బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. మళ్లీ బీజేపీతో చేరుతారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంచనా వేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా, పీకే వ్యాఖ్యలపై సీఎం నితీష్ స్పందించారు. పీకే మంచి వయస్సు మీద ఉన్నాడంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు.
ఈ అంశంపై నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. పీకే తన పబ్లిసిటీ కోసం ఏదైనా మాట్లాడతారు. ఆయన తన ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేసుకోవచ్చు. మేము వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ వయసు మీద ఉన్నాడని, కాబట్టి ఏదైనా మాట్లాడగలడని సెటైరికల్‌గా కామెంట్స్ చేశారు. అయితే, ఒకప్పుడు పీకే అంటే తనకు మంచి గౌరవ భావం ఉండేదని చెప్పారు. తాను అతడికి గౌరవం ఇచ్చినా అతడు మాత్రం తనను అగౌరవ పర్చాడని విమర్శించారు.
ఇక, అంతకుముందకు నితీష్ కుమార్‌పై పీకే మాట్లాడుతూ.. ‘బీజేపీతో ఆయన తెగదెంపులు చేసుకున్నారా? అది అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన ఇంకా ఆ పార్టీతో టచ్‌లోనే ఉన్నారు!. ఇందుకు సాక్ష్యం కూడా ఉంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఇంకా కొనసాగుతున్న జేడీయూ నేత హరివంశ్ అందుకు సాక్ష్యం. ఇప్పటికే ఆయన్ని పదవి నుంచి తప్పుకోవాలని నితీశ్ ఆదేశించి ఉండాల్సింది. లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సింది. కానీ, అలా జరగలేదు. ఎందుకంటే హరివంశ్ ద్వారా నితీశ్ ఇంకా బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు’ అని ప్రశాంత్ పేర్కొన్నారు.
#WATCH | "...He speaks for his own publicity & can speak whatever he wants, we don't care. He's young. There was a time when I respected him...those whom I respected had disrespected me: Bihar CM Nitish Kumar on Prashant Kishor's remark that he's in touch with BJP pic.twitter.com/ZPdmQUDSkr
— ANI (@ANI) October 21, 2022
Comments
Please login to add a commentAdd a comment