
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అనుకూల మీడియా మరీ దిగజారిపోయింది. తప్పుడు సర్వేల పేరిట ప్రజలను పక్కదారి పట్టిస్తోంది. ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఐప్యాక్) టీడీపీకి అనుకూలంగా సర్వే చేసినట్టు ఓ మీడియా కథనాలు ప్రచురించింది. దీనిపై స్పందించిన ఐప్యాక్ సంస్థ ఆ వార్తలను ఖండించింది. ఆ మీడియా ప్రచురించిన కథనాలు ఊహాజనితమైనవని ఐప్యాక్ సంస్థ తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా పేర్కొంది. ఆ మీడియా ప్రచారం చేసిన వార్తల్లో ఎటువంటి నిజాలు లేవని, ఆధారంలేని వార్తలను ప్రసారం చేస్తున్నారని ఐప్యాక్ మండిపడింది.
A local channel in AP called TV5 is spreading fake news by attributing an entirely fabricated and fictional survey to us and @PrashantKishor. Needless to say their "claim" is absolutely baseless and published with malicious intent.
— I-PAC (@IndianPAC) March 18, 2019
Comments
Please login to add a commentAdd a comment