
రాజకీయ వ్యూహాలకు దూరంగా ఉంటున్నానని చెప్పి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రశాంత్ కిషోర్.. యూటర్న్ తీసుకున్నారు. తమిళ స్టార్ నటుడు విజయ్ టీవీకేకు మద్దతుతో పాటు వ్యూహాలు అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ ఇద్దరూ కలిసి ఆదివారం(ఫిబ్రవరి 26) జరిగిన టీవీకే పార్టీ వార్షికోత్సవ సభలో ఒకే వేదికను పంచుకుని తమిళనాడుతో పాటు దేశ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను విజయ్ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీళ్ల జోడి హిట్టయ్యేనా? అనే చర్చ జోరందుకుంది.





















