Subbulakshmi
-
భారతరత్నానికి విద్యా చిత్ర నీరాజనం
‘‘గాన కోకిల ఎమ్మెస్ సుబ్బులక్ష్మి అమ్మాళ్ అంటే నాకు వల్లమాలిన ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆమె కమనీయ కంఠస్వరాన్ని వింటూ పెరిగాను. మా అమ్మ ద్వారా నాకు సుబ్బులక్ష్మి అమ్మ సుప్రభాతం వినడం అలవాటైంది. ఇప్పటికీ నా దినచర్యప్రారంభమయ్యేది ఆ అమ్మ గాంధర్వ గానం వినడంతోనే. ఆమె 108వ జయంతి సందర్భంగా ఆ భారతరత్నానికి నేను సమర్పించగల చిరు కానుక ఇదే’’ అంటూ విద్యాబాలన్ భావోద్వేగపూరితమైనపోస్ట్ పెట్టారు. ప్రముఖ గాయని ఎమ్మెస్ సుబ్బులక్ష్మిని తలపించేలా నాలుగు రకాల చీరల్లో విద్యాబాలన్ ఫొటోషూట్ చేయించుకున్నారు. ఈ చీరల గురించి ఆమె ఆపోస్ట్‌లో... ‘‘1960–80ల మధ్య ఎమ్మెస్ అమ్మ ఈ తరహా చీరలు ధరించారు. అప్పట్లో ఈ చీరలకు చాలా ప్రాచుర్యం ఉంది.ఎమ్మెస్ అమ్మ హుందాతనానికి చీరలది సగ భాగం అయితే మిగతా సగం ఆమె నుదుటి పైన కుంకుమ, విభూది, రెండు వైపులా ముక్కు పుడకలు, కొప్పు, కొప్పు చుట్టూ మల్లెపువ్వులకు దక్కుతుంది’’ అని పేర్కొన్నారు విద్యాబాలన్. కాగా ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగా తయారు కావడానికి ఆమె మనవరాలు, ప్రఖ్యాత ఫ్లూటిస్ట్ సిక్కీ మాలా సహాయం చేశారట. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ... ‘‘నేను మనస్ఫూర్తిగా సంకల్పించుకున్న ఈ ప్రయత్నానికి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు సిక్కీమాలా మేడమ్. అలాగే నా ఈ కల సాకారం కావడానికి కారణమైన అనూపార్థసారథి (కాస్ట్యూమ్ డిజైనర్)కి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా చాలదు. భారతీయ గానకోకిల, భారతరత్న డా. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి విలక్షణమైన శైలికి నివాళిగా ఈ చిత్రమాలికను విడుదల చేయడాన్ని గర్వంగా భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు విద్యాబాలన్. కాగా ఎమ్మెస్గా విద్య చక్కగా ఒదిగి΄ోయారంటూ ఈ ఫొటోషూట్‌కి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే... ఎమ్మెస్ సుబ్బులక్ష్మి జీవితం ఆధారంగా సినిమా రూపొందించడానికి బాలీవుడ్లో సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ గాన కోకిలగా ఫలానా తార నటించనున్నారంటూ వచ్చిన వార్తల్లో విద్యాబాలన్ పేరు కూడా ఉంది. తాజా ఫొటోషూట్ చూస్తే ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగా విద్యాబాలన్ న్యాయం చేయగలరనిపించక మానదు. మరి... వెండితెర సుబ్బులక్ష్మిగా ఎవరు కనిపిస్తారో చూడాలి. -
బాలా చేతిలో మరో వారసురాలు
దర్శకుడు బాలా మరో నట వారసురాలిని నటిగా మలచనున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే బదులు వస్తోంది. వైవిధ్యభరిత కథా చిత్రాలకు పెట్టింది పేరు దర్శకుడు బాలా. సేతు, పితామగన్, నందా, నాన్‌కడవుల్ ఇలా ఒకదానికొక్కటి సంబంధం లేని కథా చిత్రాల సృష్టి కర్త బాలా. ఇటీవల జ్యోతిక, జీవీ ప్రకాశ్కుమార్లు నటించిన నాచియార్ చిత్రంతో మరో సారి తన సత్తా చాటుకున్నాడు. ఈ దర్శకుడు తాజాగా తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసే బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఈ చిత్రం ద్వారా నటుడు విక్రమ్ కొడుకు ధృవ్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది కూడా. అయితే ఇందులో నాయకి ఎవరన్నది ఇంకా నిర్ణయం కాలేదు. తెలుగులో ఈ పాత్ర పోషించిన మరాఠీ భామ శాలినిపాండే విపరీతంగా క్రేజ్ తెచ్చుకుంది. ఇక అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్‌కు బాలా వర్మ అనే టైటిల్‌ను పెట్టారు. ఇందులో శాలినిపాండే పాత్రలో చిల్లన్ను ఒరు కాదల్ చిత్రంలో బాల నటిగా నటించిన శ్రియశర్మను నటింపజేయడానికి చర్చలు జరిగాయి. ఆ తరువాత తెలుగులో నటించిన శాలినిపాండేనే తమిళంలోనూ నటించనుందనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరో పేరు వెలుగులోకి వచ్చింది. సీనియర్ నటి గౌతమి కూతురు సుబ్బులక్ష్మీని బాలా కథానాయకిగా పరిచయం చేయనున్నారన్నదే ఆ న్యూస్. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. వర్మ చిత్ర షూటింగ్ రెండో షెడ్యూల్ త్వరలో చెన్నైలో నిర్వహించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్లో ధృవ్తోపాటు సుబ్బులక్ష్మీ పాల్గొనే అవకాశం ఉంది. -
సుబ్బలక్ష్మి హీరోయినా..? ఛాన్సే లేదు! - గౌతమి
లోక నాయకుడు కమల్ హాసన్‌తో పదమూడేళ్ల సహ జీవనానికి నటి గౌతమి ఎందుకు కటీఫ్ చెప్పారు? చెన్నై కోడంబాక్కమ్‌లో సినీ జనాలు చెప్పే కబుర్లు వింటే ‘అబ్బో.. అవునా? నిజమేనా?’ అనకుండా ఎవరూ ఉండలేరు. ‘శ్రుతీ హాసన్‌తో గౌతమి గొడవ పడ్డారట!’ దగ్గర్నుంచి కుప్పలు తెప్పలుగా పలు వార్త లొచ్చాయి. ఏవేవో విశ్లేషణలు చేశారు. తాజాగా వినిపిస్తోన్న పుకారు ఏంటంటే.. గౌతమి కుమార్తె సుబ్బలక్ష్మి త్వరలో హీరోయిన్ కానున్నారు. కుమార్తెను హీరోయిన్గా పరిచయం చేయమని ధనుష్‌తో పాటు పలువురు యంగ్ హీరోలతో గౌతమి సంప్రతింపులు జరిపారట! ఈ వార్తలను గౌతమి ఖండించారు. ‘‘నా బేబీ (సుబ్బలక్ష్మి) పరిచయ చిత్రం గురించి శుభాకాంక్షలు తెలి పిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. కానీ, అది తప్పుడు వార్తే. ప్రస్తుతం తన దృష్టి చదువు మీదే. యాక్టింగ్ ప్లాన్స్ లేవు’’ అని గౌతమి ట్వీట్ చేశారు. కమల్‌తో కటీఫ్ చెప్పడానికి కారణం గురించి ఎవరెన్నిసార్లు ప్రశ్నిం చినా మౌనంగానే ఉన్న గౌతమి, కూతురిపై వార్తలకు స్పష్టత ఇవ్వడంలో మాత్రం అలసత్వం ప్రదర్శించలేదు! ఎంతైనా పేగు బంధం కదా! -
కూతురి కోసం రంగంలోకి..
సీనియర్ నటి గౌతమి తన కూతురు సుబ్బలక్ష్మిని కథానాయకిగా పరిచయం చేయడానికి సిద్ధం అయ్యారా? అవుననే అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. అంతే కాదు అప్పుడే అవకాశాల వేట కూడా మొదలెట్టారని సమాచారం. నటుడు కమలహాసన్‌తో 13 ఏళ్లు సహజీవనం చేసిన గౌతమి ఇటీవల అనూహ్యంగా ఆయనకు దూరమవుతున్నానంటూ చెప్పి పెద్ద సంచలనానికే దారి తీశారు. ఈ విషయం చెప్పడానికి బాధగా ఉన్నా తన కూతురు భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని వివరించారు కూడా. కాగా ఆ మధ్య ఒక భేటీలో మీ అమ్మారుుని హీరోరుున్ చేస్తారా? అన్న ప్రశ్నకు తన కూతురు ఏ రంగంలోకి రావాలనుకుంటుందో నిర్ణయాన్ని తనకే వదిలేస్తున్నానని గౌతమి బదులిచ్చారు. ఇప్పుడు గౌతమి కూతురు సుబ్బలక్ష్మికి హీరోరుున్ అవ్వాలన్న కోరిక కలిగిందట. తన ఆశను తన తల్లి గౌతమికి చెప్పగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. అంతే కాదు వెంటనే తన కూతుర్ని హీరోరుున్ చేసే పనిలో పడ్డారు. ప్రముఖ దర్శకులు, టాప్ హీరోల సరసన సుబ్బలక్ష్మిని నాయకిగా పరిచయం చేయాలని గౌతమి భావిస్తున్నారట. సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కూతుర్ని పెళ్లి చేసుకున్న నటుడు ధనుష్ ఆమెను తాను హీరోగా నటించిన 3 చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం చేశారు. అందులో కమలహసన్ పెద్ద కూతురు శ్రుతిహాసన్‌ను హీరోరుున్‌గా ఎంపిక చేసుకున్నారు. తాజాగా తన మరదలు, రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య దర్శకత్వంలో హీరోగా నటించడానికి రెడీ అవుతున్నారు. అదే విధంగా హిందీలో తాను నటించిన షమితాబ్ చిత్రంలో కమలహాసన్ రెండవ కూతురు అక్షరాహాసన్ నటిగా పరిచయం అరుున విషయం తెలిసిందే. ఈ గణాంకాలన్నీ పరిగణనలోకి తీసుకున్న గౌతమి తన కూతురికి తనతో నటించే అవకాశం కల్పించమని నటుడు ధనుష్‌ను కోరినట్లు సమాచారం. అదే విధంగా నటుడు శివకార్తికేయన్ సరసన నటింపజేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇక తనకు తెలిసిన దర్శక నిర్మాతలను కూడా అవకాశాల కోసం అడుగుతున్నట్లు సమాచారం. నిజానికి సుబ్బలక్ష్మికి ఇంతకు ముందే నటిగా అవకాశాలు వచ్చినట్టు, అరుుతే మంచి అవకాశం కోసం వేచి ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
గాంధర్వ గాయని
కంచిపట్టు చీరతో, చక్కని ముఖ వర్చస్సుతో వేదిక మీద కనిపించే సుబ్బులక్ష్మి పాట ఎంతో పవిత్ర భావనను వెదజల్లేది. అందుకే ‘ఆమె కర్ణాటక సంగీత రాజ్యానికి రాణి’ అన్నారు జవహర్లాల్. ‘భారత కోకిల’ అన్నారు కవికోకిల సరోజినీదేవి. ఆమె ‘సుస్వరలక్ష్మి’ అని కీర్తించాడు బడే గులాం అలీఖాన్. ఒక సందర్భంలో ఏపీజే అబ్దుల్‌కలాం తన జీవితంలో ముగ్గురు తల్లులు ఉన్నారని చెప్పారు. ఆ ముగ్గురు - ఒకరు కన్నతల్లి, మరొకరు మదర్ థెరిసా, మూడో తల్లి - ఎంఎస్ సుబ్బులక్ష్మి. ఎంఎస్ సుబ్బులక్ష్మి ‘తపస్విని’ అన్నారు లతా మంగేష్కర్. ఇటీవలే సెప్టెంబర్ 16న విశ్వవ్యాప్త సంగీత ప్రపంచం సుబ్బులక్ష్మి శత జయంతిని జరుపుకుంది. ఆ సందర్భంగా ఎంఎస్ బయోగ్రఫీ. రాగం మీద మరింత దృష్టిని ప్రతిష్టించడానికి ప్రతి కీర్తనకు ముందు ఆమె క న్నుల మీద సుతారంగా వాలేవి రెప్పలు. ఇప్పుడు సంగీత ప్రియుడైన ఏ భారతీయుడు కర్ణాటక సంగీతాన్ని తలుచుకుంటూ ఎప్పుడు అలా కళ్లు మూసుకున్నా వాళ్ల దృష్టిపథంలోకి ఆమె ప్రత్యక్షమవుతారు. ఆమె.. మదురై షణ్ముఖవాదివు సుబ్బులక్ష్మి. ఇరవయ్యో శతాబ్దపు కర్ణాటక సంగీత సంప్రదాయానికి ప్రత్యేక కీర్తిని సాధించిపెట్టిన అపురూప భారతీయ వనిత. ఏడు దశాబ్దాల పాటు అలుపనేది లేకుండా గానించిన గళం ఆమెదే. ఎలాంటి ఇతర పోకడలకు చోటులేని వంద శాతం కర్ణాటక సంప్రదాయాన్ని ఎంఎస్ గొంతు సొంతం చేసుకుంది. 1927లో పదకొండేళ్ల ప్రాయంలో తిరుచిరాపల్లిలో ఒక కచేరీతో ఆరంభమైన ఆ గాన వాహిని చివరి వరకు గానప్రియులను అలరిస్తూనే ఉంది. ఒక జన్మలో వీలయ్యేదా?! సుబ్బులక్ష్మిని 20వ శతాబ్దపు కర్ణాటక సంగీతానికి ప్రతీక అనడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆమె ఇచ్చిన కచేరీలు వేల సంఖ్యలో ఉంటాయి. వాటిలో చాలావరకు కొన్ని సంస్థలకు నిధులు సమకూర్చిపెట్టడానికి ఆమె ఉచితంగా పాడారు. తొలిరోజులలోనే రికార్డిస్టుగా ఉన్నత శిఖరాలను అందుకున్నారు. ఎన్నో రికార్డులు ఇచ్చారు. ప్రపంచం ఆమె పాటను మైమరచి ఆలకించింది. ఇంత కృషి మరో కళాస్రష్ట జీవితంలో సాధ్యమయ్యేది కాదేమో! ఒక జన్మలో చేయడానికి వీలయ్యేది కూడా కాదేమో! రికార్డింగ్ సంస్థల కోసం ఆమె పాడిన మొదటి పాట ‘మరకతం వడివుయం’. ఈ పాటకి పక్క వాయిద్యాలను అందించిన వారిలో షణ్ముఖివాదివు కూడా ఉన్నారు. ఆమె గొప్ప వైణికురాలు. సుబ్బులక్ష్మి కన్నతల్లి. అమ్మమ్మ వాయులీనంలో ప్రావీణ్యం కలిగి ఉండేవారు. రికార్డిస్టుగా ‘స్టార్’ హోదా రావడంతో స్వస్థలం మదురై నుంచి ఆ కుటుంబం మద్రాసుకు తరలి వచ్చింది. కర్ణాటక సంగీత సామ్రాజ్యానికి సాంస్కృతిక రాజధాని వంటి చెన్నపట్టణానికి ఆమె గాన మాధుర్యం పరిచయం కావడం ఎంతో యాదృచ్ఛికంగా జరిగిపోయింది. సరస్వతి కటాక్షించినట్టే జరిగింది. ప్రఖ్యాత మద్రాసు మ్యూజిక్ అకాడమిలో ఏర్పాటయిన కచేరీని, నాటి సంగీత విద్వాంసులలో ఒకరైన అరియకుడి రామానుజ అయ్యంగార్ హఠాత్తుగా అస్వస్థులు కావడం వల్ల రద్దు చేసుకున్నారు. నిర్వాహకులు సుబ్బులక్ష్మి చేత మొదటిసారి పాడించారు. 1933 డిసెంబర్లో ఇది జరిగింది. తరువాత కొన్నేళ్లకి ఆ అకాడమి ఇచ్చే అత్యుత్తమ పురస్కారం ‘సంగీత కళానిధి’ సుబ్బులక్ష్మి స్వీకరించారు. వెండితెరపై సువర్ణగాత్రం ఎంఎస్ సువర్ణగాత్రం వెండితెర మీద కూడా వెన్నెలలు విరబూయించింది. అక్కడ కూడా ఆమె ఒక వెలుగు వెలిగారు. మున్షీ ప్రేమ్‌చంద్ అద్భుత నవల ‘సేవాసదన్’ ఆధారంగా నిర్మించిన చిత్రంలో ఎంఎస్ నటించారు. 1938లో ఆ చిత్రం విడుదలయింది. వారణాసి నేపథ్యంలో ఒక సాధారణ గృహిణి ఎలాంటి పరిస్థితులలో గడప దాటిందో ఈ కథలో ఆ మహా రచయిత మహోన్నతంగా ఆవిష్కరించారు. ఇందులో కట్నం సమస్యను కూడా ప్రస్తావించారాయన. ఆ ఒక్క చిత్రంతోనే సుబ్బులక్ష్మి గాయక నటిగా వినుతికెక్కారు. 1940లో ఎల్లిస్ దున్గన్ ఎంఎస్తోనే శకుంతల చిత్రం నిర్మించారు. ఆ తరుణంలోనే ‘కల్కి’ సదాశివంతో వివాహమైంది. సదాశివం ‘కల్కి’ పత్రిక నడిపేవారు. సి. రాజాజీకి సన్నిహితుడు. జాతీయోద్యమంలో పనిచేసేవారు. ‘కల్కి’ పత్రికకు నిధులు సమకూర్చడానికి ఎంఎస్ 1941లో నారద పాత్రతో ‘సావిత్రి’ చిత్రంలో కనిపించారు. అలనాటి ప్రఖ్యాత హిందీనటి శాంతా ఆప్టే సావిత్రి పాత్రలో కనిపించారు. మళ్లీ 1945లో ఎల్లిస్ దున్గన్ దర్శకత్వంలోనే ఎంఎస్ ‘మీరా’ చిత్రంలో కథానాయిక పాత్ర ధరించారు. మీరా చిత్రాన్ని జవహర్లాల్ నెహ్రూ, భారత ఆఖరి వైశ్రాయ్ మౌంట్‌బాటన్‌తో కలసి ఢిల్లీలో చూశారు. ఈ చిత్రంలో అన్ని పాటలూ ఎంఎస్ ఒక్కరే పాడారు. ఆ సినిమా చూసి, ఆ పాటలకు మైమరచి సరోజినీ నాయుడు ఎంఎస్‌ను ‘భారత కోకిల’ అని శ్లాఘించారు. ప్రాగ్, వెనీస్లలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో కూడా మీరాను ప్రదర్శించారు. ఎంఎస్ కీర్తి నలుదిశలా వ్యాపించింది. కానీ అదే ఆమె ఆఖరి చిత్రమైంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎంఎస్ చలనచిత్ర జీవితానికి శుభం కార్డు వేసి, కర్ణాటక సంగీతానికే పూర్తిగా తన జీవితాన్ని అంకితం చేశారు. అంతర్జాతీయ వేదికలపై... 1960లో అంతర్జాతీయ వేదిక మీద పాడేందుకు సుబ్బులక్ష్మికి మొదటిసారి అవకాశం వచ్చింది. అప్పటికే ఆకాశవాణి ద్వారా, కచేరీల ద్వారా కర్ణాటక సంగీత ప్రియులకు ఆరాధనీయ గాయనిగా మారిన ఎంఎస్‌ను ఎడిన్‌బరో ఉత్సవానికి ఆహ్వానించారు. 1963లో అక్కడ కచేరి జరిగిన తరువాత మరుసటి సంవత్సరం ఐక్యరాజ్య సమితి దినోత్సవంలో పాడేందుకు రావలసిందిగా నాటి ప్రధాన కార్యదర్శి యు థాంట్ ఆహ్వానించారు. 1966లో సమితి జనరల్ అసెంబ్లీలో కూడా ఆమె పాడారు. ఇది సుబ్బులక్ష్మి శతజయంతి అయితే, జనరల్ అసెంబ్లీలో ఆమె పాట పాడి యాభై ఏళ్లు పూర్తి కావడం కేవలం యాదృచ్ఛికం (జనరల్ అసెంబ్లీలో పాడిన మొదటి గాయని ఎంఎస్. రెండోసారి ఆగస్టు 16, 2016న అదే అవకాశాన్ని పొందిన వారు ఏఆర్ రెహమాన్. ఆ సందర్భంలో రెహమాన్ ఎంఎస్‌కు ఘనంగా నివాళి సమర్పించారు). ఈ కచేరీ నిజంగా చరిత్రాత్మకం. ఆ కార్యక్రమంలో ఆమె మొత్తం 30 గీతాలు పాడారు. అవి ఆరు భాషలకు చెందినవి. అదొక అపురూప ఘట్టం. జెనీవాలోని రెడో విల్లాలో పాడే అవకాశం కూడా భారతదేశం నుంచి ఎంఎస్కే లభించింది. విశ్వవిఖ్యాత సంగీతకారుడు బీతోవెన్ ఒకసారి కచేరి చేసిన వేదిక అది. పారిస్, లండన్, న్యూయార్క్ నగరాలు కూడా ఎంఎస్ గానవాహినలో తడిసినవే. ఔన్నత్యంలో తపస్విని ఎంఎస్ జీవితాంతం ఆరాధించిన కళ, ఆమెను భూగోళానికి పరిచయం చేసిన పాట ఎంఎస్‌ను ఒక తపస్విని స్థాయికి తీసుకువెళ్లాయి. సుబ్బులక్ష్మి, మరో ప్రఖ్యాత విదుషీమణి డీకే పట్టమ్మాళ్ చెన్నైలో ఒకే వీధిలో ఉండేవారు. ఆ వీధికి సుబ్బులక్ష్మి పేరు పెట్టదలిచామని మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. కానీ అందుకు ఎంఎస్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ వీధికి ఏదైనా ఒక పేరు పెట్టాలి అంటే, అది పట ్టమ్మాళ్ పేరు మాత్రమే అయి ఉండాలని చెప్పారామె. ఆమె సంగీత సామ్రాజ్యంలో రాణి అయినా, ఔన్నత్యంలో మాత్రం తపస్వినే. అదే చెబుతోంది ఈ ఉదంతం. మీరా భజన్లు అద్భుతంగా ఆలపించిన ఆ దక్షిణాది గాయని ఉత్తర భారత ప్రజల హృదయాలను అలవోకగా గెలిచారు. పురుషాధిపత్యంతో సాగుతున్న కర్ణాటక సంగీత సామ్రాజ్యంలో మహిళ గొంతును ప్రథమంగా బలంగా వినిపించారు. ఎంఎస్ సంగీతానికి శరీరం రాగమే కావచ్చు. కానీ దాని ఆత్మ భక్తి. ఆమె ఆలపించిన ఏ రాగమైనా భక్తిభావంతోనే తొణికిసలాడేది. భక్తిగీతమే ఈ చరాచర ప్రపంచంలో ఎక్కడ ఉన్న మనిషి హృదయాన్నయినా తాకగలుగుతుందని ఆమె విశ్వసించారు. చిరస్మరణీయం అయ్యారు. - డాక్టర్ గోపరాజు నారాయణరావు దేశానికి ఇష్టమైన పాట శంకర భగవత్పాదుల గీతాలు, శ్లోకాలు; మరాఠీ భక్తకవి తుకారామ్ గీతాలు, గురుగ్రంథ సాహెబ్‌లోని గీతాలు, మీర్జా గాలిబ్ ఉర్దూ ఘజల్స్ కూడా ఎంఎస్ గానం చేశారు. ఆమె పాడిన అన్నమాచార్య కీర్తనలు, వెంకటేశ్వర సుప్రభాతం ఏదో సందర్భంలో ఆలకించని ఇల్లు దక్షిణ భారతదేశంలో ఉండదు. ఇక బెంగాలీ భాషలో ప్రఖ్యాత జాతీయవాద కవి ద్విజేంద్రలాల్ రాయ్ రాయగా, ఎంఎస్ పాడిన పాట, ‘ధనో ధన్య పుష్పో భరా’ మన దేశంలో ఎందరికో అత్యంత ఇష్టమైన పాట. కాలాతీత గాత్ర మాధుర్యం గాంధీజీ టేప్ చేయించుకుని మరీ విన్నారు! గాంధీజీ 78వ జన్మదినం. ఆ అక్టోబర్ 2న గాంధీజీ కోసమే ఢిల్లీలో కొన్ని సంగీత కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని, ఆ రోజున ఎంఎస్ వచ్చి, గాంధీజీకి ఎంతో ఇష్టమైన మీరా భజన్ ‘హరి తుమ్ హరో’ పాడగలరా అని అడుగుతూ ‘కల్కి’ కార్యాలయానికి ఫోన్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేత సుచేతా కృపలానీ ఆ ఫోన్ చేశారు. అయితే ఆ భజన్ ఎంఎస్‌కు రాదనీ, అలాగే ఆ వారం ఢిల్లీకి రావడం కూడా సాధ్యం కాదనీ సదాశివం చాలా హుందాగా సుచేత ఆహ్వానాన్ని తిరస్కరించారు. మరెవరితో అయినా పాడించమని సలహా ఇచ్చారు. ఇక పుట్టినరోజు రెండు రోజులు ఉందనగా మళ్లీ ఫోన్. ఆ భజన్‌ను వేరొకరి కంఠం నుంచి వినడం కంటే, ఎంఎస్ ఆ పాటను టేప్ చేసి పంపితే వింటానని గాంధీజీ మరీ మరీ కోరినట్టు సుచేత చెప్పారు. ఇక తప్పలేదు. గాంధీజీ మీద గౌరవంతో సదాశివం ఆగమేఘాల మీద మద్రాసులోని ఆకాశవాణిలో రికార్డ్ చేయించి, ఢిల్లీ పంపించారు. ఆ విధంగా గాంధీజీ తన పుట్టిన రోజున ఆ భజన్ చెవులారా విన్నారు. కానీ, 1947లో జరిగిన ఆ పుట్టినరోజే చివరి పుట్టినరోజు అవుతుందని ఎవరూ ఊహించలేదు. జనవరి 30, 1948న గాంధీజీ హత్యకు గురైయ్యారు. ఆ సమయంలోనే ఆకాశవాణి ఆయనకు నివాళిగా ఒక పాటను వినిపించింది. అది గాంధీగారి కోసం ఆ రోజు సుబ్బులక్ష్మి మద్రాసు ఆకాశవాణిలో రికార్డు చేసి పంపినదే. దానితో ఆమెపేరు ఇంటింటా మారుమోగింది. -
జేసీబీ క్రేన్ ఢీకొని మహిళ మృతి
విశాఖపట్టణం జిల్లా అక్కిరెడ్డిపాళెం ఆటోనగర్‌లో ఆదివారం సాయంత్రం చెందింది. కంపెనీలో పని ముగించుకుని కూలీలు నడుచుకుంటూ వెళుతుండగా వెనుక వేగంగా వచ్చిన క్రేన్ వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో గుడిమెట్ల సుబ్బలక్ష్మి(40) అక్కడికక్కడే మృతిచెందింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
గౌతమి కూతురికి శ్రుతి అడ్వైజ్
తమిళసినిమా: ప్రఖ్యాత నటుడు కమలహాసన్ వారసులుగా శ్రుతిహాసన్, అక్షరహాసన్ రంగ ప్రవేశం చేశారు. శ్రుతి ఇప్పటికే తమిళం, తెలుగు, హిందీ భాషల్లో టాప్ హీరోయిన్గా వెలిగిపోతున్నారు. షమితాబ్తో నటిగా అరంగేట్రం చేసిన అక్షర చక్కని అభినయంతో అభినందనలు అందుకుంటున్నారు. కమలహాసన్‌తో సహజీవనం చేస్తున్న నటి గౌతమి పాపనాశం చిత్రంతో రీ ఎంట్రీ అయ్యారు. ఇప్పుడామె కూతురు సుబ్బులక్ష్మికి నటి కావాలనే కోరిక ఉందట. తన ఆకాంక్షను గౌతమి చెవిలో వేసింది. కూతురి కోరికకు తల్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. పనిలో పనిగా చిన్న సూచన కూడా చేశారట. శ్రుతిహాసన్‌ను రోల్ మాడల్‌గా తీసుకో, తాను చెప్పే సలహాలను పాటించు అని హితవు పలికారట. సుబ్బులక్ష్మి ఆశ తెలుసుకున్న శ్రుతిహాసన్ వెంటనే శుభాశీస్సులు అందించేశారు. అయితే ఆమె కూడా సుబ్బులక్ష్మి అనే పేరు మార్చుకో అంటూ చిన్న అడ్వైజ్‌ను ఇచ్చేశారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. సుబ్బులక్ష్మిని ఏ భాషలో పరిచయం చేయాలన్నదే గౌతమి ముందున్న ప్రశ్న అట. అయితే శ్రుతిహాసన్, అక్షరహాసన్ మాదిరిగానే సుబ్బులక్ష్మిని తొలుత బాలీవుడ్లో పరిచయం చేయాలని ఆ తరువాత దక్షిణాదిలో ఆటోమేటిక్‌గా అవకాశాలు తలుపు తడుతాయని ఆమె సన్నిహితులు సలహా ఇస్తున్నారని సమాచారం.