విశాఖపట్టణం జిల్లా అక్కిరెడ్డిపాళెం ఆటోనగర్‌లో ఆదివారం సాయంత్రం చెందింది. కంపెనీలో పని ముగించుకుని కూలీలు నడుచుకుంటూ వెళుతుండగా వెనుక వేగంగా వచ్చిన క్రేన్ వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో గుడిమెట్ల సుబ్బలక్ష్మి(40) అక్కడికక్కడే మృతిచెందింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
జేసీబీ క్రేన్ ఢీకొని మహిళ మృతి
Published Sun, May 8 2016 6:00 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement