సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తలు అవసరం లేదని, పార్టీలో నాయకులు తప్ప వ్యూహకర్తలు ఉండరని తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతాడని అన్నారు. శనివారం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పీకేకు ఏ బాధ్యతలు అప్పగిస్తుందనే విషయాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని పేర్కొన్నారు.
పీకే పార్టీలో చేరిన తర్వాత ఇతర పార్టీలకు పని చేస్తానంటే కుదరదని అన్నారు. పీకేను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేదే.. వ్యూహకర్త సునీల్ కొనుగోలు అనుకోవచ్చని తెలిపారు. తెలంగాణలో ఓడిపోయే టీఆర్‌ఎస్‌లో పొత్తు ఉండదని పేర్కొన్నారు. కేసీఆర్‌కు బర్త్‌డే విష్ చేప్తే.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని రాహుల్ గాంధీ చెప్పారని అన్నారు. టీఆర్‌ఎస్ విషయంలో రాహుల్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని పేర్కొన్నారు. మే 6 రాష్ట్ర ప్రజలకు మరింత స్పష్టత ఇస్తారని రేవంత్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment