Actress Gautami Income Tax Case: High Court Issues New Order, Check Details Inside - Sakshi
Sakshi News home page

Actress Gautami IT Case: ఆదాయ పన్ను కేసులో నటి గౌతమికి ఊరట

Published Fri, Mar 25 2022 10:27 AM | Last Updated on Fri, Mar 25 2022 11:35 AM

Actress Gautami Income Tax Case: High Court Issues New Order - Sakshi

సాక్షి, చెన్నై: ఆదాయపు పన్ను చెల్లింపు వ్యవహారంలో సినీ నటి గౌతమికి మద్రాసు హైకోర్టులో గురువారం ఊరట లభించింది. ఈమె గతంలో శ్రీపెరంబదూరు సమీపంలో తన వ్యవసాయ పొలాన్ని విక్రయించారు. ఈ వ్యవహారంలో ఆదాయపు పన్ను చెల్లింపులు గందరగోళానికి దారి తీశాయి. దీంతో ఆమెకు చెందిన బ్యాంక్‌ ఖాతాలను ఐటీ వర్గాలు సీజ్‌ చేశాయి. దీనిని వ్యతిరేకిస్తూ గౌతమి హైకోర్టును ఆశ్రయించారు. ఆ స్థలాన్ని తాను రూ. 4 కోట్ల 10 లక్షలకు విక్రయించానని, అయితే, ఐటీ వర్గాలు రూ. 11 కోట్ల 11 లక్షలు విచారించినట్టు పేర్కొంటున్నాయని కోర్టుకు వివరించాయి.

ఆరు బ్యాంక్‌ల్లోని తన  ఖాతాల్ని సీజ్‌ చేశారని, వీటిని మళ్లీ ఉపయోగించుకునే అవకాశం కల్పించాలని విన్నవించారు. ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ ఆ స్థలం విక్రయాన్ని ప్రస్తావిస్తూ, మూలధనంలో 25 శాతం చెల్లిస్తే, సీజ్‌ చేసిన ఖాతాల్ని ఉపయోగించుకునే అవకాశం కల్పించాలని ఐటీ వర్గాల్ని ఆదేశించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement