
అమ్మ త్వరగా కోలుకోవాలి: గౌతమీ
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం తీవ్రవిషమంగా ఉండటంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ బాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. 68 ఏళ్ల జయలలిత కోలుకొని.. మళ్లీ తమిళనాడు ప్రజలకు తమ సేవలు అందించే చూడాలని ఆ దేవుడిని ప్రార్థించారు.
‘అమ్మ త్వరగా కోలుకోవాలని నా దైవికమైన తల్లిని ప్రార్థిస్తున్నాను. శక్తికి, దయకు మారురూపం జయలలిత’ అంటూ ప్రముఖ నటి గౌతమీ ట్వీట్ చేసింది. జయలలిత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ బాలీవుడ్ నటులు పరేశ్ రావల్, హేమామాలినీ కూడా ట్వీట్ చేశారు. అమ్మ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తూ ట్వీట్ చేసిన రిషీ కపూర్ 1974లో ఏవీఎం స్టూడియోలో ఎంజీఆర్, జయలలితను కలిసినప్పటి తన జ్ఞాపకాన్ని నెమరువేసుకున్నారు.