
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై టాటా హేరియర్ వాహనం అతివేగంగా దూసుకొచ్చి ఓ బైకు, స్కూటీలను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న విద్యార్థులు ప్రయాణీకులు ఫ్లైఓవర్ మీద నుండి 30 అడుగుల కిందకి పడిపోయారు.
వివరాల ప్రకారం.. తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై టాటా హేరియర్ వాహనం బీభత్సం సృష్టించింది. టాటా హేరియర్ నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో వేగంగా వాహనాన్ని నడపడం వల్ల వాహనం బైకు, స్కూటీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఫ్లైఓవర్ మీద నుండి 30 అడుగుల కిందకి పడిపోయాడు. దీంతో.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. జైకృష్ణ అనే విద్యార్ధి మృతిచెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యశ్వంత్ చనిపోయాడు. మరో విద్యార్థి హరి కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనలో స్కూటీ నుజ్జునుజ్జు అయ్యింది. కాగా, కాకాని చార్విక్ అనే వ్యక్తి మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఇక, మురళీనగర్‌లో నివాసం ఉంటున్న చార్విక్ రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. చార్విక్ స్వస్థలం గన్నవరం. అయితే, చార్విక్ నిన్న(శవివారం) రాత్రి ఓ పార్టీలో ఫుల్‌గా మద్యం సేవించి కారు డ్రైవింగ్ చేసినట్టు సమాచారం.
ఇది కూడా చదవండి: థియేటర్ ధ్వంసం.. పవన్ అభిమానులపై కేసు
Comments
Please login to add a commentAdd a comment