ప్రశాంత్ కిషోర్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: రెండు అగ్రరాజ్యల (భారత్-అమెరికా) అధినేతలు కలిసి వేదిక పంచుకున్న హ్యూస్టన్ హౌడీ మోదీ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యకక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే. దీనిపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. మోదీ, ట్రంప్ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని, ఈ కార్యక్రమం ట్రంప్‌కు ఎంతో లబ్ధి చేకూరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం ఆసన్నమైన వేళ.. ఈ కార్యక్రమానికి ట్రంప్ హాజరవడం ఎంతో వ్యూహత్మకమైన, తెలివైన చర్యగా అని ట్విటర్ వేదికగా ఆయన పేర్కొన్నారు.
కాగా రానున్న ఎన్నికల్లో మరోసారి అమెరికా ప్రజలు, ప్రవాస భారతీయులు ట్రంప్‌కే ఓటు వేయాలని మోదీ పిలుపునివ్వడాన్ని రాజకీయ ఎత్తుగడగా ప్రశాంత్ కిషోర్ వర్ణించారు. హౌడీ మోదీ కార్యక్రమంలో మోదీ ప్రసంగం ట్రంప్‌కు రానున్న ఎన్నికల్లో ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. కాగా ఈ ఈవెంట్‌లో మోదీ మాట్లాడుతూ.. ‘ట్రంప్ నాకు మంచి మిత్రుడు. అమెరికా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. అందుకే చెబుతున్నా.. అబ్ కీ బార్.. ట్రంప్ కీ సర్కార్ (మళ్లీ ట్రంప్ ప్రభుత్వమే)’ అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా ట్రంప్‌కు అనుకూలంగా మోదీ చేసిన వ్యాఖ్యలపై పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment