నుంచి సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనలకు వెళ్లేలా షెడ్యూలు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. యువత, కొత్తవారికే పెద్దపీట.. మొత్తం 119 మంది అసెంబ్లీ సభ్యులకు గాను టీఆర్ఎస్కు ప్రస్తుతం 103 మంది సభ్యుల బలం ఉంది. వీరిలో 65 మందికి పైగా ఎమ్మెల్యేలు వరుసగా రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 30 మందికి పైగా సభ్యులు తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుగురు మినహా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చిన కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో యువత, కొత్తవారికి పెద్దపీట వేసేలా ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. -
PK: ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా..?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ, పార్టీ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మంగళవారం ప్రత్యేకంగా భేటీ అయిన నేపథ్యంలో.. కాంగ్రెస్‌లో ఆయన చేరడంపై ఊహాగానాలు పెరిగాయి. 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు, ఆ లోపు రానున్న పలు అసెంబ్లీల ఎన్నికలకు కాంగ్రెస్ సిద్దమవుతున్న పరిస్థితుల్లో.. పార్టీలో ప్రశాంత్ కిషోర్ పోషించాల్సిన కీలక పాత్రపై సోనియా, రాహుల్, ప్రియాంకలతో భేటీ సందర్భంగా చర్చ జరిగి ఉండవచ్చని పార్టీ వర్గాలు సంకేతాలిచ్చాయి. సోనియా, రాహుల్, ప్రియాంకలతో ప్రశాంత్ కిషోర్ సమావేశం కావడం ఇదే మొదటిసారి కాదని వెల్లడించాయి. రాహుల్ గాంధీ నివాసంలో మంగళవారం జరిగిన భేటీ అందరూ అనుకున్నట్లు పంజాబ్, లేదా ఉత్తరప్రదేశ్‌లో పార్టీ వ్యవహారాల గురించి కాదని.. అంతకు మించిన అంశంపై వారి మధ్య చర్చ జరిగిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 2024 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విజయం సాధించిపెట్టే బృహత్తర బాధ్యతను ప్రశాంత్ కిషోర్‌పై పెట్టాలని సోనియా భావిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తన వ్యూహాలతో పశ్చిమబెంగాల్లో టీఎంసీకి, తమిళనాడులో డీఎంకేకు ప్రశాంత్ కిషోర్ విజయం సాధించిపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ తరహా బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ఇటీవల ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. ‘ఇప్పుడు చేస్తున్న పనిని కొనసాగించాలని అనుకోవట్లేదు. ఇప్పటివరకు చేసింది చాలు. విరామం తీసుకుని, కొత్తదేదైనా చేయడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నా’ అని అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మే నెలలో ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో ఆయన స్పష్టం చేశారు. మళ్లీ రాజకీయాల్లోకి వెళ్తారా? అన్న ప్రశ్నకు.. ‘నేను ఒక విఫల రాజకీయవేత్తను. ముందుగా, నేనేం చేయగలను అనే విషయాన్ని సమీక్షించుకోవాల్సి ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలోనూ కాంగ్రెస్‌తో ప్రశాంత్ కిషోర్ కలిసి పని చేశారు. పంజాబ్ ఎన్నికల్లో కిషోర్ వ్యూహాల సాయంతోనే కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే, ఆ తరువాత పలు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని ప్రశాంత్‌కిషోర్ విమర్శించారు. కాంగ్రెస్ 100 ఏళ్ల వయస్సున్న రాజకీయ పార్టీ. ఆ పార్టీ పనితీరు ప్రత్యేకంగా ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ వంటి వ్యక్తుల నుంచి సలహాలు తీసుకునేందుకు వారు సిద్ధంగా ఉండరు. నా పనితీరు వారికి సరిపడదు’ అని గతంలో వ్యాఖ్యానించారు. -
అబ్బో... ! ఎంత గొప్ప సాయమో కదా ?
న్యూఢిల్లీ : కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకునేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన సాయంపై పెదవి విరిచారు పొలిటికల్ స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిశోర్. ఎంత గొప్ప సాయం ప్రకటించారో అంటూ సెటైర్లు కూడా సంధించారు. ఈ మేరకు వరుసగా ట్వీట్లు చేశారు ప్రశాంత్ కిశోర్. ఇప్పటి నుంచే పాజిటివ్‌గా ఫీల్.. కొవిడ్ సంక్షోభంలో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలపై సానుభూతి ప్రదర్శించడం ద్వారా మరోసారి తనదైన శైలిలో టిపికల్ మాస్ట్రర్ స్ట్రోక్ కొట్టారు నరేంద్ర మోదీ అంటూ ప్రశాంత్ కిశోర్ విరుచుకుపడ్డారు. ఇప్పుడు తల్లిదండ్రులు కోల్పోయి అనాథలైన పిల్లలకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత స్టైపండ్ ఇస్తామని ప్రకటించడమేంటని ప్రశ్నించారు. ప్రధాని ఇచ్చిన హామీకి ఇప్పటి నుంచే ఆ పిల్లలు చాలా పాజిటివ్‌గా ఫీల్ కావాలనుకుంటా అంటూ మోదీపై మరో వ్యంగ్యాస్త్రాన్ని ప్రశాంత్ కిశోర్ సంధించారు. అటుఇటు తిప్పి ఇప్పటికే అమల్లో ఉన్న విద్యాహక్కు చట్టం, ఆయుష్మాన్ భారత్ పథకాలనే అటు ఇటు తిప్పి కొవిడ్ కారణంగా అనాథలైన పిల్లలకు పీఎం కేర్స్ ద్వారా ఉచిత విద్య, వైద్యం అందిస్తామంటూ ప్రధాని కలరింగ్ ఇచ్చారని ప్రశాంత్ కిశోర్ మండిపడ్డారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశంలో యాభై కోట్ల మందికి లబ్ది జరుగుతుందని ప్రధాని హామీ ఇచ్చారని, కొవిడ్ సెకండ్ వేవ్‌లో రోగులకు కనీసం బెడ్డు, ఆక్సిజన్ అందివ్వలేక పోయారంటూ కేంద్రంపై ప్రశాంత్ కిశోర్ నిప్పులు చెరిగారు. మాస్ట్రర్ స్ట్రోక్ నోట్ల రద్దు, సర్జికల్స్ స్ట్రైక్స్ నిర్ణయాలు ప్రధాని ప్రకటించినప్పుడు బీజేపీ శ్రేణులు వాటిని నరేంద్ర మోదీ మాస్ట్రర్ స్ట్రోక్స్‌గా అభివర్ణించారు. మోదీ తీసుకున్న నిర్ణయాలతో శత్రువులు కుదేలైపోయారంటూ భారీగా ప్రచారం చేశారు. ఒకప్పటి బీజేపీ ప్రచార అస్త్రమైన మాస్టర్ స్ట్రోక్‌ను ఈరోజు సెటైరిక్‌గా ప్రశాంత్ కిశోర్ ఉపయోగించారు. Another typical #MasterStroke by #ModiSarkar this time redefining EMPATHY and CARE for children ravaged by #Covid and its catastrophic mishandling - Instead of receiving much needed support NOW, the children should feel POSITIVE about a PROMISE of stipend when they turn 18 (1/2) https://t.co/6m4uu16YWM — Prashant Kishor (@PrashantKishor) May 30, 2021 -
ఒక రూపాయి జీతం.. సీఎంకు ప్రధాన సలహాదారుగా పీకే
చండీగఢ్: 2022లో పంజాబ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడం కోసం పంజాబ్ ముఖ్యమంత్రి అమరేంద్ర సింగ్ ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించారు. అందులో భాగంగానే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. సోమవారం ప్రశాంత్ కిషోర్.. సీఎం కెప్టెన్ అమరేంద్ర సింగ్‌కు ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ ట్విటర్లో పేర్కొన్నారు. ‘ప్రశాంత్ కిషోర్ నాకు ప్రధాన సలహాదారుగా నియమితులవడం చాలా సంతోషంగా ఉంది. పంజాబ్ ప్రజల శ్రేయస్సు కోసం తాము ఇద్దరు కలిసి పనిచేయడానికి ఎదురు చేస్తున్నా’ అని ఆయన తెలిపారు. Happy to share that @PrashantKishor has joined me as my Principal Advisor. Look forward to working together for the betterment of the people of Punjab! — Capt.Amarinder Singh (@capt_amarinder) March 1, 2021 ప్రశాంత్ కిషోర్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు పంజాబ్ మంత్రి మండలి ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పదవి కేబినెట్ ర్యాంక్‌తో సమానం. మంత్రి మండలి విడుదల చేసిన నియామక నోటిఫికేషన్లో ఆయన ఈ పదవిలో జీతంగా రూ.1 మాత్రమే తీసుకోనున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం అందించే అన్ని సౌర్యాలను ఆయన పొందుతారు. ఇక 2017లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 117 సీట్లకు గాను కాంగ్రెస్ 77 సీట్లను కైవసం చేసుకుంది. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా ప్రధాన సలహాదారుగా పని చేస్తున్న విషయం తెలిసిందే. చదవండి: విద్యార్థులతో రాహుల్ గాంధీ స్టెప్పులు : వైరల్ -
ప్రశాంత్ కిషోర్‌కు పోటీగా సునీల్
సాక్షి, చెన్నై: కరోనా వైరస్ భయంతో ప్రజలంతా వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దాదాపుగా మరిచిపోయారు. అయితే అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు మాత్రం ప్రణాళికలు రచిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను డీఎంకే నియమించుకున్న నేపథ్యంలో అన్నాడీఎంకే సైతం డీఎంకే మాజీ రాజకీయ వ్యూహకర్త సునీల్‌తో జతకట్టనుంది. కరోనాకు కళ్లెం వేయగానే ఎన్నికల కదన రంగంలోకి దూకేందుకు ఇరు పార్టీలూ సిద్ధం అవుతున్నాయి. రాజకీయ పార్టీల్లో కార్యకర్తలపై విశ్వాసం పెట్టుకునే రోజులు అంతరించిపోగా ఐటీ రంగ నిపుణుల సలహాలు, సూచనలతో ఎన్నికల బరిలోకి దిగేలా మార్పులు చోటుచేసుకున్నాయి. 2016 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకేకు సునీల్ రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు. సునీల్ మార్గదర్శకంలోనే డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో పాటు ఆ పార్టీ కూడా నడిచింది. సునీల్ సలహా మేరకే స్టాలిన్ ‘నమక్కు నామే’ పేరున పాదయాత్ర సాగిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోకపోయినా అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా డీఎంకే అవతరించింది. అదే బాణిని అనుసరించి లోక్‌సభ ఎన్నికల్లో సైతం అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. అయితే 21 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సునీల్ వ్యూహం డీఎంకేకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఉప ఎన్నికల్లో అత్యధిక సీట్లను కొల్లగొట్టడం ద్వారా అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూలదోసి డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆశలు అడియాసలయ్యాయి. దీంతో సునీల్, డీఎంకే బంధానికి బీటలువారాయి. డీఎంకేకు సునీల్ దూరం అయ్యారు. డీఎంకే సైతం ఇచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను నియమించుకుంది. డీఎంకేకు ఘనవిజయం సాధించిపెట్టడం ద్వారా స్టాలిన్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే లక్ష్యంతో ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే రంగంలోకి దిగినట్లు సమాచారం. చదవండి: భాస్కర్.. ఏం నడుస్తుంది? :కేసీఆర్ ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను ఢీకొట్టేందుకు అన్నాడీఎంకే సైతం అడుగులు వేయడం ప్రారంభించింది. ప్రశాంత్ కిషోర్‌కు పోటీగా డీఎంకే నుంచి వైదొలగిన సునీల్‌ను రాజకీయ వ్యూహకర్తగా అన్నాడీఎంకే నియమించుకుంది. సునీల్ సూచనల మేరకే అన్నాడీఎంకే ఐటీ విభాగాన్ని ప్రక్షాళన చేసినట్లు సమాచారం. గత ఐటీ విభాగం వారు ఎలాంటి వ్యూహకర్తలు లేకుండానే 2016 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత విజయం సాధించేందుకు సహకరించారు. జయ హయాంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఐటీ విభాగం సహకారంతో అన్నాడీఎంకేను మరోసారి అధికారంలో కూర్చొనబెట్టేందుకు సునీల్ రంగప్రవేశం చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల నుంచి బయటపడగానే అన్నాడీఎంకే, డీఎంకేలు తమ వ్యూహాలతో ప్రజాక్షేత్రంలో వస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
ఢిల్లీ ఫలితాలు : ప్రశాంత్ కిశోర్ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు. ఆప్‌కు భారీ విజయం కట్టబెట్టినందుకుగాను ఢిల్లీ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మూడోసారి సీఎం కాబోతున్న కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపారు. ‘ భారత దేశ ఆత్మను కాపాడిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు’ అని ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీకి ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కేజ్రీవాల్‌కు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డీఎంకే చీప్ స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ ప్రజలు బీజేపీని తిరస్కరించారని ఆమె విమర్శించారు. అభివృద్దే ఢిల్లీలో ఆప్‌ను గెలిపించిందని ఆమె పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది. సాధారణ మెజార్టీకి అవసరమైన స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో ఉంది. ఇప్పటి వరకు వెలువడి ఫలితాల ప్రకారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఆప్ 15 స్థానాల్లో విజయం సాధించి, 43 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ రెండు చోట్ల విజయం సాధించి, 10 స్థానాల్లో ముందంజలో ఉంది. -
ప్రశాంత్ కిషోర్ ఎఫెక్ట్.. కేంద్రానికి షాకిచ్చిన నితీష్
పట్నా : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. సీఏఏపై అనేక అనుమానాలు ఉన్నందున దీనిపై పున సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. చట్టంపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నామని నితీష్ అన్నారు. ఈ మేరకు సోమవారం పట్నాలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఏఏపై మరోసారి సుదీర్ఘ చర్చ జరగాలన్నారు. సీఏఏపై ఈ విధంగా ప్రకటించిన తొలి ఎన్డీయే కూటమి పార్టీ జేడీయూ కావడం విశేషం. సీఏఏపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్ఆర్సీని బిహార్‌లో అమలు చేసే ప్రసక్తేలేదని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నితీష్ ప్రకటనతో బీజేపీ నేతలు షాక్‌కి గురయ్యారు. కాగా, పార్లమెంట్ ఉభయసభల్లో సీఏఏ బిల్లుకు జేడీయూ మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో నితీష్ నేతృత్వంలోని జేడీయూ అన్ని అంశాల్లో ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రజాగ్రహానికి గురైన చట్టాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తోంది. ఇటీవల జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ అంశాలను పక్కనపెట్టి, కేవలం స్థానిక అంశాలపైనే నితీష్ దృష్టి సారిస్తున్నారు. జేడీయూ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వివాదాస్పద చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన సూచనల మేరకే నితీష్ నిర్ణయాలు తీసుకుంటున్నారని బిహార్ రాజకీయ వర్గాల సమాచారం. కాగా ఎన్సీఆర్సీ, సీఏఏకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల నేతృత్వంలో బిహార్, యూపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వీటిల్లో పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు. -
ప్రియాంకపై ప్రశాంత్ కిషోర్ ప్రశంసలు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ నేతలపై జేడీయూ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రశంసల జల్లు కురిపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద ఎన్ఆర్సీ, సీఏఏపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టిన హస్తం పార్టీ నేతలను పొగడ్తతల్లో ముంచెత్తారు. ఈ ఆందోళనకు సారథ్యం వహించిన ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ప్రశాంత్ కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్విటర్ వేదికగా స్పందించారు. కేంద్రానికి వ్యతిరేకంగా, ప్రజలపక్షాణ నిలిచిన తీరు అభినందనీయమని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కూడా ఇలానే కొనసాగాలని ఆయన కోరారు. (గెట్ రెడీ : ప్రశాంత్ కిషోర్) కాగా బిహార్‌లో సైతం ఎన్ఆర్సీని అమలు చేయవద్దని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్‌పై ప్రశాంత్ కిషోర్ తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యక్త పరిచారు. దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన, నిరసనలు చోటుచేసుకోవడంతో నితీష్ తలొంచక తప్పలేదు. రాష్ట్రంలో ఎన్ఆర్సీని అమలు చేసే ప్రసక్తే లేదని చివరికి తేల్చి చెప్పారు. -
గెట్ రెడీ : ప్రశాంత్ కిషోర్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలతో సహా విశ్లేషకుల దృష్టి హస్తిన వైపు మళ్లింది. ఎన్నికలపై చర్చలకు దిగితూ.. రాజకీయ వేడిని పుట్టిస్తున్నారు. ఫిబ్రవరి 8న పోలింగ్, ఫిబ్రవరి 11న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అంటూ పిలుపునిచ్చారు. ‘ప్రజల బలం చూసేందుకు ఫిబ్రవరి 11న సిద్ధంగా ఉండండి’ అంటూ ట్వీట్ చేశారు. ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఆయన ఎన్నికల సలహాదారుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆప్ విజయానికి దోహదపడేందుకు ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ బృందం గ్రౌండ్ వర్క్‌ను ప్రారంభించింది. ప్రచారం, పథకాలు, అభ్యర్థుల ఎంపిక వంటి కీలక అంశాల్లో కేజ్రీవాల్‌కు సలహానిస్తోంది. (మోగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా) కాగా షెడ్యూల్ విడుదల అనంతరం సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. గడిచిన ఐదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఢిల్లీలోని ప్రతి గడపగడపకు తమ ప్రచారాన్ని చేరవేస్తామని అన్నారు. విద్య వైద్యం ఆరోగ్యం వంటి అంశాల్లో గతంలో కంటే ప్రస్తుతం మెరుగైన స్థితికి చేర్చామని పేర్కొన్నారు. రెండోసారీ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా కేజ్రీవాల్ ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన విషయం తెలిసిందే. (త్రిముఖ పోరులో పీఠం ఎవరిది..?) -
బీజేపీకి ప్రశాంత్ కిషోర్ అల్టిమేటం..!
పట్నా : రానున్న కాలంలో బీజేపీకి మరో మిత్రపక్షం గుడ్‌బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీతో దశాబ్దాల కాలం పాటు స్నేహం చేసిన శివసేన, టీడీపీ ఇప్పటికే విభేదించి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కకపోవడంతో కేంద్రంపై నితీష్ ఇప్పటికే తీవ్ర అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్ఆర్సీ ఆందోళనలు దానికి మరింత ఆజ్యంపోశాయి. బిహార్‌లో ఎన్ఆర్సీ అమలు చేసే ప్రసక్తే లేదని నితీష్ బహిరంగంగానే ప్రకటించారు. మరోవైపు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. సీట్ల పంపకాలపై బీజేపీ-జేడీయూలో ఇప్పటికే చర్చలు మొదలైయ్యాయి. ఈ నేపథ్యంలో జేడీయూ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో అసక్తికరంగా మారాయి. ఆదివారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో ప్రశాంత్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకత్వం అంచనాలు వేస్తున్నట్లు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50:50 సీట్ల పంపకాల ఒప్పందం కుదరదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జేడీయూకే సింహాభాగం సీట్లు కేటాయించాలని అన్నారు. సీట్ల ఒప్పందంపై బీజేపీ నేతలు మరోసారి పునపరిశీలన చేసుకోవాలని సూచించారు. అలాగే 1:4 ఫార్మూలాను ఆయన తెరపైకి తీసుకువచ్చారు. అయితే ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. సీట్ల పంపకాలపై ఇరు పార్టీల అధినేతలు నిర్ణయం తీసుకుంటారని, దీనిలో ప్రశాంత్ తలదూర్చడం సరికాదని తప్పపట్టారు. (ఎన్డీయే నుంచి బయటకు రండి.. మద్దతిస్తాం) గత లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించిన 50:50 ఫార్మూలానే ఈసారి కూడా పాటిస్తామని బీజేపీ నేతలు స్పష్టంచేశారు. దీంతో ప్రశాంత్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా బీజేపీకి వ్యతిరేకంగా ఇప్పడిప్పుడే గళం విప్పుతున్న నితీష్‌కు అసెంబ్లీ ఎన్నికలు పెద్ద సవాలుగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆర్జేడీ-జేడీయూ మహా ఘట్ బంధన్‌గా ఏర్పడి విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం కూటమికి గుడ్‌బై చెప్పి మళ్లీ బీజేపీతో కలిసిపోయారు. -
రాహుల్‌కు ప్రశాంత్ కిషోర్ అభినందనలు
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కృతజ్క్షతలు తెలిపారు. మంగళవారం ట్విటర్ వేదికగా స్పందించిన ఆయన.. రాహుల్ గాంధీకి పలు సూచనలు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సీఏఏ, ఎన్ఆర్సీను అమలు చేయమని ప్రకటించాలని రాహుల్‌ను కోరారు. ఆ మేరకు ఆయన చర్యలు తీసుకోవాలని విజ్క్షప్తి చేశారు. అలాగే చట్టాన్ని వ్యతిరేకిస్తూ సత్యగ్రహం కార్యక్రమాన్ని చేపట్టడాన్ని ప్రశాంత్ కిషోర్ అభినందించారు. అలాగే పార్లమెంట్లో చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే సరిపోదని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాలని ఆయన సూచించారు. కాగా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సోమవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో సత్యాగ్రహం చేపట్టిన విషయం తెలిసిందే. ‘ఐకమత్యం కోసం సత్యాగ్రహం’పేరుతో నిర్వహించిన ఈ ఆందోళనలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్, రాహుల్, ముఖ్య నేతలు పాల్గొన్నారు. విద్వేషాలను పెంచుతూ దేశాన్ని ముక్కలు చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. భరత మాత గొంతు అణచివేసేందుకు, రాజ్యాంగంపై దాడికి చేస్తున్న యత్నాలను ప్రజలు కొనసాగనివ్వబోరని హెచ్చరించారు. ప్రశాంత్ కిషోర్ ఉపాధ్యక్షుడుగా వ్యవహిరిస్తున్న జేడీయూ మాత్రం పార్లమెంట్లో ఎన్ఆర్సీ, సీఏఏకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. పార్టీ అధ్యక్షుడు నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై పీకే బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై నితీష్ మరోసారి ఆలోచన చేయాలని కూడా కోరారు. మరోవైపు ఎన్ఆర్సీను దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలని ప్రశాంత్ కోరడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ ద్వంద వైఖరిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శల వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళన నేపథ్యంలో నితీష్ వెనక్కి తగ్గారు. ఎన్ఆర్సీని అమలు చేసే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. Thanks @rahulgandhi for joining citizens’ movement against #CAA_NRC. But as you know beyond public protests we also need states to say NO to #NRC to stop it. We hope you will impress upon the CP to OFFICIALLY announce that there will be #No_NRC in the #Congress ruled states. 🙏🏼 — Prashant Kishor (@PrashantKishor) December 24, 2019 -
రాష్ట్రాల సహకారం లేనిదే అమలు కుదరదు : పీకే
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రం ఏ చట్టం చేసినా రాష్ట్రాల సహకారం లేనిదే అమలు సాధ్యం కాదని ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌కిషోర్ మరోసారి తేల్చి చెప్పారు. శుక్రవారం ఓ ప్రముఖ జాతీయ మీడియాతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమలో ఆయన సీఏఏ, ఎన్నార్సీలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రశ్న : సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా మీరు ట్వీట్ చేశారు. మీ పార్టీ ఏమో పార్లమెంటులో మద్దతిచ్చింది. దీనిపై మీరేమంటారు? జవాబు : పౌరసత్వ సవరణ బిల్లుపై పార్లమెంటులో ఓటింగ్ జరగక ముందే నా అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించాను. మా పార్టీ కూడా మొదట సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. కానీ తర్వాత వైఖరిని మార్చుకుంది. దీనిపై మా అధ్యక్షుడు నితీష్‌కుమార్‌ను అడిగాను. ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు అనిపించిందేంటంటే సీఏఏ, ఎన్నార్సీలను వారు వేర్వేరుగా చూస్తున్నారు. సీఏఏకు మద్దతిచ్చినా, ఎన్నార్సీకి మద్దతివ్వనని, అది బీహార్‌కు అవసరం లేదని ఆయన నాకు భరోసానిచ్చారు. సీఏఏ, ఎన్నార్సీలు దేశానికి మంచిది కాదని నా అభిప్రాయం. నాతో ఏకీభవించేవాళ్లంతా ఈ చట్టాలను వ్యతిరేకించాలని కోరుతున్నా. ప్రశ్న : ఈ చట్టాలను బీజేపీయేతర ముఖ్యమంత్రులు వ్యతిరేకించాలని మీరు పిలుపునిచ్చారు. కానీ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తప్ప మిగతా ముఖ్యమంత్రులెవరూ ఇప్పటి వరకు స్పందించలేదు. వారంతా మీ సూచనను పాటిస్తారని అనుకుంటున్నారా? జవాబు : దేశంలోని 16 రాష్ట్రాల్లో బీజేపీయేతర ముఖ్యమంత్రులున్నారు. ఈ రాష్ట్రాల్లో దేశ జనాభా 65 శాతం ఉంది. గత లోక్‌సభ ఎన్నికలల్లో బీజేపీకి అత్యధిక మెజార్టీ స్థానాలు వచ్చినా ఓట్ల శాతం చూసుకుంటే వారికి వచ్చిన ఓట్లు 39 శాతమే. అంటే బీజేపీని దేశంలో 61శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారనేగా అర్థం. ఇప్పుడు బీజేపీ దేశ ప్రజలు మాకు సంపూర్ణ మెజారిటీ ఇచ్చారు కాబట్టి, ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ 61 శాతం మంది మీకు వ్యతిరేకంగా ఓటు వేశారు కదా. వారి సంగతేంటి? ఈ 61 శాతం మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకే నేను వ్యతిరేకించమని చెప్పేది. ప్రశ్న : కానీ, కేంద్రం చేసిన చట్టాలను వ్యతిరేకించే అధికారం రాష్ట్రాలకు లేదు కదా? జవాబు : వ్యతిరేకించే అధికారం రాజ్యాంగం ప్రకారమైతే లేదు. కానీ రాష్ట్రాల సహకారం లేకుండా కేంద్రం ఈ చట్టాన్ని దేశంలో అమలు చేయగలదా? ఒక్క అస్సాంలోనే ఎన్నార్సీ చేపడితే రేయింబవళ్లు కష్టపడినా మూడేళ్లు పట్టింది. అలాంటిది దేశం మొత్తం అమలు చేయాలంటే ఎంతకాలం పడుతుంది. అది కూడా కేంద్రం మాత్రమే చేయాలంటే ఎంత సమయం పడుతుందో ఊహించండి. ప్రశ్న : మరి పార్లమెంటులో మీ పార్టీ సీఏఏకు అనుకూలంగా ఓటు వేయడం ద్వంద వైఖరి కాదా? జవాబు : ఇది ద్వంద వైఖరి కాదు. పైన చెప్పినట్టు సీఏఏ, ఎన్నారర్సీలకు మధ్య లింకు ఉంటుందని వారు బహుశా ఊహించి ఉండరని అనుకుంటున్నాను. ప్రశ్న : బీజేపీ నేతృత్వంలోని ఏన్డీయే కూటమిలో మీ పార్టీ జేడీయూ భాగస్వామి కదా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జవాబు : మా పార్టీ ఎన్డీఏలో భాగస్వామియే. కాదనను. కానీ చరిత్ర చూస్తే కొన్ని కీలక సమస్యలపై ఈ రెండూ పార్టీల వైఖరి పరస్పరం విరుద్ధంగా ఉంటుంది. అలాగే ఎన్నార్సీపై కూడా మా పార్టీ వైఖరి ఏంటో ఇప్పటికే మా నాయకుడు స్పస్టం చేశారు. -
ప్రశాంత్ కిశోర్‌తో కేజ్రీవాల్ జట్టు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్) తో జట్టు కట్టారు. ఈ విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ శనివారం ట్వీట్ చేశారు. 2014లో మోదీ తరఫున ప్రశాంత్ ప్రచార వ్యూహాలు సిద్ధంచేశారు. ప్రస్తుతం ప్రశాంత్ బిహార్‌లోని జనతా దళ్ (యూ) ఉపాధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నారు. కేజ్రీవాల్ శనివారం చేసిన ట్వీట్‌కు స్పందనగా ‘‘పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి ప్రత్యర్థిగా చూశామని, కానీ ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాల కారణంగా కాంగ్రెస్‌ను విజయం వరించిందని’’ఐప్యాక్ మరో ట్వీట్ చేసింది. ‘‘పంజాబ్ ఎన్నికల ఫలితాల తరువాత మిమ్మల్ని (కేజ్రీవాల్) మేము ఎదుర్కొన్న బలమైన ప్రత్యర్థిగా గుర్తించాం. ఇప్పుడు కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీతో చేతులు కలపడం సంతోషాన్నిస్తోంది’’అని తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఆమ్ ఆద్మీపార్టీలతో ముక్కోణపు పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. -
‘క్యాబ్’పై పీకే వ్యతిరేకతకు కారణం ఇదే !
పాట్నా : పౌరసత్వ సవరణ చట్టంపై జేడీయూ వైఖరితో బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఆర్జేడీ బిల్లును వ్యతిరేకించగా, మొదట్లో వ్యతిరేకించినా అనంతర పరిణామాలతో అధికార జేడీయూ రెండు సభల్లోనూ బిల్లుకు మద్దతిచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీ వైఖరిలో మార్పు పట్ల జేడీయూ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ నిర్ణయాన్ని బహింరంగంగా వ్యతిరేకించడం ప్రాధాన్యత సంతరించుకొంది. పార్టీ సమావేశంలో ముందుగా తీసుకున్న నిర్ణయానికి ఎందుకు వ్యతిరేకంగా వెళ్లారని పీకేతో పాటు రవివర్మ ప్రశ్నించగా, తాజాగా పార్టీ ఎంపీలు రాంచందర్ సింగ్ స్పందిస్తూ పార్టీలో నితీష్‌కుమార్ నిర్ణయమే ఫైనల్ అని నచ్చనివాళ్లు పార్టీని వదిలి నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని వ్యాఖ్యానించారు. మరో ఎంపీ రాజీవ్ రంజన్ అధినేత తీసుకున్న నిర్ణయాలను ధిక్కరించే అధికారం పార్టీలో ఎవరికీ లేదని పీకేనుద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ఈ పరిణామం పట్ల విశ్లేషకులు మరో భాష్యాన్ని చెప్తున్నారు. ప్రశాంత్ కిషోర్ భార్య అస్సామీ. ఈ బిల్లు వల్ల ఆ రాష్ట్రం అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీకే బిల్లును వ్యతిరేకిస్తున్నారని భావిస్తున్నారు. మరోవైపు నితీష్ కుమార్ బిల్లుకు మద్దతివ్వడంపై మరో కోణాన్ని తెలుపుతున్నారు. ఇటీవల బీహార్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ముస్లిం ఓట్లు ప్రతిపక్ష ఆర్జేడీకే పడ్డాయని, ఆర్జేడీ ముస్లింలకు ఎప్పుడు కూడా ప్రథమ ప్రాధాన్యంగా ఉంటుందని నితీష్ పసిగట్టారు. వచ్చే ఏడాది బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనునక్నాయి. ఈ నేపథ్యంలో పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తే అటు ముస్లింల ఓట్లు పడకపోగా, ఇటు బలమైన హిందూ ఓటు బ్యాంకు కూడా దూరమైపోతుందని నితీష్ గ్రహించారు. అందుకే యూటర్న్ తీసుకొని బిల్లుకు మద్దతిచ్చారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాల్లో తమ పార్టీ దెబ్బతింటుందని నితీష్‌కు తెలుసు. అయినా కూడా బీహార్‌లో హిందూ ఓట్లను కోల్పోకూడదనే ఉద్దేశంతో మద్దతిచ్చారని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై జేడీయూ సీనియర్ నాయకుడు నీరజ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘ముస్లింలకు ఎంతో చేసినప్పటికీ వారి నుంచి మాకు పడే ఓట్ల శాతంలో పెద్ద తేడాలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయంపై మాకు ఎవరి సలహా అక్కర్లేద’ని పీకేనుద్దేశించి వ్యాఖ్యానించారు. -
బీజేపీయేతర సీఎంలు వ్యతిరేకించాలి : పీకే
సాక్షి, ఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొంది రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారిన పౌరసత్వ సవరణ బిల్లు అమలుపై బీజేపీయేతర ముఖ్యమంత్రులు తమ వైఖరిని స్పష్టం చేయాలని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ శుక్రవారం వ్యాఖ్యానించారు. మత ప్రాతిపదికన పౌరసత్వం ఇచ్చే ఈ బిల్లు వల్ల భారతదేశ ఆత్మ దెబ్బతింటుందని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. పంజాబ్, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే ఈ చట్టంతోపాటు ఎన్నార్సీని తమ రాష్ట్రంలో అమలుచేయబోమని ప్రకటించారని, మిగతా 16 రాష్ట్రాల బీజేపీయేతర ముఖ్యమంత్రులు తమ వైఖరి స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఈ బిల్లుకు జేడీయూ పార్టీ లోక్‌సభలో మద్దతు తెలపడంపై పీకే అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా జేడీయూ రాజ్యసభలోనూ ఈ బిల్లుకు మద్దతు తెలపడం గమనార్హం. మరోవైపు ఈ బిల్లును ఈశాన్య రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదిలా ఉండగా, దేశంలో ఉన్న శరణార్థులు ఈ బిల్లుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి : (మా పార్టీ వైఖరిపై నిరాశ చెందా : పీకే) -
మా పార్టీ వైఖరిపై నిరాశ చెందా : పీకే
సాక్షి, ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లుకు తమ పార్టీ జనతాదళ్(యు) మద్దతు తెలపడంపై ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఈ బిల్లును మొదట్లో వ్యతిరేకించిన జనతాదళ్, బిల్లు ప్రవేశపెట్టే ముందు రోజు (ఆదివారం) మద్దతివ్వాలని నిర్ణయించింది. ఈ పరిణామం పట్ల ప్రశాంత్ కిషోర్ స్పందిస్తూ.. ఇది తనకు నిరాశకు గురిచేసిందని వ్యాఖ్యానించారు. మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించే ఈ బిల్లు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకమని సోమవారం ట్విటర్లో పేర్కొన్నారు. మరోవైపు బిల్లుకు జనతాదళ్ పార్టీ మద్దతు తెలపడంపై బీహార్‌లో ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ విమర్శించింది. నితీష్‌కుమార్ ప్రధాని మోదీకి బానిసలా వ్యవహరిస్తున్నారని, 370 రద్దు, ట్రిపుల్ తలాక్, ఎన్నార్సీలకు మద్దతు తెలపడంతో ఈ విషయం రూడీ అయిందని వాగ్బాణాలు సంధించింది. -
విజయ్‌కి ఆశలు రేపుతున్న ప్రశాంత్ కిషోర్
పెరంబూరు: రాజకీయ వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ నటుడు విజయ్‌కు ముఖ్యమంత్రి ఆశలు రేకెత్తిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు ప్రధాని నరేంద్రమోదీకి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌లకు రాజకీయ వ్యూహకర్తగా పని చేశారు. దీంతో ప్రశాంత్ కిషోర్ పేరు తమిళనాడుకు కూడా పాకింది. తమిళనాడులో 2021లో శాసనసభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో తమిళపాడులోని పలు రాజకీయ పార్టీలు ప్రశాంత్ కిషోర్‌ను వ్యూహకర్తగా నియమించుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. కాగా ఇప్పటికే ఈయన మక్కళ్ నీది మయ్యం పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్‌కు మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌కు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడినట్లు ప్రచారం జరిగింది. పార్టీ విధానం విషయంలో ప్రశాంత్ కిషోర్ నిర్ణయాలను కమలహాసన్ విభేదించడమే అందుకు కారణం అని తెలిసింది. దీంతో ప్రశాంత్ కిషోర్‌తో మక్కళ్ నీది మయ్యం ఒప్పందం రద్దు కానున్నట్లు సమాచారం. కాగా త్వరలో రాజకీయ రంగప్రవేశం చేయడానికి సిద్ధం అవుతున్న రజనీకాంత్ కూడా తనకు రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను నియమించుకోవాలను భావిస్తున్నట్లు, వీరిద్దరి మధ్య ముంబాయిలో భేటీ కూడా జరిగినట్లు ప్రచారం జరిగింది. విజయ్ను ముగ్గులోకి దించే ప్రయత్నాలు ఇలాంటి పరిస్థితిలో ప్రశాంత్ కిషోర్ దళపతి విజయ్ను రాజకీయాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. రాజకీయ పరిస్థితులను అంచనా వేయడానికి ప్రశాంత్ కిషోర్‌కు చెందిన బృందం సమగ్ర సర్వే నిర్వహిస్తుందట. తమిళనాడులో చేసిన సర్వేలో నటుడు విజయ్ పేరును చేర్చారట. అలా విజయ్‌కు 28 శాతం ప్రజలు ఆదరణ తెలిపారట. కాగా ఇటీవల ప్రశాంత్ కిషోర్ నటుడు విజయ్ను కలిసి చర్చించినట్లు సమాచారం. అప్పుడు తాము నిర్వహించిన సర్వే వివరాలను, ఆయనకు 28 శాతం మంది ప్రజల మద్ధతు తెలిపిన విషయాన్ని తెలియజేసినట్లు సమాచారం. అంతే కాదు రాజకీయాల్లోకి వస్తే మిమ్మల్ని గెలిపించడానికి తాము వ్యూహ రచన చేస్తామని తెలిపినట్లు తెలిసింది. అందుకు ఏడాది పాటు అనుసరించాల్సిన పథకాల గురించి వివరించినట్లు సమాచారం. వాటిని అమలు చేస్తే చాలు మీరే కాబోయే సీఎం అని ఆశలు రేకెత్తించినట్లు తెలిసింది. తమిళ ప్రజలు ప్రస్తుతం విజయ్‌కు అనుకూలంగా ఉన్నారని, ఆంధ్రప్రదేశ్‌లో యువకుడైన జగన్‌మోఃహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినట్లు, తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి అవుతారని ప్రశాంత్‌కిషోర్ పేర్కొన్నాట్లు సమాచారం. అయితే నటుడు విజయ్ మాత్రం చాలా ప్రశాంతంగా ఆయన చెప్పినవి విని ఊరుకున్నారని, ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదని తెలసింది. నిజానికి విజయ్‌కు మరో ఐదేళ్ల వరకు రాజకీయ రంగప్రవేశం గురించి ఆలోచన లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. -
ప్రశాంత్ కిశోర్‌తో రజనీకాంత్ భేటీ!
సాక్షి, చెన్నై: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో నటుడు రజనీకాంత్ భేటీ అయ్యారన్న వార్త ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. తలైవా (రజనీకాంత్) రాజకీయాల్లోకి రావాలన్నది ఆయన అభిమానులకు 25 ఏళ్ల కల. అయితే ఆ దేవుడు ఆదేశిస్తే ఈ రజనీ పాటిస్తాడు అంటూ కర్ర విరగరాదు పాము చావరాదు అన్న చందంగా దాటవేస్తూ వచ్చారు రజనీకాంత్. కానీ అభిమానుల వత్తిడి మేరకో, లేక తన ఆలోచనల మేరకో ఎట్టకేలకు రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు గత 2017 డిసెంబర్లో ప్రకటించాడు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాలను రజనీ ప్రజా సంఘాలుగా పేరు మార్చారు. అభిమానులతో భేటీ అయ్యి వారికి రాజకీయపరమైన దిశా నిర్ధేశం చేశారు. అభిమాన సంఘాల్లో ముఖ్యమైన వారికి నిర్వాహకులుగా బాధ్యతలను అప్పగించారు. తమిళనాడులో కోటికి పైగా సభ్యుత్వాన్ని నమోదు చేయాలని కూడా లక్ష్యంగా నిర్దేశించారు. ప్రధాన నగరాల్లో బూత్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఇక ఎన్నికలకు వెళ్లడమే తరువాయి అన్న తరుణంలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. అయితే ఆ ఎన్నికలకు రజనీకాంత్ దూరంగా ఉండటం అభిమానుల్ని నిరాశ పరచింది. అయితే శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా, రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లోనూ పోటీ చేయాలన్న రజనీ నిర్ణయంతో ఆయన అభిమానులు కాస్త సంతోషించారు. ప్రశాంత్ కిశోర్‌తో భేటీ కాగా రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అంటున్న రజనీకాంత్ ఇప్పటి వరకూ పార్టీని కూడా ప్రారంబించలేదు. పార్టీ జెండా, అజెండా ఏమిటో ఎవ్వరికి తెలియదు. ఆయన పాటికి ఆయన ప్రశాంతంగా సినిమాల్లో నటించుకుంటూపోతున్నారు. ఇది ఆయన అభిమానుల్లో అసహనానికి గురి చేస్తోంది. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా రజనీకాంత్ అభిమానుల్లో ఆనందం కట్టలు తెంచుకుంటోంది. కారణం ప్రముఖ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్‌తో రజనీకాంత్ భేటీ కావడమే. 2014లో పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదికి, రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ వ్యవహించారు. ఆ ఎన్నికలో భారతీయ జనతాపార్టీ విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో గత శాసనసభ ఎన్నికల సమయంలో జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా పని చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ చారిత్రాత్మక విజయం సాధించింది. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల రాజకీయ పార్టీ నాయకుల దృష్టి ప్రశాంత్ కిశోర్‌పై పడింది. ఇందుకు తమిళనాడు రాజకీయ పార్టీలు అతీతం కాదు. కమల్ పార్టీకి వ్యూహకర్తగా.. తమిళనాడులో నటుడు, మక్కళ్ నీతి మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహసన్ ప్రశాంత్‌కిశోర్‌ను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్నారు. ఆయనతో సుధీర్ఘ చర్చలు జరిపి, రాజకీయపరంగా పార్టీలో పలు మార్పులు చేస్తున్నారు. పార్టీకి నాయకులు లేని నియోజక వర్గాల్లో నాయకులను నియమించడం వంటి చర్యలు తీసుకుంటూ పార్టీ బలోపేతానికి శ్రీకారం చుడుతున్నారు. అదే బాటలో రజనీ: కాగా ఇలాంటి సమయంలో అనూహ్యంగా నటుడు రజనీకాంత్ ఇటీవల ముంబైలో ప్రశాంత్ కిశోర్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ప్రశాంత్‌కిశోర్ తన బృందంతో చేయించిన సర్వే వివరాలు తదితర అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు, రజనీ ప్రజా సంఘాల నిర్వాహకులు దృవీకరించారు. అంతే కాదు రజనీకాంత్ ప్రశాంత్‌కిశోర్‌తో భేటీ కావడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అయితే కమల్‌హాసన్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు రజనీకాంత్ రాజకీయ పార్టీకి తన సేవలను ఎలా అందిస్తారన్న ప్రశ్న అభిమానుల్లో తలెత్తుతోంది. -
‘హౌడీ మోదీ’పై ప్రశాంత్ కిషోర్ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: రెండు అగ్రరాజ్యల (భారత్-అమెరికా) అధినేతలు కలిసి వేదిక పంచుకున్న హ్యూస్టన్ హౌడీ మోదీ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యకక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే. దీనిపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. మోదీ, ట్రంప్ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని, ఈ కార్యక్రమం ట్రంప్‌కు ఎంతో లబ్ధి చేకూరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం ఆసన్నమైన వేళ.. ఈ కార్యక్రమానికి ట్రంప్ హాజరవడం ఎంతో వ్యూహత్మకమైన, తెలివైన చర్యగా అని ట్విటర్ వేదికగా ఆయన పేర్కొన్నారు. కాగా రానున్న ఎన్నికల్లో మరోసారి అమెరికా ప్రజలు, ప్రవాస భారతీయులు ట్రంప్‌కే ఓటు వేయాలని మోదీ పిలుపునివ్వడాన్ని రాజకీయ ఎత్తుగడగా ప్రశాంత్ కిషోర్ వర్ణించారు. హౌడీ మోదీ కార్యక్రమంలో మోదీ ప్రసంగం ట్రంప్‌కు రానున్న ఎన్నికల్లో ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. కాగా ఈ ఈవెంట్లో మోదీ మాట్లాడుతూ.. ‘ట్రంప్ నాకు మంచి మిత్రుడు. అమెరికా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. అందుకే చెబుతున్నా.. అబ్ కీ బార్.. ట్రంప్ కీ సర్కార్ (మళ్లీ ట్రంప్ ప్రభుత్వమే)’ అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా ట్రంప్‌కు అనుకూలంగా మోదీ చేసిన వ్యాఖ్యలపై పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
ప్రశాంత్ కిషోర్ చేతిలో ఠాక్రే వారసుడు
సాక్షి, ముంబై: రాజకీయ వ్యూహాలు రచించడంలో దిట్టగా పేరొందిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కోసం రాజకీయ పార్టీలు క్యూ కడుతున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంలో తెరవెనుక ఆయన కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అలాగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ-జేడీయూ మహాకూటమి గెలపు వెనుక ఆయన కృషి ఎంతో ఉంది. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన సలహాదారుడిగా పనిచేశారు. దీంతో దేశ వ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు ఆయనను తమ పార్టీకి వ్యూహకర్తగా ఉండాలంటూ స్వాగతిస్తున్నాయి. బెంగాల్లో మమత బెనర్జీతో ఇప్పటికే ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అయితే ఇవన్నీ వారంతా వారి పార్టీలను అధికారంలోకి తీసుకువచ్చేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రశాంత్ కోరుతున్నారు. కానీ అందుకు భిన్నంగా శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే మాత్రం ప్రశాంత్ కిషోర్ వద్ద ఓ కీలక ప్రతిపాదన ఉంచారని తెలుస్తోంది. త్వరలో మహారాష్ట్రలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొందేకు కృషి చేస్తూనే.. తన కుమారుడు ఆదిత్య ఠాక్రేను సమర్ధవంతమైన రాజకీయనేతగా తయారుచేయాలని ఆయన వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. ప్రశాంత్ సూచనలతో రానున్న అసెంబ్లీ ఎన్నికలల్లో ఆదిత్యను బరిలోకి దింపేందుకు ఠాక్రే సిద్ధమయ్యారు. అంతే కాదు మహారాష్ట్ర సీఎం పీఠంపై కూడా శివసేన కన్నేసింది. ఈ విషయాన్ని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆదిత్యాను మరింత తీర్చిదిద్దే బాధ్యతను ప్రశాంత్ కిషోర్‌పై పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వారిద్దరి మధ్య భేెటీ జరిగిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఎవరూ కూడా అధికారిక ప్రకటన చేయలేదు. -
‘ప్రశాంత్ కిషోర్‌ను తప్పుపట్టలేం’
పట్నా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో ఇటీవల భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే జేడీయూకి ఉపాధ్యక్షుడిగా ప్రశాంత్ కిషోర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో వారిద్దరి మధ్య భేటీ చర్చనీయాంశంగా మారింది. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో జేడీయూ కేంద్రంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉంది. ఎన్డీయేకు వ్యతిరేకంగా మమత కోసం పీకే పనిచేస్తున్నారంటూ బిహార్ రాజకీయాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మమత-ప్రశాంత కిషోర్ భేటీపై నితీష్ కుమార్ తొలిసారి స్పందించారు. ‘‘దేశంలో వివిధ రాజకీయ పార్టీలకు వ్యహకర్తగా సలహాలు ఇవ్వడం ఆయన వృత్తి. ఇది పార్టీకి ఎలాంటి సంబంధంలేని అంశం.దీదీ, పీకే భేటీపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. ప్రశాంత్ కిశోర్ మా పార్టీ ఉపాధ్యక్షుడే. దాంతో పాటు ఎన్నికల వ్యూహరచన చేసే ఓ సంస్థకు అధిపతి కూడా. వ్యాపార వ్యవహారాల్లో భాగంగా ఆయన బెంగాల్ సీఎం మమతాబెనర్జీని కలిసి ఉండొచ్చు. అంతేకానీ జేడీయూ కార్యకర్తగా పీకే అక్కడికి వెళ్లలేదు. కాబట్టి ఆయన్ను తప్పుపట్టలేం’ అంటూ వ్యాఖ్యానించారు. కాగా మమతతో పీకే ఇటీవల దాదాపు రెండు గంటలపాటు భేటీ అయినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమతో కలిసి పని చేయాల్సిందిగా దీదీ.. పీకేను కోరినట్లు సమాచారం. ఇందుకు ప్రశాంత్ కిషోర్ కూడా ఒప్పుకున్నట్లు తెలిసింది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. బెంగాల్లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలుండగా.. టీఎంసీ 22 స్థానాల్లో విజయం సాధిస్తే.. బీజేపీ దీదీకి గట్టి పోటీ ఇస్తూ.. ఏకంగా 18 స్థానాల్లో గెలుపొందింది. ఇదే పరిస్థితి కొనసాగితే.. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ తనకు గట్టి పోటీ ఇస్తుందని భావించిన దీదీ.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో సమావేశమయ్యి.. తమ పార్టీ కోసం పని చేయాల్సిందిగా కోరినట్లు ప్రచారం జరుగుతోంది. -
వైఎస్సార్సీపీ విజయంలో ‘ఐ–ప్యాక్’ కీలక పాత్ర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం వెనుక ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఐ–ప్యాక్) కీలక పాత్ర పోషించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల రాష్ట్రంలో ఉన్న అఖండ ప్రజాదరణను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికాబద్ధమైన కార్యాచరణను అమలు చేసింది. సంస్థాగతంగా బలోపేతం కావడం, ప్రచారం, పోల్ మేనేజ్మెంట్లో ఐ–ప్యాక్ సంస్థ పక్కా వ్యూహాలతో దిశానిర్దేశం చేసింది. 2014 ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల వ్యూహకర్తగా విజయవంతమై ప్రశాంత్ కిశోర్ యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. ప్రత్యర్థి పార్టీల దుష్ప్రచారం, కుట్రలతో 2014లో తృటిలో అధికారానికి దూరమైన వైఎస్సార్సీపీ 2019 ఎన్నికల కోసం నాలుగేళ్ల క్రితమే సమాయత్తమైంది. వైఎస్ జగన్ తమ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్‌ను నియమించారు. దాంతో ప్రశాంత్ కిశోర్ తొలిసారి దక్షిణ భారతదేశంలో ఎన్నికల వ్యూహకర్తగా రంగంలోకి దిగారు. 2017 మే నుంచి ఐ–ప్యాక్ సంస్థ వైఎస్సార్సీపీతో కలిసి పనిచేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా వ్యూహాలను అమలు చేస్తూ పార్టీకి దిక్సూచిగా నిలిచింది. ఆపరేషన్–2019 వైఎస్సార్సీపీ ఎన్నికల వ్యూహకర్తగా నియమితులు కాగానే ప్రశాంత్ కిశోర్ తన ఐ–ప్యాక్ బృందంతో కార్యాచరణ చేపట్టారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటికి ఎన్నికలకు 709 రోజులే ఉన్నాయి. అందుకు అనుగుణంగా 200 మంది సభ్యులను వివిధ బృందాలుగా ఏర్పాటు చేసి, పలు బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయి విభాగాలు, మీడియా వింగ్, డిజిటల్ మీడియా అండ్ రిసెర్చ్ కమ్యూనికేషన్ వింగ్... ఇలా పలు విభాగాలు ఏర్పాటయ్యాయి. ఐ–ప్యాక్ సంస్థ అధినేత ప్రశాంత్ కిశోర్ మొత్తం వ్యవహారాలను పర్యవేక్షిస్తూ రిషిరాజ్ సింగ్, శంతన్‌సింగ్, ఈషాలకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆ ముగ్గురు వైఎస్సార్సీపీకి చెందిన వివిధ విభాగాలను పర్యవేక్షిస్తూ, ఎన్నికల వ్యూహాలను అమలు చేశారు. వైఎస్సార్సీపీ ఆశయాలు, వైఎస్ జగన్ నిబద్ధతను ఐ–ప్యాక్ సంస్థ పక్కాప్రణాళికతో ప్రజల్లోకి తీసుకెళ్లింది. పార్టీ తరపున 17 కార్యక్రమాలకు రూపకల్పన చేసి, అమలు చేసింది. వాటిల్లో 13 క్షేత్రస్థాయిలో ప్రచార కార్యక్రమాలు కాగా, 4 ప్రచార కార్యక్రమాలను ఆన్లైన్లో నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ పరిస్థితిపై అధినేతకు నివేదికలు వైఎస్ జగన్ నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్రలో ఐ–ప్యాక్ కీలక భూమిక పోషించింది. 20 మంది సభ్యుల బృందం పాదయాత్ర ప్రారంభం నుంచి ముగింపు వరకు కొనసాగుతూ పర్యవేక్షించింది. ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించింది. పార్టీలో పలువురు నేతల చేరికలో ఐ–ప్యాక్ పాత్ర అత్యంత కీలకం. ఎన్నికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘రావాలి జగన్... కావాలి జగన్’ అనే పార్టీ ప్రచార గీతాన్ని 3 కోట్ల మంది వీక్షించడం సరికొత్త రికార్డును సృష్టించింది. టీడీపీ ప్రచారాన్ని తిప్పికొడుతూ ‘నిన్ను నమ్మం బాబు’ పేరుతో ఐ–ప్యాక్ ప్రచార వ్యూహాన్ని అమలు చేసింది. పార్టీ బూత్ కమిటీ సభ్యులతో వైఎస్ జగన్ నిర్వహించిన సమర శంఖారావం సభలకు రూపకల్పన చేసింది. ‘జగనన్న పిలుపు’ పేరుతో తటస్థులతో సమావేశాలు నిర్వహించింది. ఇందులో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఎన్నికల్లో రోజువారీగా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని సమీక్షిస్తూ అధినేత వైఎస్ జగన్‌కు ఐ–ప్యాక్ నివేదికలు ఇస్తూ వచ్చింది. నియోజకవర్గాలకు ఇన్చార్జిల నియామకం, వారితో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసింది. నియోజకవర్గ స్థాయిలో నేతల మధ్య విభేదాలను పరిష్కరించింది. తటస్థులను అకర్షించేందుకు సలహాలు, సూచనలు అందజేసింది. ఎన్నికల అనంతరం జగన్మోహన్రెడ్డి హైదరాబాద్‌లోని ఐ–ప్యాక్ కార్యాలయానికి ప్రత్యేకంగా వెళ్లి, ఆ బృంద సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఫలితాల రోజున వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసంలో ప్రశాంత్ కిశోర్‌తో కలిసి ఫలితాల సరళిని పర్యవేక్షించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో నూతనోత్సాహం ఔట్ డోర్ ప్రచారాలతోపాటు ప్రధానంగా సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకుంటూ ప్రచారపర్వంలో ఐ–ప్యాక్ దూసుకెళ్లింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఐటీ విభాగాలు సోషల్ మీడియాలో వైఎస్ జగన్‌పై సాగిస్తున్న దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొడుతూ వచ్చింది. వైఎస్సార్సీపీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఐ–ప్యాక్ రూపొందించిన పలు కార్యక్రమాలు పూర్తిస్థాయిలో విజయవంతమయ్యాయి. వైఎస్సార్ కుటుంబం, రచ్చబండ–పల్లెనిద్ర, గడప గడపకు వైఎస్సార్, నవరత్నాల సభలు, రావాలి జగన్–కావాలి జగన్... ఇలా ఐ–ప్యాక్ చేపట్టిన పలు కార్యక్రమాలు ప్రజల్లోకి చొచ్చుకెళ్లాయి. ఔట్‌డోర్ ప్రచారం, ఇంటింటికీ వైఎస్సార్సీపీ టేబుల్ క్యాలెండర్ల పంపిణి తదితర రూపాల్లో పార్టీకి ప్రచారం కల్పించింది. వీటన్నింటితో వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో నూతనోత్సాహం వచ్చింది. -
ప్రశాంత్ కిషోర్ బృందానికి వైఎస్ జగన్ అభినందన
సాక్షి, హైదరాబాద్ : ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందానికి అభినందనలు తెలిపారు. వైఎస్ జగన్ శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇక్కడి ‘ఐ–ప్యాక్’ కార్యాలయాన్ని సందర్శించారు. ప్రశాంత్ కిషోర్, ఆయన బృందం సభ్యులతో కొద్దిసేపు గడిపారు. కాగా జగన్ ఐప్యాక్ కార్యాలయానికి చేరుకున్న వెంటనే అక్కడి సిబ్బంది అందరూ ‘సీఎం... సీఎం..’ అంటూ ఆయనకు స్వాగతం పలికారు. కాబోయే ఏపీ ముఖ్యమంత్రి అంటూ పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్, ప్రశాంత్ కిషోర్‌లు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. తమకు అప్పగించిన పనిని పూర్తి చేసినట్టుగా ప్రశాంత్ కిషోర్ చెప్పారు. రెండేళ్లపాటు ఐప్యాక్ బృందం చాలా కష్టపడి పనిచేసిందని, వారందరికీ అభినందనలు తెలుపుతున్నానని జగన్ ఈ సందర్భంగా అన్నారు. బృందం సభ్యులంతా చాలా క్రియాశీలంగా వ్యవహరించినందుకుగాను ఆయన వారికి కృతజ్ఞతలు తెలిపారు. జగన్ వెంట ఆయన ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి కూడా ఉన్నారు. ఇంకా పలు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ తాము నిర్వర్తించాల్సిన విధులకోసం ఐప్యాక్ బృందం సభ్యులు తరలి వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ వారి కార్యాలయానికి వెళ్లి భేటీ అయ్యారు. -
ఇక బై బై బాబు
సాక్షి, హైదరాబాద్: తనపై తప్పుడు ట్వీట్ పెట్టినందుకు చంద్రబాబుపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా ప్రతిస్పందించారు. ప్రజల విశ్వాసం కోల్పోయినప్పుడు, వారి విజ్ఞతమీద నమ్మకం లేనప్పుడు, దిగజారిపోయి నిందలేస్తారని, అసత్యాలు, నకిలీ వార్తలు ప్రచారం చేస్తారని ఆయన అన్నారు. చంద్రబాబు తీవ్ర నిందలేసి.. దారుణమైన అబద్ధాలు చెప్పినా ప్రజలు పట్టించుకోలేదని, వారి విశ్వాసాన్ని ఆయన కోల్పోయారని, వారు బైబై బాబు అంటూ తీర్పు ఇచ్చేశారని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కొద్ది గంటల్లో పోలింగ్ ముగుస్తుందనగా ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘మీరు(చంద్రబాబు) దారుణమైన నిందలేశారు.. అబద్ధాలు చెప్పారు.. అయినప్పటికీ ప్రజల విశ్వాసాన్ని మీరు కోల్పోయారు. ప్రజల విజ్ఞతపై మీకు నమ్మకం పోయింది. అందుకే అసత్యాలు, నకిలీ వార్తలు ప్రచారం చేసే స్థాయికి దిగజారిపోయారు. ఇక పోలింగ్ ముగియడానికి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. ఏపీ ప్రజల తీర్పు ఏమిటనేది స్పష్టంగా తెలిసిపోతోంది. ఇక మీకు బై బై బాబు అని చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని ట్వీట్ చేశారు. తాను, తన బృందంతో రెండేళ్లుగా పడిన శ్రమ వృథా అయిపోతోందని, జగన్ మెజారిటీకి కావాల్సిన అసెంబ్లీ సీట్లను సాధించలేరని ప్రశాంత్ కిషోర్ పెట్టినట్లుగా ఒక తప్పుడు ట్వీట్‌ను సృష్టించడంపై ప్రశాంత్ కిషోర్ ప్రతిస్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. -
ఫేక్ ట్వీట్‌పై చంద్రబాబుకు ప్రశాంత్ కిషోర్ కౌంటర్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని సర్వేలన్నీ ఘోషిస్తుండడం, క్షేత్ర స్థాయిలో ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌లో తిరుగుతున్నట్టుగా స్పష్టమైన సంకేతాలు కనిపిస్తుండడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన దిగజారుడు రాజకీయాలకు మరోసారి పదును పెంచి అడ్డంగా దొరికిపోయారు. ఇప్పటికే ఫేక్ ఆడియోలు, ఫేక్ గొడవలు, ఫేక్ ధర్నాలు, ఫేక్ సర్వేల పేరుతో అనుకూల మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేపించిన చంద్రబాబు, చివరి అస్త్రంగా పోలింగ్ జరుగుతున్న సమయంలోనే ఫేక్ ట్వీట్లను సృష్టించి ఓట్లు రాబట్టాలనుకున్నారు. ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరిట ఓ ఫేక్ ట్వీట్‌ను సృష్టించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. అయితే ఈ తప్పుడు వార్తలపై ప్రశాంత్ కిషోర్ తన అధికారిక ట్విట్టర్లో స్పందించారు. 'ప్రజల విశ్వాసం కోల్పోయినప్పుడు, వారి విజ్ఞతమీద నమ్మకం లేనప్పుడు, ఇలా దిగజారిపోయి నిందలు వేస్తారు. అసత్యాలు, నకిలీ వార్తలు ప్రచారం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ తీర్పును నిర్ణయించుకున్నారు. మరికొన్ని గంటల్లో పోలింగ్ ముగియనుంది. బై బై బాబు అని చెప్పడానికి ఇదే సరైన సమయం' అంటూ ఫేక్ ట్వీట్ ఫోటోతో పోస్ట్ పెట్టి చంద్రబాబును ట్యాగ్ చేశారు. .@ncbn when you lose trust of the people and your faith in their wisdom, after abuses and lies, you stoop down to circulating fake news. Few hours left for the polling to close but it’s clear that people of AP have decided their verdict. It is time to say #ByeByeBabu pic.twitter.com/TH3K4dwXqB — Prashant Kishor (@PrashantKishor) April 11, 2019 -
‘ఆ మీడియా తప్పుడు వార్తలను ప్రసారం చేస్తోంది’
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అనుకూల మీడియా మరీ దిగజారిపోయింది. తప్పుడు సర్వేల పేరిట ప్రజలను పక్కదారి పట్టిస్తోంది. ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఐప్యాక్) టీడీపీకి అనుకూలంగా సర్వే చేసినట్టు ఓ మీడియా కథనాలు ప్రచురించింది. దీనిపై స్పందించిన ఐప్యాక్ సంస్థ ఆ వార్తలను ఖండించింది. ఆ మీడియా ప్రచురించిన కథనాలు ఊహాజనితమైనవని ఐప్యాక్ సంస్థ తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా పేర్కొంది. ఆ మీడియా ప్రచారం చేసిన వార్తల్లో ఎటువంటి నిజాలు లేవని, ఆధారంలేని వార్తలను ప్రసారం చేస్తున్నారని ఐప్యాక్ మండిపడింది. A local channel in AP called TV5 is spreading fake news by attributing an entirely fabricated and fictional survey to us and @PrashantKishor. Needless to say their "claim" is absolutely baseless and published with malicious intent. — I-PAC (@IndianPAC) March 18, 2019 -
ప్రశాంత్ కిషోర్ రాజకీయ అరంగేట్రం
పట్నా : ఎన్నికల వ్యూహాలు రచించడంలో దేశ రాజకీయాల్లో చాణిక్యుడిగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ (41) రాజకీయ ప్రవేశం చేయనున్నారు. బిహార్‌లోని ససారంకు చెందిన ప్రశాంత్ కిషోర్.. జేడీయూలో చేరనున్నారు. ఆ రాష్ట్రా సీఎం నితీష్ కుమార్ సమక్షంలో ఆదివారం ఆయన పార్టీలో చేరతారని జేడీయూ వర్గాలు వెల్లడించాయి. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల కంటే ముందే ఆయన పార్టీలో చేరుతారని జేడీయూ నేతలు ధృవీకరించారు. దీంతో పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలో కూడా ఆయన కీలక బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఎన్నికల వ్యూహాలు రచించడంలో దిట్ట అయిన కిషోర్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాకర్తగా పనిచేసి నరేంద్ర మోదీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తరువాత కాంగ్రెస్, జేడీయూ,ఆర్జేడీ తరుఫున బిహార్‌లో మహాకూటమి తరుపున పనిచేసి బీజేపీ ఓటమికి కారణమయ్యాడు. ఆ తరువాత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సలహాదారుడిగా పనిచేసి అమరేందర్ సింగ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. గత బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే నితీష్‌కు కిషోర్‌కు మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. దాంతోనే నితీష్ తన సలహాదారుడిగా కొంతకాలం ప్రశాంత్ కిషోర్‌ను నియమించుకున్నాడు. ఆ తరువాత బీజేపీ, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీల నుంచి ఆహ్వానాలు అందినా.. ఆయన వాటిని తిరస్కరించారు. తన సొంత రాష్ట్రామైన బిహార్‌కు చెందిన ప్రాంతీయ పార్టీతోనే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాలని భావించిన ఆయన.. ఈ మేరకు ‘‘బిహార్ నుంచి కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని శనివారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. అంతకుముందు ఆయన ఐక్యరాజ్య సమితి పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‌గా ఎనిమిదేళ్లు సేవలు అందించారు. ఆ తరువాత ఇండియన్ పోలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపాక్)లో చేరి భారత్‌తో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. Excited to start my new journey from Bihar! — Prashant Kishor (@PrashantKishor) September 16, 2018 -
ప్రశాంత్ కిషోర్ ఢిల్లీలోనే లేరు
సాక్షి, అమరావతి: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శనివారం ఢిల్లీలోనే లేరని.. అలాంటప్పుడు ఏపీ బీజేపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిర్వహించిన సమావేశంలో ఎలా పాల్గొంటారని ఆయన సంస్థ ఐ–ప్యాక్ ప్రశ్నించింది. ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా శనివారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారంటూ ఓ వర్గం మీడియా ప్రసారం చేసిన కథనాలను ట్వీటర్లో ఐ–ప్యాక్ ఖండించింది. అవాస్తవ కథనాలను ప్రసారం చేయడం.. ప్రచురించడం ద్వారా ఏం సాధిస్తారంటూ అసహనం వ్యక్తం చేసింది. -
పని చేయని ప్రశాంత్ కిషోర్ టెక్నిక్
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాజకీయ వ్యూహాల ముందు ప్రశాంత్ కిషోర్ టెక్నిక్‌లు పని చేయలేదు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భారత రాజకీయ ప్రచార రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీని, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్‌ను విజయపథాన నడిపించడంతో ప్రశాంత్ కిషోర్ పేరు దేశవ్యాప్తంగా మర్మోగిపోయింది. అయితే ఈ సారి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ మ్యాజిక్ వర్కవుట్ కాలేదు. అంతేకాకుండా యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, ప్రశాంత్‌కు విభేదాలు వచ్చినట్టు సమాచారం. మరోవైపు 90వ దశకం తర్వాత యూపీలో నానాటికి ఆదరణ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ తాజా ఎన్నికల్లో మరింత ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సమాజ్‌వాదీతో పొత్తు కట్టినా హస్తం పార్టీకి ప్రయోజనం రాలేదు. పైగా పార్టీ చరిత్రలో యూపీలో అత్యంత దారుణ స్థాయికి పడిపోయింది. అఖిలేష్ యాదవ్‌తో బేరాలాడి మరీ 105 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ పట్టుమని పది స్థానాలను కూడా గెలవలేకపోయింది. కేవలం ఏడు స్థానాలతో సరిపెట్టుకుంది. అలాగే హస్తం పార్టీ కంచుకోటలైన అమేథీ, రాయ్‌బరేలీల్లో కూడా కాంగ్రెస్‌కు ఆధిక్యం రాలేదు. ఆ రెండు నియోజకవర్గాల్లో ప్రియాంకాగాంధీ స్వయంగా ప్రచారం చేసినా కూడా హస్తం అభ్యర్థులు గెలవలేకపోయారు. ప్రియాంకా గాంధీ స్వయంగా రంగంలోకి దిగినా ఫలితం దక్కలేదు. దీంతో ప్రియాంక కేవలం కాగితం పులిగానే మిగిలిపోయారంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. మోదీ అభివృద్ధి పనులతోనే యూపీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని ఆమె వ్యాఖ్యానించారు.