
సాక్షి, అమరావతి: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శనివారం ఢిల్లీలోనే లేరని.. అలాంటప్పుడు ఏపీ బీజేపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిర్వహించిన సమావేశంలో ఎలా పాల్గొంటారని ఆయన సంస్థ ఐ–ప్యాక్ ప్రశ్నించింది. ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా శనివారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారంటూ ఓ వర్గం మీడియా ప్రసారం చేసిన కథనాలను ట్వీటర్‌లో ఐ–ప్యాక్ ఖండించింది. అవాస్తవ కథనాలను ప్రసారం చేయడం.. ప్రచురించడం ద్వారా ఏం సాధిస్తారంటూ అసహనం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment