కూతురి కోసం రంగంలోకి.. | actor gowthami wants her daughter becomes heroin | Sakshi
Sakshi News home page

కూతురి కోసం రంగంలోకి..

Published Fri, Nov 18 2016 1:36 AM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM

కూతురి కోసం రంగంలోకి..

కూతురి కోసం రంగంలోకి..

సీనియర్ నటి గౌతమి తన కూతురు సుబ్బలక్ష్మిని కథానాయకిగా పరిచయం చేయడానికి సిద్ధం అయ్యారా? అవుననే అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. అంతే కాదు అప్పుడే అవకాశాల వేట కూడా మొదలెట్టారని సమాచారం. నటుడు  కమలహాసన్‌తో 13 ఏళ్లు సహజీవనం చేసిన గౌతమి ఇటీవల అనూహ్యంగా ఆయనకు దూరమవుతున్నానంటూ చెప్పి పెద్ద సంచలనానికే దారి తీశారు. ఈ విషయం చెప్పడానికి బాధగా ఉన్నా తన కూతురు భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని వివరించారు కూడా. కాగా ఆ మధ్య ఒక భేటీలో మీ అమ్మారుుని హీరోరుున్ చేస్తారా? అన్న ప్రశ్నకు తన కూతురు ఏ రంగంలోకి రావాలనుకుంటుందో నిర్ణయాన్ని తనకే వదిలేస్తున్నానని గౌతమి బదులిచ్చారు. ఇప్పుడు గౌతమి కూతురు సుబ్బలక్ష్మికి హీరోరుున్ అవ్వాలన్న కోరిక కలిగిందట.

తన ఆశను తన తల్లి గౌతమికి చెప్పగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. అంతే కాదు వెంటనే తన కూతుర్ని హీరోరుున్ చేసే పనిలో పడ్డారు. ప్రముఖ దర్శకులు, టాప్ హీరోల సరసన సుబ్బలక్ష్మిని నాయకిగా పరిచయం చేయాలని గౌతమి భావిస్తున్నారట. సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కూతుర్ని పెళ్లి చేసుకున్న నటుడు ధనుష్ ఆమెను తాను హీరోగా నటించిన 3 చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం చేశారు. అందులో కమలహసన్ పెద్ద కూతురు శ్రుతిహాసన్‌ను హీరోరుున్‌గా ఎంపిక చేసుకున్నారు. తాజాగా తన మరదలు, రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య దర్శకత్వంలో హీరోగా నటించడానికి రెడీ అవుతున్నారు. అదే విధంగా హిందీలో తాను నటించిన షమితాబ్ చిత్రంలో కమలహాసన్ రెండవ కూతురు అక్షరాహాసన్ నటిగా పరిచయం అరుున విషయం తెలిసిందే.

ఈ గణాంకాలన్నీ పరిగణనలోకి తీసుకున్న గౌతమి తన కూతురికి తనతో నటించే అవకాశం కల్పించమని నటుడు ధనుష్‌ను కోరినట్లు సమాచారం. అదే విధంగా నటుడు శివకార్తికేయన్ సరసన నటింపజేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇక తనకు తెలిసిన దర్శక నిర్మాతలను కూడా  అవకాశాల కోసం అడుగుతున్నట్లు సమాచారం. నిజానికి సుబ్బలక్ష్మికి ఇంతకు ముందే నటిగా అవకాశాలు వచ్చినట్టు, అరుుతే మంచి అవకాశం కోసం వేచి ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement