టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీపై ఇప్పుటికే వైఎస్సార్‌సీపీ నేతలు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, అసలు పీకేతో చంద్రబాబు భేటీ ఎలా జరిగింది.. వీరి భేటీ కోసం టీడీపీ ఎన్ని ప్లాన్స్ చేసింది. ఎంత డబ్బు ముట్టజెప్పారు అనేది ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు పీకేపై తీవ్ర విమర్శలు చేసి మళ్లీ ఇప్పుడు ఆయనతోనే సమావేశమవడంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.
ఇంతకీ చంద్రబాబుతో పీకే భేటీ ఎలా జరిగిందో, ఏం చర్చించుకున్నారో..
ఆయన సన్నిహితుడు ఒకరు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి..
►ప్రశాంత్ కిషోర్ పోల్ కన్సల్టెన్సీని వదిలి రాజకీయాల్లోకి వెళ్లారు. టీడీపీకి అత్యంత ఆప్తులు కొంతమంది ప్రశాంత్ కిషోర్‌తో పదేపదే చంద్రబాబు గారిని ఒకసారి కన్సల్ట్ అవ్వండి అని అడిగారు. దీంతో, ఫైనల్‌గా నిన్న(శనివారం) మీటింగ్‌కు ఓకే చెప్పారు. దానికి ప్రతిఫలంగా రూ.20కోట్లు, స్పెషల్ విమానం ఏర్పాటు చేశారు.
► చర్చల్లో భాగంగా ప్రశాంత్ కిషోర్‌ని ఈ కొద్ది రోజులైనా టీడీపీ కోసం వ్యూహకర్తగా పనిచేయాలని కోరగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. తాను ఇప్పుడు ఐప్యాక్‌తో లేనని, దానిని లీడ్ చేస్తున్న వ్యక్తులు ఆల్రెడీ వేరే పార్టీతో టై అప్‌లో ఉన్నారని తెలిపారు.
►దీంతో, తమకు ఐప్యాక్‌తో పనిలేదు మీరు ఒక టీమ్ ఫామ్ చేసి ఇవ్వండి. దానికి మీరు అడిగింది చెల్లిస్తాం అనగా.. ప్రస్తుతానికి బీహార్‌లో పార్టీ బలోపేతం పనుల్లో ఉన్నాను.. నేను చేయలేను.. కావాలంటే ప్రతీనెలా ఒకరోజు కేటాయిస్తాను.. ఇదే ఫీజు చెల్లించండి చాలు అని చెప్పారు. ప్రస్తుతానికి కొన్ని సూచనలు చెప్తాను, వాటిని చేస్కోండి అని సలహా ఇచ్చారు.
►అభ్యర్థులను సెలెక్ట్ చేసి వెంటనే ప్రజల్లోకి పంపండి. పాత అభ్యర్థులను పెట్టుకుంటే మీకు అసలుకే మోసం వస్తుంది. మీ పొత్తు పట్ల ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వండి. కులాల ప్రాతిపదికన మీరు కలిసారని ఇప్పటికే జనం బాగా నమ్ముతున్నారు. మీ పార్టీ.. మీ మీడియా ఒకే స్టాండ్ తీసుకోండి.. ఓవర్ హైప్ క్రియేట్ చేయాలి అనే ఆలోచనతో రాంగ్ డైరెక్షన్ వైపు తీసుకెళ్తున్నారు.
►గతంలో ఇచ్చిన హామీలు చేయలేదు అనే బ్లాక్ మార్క్ మీపై ఉన్నందున పదికి మించి హామీలు ఇవ్వకండి. మీ గత చరిత్ర పట్ల జనానికి పూర్తి అవగాహన ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కంటే బాగా చేస్తాం, ఆయన కంటే ఎక్కువ ఇస్తాం అనే టాపిక్ రానివ్వకండి. మీరు పోటీ పడలేరు. గతంలో హామీలను అమలు చేయలేదు. ప్రజల్లో మీ ప్రకటనలకు, వాగ్దానాలకు, హామీలకు అంతగా విశ్వసనీయత లేదు.
►మీరు సంక్షేమం గురించి తక్కువ మాట్లాడి.. అభివృద్ధి గురించి ఎక్కువగా మాట్లాడండి. అయినా మీరు అభివృద్ధి కూడా చేయలేదు కదా?. అమరావతి ప్రస్తావన అత్యవసరం అనుకుంటే తప్ప.. వాంటెడ్‌గా తీసుకురావద్దు. దానివల్ల మీకు ప్రయోజనం సున్నా. మీరు ఐదేళ్లలో సృష్టించింది భ్రమరావతి మాత్రమే.
►ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను టార్గెట్ చేసి రాష్ట్రం దివాళా తీసింది, అన్యాయం జరిగిపోతోంది అని ప్రచారం చేస్తే మీరు మరింత ఇబ్బందుల్లోకి వెళ్లారు. అలా కాకుండా..పరిపాలనలోని లోపాలను మీకు చేతనైతే బయటికి తీయండి. జనవరి 15 తర్వాత ఇక్కడ లేదా ఢిల్లీలో మళ్లీ కలుద్దాం అని వెళ్ళిపోయాడు. ఫైనల్‌గా ప్రశాంత్ కిషోర్ టీడీపీకి పనిచేయలేను అని చెప్పి వెళ్లినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment