telugutalli flyover
-
తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై టాటా హేరియర్ వాహనం అతివేగంగా దూసుకొచ్చి ఓ బైకు, స్కూటీలను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న విద్యార్థులు ప్రయాణీకులు ఫ్లైఓవర్ మీద నుండి 30 అడుగుల కిందకి పడిపోయారు. వివరాల ప్రకారం.. తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై టాటా హేరియర్ వాహనం బీభత్సం సృష్టించింది. టాటా హేరియర్ నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో వేగంగా వాహనాన్ని నడపడం వల్ల వాహనం బైకు, స్కూటీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఫ్లైఓవర్ మీద నుండి 30 అడుగుల కిందకి పడిపోయాడు. దీంతో.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. జైకృష్ణ అనే విద్యార్ధి మృతిచెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యశ్వంత్ చనిపోయాడు. మరో విద్యార్థి హరి కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో స్కూటీ నుజ్జునుజ్జు అయ్యింది. కాగా, కాకాని చార్విక్ అనే వ్యక్తి మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఇక, మురళీనగర్‌లో నివాసం ఉంటున్న చార్విక్ రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. చార్విక్ స్వస్థలం గన్నవరం. అయితే, చార్విక్ నిన్న(శవివారం) రాత్రి ఓ పార్టీలో ఫుల్‌గా మద్యం సేవించి కారు డ్రైవింగ్ చేసినట్టు సమాచారం. ఇది కూడా చదవండి: థియేటర్ ధ్వంసం.. పవన్ అభిమానులపై కేసు -
ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం పూర్తి
-
ఖైరతాబాద్ భారీ గణేషుడి నిమజ్జనం పూర్తి
హైదరాబాద్ :నగరంలో లక్షలాది మంది భక్తులచే పూజలందుకున్న ఖైరతాబాద్ భారీ వినాయకుడిని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం అయ్యాడు. మంగళవారం 8 గంటలపాటు సాగిన గణేషుడి శోభాయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రేన్‌తో వినాయకుడిని సాగర్ జలాల్లో నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు. అరవై వసంతాలు పూర్తి చేసుకున్నసందర్భంగా 60 కేజీల భారీ విగ్రహంతో 11 రోజుల పాటు భక్తులను అలరించిన గణనాథుడు నేటి సాయంత్రం తల్లి గంగమ్మ ఒడిలో సేద తీరాడు. గణనాధుడి నిమజ్జనాన్ని తిలకించేందుకు నగరవాసులు తరలి రావటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఖైరతాబాద్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద ట్రాఫిక్ స్తంభించగా, సచివాలయం వెళ్లేవైపు కాసేపు రాకపోకలు ఆగిపోయాయి. పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. -
హుస్సేన్ సాగర్‌లో గణేషుడి నిమజ్జనం
-
కాసేపట్లో ఖైరతాబాద్ భారీ గణేషుడి నిమజ్జనం
హైదరాబాద్ : నగరంలో లక్షలాది మంది భక్తులచే పూజలందుకున్న ఖైరతాబాద్ భారీ వినాయకుడిని కాసేపట్లో హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు. మంగళవారం సాయంత్రం వరకు సాగిన గణేశుడి శోభాయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రైన్‌తో వినాయకుడిని సాగర్ జలాల్లో వదలనున్నారు. గణనాధుడి నిమజ్జనాన్ని తిలకించేందుకు నగరవాసులు తరలి రావటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఖైరతాబాద్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద ట్రాఫిక్ స్తంభించగా, సచివాలయం వెళ్లేవైపు కాసేపు రాకపోకలు ఆగిపోయాయి. పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. -
తెలుగుతల్లి ఫ్లైఓవర్ కు ఖైరతాబాద్ గణేషుడు
-
తెలుగుతల్లి ఫ్లైఓవర్ కు ఖైరతాబాద్ గణేషుడు
హైదరాబాద్ : నగరంలో రెండోరోజు కూడా గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. ఖైరతాబాద్ వినాయకుడు మంగళవారం మధ్యాహ్నానికి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్నాడు. అలాగే నిమజ్జనానికి గణనాధులు ఎన్టీఆర్ మార్గ్ వైపు భారీగా కొలువు తీరారు. దాంతో అధికారులు నిమజ్జం చేసేందుకు వినాయకులను ట్యాంక్‌బండ్ వైపు ఉన్న క్రేనుల వద్దకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు భారీ గణనాధుడి నిమజ్జనాన్ని తిలకించేందుకు నగరవాసులు తరలి రావటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దాంతో ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిసిపోయింది. ఇక సచివాలయం వెళ్లేవైపు రాకపోకలను పోలీసులు పునరుద్ధరించారు. రవీంద్ర భారతి, మింట్ కంపౌండ్ మీదగా రాకపోకలను అనుమతి ఇచ్చారు.