బాలీవుడ్, దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన పలు జంటలు ఇటీవల విడిపోయాయి. కొందరి విడాకులు కేసులు ఇంకా కోర్టులో ఉన్నాయి. తాజాగా ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్, నటి గౌతమి తమ బంధాన్ని తెంచుకున్నారు. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోకపోయినా సుదీర్ఘకాలం సహజీవనం చేశారు. కమల్, గౌతమి 13 ఏళ్లు కలసి ఉన్నారు. కాగా కమల్, తాను విడిపోయామని గౌతమి ట్విట్టర్‌లో తెలిపారు. లైఫ్ అండ్ డెసిషన్స్ పేరుతో గౌతమి ఇంగ్లీష్లో రాసిన లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.